![Bandhan Bank hiked interest rates on its fixed deposits](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/16/fd.jpg.webp?itok=C7XR65oj)
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్‌లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్‌లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్‌లోకి..
మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్‌లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ సదుపాయం ద్వారా కస్టమర్‌లు ఎఫ్‌డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.
కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్‌లకు సాధారణ ప్రజలకు
7 నుంచి 14 రోజులు 3.00% 3.75%
15 నుంచి 30 రోజులు 3.00% 3.75%
31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%
2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%
3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%
6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%
ఏడాది 8.05% 8.55%
ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%
21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%
ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ 7.00% 7.50%
Comments
Please login to add a commentAdd a comment