retairment
-
ఎన్పీఎస్ వాత్సల్యకూ పన్ను ఊరట
న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్పీఎస్ పథకానికి తాజా బడ్జెట్లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్పీఎస్ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్పీఎస్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది. -
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
ఇలా చేస్తే... మీరు రిచ్చో రిచ్చు!
జీవితంలో ఎవరికైనా సరే ధనవంతునిగా మారాలని, అన్ని సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని ఉంటుంది. అయితే అందుకు పరిస్థితులు అడ్డంకిగా మారాయని పలువురు చెబుతుంటారు. సరైన పెట్టుబడి వ్యూహంతో ముందుకెళితే డబ్బుకి చింత లేకుండా జీవితాన్ని నిశ్చింతగా గడపవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడి పెట్టడంలో ఎల్లప్పుడూ తగిన వ్యూహాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం సంపాదించిన డబ్బును సరైన మార్గంలో వినియోగించినట్లవుతుంది. మనం సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా హాయిగా జీవించగలుగుతాం. ఇందుకు దోహదపడేలా నిపుణులైన ఇన్వెస్టర్లు కొన్ని సూత్రాలు చెప్పారు. 1. రూల్ ఆఫ్ 7272 నియమం సహాయంతో స్థిర వడ్డీ రేటుతో డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పెట్టుబడిపై పొందుతున్న వడ్డీ రేటును 72తో భాగించవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీరు బ్యాంకులో ఎఫ్డీపై 7 శాతం వడ్డీని పొందుతున్నారనుకుందాం. అప్పుడు మీరు 72ని 7తో భాగిస్తే, సమాధానం 10.28 అవుతుంది. అంటే 7 శాతం వడ్డీతో మీ డబ్బు 10.28 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.2. 10-12-10 10-12-10 నియమం ప్రకారం 10 సంవత్సరాలకు 12శాతం వార్షిక రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలో ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు దాదాపు రూ. 23-24 లక్షలను కూడబెట్టవచ్చు. అయితే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో లేదా సగటు వార్షిక రాబడి 12శాతం ఉన్న షేర్లలో ప్రతి నెలా రూ. 43,000 పెట్టుబడి పెడితే, మీరు 10 సంవత్సరాలలో రూ. ఒక కోటి కార్పస్‌ను సృష్టించగలుగుతారు.3. 20-10-12 20-10-12 నియమం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం. మీరు 12శాతం వార్షిక రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలో 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, మీరు కోటి రూపాయల కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.4. 50-30-2050-30-20 నియమం అనేది మీ ఆదాయాన్ని వివిధ ఆర్థిక లక్ష్యాలకు కేటాయించడంలో మీకు సహాయపడే వ్యక్తిగత ఆర్థిక సూత్రం. ఈ నియమం ప్రకారం మీరు మీ ఆదాయంలో 50 శాతం అవసరమైన ఖర్చుల కోసం, 30 శాతం వినోదం, భోజనం వంటి ఖర్చులకు 20 శాతం పొదుపు,పెట్టుబడుల కోసం కేటాయించాలి.5. 40-40-12 మీరు 10-20 సంవత్సరాలలో పెద్ద కార్పస్‌ను అందుకునేందుకు 40-40-12 నియమాన్ని అనుసరించాల్సివుంటుంది. ఇందులో మీరు అధికమొత్తంలో పొదుపు చేయాలి. ఈ నియమంలో మీరు మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో మీ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం ఉంచాల్సి ఉంటుంది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సగటు వార్షిక రాబడిని 12 శాతం లక్ష్యంగా చేసుకోవాలి.6. 15-15-15 15-15-15 నియమం ప్రకారం మీరు సంవత్సరానికి సగటున 15శాతం రాబడిని పొందే పెట్టుబడి ఎంపికలో 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెడితే, మీరు సుమారు కోటి రూపాయలు అందుకో గలుగుతారు.7. 25X ఈ నియమం త్వరగా పదవీ విరమణ పొందాలనుకునే వారి కోసం ఉద్దేశించినది. ఈ నియమం ప్రకారం మీరు హాయిగా పదవీ విరమణ చేయగలిగేలా మీ వార్షిక ఖర్చుల కోసం ముందుగానే 25 రెట్లు ఆదా చేయాలి. ఉదాహరణకు మీ జీవనానికి సంవత్సరానికి రూ. 4 లక్షలు అవసరమైతే, మీ పదవీ విరమణ నిధికి రూ. ఒక కోటి (రూ. 4 లక్షలు x 25) అవసరం. సిప్ తరహా పెట్టుబడి ఎంపికలను అవలంబించడం ద్వారా మీరు ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం అవుతుందని గుర్తించండి. ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ -
ఇక నుంచి నేను ఇలా న్యాయం చేయలేను: సీజేఐ చంద్రచూడ్ భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పదవీ కాలం ముగిసింది. శుక్రవారమే చివరిరోజు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన హాల్లో నలుగురు సభ్యులతో కూడిన సెర్మోనియల్ బెంచ్ ఆయనకు వీడ్కోలు పలికింది. జస్టిస్ చంద్రచూడ్‌తోపాటు కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. తన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కొద్దిసేపు అందరినీ నవి్వంచారు. జైన పదం ‘మీచా మి దుఖఃదాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘రేపటి నుంచి నేను ఇలా న్యాయం చేయలేను, కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అని కోరారు. ఇతరులను నొప్పించాలన్న ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నారు. న్యాయవాద వృత్తితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. రూపురేఖలను బట్టి తనను చాలామంది యువకుడిగానే భావించేవారని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు తన వద్దకు వచ్చి ‘మీ వయసు ఎంత’ అని అడిగారని గుర్తుచేశారు. న్యాయవాద వృత్తి తనకు ఎన్నో గొప్ప విషయాలు నేరి్పంచిందని అన్నారు. యువ లాయర్‌గా కోర్టుల్లో ఎన్నో వాదనలు విన్నానని, న్యాయవాదుల్లో నైపుణ్యాలు గమనించానని, విలువైన కోర్టురూమ్ టెక్నిక్‌లు నేర్చుకున్నానని తెలిపారు. కోర్టుల్లో పనిచేసే మనమంతా వచ్చి వెళ్లిపోయే యాత్రికులమేనని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో ఎంతోమంది గొప్ప న్యాయమూర్తులుగా రాణించారని, వారసత్వాన్ని మరొకరికి అప్పగించి వెళ్లారని పేర్కొన్నారు. తాను వెళ్లిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదని, తన తర్వాత మరొకరు ఈ పదవిలోకి వస్తారని చెప్పారు. సమర్థుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, సుప్రీంకోర్టు ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింపజేస్తారన్న విశ్వాసం తనకు ఉందని వివరించారు. న్యాయమూర్తి అనే పదవి తనను ఇన్నాళ్లూ ఉత్సాహంగా ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. చట్టం, న్యాయం, జీవితం గురించి సుప్రీంకోర్టులోని ప్రతి ఒక్కరూ తనకు ఎన్నో విషయాలు నేర్పించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సీజేఐగా తాను విచారించిన 45 కేసులు సైతం తనకు జీవితం గురించి ఎన్నో కొత్త సంగతులు నేరి్పంచాయని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. అణగారిన యువత, నిరుపేదల బాగు కోసం జస్టిస్ చంద్రచూడ్ ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో విజయం సాధించిందని, కొన్ని ఓడిపోయిందని, తమ అభిప్రాయాలను జస్టిస్ చంద్రచూడ్ ఓపిగ్గా విన్నారన్న సంతృప్తి తమకు ఉందని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేసన్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రచూడ్‌ను న్యాయమూర్తులు, న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు సత్కరించారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏం చెప్పారంటే... అంతకంటే గొప్ప అనుభూతి ఉండదు ‘‘అవసరాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయగల శక్తి కలిగి ఉండడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. మనకు తెలియని, మనం ఎప్పుడూ కలవని వ్యక్తులకు సేవ చేయడం, వారి జీవితాలను ప్రభావితం చేయడం అదృష్టమే. వృత్తిలో విజయాలు సాధించడంతోపాటు దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఉన్నంతకాలం కొత్త విషయాలు నేర్చుకోలేదు అని భావించిన రోజు ఒక్కటి కూడా లేదు. న్యాయ విద్యారి్థగా కోర్టులో చివరి వరుసలో కూర్చున్న రోజుల నుంచి సుప్రీంకోర్టు కారిడార్ల దాకా నా ప్రస్థానం సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి నా వంతు సేవ చేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. దాదాపు రెండేళ్లపాటు సీజేఐగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పారదర్శకత తీసుకొచ్చేందుకు కృషి చేశా. ఈ విషయంలో తరుచుగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టారు. దూషించారు. నన్ను తప్పుపట్టారు. వాటిని మర్చిపోలేను. నేను ఇక పదవీ విరమణ చేస్తున్నా. ట్రోలర్స్‌కు, విమర్శకులకు సోమవారం నుంచి పని ఉండదు. వారంతా నిరుద్యోగులైపోతారు. ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేం మా తండ్రి పుణేలో ఒక ఫ్లాట్ కొన్నారు. న్యాయమూర్తిగా చివరి రోజు దాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నాకు చెప్పారు. నిజాయతీ, సమగ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయన చెప్పిందే ఆచరించాను. న్యాయమూర్తిగా మారిన తర్వాత మొదట ఎదుర్కోవాల్సింది మనలోని భయాన్నే. మన పరిమితులు మనం తెలుసుకోవాలి. న్యాయవాద వృత్తి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ అధికార పరిధిని కూడా గుర్తుంచుకోవాలి. న్యాయమూర్తిగా ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేమని కోర్టులో ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు చట్టబద్ధమైన పాలనలోనే అన్యాయాలు జరుగుతూ ఉండొచ్చు. చట్టబద్ధ పాలనకు అవతల జరిగే అన్యాయాలను మనం సరిదిద్దవచ్చు. బాధితులకు ఉపశమనం కలిగించడం అనేది ఓదార్పు ఇచ్చే మన సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వారి కష్టాలను, సమస్యలను ఓపికతో వినగలిగే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఇన్ఫెక్షన్లు తొలగించే శక్తి సూర్యకాంతికి ఉంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు తెలుసు. సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా. నా బాహువులు విశాలమైనవి కాబట్టి అన్ని రకాల విమర్శలను వినమ్రంగా స్వీకరించా. బార్ అసోసియేషన్ సభ్యులు, నా సహచరులు నాకు మద్దతుగా నిలిచారు. సుప్రీంకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృత కోర్టు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. పెండింగ్ కేసులు పరిష్కరించా న్యాయ వ్యవస్థను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పారదర్శకత పెంచడానికి కృషి చేశా. పెండింగ్ కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చా. నేను సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 1,500 ద్రస్తాలు రిజి్రస్టార్ కప్‌బోర్డులో పడి ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకోకపోవడం బాధ కలిగించింది. ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించా. సుప్రీంకోర్టులో నమోదయ్యే ప్రతి కేసుకు ఒక నెంబర్ కేటాయించి, వరుసగా పరిష్కరించే విధానం ప్రారంభించా. దీనివల్ల వేలాది కేసులు పరిష్కారమయ్యాయి. బ్యాక్లాగ్ కేసుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కేసుల పెండింగ్ విషయంలో మాపై ఎన్నోవిమర్శలు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న 82,000 కేసుల్లో రిజిస్టర్ కాని కేసులు చాలా ఉండేవి. ఆ విషయం చాలామందికి తెలియదు. గత రెండేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 11,000కు తగ్గిపోయింది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్ఘాటించారు. మానవత్వంతో కూడిన తీర్పులిచ్చారు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. భారత న్యాయ వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారని ప్రశంసించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ తదితరులు మాట్లాడారు. జస్టిస్ చంద్రచూడ్ వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించడంతోపాటు మానవత్వంతో కూడిన తీర్పులు ఇచ్చారని చెప్పారు. ఆయనకు అంతులేని సహనం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవన శైలి ఆయన సొంతమని అన్నారు. క్లిష్టమైన తీర్పులు ఇచ్చే సమయంలోనూ ప్రశాంతంగా ఉండేవారని, న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెట్టారని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ నిత్యం యువకుడిలా కనిపిస్తారని, ఆయనను చూసి తాము వృద్ధులమైపోయినట్లు భావిస్తామని అన్నారు. ‘‘జస్టిస్ చంద్రచూడ్ పూర్తిగా శాకాహారి. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఆయనది క్రమశిక్షణతో కూడిన జీవితం. సమోసాలంటే ఆయనకు ఇష్టం. కానీ, సమావేశాల్లో ఏమీ తీసుకోరు. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోర్టుల్లో టెక్నాలజీ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. నా పనిని మరింత సులభతరం చేశారు’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు సుప్రీంకోర్టులో తన చివరి రోజు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ విద్యాసంస్థ హోదా విషయంలో కీలక తీర్పు వెలువరించారు. -
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటైర్ మెంట్
-
పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..
