హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌, వందల కోట్లలో పెట్టుబడులు | Capitaland Investment Of Rs 1,200 Crore In Hyderabad For Data Center | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్‌, వందల కోట్లలో పెట్టుబడులు

Published Tue, Dec 6 2022 6:36 PM | Last Updated on Tue, Dec 6 2022 6:49 PM

Capitaland  Investment Of Rs 1,200 Crore In Hyderabad For Data Center - Sakshi

సింగపూర్‌కు చెందిన ప్రముఖ డైవర్సిఫైడ్‌ రియల్‌ఎస్టేట్‌ సంస్థ క్యాప్టాల్యాండ్‌ (CapitaLand) వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టుంది. పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్‌లో రూ.1200కోట్లతో  డేటా సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. 

ఈ సందర్భంగా క్యాప్టాల్యాండ్‌ తన భవిష్యత్‌ కార్యచరణ వివరించింది. . రానున్న 5 - 7 సంవత్సరాల్లో పొటెన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కింద రూ.5వేల కోట్లు, డేటా సెంటర్‌, ఆఫీస్‌ స్పేప్రాజెక్ట్‌ కింద మొత్తంగా రూ.6,200కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. 

ఇందులో భాగంగా  క్యాప్టాల్యాండ్‌ యాజమాన్యం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement