Bandhan Bank
-
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎఫ్డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకు7 నుంచి 14 రోజులు 3.00% 3.75%15 నుంచి 30 రోజులు 3.00% 3.75%31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%ఏడాది 8.05% 8.55%ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.00% 7.50% -
బంధన్ బ్యాంక్ సీఈఓగా రతన్ కుమార్ కేష్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'రతన్ కుమార్ కేష్' జూలై 10 నుంచి అమలులోకి వచ్చేలా ప్రైవేట్ లెండర్ తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ 2024 జులై 9న పదవీ విరమణ చేయనున్నారు.జూలై 6న సమావేశంలో రతన్ కుమార్ కేష్‌ను తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు తీర్మానించింది. ఈ నియామకం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది.రతన్ కుమార్ కేష్ మార్చి 2023 నుంచి బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతకంటే ముందు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యెస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్‌లలో కూడా పనిచేశారు. -
తగ్గిపోయిన బంధన్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: నాలుగో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం రూ. 55 కోట్లకు పరిమితమైంది. క్రితం క్యూ4లో ఇది రూ. 808 కోట్లు. తాజాగా రైటాఫ్‌లు, మొండిబాకీలకు అధిక కేటాయింపులు జరపాల్సి రావడం వంటి అంశాలు లాభాలు తగ్గడానికి కారణం.జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రొవిజనింగ్ రూ. 735 కోట్ల నుంచి రూ. 1,774 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. అలాగే రూ. 3,852 కోట్లు రైటాఫ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్ 7.6 శాతంగా ఉంది.స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 4.9 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.1 శాతంగా ఉన్నాయి. జూలైలో ఎండీ, సీఈవో పదవి నుంచి రిటైర్ కానున్న ఘోష్.. రిటైర్మెంట్ తర్వాత హోల్డింగ్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌లో వ్యూహాత్మక బాధ్యతలు పోషించనున్నట్లు తెలిపారు. -
బంధన్ బ్యాంక్‌కు సీఈవో గుడ్‌బై
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన బంధన్ బ్యాంక్ లాభాలు - పూర్తి వివరాలు
బంధన్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల ప్రకారం బ్యాంక్ మొత్తం వ్యాపారం 17 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లలో బ్యాంక్ రిటైల్ వాటా ఇప్పుడు 71 శాతం వద్ద ఉంది. ఈ త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 26 శాఖలను ప్రారంభించింది. దీంతో భారతదేశం మొత్తం మీద ఉన్న బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య 6250కు చేరుకుంది. వీటి ద్వారా బ్యాంక్ ఏకంగా 3.26 కోట్ల కంటే ఎక్కువ మందికి సేవలు అందిస్తోంది. బంధన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 75,000 కంటే ఎక్కువ. బ్యాంక్ డిపాజిట్ గతంలో కంటే కూడా ఈ త్రైమాసికంతో 15 శాతం పెరిగింది. మొత్తం డిపాజిట్ ఇప్పుడు రూ.1.17 లక్షల కోట్లు కాగా, మొత్తం అడ్వాన్సులు రూ.1.16 లక్షల కోట్లు. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ నిష్పత్తి 36.1 శాతం వద్ద ఉంది. బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.8 శాతం వద్ద నిలిచింది. ఇది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ కావడం గమనార్హం. బంధన్ బ్యాంక్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది, తద్వారా SME లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ వంటి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. వీటితో పాటు బ్యాంక్ ఇటీవల కమర్షియల్ వెహికల్ లెండింగ్, వ్యాపారాల కోసం ఆస్తిపై లోన్ వంటి కొత్త వర్టికల్స్ ప్రారంభించింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో బ్యాంకు గణనీయమైన వృద్ధికి సహాయపడతాయి. బంధన్ బ్యాంక్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా, ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ.. మూడవ త్రైమాసికం ఎప్పుడూ బ్యాంకుకు మంచి వృద్ధి తీసుకువస్తుందని, రానున్న రోజుల్లో మరింత వృద్ధిని సాధించడానికి, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కావలసిన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని, దేశంలో మరింత మందికి చేరువయ్యే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇదీ చదవండి: ప్రశాంతత లేదని ట్వీట్.. తెల్లారేసరికి ఉద్యోగమే ఊడింది! -
కొత్త వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్.. త్వరలో ఒప్పందాలు
కోల్‌కతా: కో లెండింగ్ (ఇతర సంస్థలతో కలసి రుణాలు ఇవ్వడం) వ్యాపారంలోకి తాము అడుగు పెడుతున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ ప్రకటించారు. ఇందుకోసం తాము ఎన్బీఎఫ్సీలతో జట్టు కడతామని తెలిపారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం గురువారం కోల్‌కతాలో జరిగింది. ఈ సందర్భంగా ఘోష్ ఈ ప్రకటన చేశారు. కో లెండింగ్ కింద అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎన్బీఎఫ్సీలను ఎంపిక చేశామని, త్వరలోనే వారితో ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు. 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు ఎనిమిదేళ్ల క్రితం బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు కలిగి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో తాజాగా ఒక శాఖను తెరవగా, సెప్టెంబర్‌లో కార్గిల్‌లో ఒకటి ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమకు 3 కోట్ల కస్టమర్లు ఉన్నారని, వ్యాపారం రూ.2 లక్షల కోట్లు అధిగమించిందని వెల్లడించారు. కాసా డిపాజిట్ల రేషియో 39 శాతంగా ఉందన్నారు. బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్‌గా నమోదవుతున్నట్టు తెలిపారు. భౌగోళికంగా, రుణ విభాగాల పరంగా తాము మరింత వైవిధ్యాన్ని అమలు చేస్తామని, అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత.. -
బంధన్ బ్యాంక్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 19 శాతం క్షీణించి రూ. 721 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 887 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 2,514 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,385 కోట్ల నుంచి రూ. 4,908 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.25 శాతం నుంచి 6.76 శాతానికి తగ్గాయి. అయితే నికర ఎన్పీఏలు 1.92 శాతం నుంచి 2.18 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 8 శాతం నుంచి 7.3 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.44 శాతంగా నమోదైంది. డిపాజిట్లు రూ. 1.08 లక్షల కోట్లను తాకగా.. అడ్వాన్సులు(రుణాలు) రూ. 1.03 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 2.5 శాతం ఎగసి రూ. 221 వద్ద ముగిసింది. -
కొత్త అవతారమెత్తిన సౌరవ్ గంగూలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న బంధన్ బ్యాంక్.. సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమించుకుంది. బ్యాంక్ సందేశాన్ని విస్తరించడంలో, సంస్థ ఉత్పత్తులు, సేవలను మరింత మందికి చేరువ చేయడంలో సౌరవ్ గంగూలీ సహాయపడతారని బంధన్ బ్యాంక్ తెలిపింది. 34 రాష్ట్రాల్లో 5,644 బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. మార్చి నాటికి కొత్తగా 551 శాఖలను తెరుస్తోంది. టీమిండియాకు ఆడే సమయంలో కెప్టెన్‌గా చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ... బీసీసీఐ బాస్‌గా గత మూడేళ్లలో తనదైన ముద్ర చూపించాడు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఉండాలని ఆశపడ్డా అది కుదరలేదు. ఈ విషయంలో బీసీసీఐ బోర్డు పెద్దలు అంగీకరించకపోవడంతో దాదా అయిష్టంగానే పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. చదవండి: బ్యాంకుల పనివేళలు మారనున్నాయా? బ్యాంకు అసోసియేషన్ ప్రతిపాదనలు ఇవే! -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.4,600 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నిటితో కలిపి) రూ.4,600 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,389 కోట్లతో పోలిస్తే 57.5 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.32,851 కోట్ల నుంచి రూ.34,090 కోట్లకు వృద్ధి చెందింది. ‘2019 సెప్టెంబర్ క్వార్టర్లో అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్‌ను బంధన్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు, వాటా విక్రయించిన కారణంగా రూ.8,000 కోట్ల లాభం లభించింది’ అని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ‘వాస్తవానికి, డివిడెండ్ ఆదాయాన్ని, వాటాల విక్రయం, అలాగే అంచనా క్రెడిట్ నష్టం(ఈసీఎల్) కేటాయింపులను తీసివేస్తే, క్యూ2లో నికర లాభం 27 శాతం పెరిగినట్లు లెక్క’ అని హెచ్డీఎఫ్సీ వైస్–చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు. స్టాండెలోన్‌గానూ 28 శాతం తగ్గుదల... కేవలం మార్ట్గేజ్ కార్యకలాపాలపై మాత్రమే చూస్తే (స్టాండెలోన్‌గా), క్యూ2లో హెచ్డీఎఫ్సీ నికర లాభం 28 శాతం తగ్గి రూ.2,870 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,962 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,494 కోట్ల నుంచి రూ.11,733 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 21 శాతం పెరుగుదలతో రూ.3,021 కోట్ల నుంచి రూ. 3,647 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా ఉంది. ఇక మొండిబాకీ(ఎన్పీఏ)ల విషయానికొస్తే, క్యూ2లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.8,511 కోట్లు) నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ రూ.10,000 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో వాటా అమ్మకం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీకి రూ.1,241 కోట్ల స్థూల లాభం వచ్చింది. కాగా, కోవిడ్ ప్రభావంతో సహా క్యూ2లో కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.436 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.754 కోట్లు. హెచ్డీఎఫ్సీ షేరు సోమవారం బీఎస్ఈలో 6 శాతం పెరిగి రూ. 2,043 వద్ద స్థిరపడింది. -
బంధన్ బ్యాంక్- క్యాడిలా హెల్త్ జోరు
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ చేయడం ద్వారా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కాగా.. ఊపరితిత్తులకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనాన్ని కల్పించే ఔషధాన్ని దేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో క్యాడిలా హల్త్‌కేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర బిజినెస్‌ను సాధించిన వార్తలతో బంధన్ బ్యాంక్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. క్యాడిలా హెల్త్‌కేర్ ప్రెజరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్(పీఎండీఐ)ను దేశీయంగా తొలిసారి విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ తాజాగా పేర్కొంది. ఊపిరి తీయడంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఈ ఔషధం ఉపశమనాన్ని కల్పిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఎల్ఏఎంఏ, ఎల్ఏబీఏలతో కూడిన ఈ ఇన్హేలర్ సీవోపీడీ రోగుల చికిత్సలో వినియోగించవచ్చని వివరించింది. ఫార్గ్లిన్ పీఎండీఐగా పిలిచే ఈ ప్యాక్ విలువ రూ. 495గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాడిలా హెల్త్‌కేర్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 17 శాతం పుంజుకుంది! బంధన్ బ్యాంక్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. క్యూ2(జులై-సెప్టెంబర్)లో బ్యాంక్ రుణ వృద్ధి 20 శాతం పుంజుకోవడం దీనికి కారణంకాగా.. వసూళ్లు నిష్పత్తి 92 శాతంగా నమోదైనట్లు బ్యాంక్ తెలియజేసింది. డిపాజిట్లలోనూ 34 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.3 శాతం ఎగసి రూ. 322 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 327ను అధిగమించింది. గత వారం రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడటం గమనార్హం! -
బంధన్ బ్యాంక్‌కు వాటా విక్రయ షాక్
ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11.3 శాతం కుప్పకూలి రూ. 306 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 295 వరకూ జారింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం బంధన్ బ్యాంకులో ప్రమోటర్లు 20 శాతం వాటా విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వారాంతాన పేర్కొన్నాయి. బ్లాక్‌డీల్ ద్వారా 20.9 శాతం వాటాను నేటి ట్రేడింగ్‌లో విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్ విలువ రూ. 10,500 కోట్లుకాగా.. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 311.10గా నిర్ణయించినట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. ఇది శుక్రవారం ముగింపు రూ. 345తో పోలిస్తే 10 శాతం డిస్కౌంట్‌కావడం గమనార్హం! భారీ ట్రేడింగ్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ద్వారా రూ. 314 సగటు ధరలో బంధన్ బ్యాంక్‌కు చెందిన 33 కోట్ల షేర్లు తొలుత బ్లాక్‌డీల్స్ ద్వారా చేతులు మారినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి బ్యాంకు ఈక్విటీలో 20.6 శాతం వాటాకు సమానమని తెలియజేశారు. వెరసి ట్రేడింగ్ ప్రారంభమైన 60 నిముషాల్లోనే బంధన్ బ్యాంక్ కౌంటర్లో 37 కోట్ల షేర్లు ట్రేడైనట్లు తెలుస్తోంది. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 7.47 లక్షల షేర్లు మాత్రమే! కారణమేవిటంటే? ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్లు మూడేళ్లలోగా బ్యాంకులో తమ వాటాను 40 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉంటుంది. జూన్ చివరికల్లా బంధన్ బ్యాంకులో ప్రమోటర్లు 60.95 శాతం వాటాను కలిగి ఉన్నారు. కొత్త బ్యాంకింగ్ లైన్సింగ్ విధానాల రీత్యా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమైన మూడేళ్లలోగా ప్రమోటర్ల వాటా 40 శాతానికి కుదించుకోవలసి ఉంటుందని నిపుణులు వివరించారు. దీంతో బంధన్ బ్యాంక్ ప్రమోటర్లు వాటా విక్రయం కోసం క్రెడిట్ స్వీస్ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ తదితరాలను బుక్‌రన్నర్స్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. -
క్యామ్లిన్ ఫైన్‌సైన్స్ -బంధన్ బ్యాంక్.. భళా
ప్రపంచ మార్కెట్ల బాటలో వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలతోనూ, నిఫ్టీ నామమాత్ర నష్టంతోనూ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు క్యామ్లిన్ ఫైన్‌సైన్స్, మరోపక్క బంధన్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్లిన్ ఫైన్ సైన్స్ షేరుకి రూ. 56 ధరలో క్యామ్లిన్ ఫైన్సైన్స్కు చెందిన 6.63 లక్షలకుపైగా షేర్లను ఇన్ఫినిటీ హోల్డింగ్స్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్ డీల్స్ డేటా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 0.5 శాతం వాటాకు సమానంకాగా.. గత నెల 25న ఇన్ఫినిటీ హోల్డింగ్స్ తదితర సంస్థల నుంచి రూ. 180 కోట్లను సమీకరించేందుకు క్యామ్లిన్ ఫైన్‌సైన్స్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్యామ్లిన్ ఫైన్ సైన్స్ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 60 వద్ద ట్రేడవుతోంది. బంధన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అడ్వాన్సులు, డిపాజిట్లలో వృద్ధి సాధించినట్లు పేర్కొనడంతో ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 374 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 377 వరకూ ఎగసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో రుణాలు, అడ్వాన్సులు 18 శాతం పెరిగి రూ. 74,325 కోట్లను తాకినట్లు బ్యాంక్ తెలియజేసింది. మరోవైపు డిపాజిట్లు 35 శాతం పుంజుకుని రూ. 60,602 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. -
హాకిన్స్ కుకర్స్- బంధన్ బ్యాంక్- బోర్లా
వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో కోతతోపాటు.. రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను మరో మూడు నెలలపాటు ఆర్బీఐ పొడిగించడంతో స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350 పాయింట్లు క్షీణించి 30,583ను తాకగా.. నిఫ్టీ 102 పాయింట్లు నీరసించి 9,004 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హాకిన్స్ కుకర్స్, బంధన్ బ్యాంక్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం.. హాకిన్స్ కుకర్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో కిచెన్వేర్ కంపెనీ హాకిన్స్ కుకర్స్ షేరు డీలాపడింది. ప్రస్తుతం బీఎస్ఈలో 7 శాతం(రూ. 318) కుప్పకూలి రూ. 4227 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3985 వరకూ దిగజారింది. ఇది 12 శాతం పతనంకాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హాకిన్స్ కుకర్స్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 9.4 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 21 శాతం తగ్గి రూ. 146 కోట్లకు చేరాయి. పన్నుకు ముందు లాభం సైతం 36 శాతం వెనకడుగుతో రూ. 13 కోట్లను తాకింది. బంధన్ బ్యాంక్ ఈ వారం మొదట్లో చెలరేగిన అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిషాలలోని కొన్ని ప్రాంతాలలో కార్యకలాపాలకు దెబ్బతగిలినట్లు ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. రూ. 260 కోట్ల విలువైన బిజినెస్ ప్రభావితమయ్యే వీలున్నదని తెలియజేసింది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంధన్ బ్యాంక్ ప్రధానంగా 49 యూనిట్లు తుఫాన్ ప్రభావానికి లోనైనట్లు వెల్లడించింది. అయితే ఐదు జిల్లాలలో దాదాపు కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేరు 5.5 శాతం పతనమై రూ. 199 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 195 సమీపానికి క్షీణించింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 11 శాతం నీరసించడం గమనార్హం! -
యస్ బ్యాంకు : మరో రూ. 600 కోట్లు
సాక్షి, ముంబై: మూలధన సంక్షోభం పడిన యస్‌బ్యాంకునకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఆర్బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. అంతేకాదు బ్యాంకునకు అందించే అధీకృత మూలధనాన్ని రూ. 6200 కోట్లకు పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుఎస్‌బీఐ 49 శాతం ఈక్విటీ కొనుగోలు ద్వారా రూ.7250 కోట్ల నిధులను యస్ బ్యాంకునకు అందించనుంది. దీంతో యస్ బ్యాంకులో పెట్టుబడులకు దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు పెట్టుబడులను ప్రకటించగా శనివారం బంధన్ బ్యాంక్ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును (రూ.8 ప్రీమియంతో) రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుంది. తాజాగా ఫెడరల్ బ్యాంకు కూడా యస్ బ్యాంకులో రూ .300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. 30 కోట్ల ఈక్విటీ షేర్లను ఈక్విటీ షేరుకు 10 రూపాయల చొప్పున కొనుగోలు ద్వారా రూ. 300 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. (యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ) ఇప్పటివరకూ యస్ బ్యాంకులో ప్రైవేటుబ్యాంకుల పెట్టుబడులు ఐసీఐసీఐ బ్యాంక్ రూ .1000 కోట్లు హెచ్డీఎఫ్సీ రూ. 1,000 కోట్లు యాక్సిస్ రూ.600 కోట్లు కోటక్ మహీంద్రా రూ.500 కోట్లు బంధన్ బ్యాంకు రూ.రూ. 300 కోట్లు ఫెడరల్ బ్యాంకు రూ. 300 కోట్లు కాగా సమస్యాత్మక ప్రైవేట్ బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో బ్యాంకు, ఖాతాదారులు నగదు ఉపసంహరణపై తాత్కాలిక నిషేధాన్ని మార్చి 18 న ఎత్తివేయనున్న సంగతి తెలిసిందే. -
125 కొత్త శాఖలను ఆరంభించిన బంధన్ బ్యాంకు
హైదరాబాద్: బంధన్ బ్యాంకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 125 నూతన శాఖలను ప్రారంభించినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంకు శాఖలు 1,013కు పెరిగాయి. అలాగే, 3,206 బ్యాంకింగ్ యూనిట్లు, 195 గృహ రుణ సేవా కేంద్రాలు కూడా బ్యాంకు నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. దీంతో మొత్తం మీద దేశవ్యాప్తంగా తమకు 4,414 బ్యాంకింగ్ ఔట్లెట్లు ఉన్నట్టు బంధన్ బ్యాంకు తెలిపింది. అలాగే, రెండు మినహా దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోకి విస్తరించినట్టు పేర్కొంది. డిసెంబర్ చివరికి బంధన్ బ్యాంకు రూ.54,908 కోట్ల డిపాజిట్లు, రూ.65,456 కోట్ల రుణ పుసక్తంతో ఉంది. -
బంధన్ బ్యాంక్ లాభం 68 శాతం అప్
కోల్‌కత: ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 68% ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో రూ.651కోట్ల నికర లాభం సాధించామని బంధన్ బ్యాంక్ తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఇది రూ.388 కోట్లని బ్యాంక్ ఎమ్డీ సీఎస్ ఘోష్ తెలిపారు. ఇతర ఆదాయం దాదాపు రెట్టింపు కావడం, ఫీజు ఆదాయం పెరగడంతో గత క్యూ4లో నికర లాభంలో భారీ వృద్ధి సాధించామని తెలిపారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. 10.69 శాతానికి నికర వడ్డీ మార్జిన్.. నికర వడ్డీ మార్జిన్ 9.32 శాతం నుంచి 10.69 శాతానికి పెరిగిందని ఘోష్ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.864 కోట్ల నుంచి 46 శాతం వృద్ధితో రూ.1,258 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రుణాలు రూ.32,339 కోట్ల నుంచి 38 శాతం వృద్ధితో రూ.44,776 కోట్లకు పెరిగాయని, డిపాజిట్లు రూ.33,869 కోట్ల నుంచి 28 శాతం పెరిగి రూ.43,232 కోట్లకు చేరాయని వివరించారు. మెరుగుపడిన రుణ నాణ్యత... సీక్వెన్షియల్‌గా చూస్తే, బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 2.41 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 2.04 శాతానికి తగ్గాయని ఘోష్ తెలిపారు. నికర మొండి బకాయిలు 0.70 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల మొండి బకాయిలు పెరిగాయని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 45 శాతం వృద్ధితో రూ.1,952 కోట్లకు పెరిగిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్ 4.3 శాతం లాభంతో రూ.624 వద్ద ముగిసింది. -
బంధన్ బ్యాంక్ లాభం 10 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పుణ్యమాని ఈ బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరిగాయి. 54 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం.... గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. రుణాలు 46 శాతం వృద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వృద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు. తగ్గిన రుణనాణ్యత... ఇన్ని సానుకూలాంశాలున్నా ఈ బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 1.29 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిల నిష్పత్తి ఈ క్యూ3లో 2.41 శాతానికి పెరిగింది. అలాగే నికర మొండి బకాయిలు 0.69 శాతం నుంచి 0.70 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో రూ.124 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.474 కోట్లకు పెరిగాయని ఘోష్ పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి ఇచ్చిన రుణాల కోసం రూ.385 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేటాయింపులు లేకపోతే మొత్తం కేటాయింపులు రూ.90 కోట్లుగానే ఉండేవని వివరించారు. హెచ్డీఎఫ్సీ గ్రూప్‌నకు చెందిన గృహ్ ఫైనాన్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్ ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందన్న ధీమాను బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బంధన్ బ్యాంక్ షేర్ పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు పతనమైనా, బంధన్ బ్యాంక్ షేర్ 4 శాతం ఎగసి రూ.472 వద్ద ముగిసింది. -
బంధన్ చేతికి గృహ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ తాజాగా గృహ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది. ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేశాయి. రెండు పక్షాలకు ఇది ప్రయోజనకరమైన ఒప్పందంగా హెచ్డీఎఫ్సీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు గృహ్ ఫైనాన్స్‌కి, మరింత వైవిధ్యమైన సెక్యూర్డ్ రుణాల పోర్ట్‌ఫోలియో దక్కడం ద్వారా బంధన్ బ్యాంక్‌కు ఇది లాభించగలదన్నారు. విలీన సంస్థలో 15 శాతం దాకా వాటాలను అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరతామని, అనుమతి లభించని పక్షంలో నిబంధనల ప్రకారం 10 శాతం లోపునకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికల్లో భాగంగా డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టినట్లు, ఇందులో భాగంగానే గృహ్ ఫైనాన్స్ కొనుగోలు చేస్తున్నట్లు బంధన్ బ్యాంక్ సీఈవో చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. విలీనానంతరం బంధన్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో అన్సెక్యూర్డ్ రుణాల వాటా 86 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందన్నారు. విలీన బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 4,182 బ్యాంకింగ్ అవుట్‌లెట్స్, 476 ఏటీఎంలు ఉంటాయి. రుణ పోర్ట్‌ఫోలియోలో 58 శాతం మైక్రో ఫైనాన్స్ రుణాలు, 28 శాతం రిటైల్ హోమ్ లోన్స్, 14 శాతం ఇతరత్రా రుణాలు ఉంటాయి. తగ్గనున్న బంధన్ హోల్డింగ్స్ వాటాలు .. ప్రస్తుతం బంధన్ బ్యాంక్‌లో మాతృ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు (బీఎఫ్హెచ్ఎల్) 82.28 శాతం వాటాలు ఉన్నాయి. అటు గృహ్ ఫైనాన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 57.83% వాటాలు ఉన్నాయి. విలీనానంతరం బంధన్ బ్యాంక్‌లో బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాటా 60.27%కి తగ్గుతుంది. అటు హెచ్‌డీఎఫ్‌సీకి 15% వాటాలు దక్కుతాయి. ఆ తర్వాత కొన్ని వాటాలను పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు లేదా సెకండరీ మార్కెట్లలో విక్రయించడం ద్వారా దీన్ని క్రమంగా 10% లోపునకు తగ్గించుకుంటుంది. ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలో బంధన్ బ్యాంక్‌లో బీహెచ్ఎఫ్ఎల్ తన వాటాలు 82.3% నుంచి 40%కి తగ్గించుకోవాలి. కానీ అది జరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో బంధన్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ జీతభత్యాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటికీ ఇటీవల సడలించింది. తాజా డీల్ పూర్తయినా బంధన్ బ్యాంక్‌లో బీహెచ్ఎఫ్ఎల్ వాటా 60.27% స్థాయికి మాత్రమే తగ్గుతుంది. దీంతో.. వాటాలను మరింత తగ్గించుకోవడానికి బీహెచ్ఎఫ్ఎల్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉండనుంది. ఇక, అటు హెచ్‌డీఎఫ్‌సీకి విలీన బ్యాంకులో ప్రమోటరు హోదా లభిస్తుంది.ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీకి.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 19.72% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాంకులో ప్రమోటరుగా ఉన్న సంస్థ మరో బ్యాంకులో ప్రమోటరుగా 10%కి మించి వాటాలు ఉండకూడదు దీంతో విలీన సంస్థలో ప్రారంభ దశలో 15.44% వాటాలు ఉన్నప్పటికీ.. హెచ్డీఎఫ్సీ కూడా క్రమంగా దీన్ని పది శాతం లోపునకు తగ్గించుకోవాల్సి రానుంది. సోమవారం బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్లు 5.21 శాతం క్షీణించి రూ. 501.10 వద్ద క్లోజయ్యాయి. గృహ్ ఫైనాన్స్ షేరు 3.9 శాతం క్షీణించి రూ. 306.20 వద్ద క్లోజయ్యింది. గృహ్ ఫైనాన్స్.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో ఆగా ఖాన్ ఫౌండేషన్, హెచ్డీఎఫ్సీ కలిసి గృహ్ ఫైనాన్స్ ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాల ప్రకారం.. గృహ్ ఫైనాన్స్ దాదాపు రూ. 2,738 కోట్ల రుణాలు ఇచ్చింది. మొత్తం లోన్ బుక్ పరిమాణం రూ. 16,663 కోట్లుగా ఉంది. ప్రధానంగా రిటైల్ విభాగంపై దృష్టి పెడుతున్న గృహ్ ఫైనాన్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 220 కోట్ల నికర లాభం ఆర్జించింది. బంధన్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్‌కు.. 938 శాఖలు, 30,431 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం డిపాజిట్లు రూ. 33,869 కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 33,373 కోట్లుగా ఉన్నాయి. బంధన్ బ్యాంక్ ప్రధానంగా తూర్పు భారతదేశ రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా మైక్రోఫైనాన్స్ లోన్సే ఉన్నాయి. అటు గృహ్ ఫైనాన్స్ పశ్చిమాది రాష్ట్రాల్లో .. గృహ రుణాల కేటగిరీలో కార్యకలాపాలు సాగిస్తోంది. షేర్ల మార్పిడి ఇలా.. డీల్ ప్రకారం.. గృహ్ ఫైనాన్స్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బంధన్ బ్యాంక్‌కి చెందిన 568 షేర్లు లభిస్తాయి. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రమోటర్ హోల్డింగ్‌ను తగ్గించుకోవడానికి, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించుకోవడానికి బంధన్ బ్యాంక్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లుగా ఉంటుంది. బంధన్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 59,800 కోట్లుగా ఉండగా, గృహ్ ఫైనాన్స్ విలువ రు. 23,224 కోట్లుగా ఉంది. -
బంధన్ బ్యాంక్‌కు సెబీ ఊరట
ముంబై: ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ తగ్గింపు విషయానికి సంబంధించి బంధన్ బ్యాంక్‌కు కొంత ఊరట లభించింది. లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు ఏడాది దాకా వాటాలను విక్రయించకుండా చేసే నిబంధన విషయంలో తమకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపు లభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ లైసెన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటింగ్ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (బీఎఫ్హెచ్ఎల్).. బంధన్ బ్యాంకులో తనకున్న 82 శాతం వాటాలను 40 శాతానికి తగ్గించుకోవాలి. లాకిన్ వ్యవధి నిబంధనలు తదితర అంశాల నేపథ్యంలో బీఎఫ్హెచ్ఎల్ దీన్ని అమలు చేయడంలో విఫలమైంది. ఇందుకు గాను బంధన్ బ్యాంకు.. కొత్త శాఖలు తెరవకుండా, ఎండీ చంద్రశేఖర్ ఘోష్ జీతభత్యాలను పెంచకుండా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో లాకిన్ వ్యవధికి సంబంధించి సెబీ కొంత మినహాయింపునిచ్చింది. దీంతో ప్రమోటర్ వాటాను తగ్గించుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లేదా ఇతర సంస్థల విలీన, కొనుగోలు తదితర మార్గాలను పరిశీలించనున్నట్లు ఘోష్ తెలిపారు. -
బంధన్ బ్యాంక్ లాభం 47% అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(2018–19, క్యూ2)లో రూ.488 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.331 కోట్లు)తో పోల్చితే 47 శాతం వృద్ధి సాధించామని బంధన్ బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బంధన్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.693 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో 56 శాతం వృద్ధితో రూ.1,078 కోట్లకు ఎగసిందని వివరించారు. నికర వడ్డీ మార్జిన్ 9.3 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగిందని తెలిపారు. తగ్గిన మొండి బకాయిలు... స్థూల మొండి బకాయిలు 1.4 శాతం నుంచి 1.3 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 0.8 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గాయని చంద్రశేఖర్ తెలిపారు. డిపాజిట్లు రూ.25,442 కోట్ల నుంచి 30 శాతం వృద్ధితో రూ.32,959 కోట్లకు పెరిగాయని వివరించారు. మొత్తం రుణాలు రూ.22,111 కోట్ల నుంచి 51 శాతం వృద్ధితో రూ.33,373 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం రుణాల్లో సూక్ష్మ రుణాల వాటాయే 87 శాతంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 938 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, సగటున ఒక్కో బ్రాంచ్‌కు 3,000 మంది ఖాతాదారులకు సేవలందిస్తోందని తెలిపారు. కాసా నిష్పత్తి 28.2 శాతం నుంచి 36.9 శాతానికి, క్యాపిటల్ అడెక్వసీ రేషియో 26.3 శాతం నుంచి 32.6 శాతానికి పెరిగాయని తెలిపారు. కేటాయింపులు 43 శాతం పెరిగి రూ.124 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్ మంచి లాభాలు సాధించింది. 5.6 శాతం లాభంతో రూ.512 వద్ద ముగిసింది. -
