హైదరాబాద్‌లో అక్టోబర్ నెలలో ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదించింది. మొత్తం 5,894 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నమోదైనట్లు పేర్కొంది. వాటి విలువ సమారు రూ.3,617 కోట్లు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారం
హైదరాబాద్‌లో అక్టోబర్ 2024లో మొత్తం రూ.3,617 కోట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14%, ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 28% వృద్ధి కనబరిచింది.
అక్టోబర్‌లో మొత్తం 5,894 యూనిట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది ఏడాదివారీగా 2%, నెలవారీగా 20% పెరుగుదల నమోదు చేసింది.
సెప్టెంబర్ 17-అక్టోబర్ 2, 2024 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి.
ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
హైదరాబాద్‌లో రూ.50 లక్షల లోపు విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల రూ .ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల అమ్మకాలు పెరుగుతున్నాయి.
ప్రీమియం ఇళ్ల విక్రయాల వాటా అక్టోబర్ 2024లో 10% నుంచి 14%కి పెరిగింది. రూ.కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరిగాయి.
జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ జరిగిన మొత్తం ఇళ్ల సంఖ్య 65,280. ఇది ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రూ.40,078 కోట్ల విలువై ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 32 శాతం అధికం.
Comments
Please login to add a commentAdd a comment