దిల్సుఖ్నగర్ పీఎల్పీ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ పీఎల్పీ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజీవరెడ్డి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే, ఘటనకు పాల్పడ్డ వారిలో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఎనిమిది మంది దొంగలు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.