Fixed Deposit
-
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది. కానీ చేసే ముందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేశానురా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగింది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంక్‌కు వచ్చారు. అనంతరం, బ్యాంక్ మేనేజర్ సంప్రదించి తన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తియ్యింది. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాను. సంబంధింత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.దీంతో సదరు బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు విత్ డ్రా ప్రాసెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఎఫ్డీపై ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవ్వడాన్ని గమనించారు.ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌తో ప్రస్తావించారు. బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ జైమన్ రావెల్ సహనం కోల్పోయారు. ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు. బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చొక్కా కాలర్ పట్టుకున్నారు. అంరతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'Customer' turned 'Crocodile' after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn 'taekwondo' for self defense. pic.twitter.com/CEDarfxcqi— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024 కుమారుడు, బ్యాంక్ మేనేజర్ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నాలు చేసింది. బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగి శుభమన్‌ను కోరింది. ఇరువురి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో చేసేది లేక ఆ తల్లి తన కుమారుడిని కొట్టింది. దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గొడవ సర్ధుమణిగింది. బ్యాంక్‌లో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు, ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ విషయంలో లాభనష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌లో దాచుకునే డబ్బులుపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. -
ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?
స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు. దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్డ్, ఫ్లోటింగ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ అని పలు రకాలున్నాయి. గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.యాన్యుటీ ప్లాన్లుపెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఎల్ఐసీ నుంచి జీవన్ శాంతి, జీవన్ అక్షయ్ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్ శాఖల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు)బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్ క్యుములేటివ్)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్ పరంగా చూస్తే.. బ్యాంక్ ఎఫ్డీలకు ఆర్బీఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం.మంత్లీ ఇన్కమ్ ప్లాన్లుమ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.కార్పొరేట్ డిపాజిట్లునాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల(నాన్ క్యుములేటివ్)లో ఇన్వెస్ట్ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్ రేటెడ్ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్ కలిగిన సంస్థలు.సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది. మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ ల్యాడర్ పోర్ట్‌ఫోలియో వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి. పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్ పీ2పీ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి. వీటిని గమనించాలి..→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. → రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?
ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్డ్ డిపాజిటర్లు నిర్దేశిత భాగాలతో ఎక్కువ మంది బహుళ నామినీలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్యాంకింగ్ నిబంధనలను సవరించే చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిశీలిస్తారని భావిస్తున్నారు.ఎక్కువ మంది నామినీలను పెట్టుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను నిర్వహించే అనేక మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డిపాజిటర్లు ఫిక్స్డ్ డిపాజిట్లను తెరిచేటప్పుడు నామినీలను పేర్కొనలేదు. దీంతో వారి మరణం తరువాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకోవడంలో వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద ఎత్తున ఎదురయ్యాయి.ప్రతిపాదిత కొత్త నిబంధనలుఎకనమిక్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుత సింగిల్ నామినీ సిస్టమ్ అమలులో ఉండగా ప్రతిపాదిత సవరణలతో గరిష్టంగా నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది.నామినీల ఏర్పాటు రెండు విధాలుగా ఉండవచ్చు. నామినీలకు భాగాలను పేర్కొంటూ ఒకేసారి అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా వివిధ సందర్భాల్లో నామినీలను జోడించుకునే అవకాశమైనా కల్పించవచ్చు.ఒకేసారి నామినీలను ఏర్పాటుచేసిన సందర్భంలో డిపాజిటర్ మరణించిన తర్వాత ముందుగానే పేర్కొన్న భాగాల ప్రకారం నామినీలందరూ డిపాజిట్ సొమ్మును పొందే వీలుంటుంది. దీని వల్ల క్లయిమ్ సెటిల్మెంట్ సులభతరం కావడం మాత్రమే కాకుండా డిపాజిటర్ సొమ్ము సరైన వారసులకు దక్కే ఆస్కారం ఉంటుంది. -
అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
డబ్బు పొదుపు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటారు. అయితే వాటిలో డిపాజిట్ చేసే డబ్బుకు ఆర్బీఐ కొంత వరకు బీమా కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఎఫ్డీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో వివిధ మనీ యాప్‌లు, బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు వంటివి ఎఫ్డీలకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఎక్కువ వడ్డీ అందించే సంస్థలు, ఏడాదిలో వాటి వడ్డీరేట్లను కింద తెలియజేశాం.యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50% నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.05% శ్రీరామ్ ఫైనాన్స్ - 9.07% వరకు (మహిళలకు)బజాజ్ ఫైనాన్స్ - 8.65% వరకుఇండస్ ఇండ్ బ్యాంక్ - 8.25%సౌత్ ఇండియన్ బ్యాంక్ - 7.75%ఈ రేట్లు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే కాలపరిమితి, వారి పెట్టుబడిని బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.ఇదీ చదవండి: అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?9.5 శాతం వడ్డీ ఇస్తున్న మనీ యాప్‘సూపర్.మనీ’ యాప్ ఎఫ్డీపై 9.5 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆర్బీఐ గుర్తింపు కలిగిన ఏ ఆర్థిక సంస్థలో ఎఫ్డీ ద్వారా పెట్టుబడి పెట్టినా రూ.5 లక్షల వరకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) బీమా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అందుకు సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రూ.5 లక్షలలోపు ఎప్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారు అధిక వడ్డీలిచ్చే బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను ఇటీవల అప్డేట్ చేసింది. దీంతోపాటు బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ అనే కొత్త డిపాజిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇది డిపాజిట్‌దారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 14 నుండి అమలులోకి వచ్చాయి.కొత్త స్కీమ్ వడ్డీ రేట్లుబీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ సాధారణ పౌరులకు 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు 7.80 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే గరిష్టంగా 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ముబ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్డీ వడ్డీ రేట్ల మార్పు తర్వాత రూ. 3 కోట్ల లోపు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వ్యవధి గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25% నుండి 7.30% (ప్రత్యేక డిపాజిట్‌తో సహా) వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75% నుండి 7.80% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. -
డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్ డిపాజిట్– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్ఐపీ) కాంబో ప్రొడక్ట్సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్‌ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్మెంట్లో ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్‌ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.రికరింగ్ డిపాజిట్ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్/ రికరింగ్ డిపాజిట్–ఎస్ఐపీను డిజిటల్‌గా యాక్సెస్ చేయగల కాంబో ప్రోడక్ట్‌గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.తాజా ప్రొడక్టులు జన్ జెడ్‌లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.అంతేకాకుండా, డిపాజిట్ సమీకరణ కోసం బ్యాంక్ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్ ఛానెల్‌ల ద్వారానే తెరుస్తున్నాం.వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని బ్యాంక్ నమోదుచేసింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
గడువు ముగియనున్న ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్ ‘ఎస్బీఐ అమృత్ కలశ్’కు గడువు త్వరలో ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది.ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలు సార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది.కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్డీ ప్లాన్‌పై సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు సుమారు 30 బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది.అమృత్ కలశ్ ఎఫ్డీ రేట్లుఎస్బీఐ అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6% రేటు లభిస్తోంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1-2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్డీ ప్లాన్‌కు సాధారణ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తోంది. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎఫ్డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకు7 నుంచి 14 రోజులు 3.00% 3.75%15 నుంచి 30 రోజులు 3.00% 3.75%31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%ఏడాది 8.05% 8.55%ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.00% 7.50% -
‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇటీవల రూ. 3 కోట్లలోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందులో భాగంగా అధిక రాబడిని అందించే ‘స్టార్ ధన్ వృద్ధి’అనే పేరుతో కొత్త ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. మార్పుల తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ రేట్లు సాధారణ ప్రజలకు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.‘స్టార్ ధన్ వృద్ధి’ గురించి..స్టార్ ధన్ వృద్ధి పథకం అనేది పరిమిత-సమయ ఎఫ్డీ స్కీమ్. ఇది 333 రోజుల స్థిర కాలవ్యవధికి 7.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఈ పథకం కింద మరింత మెరుగైన రాబడి లభిస్తుంది.ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు (వయస్సు 60-80 ఏళ్లు ) 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లు ( వయస్సు 80 ఏళ్లకు పైబడి) 7.90 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. -
అధికంగా వడ్డీ ఇస్తున్న చిన్న బ్యాంకులు
Best FD Rates: దేశంలో చాలా మంది అధిక రాబడుల కోసం ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను వదిలి కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, మొత్తం పెట్టుబడిని మార్కెట్లో పెట్టే బదులు కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిలో మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తక్కువ వస్తుంది కదా అని అపోహ పడవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక మాత్రమే కాకుండా వడ్డీ కూడా బాగానే వస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్డీపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న బ్యాంకులు కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్డీపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్డీపై దేశంలోనే అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ బ్యాంకులో 3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ ఖాతాను తెరిస్తే సంవత్సరానికి 9.5 శాతం వడ్డీని ఇస్తుంది.సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీపై అత్యధిక వడ్డీ ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.1 శాతం వడ్డీని ఇస్తోంది.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 3 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75 శాతం వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందించే బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు మూడేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఆఫర్ 3 సంవత్సరాల వ్యవధిలో చేసిన బ్యాంక్ ఎఫ్డీలకు కూడా వర్తిస్తుంది.