పదవీ విరమణ అంటే కొందరికి సంతోషం, ఇంకొందరికీ భయం కలుగుతుంది. ఆర్థిక అవసరాలకు సరిపడే డబ్బును సమకూర్చుకున్నవారికి అది ఆనందం అయితే..ఎలాంటి పెట్టుబడులు, మిగులు లేనివారికి రిటైర్మెంట్ నరకమే. ఇటీవల ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం నలుగురిలో ముగ్గురు భారతీయులు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారని తేలింది. అయితే ముందు నుంచి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని మదుపు చేస్తే పదవీ విరమణ తర్వాత సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మానవ విలువలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో చాలామందికి తమ తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు పనిచేస్తున్నంత కాలం ఏదో కొంత డబ్బు సంపాదిస్తున్నారు కదా అని భరిస్తున్నారు. కానీ పదవీ విరమణ తర్వాత మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో పెరిగే అనారోగ్యంతో ఆర్థిక, మానసిక స్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా సురక్షితమైన, సంతృప్తికరమైన జీవితం గడపాలంటే కొన్ని నియమాలు పాటించాలి.పక్కా ప్రణాళికపదవీ విరమణ తర్వాత ఆదాయం నిలిచిపోతుంది. ఏటా ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి. మనుషులు ఆయుర్ధాయం అధికమవుతుంది. పనిచేస్తున్నపుడే పొదుపు పాటించాలి. అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దాంతో రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు..వంటి ఖర్చులను భరించడానికి పొదుపు చాలా అవసరం. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేపుడు మీ జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, భవిష్యత్తు అవసరాలు, మీపై ఆధారపడినవారు, కుటుంబానికి చేయాల్సిన ప్రధాన బాధ్యతలు..వంటివి పరిగణనలోకి తీసుకుని పొదుపు చేయాలి.పెరుగుతున్న ఆయుర్ధాయంమారుతున్న ఆహార అలవాట్లు దృష్ట్యా చాలామందికి చిన్న వయసులోని బీపీ, షుగర్, కిడ్నీ..సమస్యలు మొదలవుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన తర్వాత ఈ సమస్యలు తీవ్రరూపం దాలుస్తాయి. దాంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ప్రస్తుతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనుషులు మరింత ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. కానీ అందుకు డబ్బు కావాల్సి ఉంటుంది. దాన్ని ముందుగానే అంచనా వేసి తగిన కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.పెట్టుబడి ఎక్కడ చేయాలంటే..పదవీ విరమణ ప్రణాళిక కోసం వివిధ పెట్టుబడి మార్గాలున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) వంటి స్థిరంగా రాబడినిచ్చే పథకాలున్నాయి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్)లో ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా అధిక రాబడి ఉంటుంది. ఈక్వీటీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్థిరాస్తిలో మదుపు చేయవచ్చు.ఇదీ చదవండి: విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణితొందరపడండిపదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుగానే మదుపు చేయడం ప్రారంభించాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు అవసరమో లెక్కించడం, దీనికి అనువైన పొదుపును ఎంచుకుని పాటించడం ముఖ్యం. క్రమశిక్షణతో ముందుగానే మదుపు చేస్తే అధిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. క్రమంగా కాలం గడుస్తున్న కొద్దీ అధిక పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవచ్చు. -
బంధన్ బ్యాంక్‌కు సీఈవో గుడ్‌బై
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు. -
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
యూపీఏ- 2 హయాంలో హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రిటైర్మెంట్ ప్రకటించారు. తన బదులు తన కుమార్తె ప్రణితి షిండే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. సుశీల్ కుమార్ శంభాజీ షిండే 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షిండే కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. 2003లో తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2006 వరకు ఈ పదవిలో కొనసాగారు. సుశీల్ కుమార్ షిండే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. 2014 వరకు ఈ పదవిలో ఉన్నారు. 1971లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో క్రియాశీల రాజకీయాల్లో షిండే కెరీర్ ప్రారంభమైంది. 1974 నుండి 1992 వరకు మహారాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఉన్నారు. 1992 నుండి మార్చి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రచార నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహించారు. షిండే రిటైర్మెంట్ ప్రకటనతో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి సంప్రదాయ సీటు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్నారు. ఈసారి షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని ప్రణితి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: డబుల్ ఇంజిన్ సర్కారులో డబుల్ అనారోగ్యం: ఖర్గే -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ రిటైరయ్యారు. ఆఖరి పనిదినమైన శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ..న్యాయవ్యవస్థ కోసం ముఖ్యంగా రాజ్యాంగ సంబంధ అంశాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమని కొనియా డారు. 1979 నుంచి ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ అగర్వాల్ పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 23న జస్టిస్ భట్ సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్లపాటు సేవలందించారు. పలు చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 1958లో మైసూరులో జన్మించిన జస్టిస్ భట్ 1982లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. -
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
Nitin Gadkari: రాజకీయాలకు ‘వీడ్కోలు దుమారం’పై గడ్కరీ స్పందన
రాజకీయాలకు కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ బాయ్ చెబుతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు మీడియాల్లో కథనాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆ ఆరోపణలకు స్పందించారు. ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వాటిల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలకు రిటైర్మంట్ చెప్పే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..ముంబై గోవా జాతీయ రహదారి నిర్మాణ పనులను గురువారం తనిఖీ చేశామని, దాదాపు పనుల్ని పూర్తియినట్లు తెలియజేశారు. ముండై-గోవా జాతీయ రహదారి కొంకణ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపే హైవే అని చెప్పారు. ఇది పర్యాటకానికి మంచిగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రోడ్డు ఉన్నందున పారిశ్రామికాభివృద్ధి కూడా మంచిగా ఊపందుకుంటుందని చెప్పారు. పన్వేల్ ఇందాపూర్ల కోసం భూసేకరణ, పర్వావరణ అనుమతులే ఈ ముంబై-గోవా జాతీయ రహదారిని ఆలస్యం చేశాయని చెప్పారు. ఇక ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయని, కర్నాల్ అభయారణ్యంలో ఫ్లైఓవర్‌ను తొలగించి పర్యావరణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..గురువారం ఉదయం రూ.కోటి విలువైన మూడు జాతీయ రహదారుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాయ్‌గఢ్ జిల్లాలోని పలాస్పే గ్రామం వద్ద 63,900 కి.మీ రూ.414.68 కోట్లతో రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, డిఘి అనే రెండు ఓడరేవుల వద్ద ఆర్థిక వృద్ధిని పెంచుతాయని గడ్కరి చెప్పారు. అయితే పన్వెల్ నుంచి కాసు హైవే వరకు శంకుస్థాపన చేయడం వల్ల ప్రయాణ వేగం తోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు గడ్కరీ. (చదవండి: ‘అమృత్‌పాల్ సింగ్ లొంగిపోకూడదు.. 1984 తరహాలోనే పాక్‌కు పారిపోవాలి’) -
రిటైరైన జస్టిస్ నజీర్
న్యూఢిల్లీ: జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియాడారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వీడ్కోలు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జస్టిస్ నజీర్‌ది బహుముఖీన వ్యక్తిత్వం. సాధారణ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రజా న్యాయమూర్తిగా పేరుగడించారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం బాధాకరమని జస్టిస్ నజీర్ అన్నారు. జూనియర్ లాయర్లకు మంచి వేతనాలు, మరిన్ని అవకాశాలు కావాలని అభిప్రాయపడ్డారు. -
జులన్... ఐదో ర్యాంక్‌తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు. -
జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్‌స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్‌స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్‌లో ‘డకౌట్’కాగా... బౌలింగ్‌లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్‌పై తొలిసారి. -
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్‌లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్‌కప్‌లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్‌కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్‌లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్‌లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్‌తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్‌గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్‌కతాలో 1997 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో బాల్‌బాయ్‌గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
US Open 2022: సరిలేరు సెరెనాకెవ్వరు
2007 ఆస్ట్రేలియన్ ఓపెన్... ఆ సమయంలో 81వ ర్యాంక్‌లో ఉన్న సెరెనా విలియమ్స్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగింది. అప్పటికి ఆమె గ్రాండ్‌స్లామ్ మాత్రమే కాదు, ఏదైనా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి సరిగ్గా రెండేళ్లయింది. ఆట, శరీరం రెండూ గతి తప్పాయంటూ వరుసగా విమర్శలు వస్తున్నాయి... విపరీతంగా బరువు పెరిగిపోయి మైదానంలో చురుకైన కదలికలు లోపించాయి... టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు ‘నైకీ’ ప్రతినిధి ఒకరు ప్లేయర్స్ లాంజ్‌లోకి వచ్చి సెరెనాను కలిశాడు. ఆశించిన స్థాయిలో సెరెనా ఆట లేదని, ఇలాగే సాగితే ఒప్పందం రద్దు చేసుకుంటాం అని హెచ్చరిక జారీ చేశాడు. కనీసం క్వార్టర్ ఫైనల్ అయినా చేరాల్సిందేనని గట్టిగా చెప్పి వెళ్లాడు. అప్పటికే 7 గ్రాండ్‌స్లామ్స్ ఆమె ఖాతాలో ఉన్నా సరే, ఒక స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ఆటతో పాటు కోర్టు బయట కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి... ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య సెరెనా ఆడింది. తన కసినంతా ప్రదర్శిస్తూ వరుసగా ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ఫైనల్ చేరింది. అక్కడ షరపోవాను ఓడించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. గెలుపు అనంతరం తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ‘ఓడాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి విజయాలే నన్ను మానసికంగా బలంగా మారుస్తాయి. విమర్శకులందరికీ ఇదే నా సమాధానం’ అంటూ గట్టిగా ప్రకటించింది. కెరీర్ ఆసాంతం ఇదే పోరాటపటిమ సెరెనాను గొప్పగా నిలిపింది. అద్భుతమైన సర్వీస్, పదునైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, రిటర్న్స్‌లో ధాటి, చురుకైన అథ్లెట్ లక్షణాలు, అన్నింటికి మించి మానసిక దృఢత్వం... లోపాలు లేని ప్లేయర్‌గా సెరెనాను ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపాయి. తనకంటే ముందు తరంలో అనేక మంది దిగ్గజాలతో పోలిస్తే ప్రత్యర్థిపై విరుచుకుపడే దూకుడు, పవర్ గేమ్ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ప్రారంభమైన ఆ ప్రస్థానం 18 ఏళ్ల పాటు ఘనంగా సాగి ఇప్పుడు ఆఖరి అంకానికి చేరింది. ఆటలోని అంకెలు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఆమెను అందరికీ స్ఫూర్తిగా మార్చాయి. బాల్యం నుంచి స్టార్‌గా మారిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నల్ల జాతీయురాలిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి శిఖరానికి చేరగలగడం ఆమెకే సాధ్యమైంది. తనపై కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సొంత దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో 14 ఏళ్లు ఆడకుండా స్వీయ వనవాసం పాటించిన ఆమె... లింగ వివక్షపై కూడా టెన్నిస్ కోర్టులోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గలేదు. అమెరికాలో పేదరికానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కాంప్టన్ పట్టణంలో పెరిగిన నాటి నుంచి ప్రపంచాన్ని జయించే వరకు కూడా సెరెనాను అదే పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం నడిపించాయి. తన విజయాలతోనే కాదు తన ప్రతీ అడుగుతో, ఆడిన ప్రతీ షాట్‌తో క్రీడా ప్రపంచంపై మరచిపోలేని ముద్ర వేసి సెరెనా తన శకాన్ని ముగిస్తోంది. విజయ ప్రస్థానం... ఓపెన్ శకంలో (1968 నుంచి) సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దిగ్గజంగా ఎదిగినా సెరెనా మొదటి ట్రోఫీ మాత్రం మిక్స్డ్ డబుల్స్‌లో రావడం విశేషం. 1998లో మ్యాక్స్ మిర్నీతో కలిసి వింబుల్డన్ గెలుచుకున్న సెరెనా ఆ తర్వాత యూఎస్ ఓపెన్‌నూ సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది పారిస్ ఇండోర్ టోర్నీ గెలవడంతో ఆమె ఖాతాలో మొదటి సింగిల్స్ టైటిల్ చేరింది. ఆ తర్వాత టెన్నిస్ ప్రపంచాన్ని సెరెనా శాసించడం లాంఛనమే అయింది. కొత్త మిలీనియంలో పాత స్టార్లంతా మెల్లగా నిష్క్రమిస్తూ రిటైర్మెంట్ బాట పట్టిన సమయంలో సెరెనా శకం మొదలైంది. 2002లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్ పూర్తి చేసుకోవడంతో ఆమె స్థాయి పెరిగింది. అద్భుత విజయాల ఫలితంగా సహజంగానే నడిచొచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో సెరెనా మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని ప్రదర్శనతో సెరెనా సత్తా చాటింది. ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే తత్వం ఆమెను అగ్రస్థానాన నిలబెట్టింది. తన సమకాలీన ప్రత్యర్థులపై ఆమె ఆడిన మ్యాచ్ రికార్డు చూస్తే సెరెనా ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. వీనస్ విలియమ్సపై 19–12, మార్టినా హింగిస్‌పై 7–6, కాప్రియాటిపై 10–7, హెనిన్పై 8–6, అజరెంకాపై 18–5తో సెరెనా పైచేయి సాధించింది. అయితే ఒకదశలో సమ ఉజ్జీలుగా నిలుస్తారని, హోరాహోరీ సమరాలు ఖాయమని టెన్నిస్ ప్రపంచం భావించిన మరో ప్రత్యర్థి మారియా షరపోవాపై సెరెనా ఆధిపత్యం తిరుగులేనిది. 2004 వింబుల్డన్ ఫైనల్లో సెరెనాపై 6–1, 6–4తో గెలవడంతో పాటు అదే ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్లో కూడా షరపోవాదే పైచేయి అయింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు 17 సార్లు తలపడగా అన్ని సార్లూ సెరెనానే గెలిచి (ఓవరాల్‌గా 18–2) తానేంటో చూపించింది. 2014 యూఎస్ ఓపెన్ నుంచి వరుసగా మళ్లీ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి రెండోసారి ఈ ఫీట్‌ను సాధించడం సెరెనాకే సాధ్యమైంది. దీంతో పాటు ఆమె సాధించిన మూడు ఒలింపిక్ స్వర్ణాలు కెరీర్‌కు అదనపు హంగును జోడించాయి. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తొలి ప్రత్యర్థి: దిగ్గజ ఆటగాళ్లు కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రొఫెషనల్ డబ్ల్యూటీఏ కెరీర్లో సెరెనా తొలిసారి కెనడాలోని క్వాబెక్ సిటీలో జరిగిన ‘బెల్ చాలెంజ్’ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అప్పుడు 149వ స్థానంలో ఉన్న యానీ మిల్లర్ (అమెరికా) చేతిలో 1–6, 1–6 తేడాతో తొలి రౌండ్లోనే ఓడింది. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. భారత్‌తో బంధం 2008 మార్చి... అప్పటికే సెరెనా ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి సమయంలో కూడా ఆమె టెన్నిస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేని భారత్‌లో... అదీ ఒక టియర్–2 టోర్నీలో పాల్గొనడం విశేషం. అదే బెంగళూరు ఓపెన్. ఈ టోర్నీలో ఆమెనే విజేతగా నిలిచింది. సెరెనా కెరీర్లో అది 29వ టైటిల్. ఆట ముగిసె... సుమారు 24 వేల మంది ప్రేక్షకులు... గ్రాండ్‌స్లామ్ గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించిన సొంతగడ్డపై చివరి సారి బరిలోకి...ఆఖరి సారిగా ఆ రాకెట్ పదును వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్ సె–రె–నా... సె–రె–నా... అంటూ హోరెత్తిస్తున్నారు... భారీ స్క్రీన్‌పై గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే కెరీర్ అత్యుత్తమ క్షణాలతో ‘మాంటేజ్’ వీడియో ప్రదర్శన... అది ముగిశాక సెరెనా విలియమ్స్ కోర్టులోకి అడుగు పెట్టింది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఐలా తొమ్లాయనోవిచ్ సిద్ధంగా ఉంది...ప్రతీ షాట్, ప్రతీ పాయింట్, ప్రతీ గేమ్, ప్రతీ సెట్... సెరెనా ప్రతీ అడుగు అభిమానులను అలరించింది. 185 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సమరం చివరకు ఒక దిగ్గజం కెరీర్‌ను ముగించింది. కెరీర్లో తాను ఆడిన 1,014వ మ్యాచ్‌లో ఆస్రేలియా ప్రత్యర్థి చేతిలో ఓడి సెరెనా నిష్క్రమించింది. భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం కోర్టంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ‘ట్విర్ల్’ తర్వాత అభివాదం చేస్తూ ఆమె కోర్టును వీడిన క్షణంతో ఒక అత్యద్భుత కెరీర్‌కు తెర పడింది. న్యూయార్క్: మహిళల టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో పరాజయంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6 తేడాతో ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. ఒకదశలో సెరెనా 5–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కోలుకున్న తొమ్లాయనోవిచ్ స్కోరు సమం చేయడంతో పాటు మరో రెండు గేమ్‌లు కూడా గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ కూడా ఇదే తరహాలో సాగింది. ఇక్కడా సెరెనా 5–2తో ఆధిక్యంలో నిలిచినా ఆసీస్ ప్రత్యర్థి పోరాడటంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఈ దశలో తన అనుభవాన్నంతా వాడి సెరెనా సెట్‌ను గెలుచుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే చివరి సెట్లో మాత్రం తొమ్లాయనోవిచ్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్ తర్వాత స్కోరు 1–1తో సమంగా ఉన్నా ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి ఐలా 5–1తో విజయానికి చేరువైంది. ఏడో గేమ్‌లో ఆరు మ్యాచ్ సెరెనా ఆరు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని అభిమానులను అలరించినా...చివరకు ఫోర్ హ్యాండ్ అన్ఫోర్స్డ్ ఎర్రర్‌తో ఓటమి ఖాయమైంది. కొన్ని వివాదాలూ... ఆటలో ఎక్కడా దూకుడు తగ్గించని నైజంతో దూసుకుపోయిన సెరెనా సుదీర్ఘ కెరీర్లో అప్పుడప్పుడు వచ్చిన వివాదాలు కొంత చర్చ రేపినా, అవి ఆమె గొప్పతనాన్ని తగ్గించేవిగా మారలేదు. 2000 వింబుల్డన్‌లో వీనస్ చేతిలో సెరెనా చిత్తుగా ఓడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తండ్రి రిచర్డ్ నిర్ణయించాడని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001 ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌కు ముందు ఆమె ప్రత్యర్థి వీనస్ గాయం పేరు చెప్పి అనూహ్యంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు లోనైన తర్వాతి 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడలేదు. చెయిర్ అంపైర్లతో వాదనలు, అందుకు జరిమానాలతో పాటు బాల్ బాయ్‌ను కూడా ‘గొంతు కోస్తా’ అన్నట్లు రాకెట్‌తో హెచ్చరించడం వరకు చాలా సందర్భాల్లో సెరెనా తనపై నియంత్రణ కోల్పోయింది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఒసాకాతో మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తన, రాకెట్‌ను నేలకు కొట్టడంవంటి ఘటనలతో బాగా చెడ్డపేరు వచ్చింది. అయితే ఆమెలోని అద్భుతమైన ఆట అలాంటి తప్పులను కాచేలా చేయగలిగింది. ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నా తల్లిదండ్రులే ఈ ఘనతకు కారణం. వారికి ఏం ఇచ్చినా తక్కువే. ఇక అక్క వీనస్ లేకపోతే చెల్లి సెరెనా లేదు. సెరెనా ప్రతీ విజయం వెనక వీనస్ ఉంది. ఇదో అత్యద్భుత ప్రయాణం. నా కెరీర్లో ఎప్పుడూ చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అలాగే పోరాడాను. ఇన్నేళ్లుగా నాకు కోర్టులో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమంతా టెన్నిస్ ఆడాను. నేను కోరుకున్నదంతా సాధించాను. ఇకపై ఆటకు దూరంగా భిన్నంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నా. రెండోసారి అమ్మను కావాలని భావిస్తున్నా. –సెరెనా –సాక్షి క్రీడా విభాగం -
సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?
టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. త్వరలోనే ఆయన నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చదవండి: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచే ఆయన పలు సెలక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారు. ఇక శాశ్వతంగా నటనకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందుకే యాక్టింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై నాజర్ నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కాగా ‘కళ్యాణ అగత్తిగళ్’ చిత్రంతో నాజర్ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ గొప్ప నటుడిగా ఎదిగారు. ఆయన సౌత్‌లోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక బాహుబలిలో ఆయన పోషించిన బిజ్జలదేవ పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఇది మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక సినిమాల్లో కనిపించరంటే ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సినీ పరిశ్రమ మరో గోప్ప నటుడిని మిస్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్‌లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్‌లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్‌లలో జట్టును ఫైనల్‌కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్‌కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్‌ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్‌పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్‌గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్‌లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్‌గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ థియేటర్ కమాండ్స్ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు. -
మీలో ‘ఫైర్’ ఉందా..?
వృద్ధాప్యం పలకరించే వరకు (60 ఏళ్లు) సంపాదన కోసం పరుగులు పెట్టడం పాత తరం నమూనా.. 45–50 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం.. 50–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవడం.. నేటి తరం కోరుకుంటున్న విధానం. సాధ్యమైనంత త్వరగా సంపాదించాలి. భారీగా కూడబెట్టాలి. ముసలితనానికి ముందే ఉద్యోగం లేదా వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి మిగిలిన జీవితాన్ని మనసుకు నచ్చినట్టు పూర్తి సంతోషంగా రైడ్ చేయాలి. ఇలా అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (ఎఫ్ఐఆర్ఈ). ఆ ఫైర్ మీలో ఉందా..? అందుకోసం ఏం చేయాలో చర్చించేదే ఈ కథనం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (ఎఫ్ఐ)/రిటైర్ ఎర్లీ (ఆర్ఈ). ఫైర్ అంటే ఇదే. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ సాధించడం/ముందుగా రిటైర్ కావడం అన్నదే సంక్షిప్తంగా ఫైర్. జీవితాంతం కూర్చుని తినేందుకు సరిపడా, అన్ని అవసరాలను తీర్చేంత సంపదను వీలైనంత ముందుగా సమకూర్చుకోవడం ఇందులోని అంతరార్థం. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం నెలవారీగా ఖర్చులు రూ.75,000గా ఉన్నాయని అనుకుందాం. అంటే ఏడాదికి జీవన ఖర్చు రూ.9 లక్షలు. అతని వద్ద రూ.18 లక్షల నిధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతీ నెలా రూ.80,000 చొప్పున 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు నెలవారీ సిప్‌ను ఏటా 8 శాతం పెంచుతూ వెళ్లాడు. పెట్టుబడులు 12 శాతం రాబడి రేటు ప్రకారం వృద్ధి చెందాయని, ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందనుకుంటే.. అప్పుడు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.7.2 కోట్లు సమకూరతాయి. ఆ సమయంలో అతని వార్షిక వ్యయాలు రూ.22.8 లక్షలకు చేరతాయి. అదే సమయంలో తన ఖర్చులకు 32 రెట్లు నిధి సమకూరి ఉంటుంది. దీన్ని కదపకుండా మెరుగైన రాబడినిచ్చే సాధనంలో మరో 5–10 ఏళ్లు కొనసాగించినా నిండు నూరేళ్లపాటు నిశ్చితంగా జీవించొచ్చు. ఫైర్‌లో పలు రకాలున్నాయి. ఇందులో ఏదో ఒక ఫైర్ ఉన్నా ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించొచ్చు. నార్మల్ ఫైర్ ఇప్పటి మాదిరే జీవితాంతం రాజీ లేకుండా జీవించడం. భవిష్యత్తులోనూ విహార యాత్రలు, ఖర్చులు, రెస్టారెంట్ భోజనాలు, వినోదం, వైద్యం అన్నింటి అవసరాలను తీర్చుకునేందుకు కావాల్సినంత సమకూర్చుకోవడం. 45 ఏళ్ల వ్యక్తి అప్పటి తన వార్షిక జీవన వ్యయానికి 35 రెట్ల సంపదను సమకూర్చుకుని ఉంటే ‘నార్మల్ ఫైర్’ సాధించినట్టు అర్థం చేసుకోవాలి. లీన్ ఫైర్ లీన్ ఫైర్ అంటే మీ ఖర్చులు, జీవన విధానంలో కొంత రాజీ పడడం. నార్మల్ ఫైర్‌తో పోలిస్తే కొంత సర్దుకుపోవడం. ఈ విధానంలో తక్కువ వ్యయాలతో జీవించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నార్మల్ ఫైర్‌ను సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు ప్రస్తుత వ్యయాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇది కూడా ఫైర్ కిందకే వస్తుంది. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయానికి 25–28 రెట్ల మేర సంపద కూడబెడితే లీన్ ఫైర్ సాధించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఫ్యాట్ ఫైర్ లీన్ఫైర్కు విరుద్ధమైనదే ఫ్యాట్ఫైర్. రాజీకి చోటు లేకుండా రాజులా జీవించడం. అనుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ జీవించడం. ఎందులోనూ రాజీపడక్కర్లేదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవక్కర్లేదు. ఈ తరహా ఫైర్ కోసం ఎక్కువ మొత్తమే కావాలి. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయాలకు 45–50 రెట్ల మేర నిధిని సమకూర్చుకోగలిగితే అతను ఫ్యాట్ఫైర్ సాధించినట్టే. ఇలా సమకూర్చుకున్నప్పుడు మిగిలిన జీవితాంతం 125–140 శాతం అధికంగా ఖర్చు చేస్తూ సాగిపోవచ్చు. కోస్ట్ ఫైర్ మిగిలిన జీవితానికి సరిపడా ముందుగా సమకూర్చుకోవడమే కోస్ట్ ఫైర్. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అదనపు పెట్టుబడులు అవసరం లేకుండానే ఆ మొత్తం వృద్ధి మరింత వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. 50 ఏళ్లకు ఫైర్ సాధించడం కోసం అతను రూ.6 కోట్ల నిధిని సమకూర్చుకోవాలి. అటువంటి సందర్భంలో లక్ష్య సాధనకు ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 60 శాతాన్ని (రూ.1.2 లక్షలను) పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా చేస్తే మొదటి పదేళ్లలోనే 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.2.5 కోట్లు సమకూరుతుంది. దీంతో రూ.6 కోట్ల లక్ష్యాన్ని తర్వాతి 10 ఏళ్లలో చేరుకునేందుకు అతను అక్కడి నుంచి రూపాయి కూడా అదనంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అప్పటి వరకు సమకూరిన రూ.2.5 కోట్ల నిధి ఏటా 10 శాతం రాబడినిచ్చే సాధనంలో ఉంచినా తదుపరి పదేళ్ల కాలంలో రూ.6 కోట్లు అవుతుంది. ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకుంటారు. దాంతో ఒత్తిడితో కూడిన పనిని విడిచిపెట్టి.. వేతనం తక్కువైనా నచ్చిన పనికి మారిపోవచ్చు. మీ ఫైర్ ఏది? తాము ఏ ఫైర్‌ను చేరుకుంటామన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మీ సంపాదన, ఖర్చులు, జీవన స్థితిగతులు వీటన్నింటి పాత్ర ఉంటుంది. వీటన్నింటి మధ్య మీకున్న సౌకర్యం ఏపాటిది? ఆలోచించుకోవాలి. లీన్ఫైర్లో రాజీపడాల్సి ఉంటుంది. కొన్ని అంచనాలు, పరిస్థితులు మారినా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అన్నింటిలోకి నార్మల్ ఫైర్ ఆచరణీయం. కనీసం లీన్ఫైర్తో ఆరంభించి.. కొన్నేళ్ల తర్వాత అయినా నార్మల్ ఫైర్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. మెరుగైన సంపాదన ఉండి, ఎక్కువ భాగాన్ని వెనకేసుకునే అవకాశం ఉన్నవారికి ఫ్యాట్ ఫైర్ ఆచరణీయం. ఫైర్ సాధిస్తే పని మానవచ్చా? అది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తికి అంతటితో విరా మం చెప్పేసుకోవచ్చు. ఒకవేళ చేస్తున్న పని బోర్‌గా అనిపించకపోతే.. ఒత్తిళ్లతో కూడుకున్నది కాకపోతే కొనసాగడమే మంచిది. దీనివల్ల అదనపు నిధి సమకూరుతుంది. అప్పుడు మీ జీవితానికి మరింత జోష్‌ను తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇందంతా మీ ఇష్టా అయిష్టాలపై, మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఫైర్ ఎందుకు అవసరం? 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం అంటే కష్టమైన పనే. ప్రైవేటు రంగంలో 58 ఏళ్లకే తప్పుకోవాలి. పైగా ఉద్యోగ భద్రత పాళ్లు తక్కువ. ఆరోగ్యం అందరికీ సహకరించకపోవచ్చు. వృద్ధాప్యంలోనూ సంపాదించుకునే శక్తి ఉంటుందన్న భరోసా పని చేయకపోవచ్చు. ముందుగానే ఫైర్‌ను సాధిస్తే మీపై ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు నచ్చినట్టు, మీదైన దారిలో సాగిపోయే స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరో ట్యూన్‌కు మీరు డ్యాన్స్ కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అభద్రతా భావం నుంచి బయటకు వస్తారు. మీ డిమాండ్లపై పట్టుబట్టే ధైర్యం లభిస్తుంది. ఫైర్ అంత ఈజీనా..? కాదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో చాలా మంది 60 దాటిపోయిన తర్వాత కూడా సంపాదన కోసం శ్రమకోరుస్తూనే కనిపిస్తుంటారు. పైగా రిటైర్మెంట్ ప్రణాళిక విషయంలో చాలా మందిలో శ్రద్ధ కనిపించదు. దీంతో 60 వచ్చినా మిగిలిన జీవితానికి చాలినంత నిధి కనిపించదు. ఆర్థిక ప్రణాళికల్లేకుండా సాగిపోవడం వల్ల అసలు తత్వం అప్పుడు కానీ బోధపడదు. ఒకవేళ ముందుగా ఫైర్ సాధించినప్పటికీ అది మంచి రాబడుల వల్ల కాదు.. సంపాదనలో అధిక మొత్తాన్ని పొదుపు చేస్తూ రావడం వల్లే. అందుకే ఫైర్ ఉంటే కాదు.. దాన్ని సాధించే పక్కా ఆచరణ, ప్రణాళికలు కూడా మీ దగ్గర ఉండాలి. ఇవి కీలకం.. ► వ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనలో సాధ్యమైనంత తక్కువ వ్యయాలకే పరిమితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అన్నది సంపద. ఆ సంపదకు సంపాదన, వ్యయ నియంత్రణ కీలకం. ► నెల సంపాదన రూ.2లక్షలు. చేస్తున్న వ్యయం రూ.25వేలు. అప్పుడు వ్యయాలకు ఎనిమిదిరెట్లు అధికంగా సంపాదిస్తున్నట్టు. ఇటువంటి వారు చాలా వేగంగా ఫైర్ సాధిస్తారు. ► కొందరికి వ్యయ నియంత్రణ సాధ్యపడదు. పైగా పోనుపోను జీవనశైలిని మరింత మెరుగు పరుచుకుంటూ జీవించేస్తారు. ఇటువంటి వారు ఫైర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ► మంచి ఆదాయానికి బాటలు వేసుకోవాలి. ► ఆదాయం నుంచి కనీసం 60 శాతాన్ని అయినా ఆదా చేసుకుని ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రా బడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► రాబడులు అంచనాలను అందుకోకపోతే, ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటే ఫైర్ కష్టంగా మారుతుంది. ► దుబారాకు దూరంగా ఉండి, సాధారణ జీవితం గడపాలి. అలా అని ఆనందం, కోర్కెల విషయంలో రాజీపడొద్దు. ► ఫైర్ సాధించిన తర్వాత.. వాటిపై క్రమం తప్పకుండా రాబడులు వచ్చేలా (క్యాష్ ఫ్లో) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉండాలి. పెట్టుబడులు ఇరుక్కుపోయే వాటిల్లో ఉంచొద్దు. ► ఎవరికివారు తమకు అనుకూలమైన ఫైర్ దిశగా అడుగులు వేసేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఈ విషయంలో స్పష్టత కోసం ఆర్థిక సలహాదారుల సేవలు తీసుకోవడం సూచనీయం. -
Mithali Raj: వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు!
న్యూఢిల్లీ: తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అందనిద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్‌కప్ టైటిల్ కోసం వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిస్తానని భారత మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ తర్వాత తాను ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని ఈ హైదరాబాదీ క్రికెటర్ సంకేతాలు ఇచ్చింది. ‘అంతర్జాతీయ క్రికెట్లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 2022 నా కెరీర్లో చివరి ఏడాది కావొచ్చు. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ నా ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నాను. వయసు పెరుగుతున్నకొద్దీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు’ అని శనివారం వర్చువల్‌గా జరిగిన ‘1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్‌నెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ‘వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ మాకు ముఖ్యమే. వరల్డ్‌కప్ కోసం పటిష్ట జట్టును రూపొందించే పనిలో ఉన్నాం. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మనం కొంచెం బలహీనంగా ఉన్నాం. సీనియర్ జులన్ గోస్వామి రిటైరైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి’ అని 38 ఏళ్ల మిథాలీ తెలిపింది. 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. ప్రత్యర్థి జట్టుపై ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించాలని... ఈ విషయంలో విరాట్ కోహ్లిని మిథాలీ రాజ్ బృందం ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించారు. -
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ రమేష్
-
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ఎన్‌ఈసీగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు(మార్చి 31) పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి ‘సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. మా బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు మాకు సంపూర్ణ సహకారంగా అందించింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చట్ట సభలపట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందే. నేను 7 ఏళ్లపాటు గవర్నర్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశాను. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు అపార విశ్వాసం ఉంది. నామినేషన్ల ఉపసంహరించడంపై హైకోర్టు ఆదేశాలను శిరసావహించా. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉంది. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్‌కు నివేదిక అందిస్తా. చేయాల్సిన సంస్కరణలపై నివేదికలో పొందుపరిచా. సిఫార్సులు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి. నాకు వారసులుగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఎస్ఈసీ నీలం సాహ్నికి అభినందనలు తెలియజేశాను. నేనెప్పుడూ అధికారిక సమాచారాన్ని బయటకు లీక్ చేయలేదు. వ్యవస్థకు సంబంధించి స్వతంత్రత, నిబద్దతపై ఎవరూ రాజీ పడటానికి వీల్లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుంది. అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగాను.’ అని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ రిటైనింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్ -
కొత్త సీజేఐ పేరును సూచించండి
-
కొత్త సీజేఐ పేరును సూచించండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో నెల రోజులే ఆయన పదవిలో ఉంటారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుందో మీరే సూచించాలని జస్టిస్ బాబ్డేను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ బాబ్డేకు ఒక లేఖ పంపారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్‌గా ఎంపికైనట్లే. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. ఒకవేళ సీనియర్ మోస్ట్ జడ్జి ఈ పోస్టుకు అర్హుడు కాడని భావిస్తే.. ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, ఒకరి పేరును ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ అత్యంత సీనియర్. 2022 ఆగస్టు 26 వరకూ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ కాలం ఉంది. -
అటు యూసుఫ్... ఇటు వినయ్...
