- వరంగల్ హైవే, యాదాద్రి అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
- దీంతో ఈ ప్రాంతంలో వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్టీ పరుగులు
- ఆచితూచి అడుగులేయాలంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి సంస్థలను ఆకర్షించేందుకు రాయితీలో.. ప్రోత్సాహకాలో అందిస్తే సరిపోదు. వాటికవే పెట్టుబడులతో రావాలంటే అభివృద్ధి పనులు చేపట్టాలని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధి పనులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏటా రూ.100 కోట్లు యాదాద్రి అభివృద్ధికి కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటిస్తే.. మేమూ చేయూతనందిస్తామంటూ టాటా, రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలూ ముందుకొచ్చాయి. దీంతో వరంగల్ హైవే ప్రాంతంలో స్థిరాస్తి సంస్థలు దృష్టిసారించాయి. దీంతో ఐదేళ్ల క్రితం ఎకరం వేల రూపాయలు పలికే ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలు పోసినా దొరకని పరిస్థితి. రానున్న రోజుల్లో మరింత ప్రియమవుతుందని పలువురు స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.
వరంగల్ హైవే, యాదాద్రి అభివృద్ధితో గుట్టే కాదు పర్యాటకం, మౌలికం, వాణిజ్యం, విద్యా, వైద్య సదుపాయాలూ మెరుగవుతున్నాయి. యాదాద్రి ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు 6-7 కి.మీ. చుట్టూ ఉన్న సైదాపూర్, మల్లాపూర్, యాదగిరిపల్లి, రాయగిరి, దాతర్‌పల్లి, గుండ్లపల్లిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకే భవిష్యత్తు అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వనమాలి టౌన్‌షిప్ పేరుతో నివాస, వాణిజ్య సముదాయాల ప్లాటింగ్ వెంచర్‌ను ప్రారంభించామని సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. సీఎండీ గురురాజ్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అందుకే వరంగల్ హైవే రోడ్‌లో పలు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం.
- రాయగిరిలో 150 ఎకరాల్లో వనమాలి టౌన్‌షిప్ మెగా వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. తొలి దశలో 133-400 గజాల్లో మొత్తం వెయ్యి ఓపెన్ ప్లాట్లొస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధి పనులకు ఈ వెంచర్ కేవలం 8 కి.మీ., వరంగల్ హైవేకు 3 కి.మీ. దూరంలోనే ఉంది. నివాస ప్లాట్లయితే గజానికి రూ.2,700, వాణిజ్యమైతే గజానికి రూ.3,600లుగా నిర్ణయించాం. 150 గజాల్లో విల్లాను రూ.20 లక్షలకే అందిస్తున్నాం. వసతుల విషయానికొస్తే.. స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ హాల్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ వంటి వసతులతో పాటుగా రిసార్ట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే 25 శాతం మేర ప్లాట్లు అమ్ముడుపోయాయంటే ఇక్కడి గిరాకీని అర్థం చేసుకోవచ్చు.
- రాంపల్లిలో 10 ఎకరాల్లో ప్లాటింగ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 133 గజాల నుంచి 500 గజాల్లో మొత్తం 175 ఓపెన్ ప్లాట్లొస్తాయి. గజం ధర రూ.6,750గా నిర్ణయించాం. 80 శాతం బుకింగ్ అయిపోయాయంటే ఇక్కడి అభివృద్ధి, ప్రాజెక్ట్‌కున్న గిరాకీని అర్థం చేసుకోవచ్చు. కొనుగోలుదారుల కోరిక మేరకు విల్లాలను కూడా నిర్మిస్తున్నాం. 150 గజాల విల్లాను రూ.22 లక్షలకు అందిస్తున్నాం. ఇప్పటికే ఈ వెంచర్‌లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా పనులు పూర్తయ్యాయికూడా.
- భువనగిరిలో 14 ఎకరాల్లో హైవే కౌంటి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 170-400 గజాల్లో మొత్తం 168 ఓపెన్ ప్లాట్లొస్తాయి. ధర గజానికి రూ.4,500లు గా నిర్ణయించాం. 80 శాతం మేర అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
- కీసర బొమ్మల రామారంలో 200 ఎకరాల్లో ఫాం ల్యాండ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మధ్యతరగతి ప్రజల కోసం వరంగల్ హైవేలో నెలసరి వాయిదాల రూపంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టనున్నాం.
సొంతిల్లు సుఖీభవ!
Published Fri, Sep 11 2015 11:38 PM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement