
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment