డబ్బు పొదుపు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటారు. అయితే వాటిలో డిపాజిట్ చేసే డబ్బుకు ఆర్‌బీఐ కొంత వరకు బీమా కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఎఫ్‌డీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్‌లో వివిధ మనీ యాప్‌లు, బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు వంటివి ఎఫ్‌డీలకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఎక్కువ వడ్డీ అందించే సంస్థలు, ఏడాదిలో వాటి వడ్డీరేట్లను కింద తెలియజేశాం.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10%
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10%
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.05%
శ్రీరామ్ ఫైనాన్స్ - 9.07% వరకు (మహిళలకు)
బజాజ్ ఫైనాన్స్ - 8.65% వరకు
ఇండస్ ఇండ్ బ్యాంక్ - 8.25%
సౌత్ ఇండియన్ బ్యాంక్ - 7.75%
ఈ రేట్లు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే కాలపరిమితి, వారి పెట్టుబడిని బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.
ఇదీ చదవండి: అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
9.5 శాతం వడ్డీ ఇస్తున్న మనీ యాప్
‘సూపర్.మనీ’ యాప్ ఎఫ్‌డీపై 9.5 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆర్‌బీఐ గుర్తింపు కలిగిన ఏ ఆర్థిక సంస్థలో ఎఫ్‌డీ ద్వారా పెట్టుబడి పెట్టినా రూ.5 లక్షల వరకు ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) బీమా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అందుకు సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రూ.5 లక్షలలోపు ఎప్‌డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారు అధిక వడ్డీలిచ్చే బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment