Real estate agencies
-
ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్‌లో అక్టోబర్ నెలలో ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదించింది. మొత్తం 5,894 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నమోదైనట్లు పేర్కొంది. వాటి విలువ సమారు రూ.3,617 కోట్లు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారంహైదరాబాద్‌లో అక్టోబర్ 2024లో మొత్తం రూ.3,617 కోట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14%, ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 28% వృద్ధి కనబరిచింది.అక్టోబర్‌లో మొత్తం 5,894 యూనిట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది ఏడాదివారీగా 2%, నెలవారీగా 20% పెరుగుదల నమోదు చేసింది.సెప్టెంబర్ 17-అక్టోబర్ 2, 2024 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!హైదరాబాద్‌లో రూ.50 లక్షల లోపు విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల రూ .ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల అమ్మకాలు పెరుగుతున్నాయి.ప్రీమియం ఇళ్ల విక్రయాల వాటా అక్టోబర్ 2024లో 10% నుంచి 14%కి పెరిగింది. రూ.కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరిగాయి.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ జరిగిన మొత్తం ఇళ్ల సంఖ్య 65,280. ఇది ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరుగుదలను నమోదు చేసింది.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రూ.40,078 కోట్ల విలువై ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 32 శాతం అధికం. -
రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్(1 బీహెచ్‌కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్-ఎంసీహెచ్ఐ’ నివేదిక పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్ లెవల్ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ్‌కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్ బెడ్ రూమ్(2 బీహెచ్‌కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్‌కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.ముంబయిలోని సీనియర్ లెవల్ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్‌కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్‌కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ముంబయిలో జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్ డ్రెయిన్(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు. -
రియల్ ఎస్టేట్ జోరు..6 నెలల్లో రూ. 24,110 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు గత ఆరు నెలల్లో స్వల్పంగా పుంజుకున్నాయి. జనవరి–జూన్ మధ్య కాలంలో దాదాపు 2.94 బిలియన్ డాలర్ల(రూ. 24,110 కోట్లు)కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశీ రియల్టీపై విశ్వాసం కొనసాగడం ఇందుకు దోహదపడింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక ప్రకారం గతేడాది(2022) తొలి ఆరు నెలల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 2.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధితోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలోనూ దేశీ రియల్టీలోకి పెట్టుబడులు బలపడినట్లు నివేదిక పేర్కొంది. వెరసి పెరుగుతున్న పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ప్రపంచ మార్కెట్లలో ఇండియా ఆశావహంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. 22 లావాదేవీలు ఈ క్యాలండర్ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రాపర్టీ రంగంలోకి 22 లావాదేవీల ద్వారా దాదాపు 2.94 కోట్ల డాలర్లు ప్రవహించినట్లు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. ఈ బాటలో ఏడాది చివరి(డిసెంబర్)కల్లా దేశీ రియల్టీలోకి 5 బిలియన్ డాలర్ల సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు లభించనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్–19 తదుపరి కనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం తాజా అంచనాలు ప్రకటించింది. తొలి ఆరు నెలల్లో కార్యాలయ ఆస్తులలో పెట్టుబడులు 105.6 కోట్ల డాలర్ల నుంచి 192.7 కోట్ల డాలర్లకు జంప్ చేయగా.. గృహ విభాగంలో 42.9 కోట్ల డాలర్ల నుంచి 51.2 కోట్లకు ఎగశాయి. ఈ బాటలో వేర్‌హౌసింగ్ విభాగం 36.6 కోట్ల డాలర్లు(గతంలో 20 కోట్ల డాలర్లు), హోటళ్ల రంగం 13.4 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే డేటా సెంటర్లు, రిటైల్, విభిన్న వినియోగ ప్రాజెక్టులకు ఎలాంటి పెట్టుబడులు లభించకపోవడం గమనార్హం! గతేడాది వీటిలో వరుసగా 49.9 కోట్ల డాలర్లు, 30.1 కోట్ల డాలర్లు, 39.6 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులు నమోదయ్యాయి. -
ఐదు జిల్లాల్లో ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్ వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. అధికారులు బృందాలుగా విడిపోయి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. చేస్తున్న వ్యాపారం కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్న వారితోపాటు అనుమానిత రియల్ ఎస్టేట్ లావాదేవీలే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సదరన్, శుభగృహ సంస్థలతోపాటు వీఎస్ గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లా కందూకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన సమీప బంధువులకు చెందిన సదరన్ డెవలపర్స్, సదరన్ ఆక్వా ప్రాసెసింగ్, సదరన్ గ్రానెట్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నంబూరు శంకర్రావుకు చెందిన శుభగృహ డెవలపర్స్, ఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గుంటూరుకు చెందిన వీఎస్ లాజిస్టిక్స్, జగ్గయ్యపేటలోని ప్రీకాస్ట్ బ్రిక్స్ తయారు చేసే వీఎస్ ఎకో బ్రిక్స్ సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌గ్రూపులో రెండోరోజు కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి రాక తాజాగా చేపట్టిన సోదాల వివరాలను బయటపెట్టడానికి స్థానిక ఐటీ అధికారులు నిరాకరించారు. దాడులు పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం తెలియజేస్తుందని, ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ఐటీ అధికారులతో సంబంధం లేకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన సుమారు 10 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు అర్ధరాత్రి దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల మధ్యాహ్నం కల్లా సోదాలు పూర్తి చేశారు. వ్యాపార లావాదేవీలకు చెందిన విలువైన పత్రాలను ఐటీ అధికారులు తమవెంట తీసుకెళ్లారు. ఖండించిన మంత్రి నారాయణ రాష్ట్ర మంత్రి పి.నారాయణకు చెందిన విద్యాసంస్థలపై ఐటీ దాడులు మొదలైనట్లు మీడియాలో తొలుత ప్రచారం జరిగింది. తన సొంత జిల్లా నెల్లూరుతోపాటు విజయవాడ, హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థలపై దాడులు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ సంస్థల్లో ఆదాయపు పన్ను అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. రాజధానిలో ఐటీ దాడుల కలకలం ఐటీ అధికారులు చేపట్టిన దాడులు రాజధానిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న సోదాల్లో ఐటీ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మొదట విజయవాడలోని నారాయణ కళాశాలకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోనగర్‌లోని ఐజీ, జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి బయల్దేరిన 10 ఐటీ బృందాలు ఏకకాలంలో లబ్బీపేట, భారతీనగర్, వినాయక థియేటర్, కరెన్సీనగర్, బెంజ్ సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న సదరన్ డెవపలర్స్, వీఎస్ లాజిస్టిక్స్, శుభగృహ ప్రాజెక్టు కార్యాలయాల్లో దాడులు చేశాయి. సదరన్ డెవలపర్స్ కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి చెందినవిగా గుర్తించారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి బంధువు ఈ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట పంచాయతీ పరిధిలో ఉన్న వీఎస్ ఎకో బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీ గుంటూరుకు చెందిన వల్లభనేని శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ పేరిట నడుస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని వీఎస్ లాజిస్టిక్స్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అలాగే ఆయా కంపెనీల ప్రతినిధుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. జగ్గయ్యపేటలో బంగారం దుకాణాలు మూత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శుక్రవారం బంగారం వ్యాపారులు మూడు గంటలపాటు దుకాణాలను మూసివేశారు. ఐటీ అధికారులు జగ్గయ్యపేటకు వస్తున్నారనే సమాచారంతో వెంటనే అప్రమత్తమై దుకాణాలను మూసేశారు. ఎమ్మెల్యే పోతుల సంస్థల్లో సోదాలు ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంట వద్ద ఎమ్మెల్యేకు చెందిన సదరన్ ఇన్ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్‌పై ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం 6 గంటలకే దాడులు ప్రారంభించారు. రెండు వాహనాల్లో వచ్చిన 10 మంది అధికారులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సమీప బంధువు, కంపెనీ ఎండీ కార్తీక్‌ను అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఎమ్మెల్యేకు సంబంధించి టంగుటూరు మండలం కారుమంచి వద్ద, ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన రొయ్యలు వలిచే ఫ్యాక్టరీల వివరాలు ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. వీటితోపాటు ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద సదరన్ రాక్ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్, పేర్నమిట్ట వద్ద ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఫ్యాక్టరీలకు చెందిన ఉన్నతాధికారులను ప్రశ్నించి, కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోతుల రామారావు పన్నులు చెల్లించకుండానే పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్థలపై గురి విశాఖపట్నంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శుభగృహలో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థల బ్యాంక్ లాకర్లను సైతం తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీశారు. ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పత్రాలను కూడా పరిశీలించారు. విశాఖపట్నంలో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుపై దాడులు గుంటూరు రూరల్ మండలం తురకపాలెం పంచాయతీ పరిధిలోని వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి దాకా కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపిన సంస్థలపై తనిఖీల్లో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. బిల్లులు, లావాదేవీల వివరాలను చూపాలని కోరారు. మండలంలోని వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంతోపాటు గుంటూరు నగరంలోని విద్యానగర్, కృష్ణనగర్, స్వర్ణభారతినగర్‌లో గల సంస్థ ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
19, 20 తేదీల్లో ‘సాక్షి ప్రాపర్టీ షో’
మహారాణిపేట : స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం ఇది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు, డెవలపర్లుతో ఈ నెల 19, 20 వ తేదీల్లో బీచ్‌రోడ్ వైఎంసీఏ దరి సన్ఫ్రా రిసాట్స్లో ‘‘సాక్షి ప్రాపర్టీ షో’’ నిర్వహించబోతోంది. మీ సొంతింటి స్వప్నం సాకారం అయ్యేందుకు వీలుగా అందుకవసరమైన సమాచారమంతటిని మీకందించి, ఓ వివేకవంతమై న నిర్ణయం తీసుకునేందుకు బాటలు వేసింది. ఈ ప్రాపర్టీ షో ద్వారా మీ సొంతింటి స్వప్న సాకారానికి ‘సాక్షి’ మా ర్గం సుగమం చేస్తోంది. ‘సాక్షి ప్రాపర్టీ షో’కి విచ్చేయండి.. పలు రకాల గృహాలు, ప్లాట్లు మీ బడ్జెట్‌కు లోబడే ఎంపిక చేసుకోండి...అంటూ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ‘సాక్షి ప్రాపర్టీ షో’లో కొనుగోలు చేసిన వారికి డ్రాలో మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ, రెండవ బహుమతిగా ఫ్రిజ్, మూడవ బహుమతిగా వాషింగ్మెషిన్లను గెలాక్సి ఎలక్ట్రానిక్ షోరూం వారి సౌజన్యంతో అందించనున్నారు. ఈ ప్రాపర్టీ షోలో కొనుగోలు చేసిన ప్రతి వారికి స్పాట్ గిఫ్ట్‌ను గాయత్రి హోం అప్లయన్స వారి సౌజన్యం తో అందించనున్నారు. ఈ షో సందర్శకులకు ఎం.వి.ఆర్.మాల్ సౌజన్యంతో ఏర్పాటు చేయనున్న ‘ఫిల్ అండ్ డ్రాప్ కాంటెస్ట్’ ద్వారా గంట గంటకు గిఫ్ట్ కూపన్లు అందించడం మరో ప్రత్యేక ఆకర్షణ. ‘సాక్షి ప్రాపర్టీ షో’లో రియల్ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, బ్యాంకులు పాల్గొనుటకు స్టాల్ బుకింగ్స కోసం 9912222796, 9912220550 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
సొంతిల్లు సుఖీభవ!
- వరంగల్ హైవే, యాదాద్రి అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం - దీంతో ఈ ప్రాంతంలో వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్టీ పరుగులు - ఆచితూచి అడుగులేయాలంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి సంస్థలను ఆకర్షించేందుకు రాయితీలో.. ప్రోత్సాహకాలో అందిస్తే సరిపోదు. వాటికవే పెట్టుబడులతో రావాలంటే అభివృద్ధి పనులు చేపట్టాలని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధి పనులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏటా రూ.100 కోట్లు యాదాద్రి అభివృద్ధికి కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటిస్తే.. మేమూ చేయూతనందిస్తామంటూ టాటా, రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలూ ముందుకొచ్చాయి. దీంతో వరంగల్ హైవే ప్రాంతంలో స్థిరాస్తి సంస్థలు దృష్టిసారించాయి. దీంతో ఐదేళ్ల క్రితం ఎకరం వేల రూపాయలు పలికే ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలు పోసినా దొరకని పరిస్థితి. రానున్న రోజుల్లో మరింత ప్రియమవుతుందని పలువురు స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. వరంగల్ హైవే, యాదాద్రి అభివృద్ధితో గుట్టే కాదు పర్యాటకం, మౌలికం, వాణిజ్యం, విద్యా, వైద్య సదుపాయాలూ మెరుగవుతున్నాయి. యాదాద్రి ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు 6-7 కి.మీ. చుట్టూ ఉన్న సైదాపూర్, మల్లాపూర్, యాదగిరిపల్లి, రాయగిరి, దాతర్పల్లి, గుండ్లపల్లిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకే భవిష్యత్తు అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వనమాలి టౌన్షిప్ పేరుతో నివాస, వాణిజ్య సముదాయాల ప్లాటింగ్ వెంచర్‌ను ప్రారంభించామని సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. సీఎండీ గురురాజ్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అందుకే వరంగల్ హైవే రోడ్లో పలు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం. - రాయగిరిలో 150 ఎకరాల్లో వనమాలి టౌన్షిప్ మెగా వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. తొలి దశలో 133-400 గజాల్లో మొత్తం వెయ్యి ఓపెన్ ప్లాట్లొస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధి పనులకు ఈ వెంచర్ కేవలం 8 కి.మీ., వరంగల్ హైవేకు 3 కి.మీ. దూరంలోనే ఉంది. నివాస ప్లాట్లయితే గజానికి రూ.2,700, వాణిజ్యమైతే గజానికి రూ.3,600లుగా నిర్ణయించాం. 150 గజాల్లో విల్లాను రూ.20 లక్షలకే అందిస్తున్నాం. వసతుల విషయానికొస్తే.. స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ హాల్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ వంటి వసతులతో పాటుగా రిసార్ట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే 25 శాతం మేర ప్లాట్లు అమ్ముడుపోయాయంటే ఇక్కడి గిరాకీని అర్థం చేసుకోవచ్చు. - రాంపల్లిలో 10 ఎకరాల్లో ప్లాటింగ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 133 గజాల నుంచి 500 గజాల్లో మొత్తం 175 ఓపెన్ ప్లాట్లొస్తాయి. గజం ధర రూ.6,750గా నిర్ణయించాం. 80 శాతం బుకింగ్ అయిపోయాయంటే ఇక్కడి అభివృద్ధి, ప్రాజెక్ట్కున్న గిరాకీని అర్థం చేసుకోవచ్చు. కొనుగోలుదారుల కోరిక మేరకు విల్లాలను కూడా నిర్మిస్తున్నాం. 150 గజాల విల్లాను రూ.22 లక్షలకు అందిస్తున్నాం. ఇప్పటికే ఈ వెంచర్లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా పనులు పూర్తయ్యాయికూడా. - భువనగిరిలో 14 ఎకరాల్లో హైవే కౌంటి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 170-400 గజాల్లో మొత్తం 168 ఓపెన్ ప్లాట్లొస్తాయి. ధర గజానికి రూ.4,500లు గా నిర్ణయించాం. 80 శాతం మేర అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. - కీసర బొమ్మల రామారంలో 200 ఎకరాల్లో ఫాం ల్యాండ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మధ్యతరగతి ప్రజల కోసం వరంగల్ హైవేలో నెలసరి వాయిదాల రూపంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టనున్నాం.