బంధన్ బ్యాంకుకు షాక్
ముంబై: లైసెన్స్ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్ బ్యాంకుపై ఆర్బీఐ కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్ ఘోష్ పారితోషికాన్ని స్తంభింపజేసింది. ‘‘బ్యాంకులో నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఆర్బీఐ తమను ఆదేశించినట్లు బంధన్ బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్బీఐకి సహకరిస్తామని బ్యాంకు ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌కు యూనివర్సల్ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి. -
స్టాక్స్ వ్యూ
సన్ ఫార్మా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.630 టార్గెట్ ధర: రూ.670 ఎందుకంటే: భారత్‌లో టర్నోవర్, మార్కెట్ క్యాప్ పరంగా అతి పెద్ద ఫార్మా కంపెనీ ఇదే. భారత్‌తో పాటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 16% వృద్ధితో రూ.7,224 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్ వ్యాపారం 22 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం.అమెరికా వ్యాపారం 12 శాతం పెరగ్గా, టారో విభాగం అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్వహణ ఆదాయం 47%వృద్ధితో రూ.1,607 కోట్లకు పెరిగింది. ఇతర వ్యయాలు తక్కువగా ఉండటంతో ఎబిటా మార్జిన్లు 5% పెరిగి 22%కి పెరిగాయి. ఇతర ఆదాయం అధికంగా ఉండటం, నిర్వహణ పనితీరు పటిష్టంగా ఉండటంతో నికర లాభం 88% వృద్ధితో రూ.988 కోట్లకు పెరిగింది. అమెరికా జనరిక్స్ వ్యాపారంలో సమస్యలున్నప్పటికీ, స్పెషాల్టీ డైవర్సిఫికేషన్ మంచి ఫలితాలనిస్తోంది. జనరిక్స్ వ్యాపారంలో ధరల ఒత్తిడి కారణంగా స్పెషాల్టీ ఔషధాలపై ఈ కంపెనీ దృష్టిసారిస్తోంది. భవిష్యత్తు వృద్ధికి కీలకమయ్యే అంశాల్లో ఇది కూడా ఒకటి కానున్నది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి 153 ఔషధాలకు ఆమోదం పొందాల్సి ఉంది. అమెరికా వ్యాపారం రెండేళ్లలో 15% చక్రగతి వృద్ధితో రూ.1,11,631 కోట్లకు పెరుగుతుందని అంచనా. దేశీయ ఫార్ములేషన్స్ రంగంలో అగ్రస్థానం ఈ కంపెనీదే. రెండేళ్లలో ఈ వ్యాపారం 15% చక్రగతి వృద్ధి తో రూ.10,586 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. లాభాల మార్జిన్లు సగటు కంటే అధికంగా ఉండటం, రాబడి నిష్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటం, అమెరికా జనరిక్స్, బయోసిమిలర్స్ వ్యాపారాల్లో అపార అవకాశాలు, హలోల్ ప్లాంట్ సమస్య తీరిపోవడం.. సానుకూలాంశాలు. కఠినతరం అవుతున్న అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు, ధరల ఒత్తిడి కొనసాగుతుండటం... ప్రతికూలాంశాలు. బంధన్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.674 టార్గెట్ ధర: రూ.825 ఎందుకంటే: పశ్చిమ బెంగాల్లో 2001లో సూక్ష్మ రుణ సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించింది. 2014లో ఆర్బీఐ నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ లైసెన్స్‌ను పొందింది. పెద్ద నోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణ సంక్షోభం వంటి సమస్యలున్నప్పటికీ, గత ఐదేళ్లలో రుణాలు 51% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. నిర్వహణ వ్యయాలపై నియంత్రణ, నిలకడైన రుణ నాణ్యత కారణంగా రాబడి నిష్పత్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ఈ బ్యాంక్ సాధారణ రుణాలను కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. అయినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ 9% రేంజ్‌లోనే ఉండగలదని అంచనా వేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల మొండి బకాయిలు 0.51 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో ఇవి 1.2%రేంజ్‌లోనే ఉండొచ్చని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో వ్యయానికి, ఆదాయానికి గల నిష్పత్తి తక్కువగా (35 శాతంగా) ఉంది. రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 3.5–4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 20 శాతం కంటే అధికంగా ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ ఏడాది జూన్ 30 నాటికి నిర్వహణ ఆస్తులు రూ.32,340 కోట్లుగా ఉన్నాయి. మూడేళ్లలో రుణాలు 37 శాతం, డిపాజిట్లు 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. నిర్వహణ ఆస్తులు బాగా వృద్ధి చెందడం, బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక మార్జిన్లు (9–10 శాతం) ఉండటం, నిలకడైన రుణ నాణ్యత, సూక్ష్మ రుణాలపై రాబడులు అధికంగా ఉండటం, తక్కువ వడ్డీ వ్యయమయ్యే డిపాజిట్లు... ఇవన్నీ సానుకూలాంశాలు. -
48 శాతం పెరిగిన బంధన్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 48 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.327 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.482 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, రుణ నాణ్యత స్థిరంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించినట్లు బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం రూ.743 కోట్ల నుంచి 40 శాతం వృద్ధితో రూ.1,037 కోట్లకు పెరిగిందని, ఇతర ఆదాయం 73 శాతం పెరిగి రూ.211 కోట్లకు చేరిందని వివరించారు. 10.27%కి తగ్గిన నికర వడ్డీ మార్జిన్... స్థూల మొండి బకాయిలు ఎలాంటి మార్పు లేకుండా 1.26%గా ఉన్నాయని, నికర మొండి బకాయిలు మాత్రం 0.56% నుంచి 0.64%కి పెరిగాయని చంద్రశేఖర్ ఘోష్ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు మాత్రం రూ.556 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరిగాయన్నారు. ‘‘నికర వడ్డీ మార్జిన్ 10.75 శాతం నుంచి 10.27%కి తగ్గింది. కాసా నిష్పత్తి 26.33% నుంచి 35.46%కి పెరిగింది. రుణాలు 52% ఎగిశాయి. మొత్తం రుణాల్లో 85% వరకూ సూక్ష్మ రుణాలే. ఇక డిపాజిట్లు ఈ ఏడాది జూన్ 30కి రూ.30,703 కోట్లకు పెరిగాయి. వీటిలో రిటైల్ డిపాజిట్లే 80%. మిగిలినవి బల్క్ డిపాజిట్లు’’ అని ఘోష్ వివరించారు. వచ్చే మార్చినాటికి వెయ్యి బ్రాంచీలు.. ప్రస్తుతం 937గా ఉన్న బ్యాంక్ బ్రాంచీల సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి వెయ్యికి పెంచనున్నామని తెలియజేశారు. ఫలితాలు బాగుండటంతో బంధన్ బ్యాంక్ షేర్ ఇంట్రాడే లో ఆల్‌టైమ్ హై రూ.608ను తాకింది. చివరకు 6.7% లాభంతో రూ. 600 వద్ద ముగిసింది. -
బంధన్ బ్యాంక్ లాభం రూ.388 కోట్లు
న్యూఢిల్లీ: బంధన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 20 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.322 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.388 కోట్లకు పెరిగిందని బంధన్ బ్యాంక్ సీఈఓ, ఎమ్డీ చంద్ర శేఖర్ ఘోష్ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం రూ.689 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.863 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.వడ్డీయేతర (ఇతర)ఆదాయం రూ.129 కోట్ల నుంచి 57 శాతం వృద్ధితో రూ.203 కోట్లకు పెరిగిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.1,208 కోట్ల నుంచి 29 శాతం పెరిగి రూ.1,554 కోట్లకు ఎగసిందని తెలిపారు. కేటాయింపులు రూ.36 కోట్ల నుంచి మూడింతలై రూ.109 కోట్లకు ఎగిశాయని తెలిపారు. రుణాలు 37 శాతం, డిపాజిట్లు 46 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్ ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, వ్యవసాయ రుణాల మాఫీ కారణంగా సూక్ష్మరుణ విభాగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉందని వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.1,112 కోట్లుగా ఉన్న నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.1,346 కోట్లకు పెరిగిందని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.3,032 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 72 శాతం పెరుగుదలతో రూ.706 కోట్లకు పెరిగాయని వివరించారు. మొత్తం ఆదాయం రూ.4,320 కోట్ల నుంచి రూ.5,508 కోట్లకు వృద్ధి చెందిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు రూ.86 కోట్ల నుంచి రూ.373 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.61 కోట్ల నుంచి రూ.173 కోట్లకు పెరిగాయని తెలిపారు. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి, నికర మొండి బకాయిలు 0.36 శాతం నుంచి 0.58 శాతానికి పెరిగాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్ 2.4 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది. -
బంధన్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్
న్యూఢిల్లీ: బంధన్ బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర(రూ.375)తో పోల్చితే ఈ షేర్ బీఎస్ఈలో 29 శాతం లాభంతో రూ.485 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 33 శాతం లాభంతో రూ.498 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27 శాతం లాభంతో రూ.477 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 1.39 కోట్లు, ఎన్ఎస్ఈలో 9 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.56,921 కోట్లుగా నమోదైంది. మార్కెట్ క్యాప్ పరంగా ఎనిమిదో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించింది. లిస్టైన అన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల కంటే(ఎస్బీఐ మినహా) బంధన్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ అధికం కావడం విశేషం. రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. పీఎన్బీ, ఇతర ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు.. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌ల కంటే కూడా ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ అధికంగా ఉంది. ఈ నెల 15–19 మధ్య రూ.370–375 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 15 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్ రూ.4,473 కోట్లు సమీకరించింది. భారత్‌లో ఇదే అతి పెద్ద బ్యాంక్ ఐపీఓ.