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఒకే రోజు ఆటకు గుడ్‌బై చెప్పారు. 38 ఏళ్ల బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ తన రిటైర్మెంట్ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్ బౌలర్ వినయ్ కుమార్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున ఆడి చాలా కాలమే అయినా... గత సీజన్ వరకు కూడా వీరిద్దరు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగారు. యూసుఫ్ పఠాన్ భారీ హిట్టర్‌గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్‌పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. టి20లకంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా యూసుఫ్ క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో అతను పలు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచిన యూసుఫ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2012, 2014 టైటిల్స్ విజయాల్లో కూడా భాగస్వామి. 2010లో 37 బంతుల్లోనే అప్పటి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన యూసుఫ్... 2014లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో అప్పటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా తన పేరిటే లిఖించాడు. మొత్తంగా 174 ఐపీఎల్ మ్యాచ్‌లలో 142.97 స్ట్రయిక్‌రేట్‌తో 3,204 పరుగులు చేసిన యూసుఫ్ 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ జట్టులోకి తీసుకోలేదు. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడిన ఈ బరోడా స్టార్... 2010లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో (సౌత్‌జోన్‌పై) ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనిది. వెస్ట్‌జోన్ తరఫున ఆడిన యూసుఫ్ 190 బంతుల్లోనే 19 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి అజేయంగా 210 పరుగులు చేయడంతో వెస్ట్ జోన్ జట్టు 536 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం రాని యూసుఫ్ 2012లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వినయ్ కుమార్ రంజీ ట్రోఫీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆటగాళ్లలో వినయ్ కుమార్ కూడా ఒకడు. దావణగెరెకు చెందిన ఈ పేస్ బౌలర్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్ గోయల్ (637), వెంకట్రాఘవన్ (530), సునీల్ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్ ఉండగా... పేస్ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. సుదీర్ఘ కాలం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెరీర్ చివరి ఏడాది అతను పుదుచ్చేరి తరఫున ఆడాడు. కర్ణాటక కెప్టెన్‌గా వినయ్ రికార్డు ఘనంగా ఉంది. 2013–14 సీజన్లో వినయ్ నాయకత్వంలో కర్ణాటక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, విజయ్ హజారే ట్రోఫీ గెలవగా... 2014–15 సీజన్లో కూడా ఇదే ‘ట్రిపుల్’ పునరావృతం కావడం విశేషం. తొలి సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినయ్ ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లలో 105 వికెట్లు తీశాడు. 2014 (కోల్‌కతా), ముంబై (2015, 2017) ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో అతనూ సభ్యుడు. 2018 తర్వాత మళ్లీ అతనికి లీగ్‌లో అవకాశం రాలేదు. భారత్ తరఫున మాత్రం వినయ్ కుమార్ కెరీర్ గొప్పగా సాగలేదు. ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో కొన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా... 2013 తర్వాత అతనికి మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ ట్రోఫీతో... -
సింధు ట్వీట్ స్మాష్
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్‌తో భారత క్రీడాభిమానులకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘డెన్మార్క్ ఓపెన్ నా చివరి టోర్నీ. నేను రిటైరయ్యా’ అని సింధు చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ట్వీట్‌తో పాటు కోవిడ్–19 స్థితిగతులు, దాని ప్రభావంపై ఆమె సుదీర్ఘ ప్రకటన చేసింది. దీంతో కరోనా నేపథ్యంలో నిజంగానే ఆమె ఆటకు దూరంగా వెళ్తుందేమోనని అందరూ బోల్తా పడ్డారు. కానీ ట్వీట్ చివర్లో నెగెటివిటీ, అనవసరపు విశ్రాంతి, భయం నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కాలంగా అనవసరపు అనిశ్చితితో బాధపడుతున్నానని, ఇక దానికి స్వస్తి పలుకుతానంటూ ఆమె ట్వీట్‌ను మొదలుపెట్టింది. ‘ఆటలో ఇన్నాళ్లూ పోరాడాను. కానీ కంటికి కనిపించని ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియట్లేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు చదువుతూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఆలోచించా. కానీ ఈ అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. భయం, నెగెటివిటీ, అవాస్తవికతకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. పోరాడకుండా నేనెప్పుడూ ఓటమి ఒప్పుకోను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం డెన్మార్క్ ఓపెన్‌తోనే ముగిస్తున్నా’ అని ఇకపై ఆడతాననే తన అభిలాషను సింధు విశ్లేషణాత్మకంగా వివరించింది. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘సింధు! నాకు మినీ షాక్ ఇచ్చావ్. కానీ నాకు నీ అకుంఠిత దీక్ష, సంకల్పంపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి ఇంకా ఎన్నో పురస్కారాలు అందిస్తావనే విశ్వాసం ఉంది’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ చివరి మ్యాచ్ ఆడేశాడు. 2018 నుంచి ఓపెనర్‌గా చెన్నై విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వాట్సన్ ఆదివారం ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపు అనంతరం వాట్సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న 39 ఏళ్ల వాట్సన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ఫ్రాంచైజీలకు ఆడుతున్నాడు. ఆదివారంతో ఇక అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సీఎస్కే సహచరులతో వాట్సన్ చెప్పాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ వాట్సన్ ఉద్వేగానికి గురయ్యాడు. చెన్నై ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అతను అన్నాడు’ అని జట్టు వర్గాలు తెలిపాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై కన్నా ముందు రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లోనే కాకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్‌లీగ్, బిగ్‌బాష్ లీగ్‌లలో కూడా వాట్సన్ బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా వాట్సన్ తన టి20 కెరీర్లో 343 మ్యాచ్‌లు ఆడి 8,821 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 216 వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్ 101 క్యాచ్‌లు తీసుకున్నాడు. -
క్రికెట్‌కు ఉమర్ గుల్ గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న పాక్ దేశవాళీ టోర్నీ టి20 కప్‌లో చివరి మ్యాచ్ ఆడిన గుల్... అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టిన గుల్... 130 వన్డేల్లో 179 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20ల్లో గుల్ మరో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు దశాబ్దకాలం పాటు పాక్ జట్టు ప్రధాన పేసర్‌గా పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన గుల్ కెరీర్ వరుస గాయాలతో ఒడిదుడుకులకు లోనైంది. అంతర్జాతీయ టి20ల్లో టాప్–10లో రెండు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (5/6, 5/6) నమోదు చేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. యార్కర్ స్పెషలిస్ట్‌గా ప్రత్యేకత ప్రదర్శించిన గుల్... 2007 టి20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల తర్వాత పాక్ గెలుచుకున్న టి20 వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గుల్ కావడం విశేషం. పాకిస్తాన్ తరఫున తన చివరి మ్యాచ్‌ను అతను నాలుగేళ్ల క్రితం 2016లో ఆడాడు. -
ట్రాయ్ చైర్మన్‌గా వఘేలా
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ ఆర్ఎస్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 30తో తీరిపోనుంది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు. మరోవైపు, టెలికం రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పదవీ విరమణ చేయనున్న శర్మ తెలిపారు. సర్వీసులకు గట్టి డిమాండ్‌తో పాటు కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకుపోగలిగే సామర్థ్యం టెల్కోలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
వీడ్కోలు మ్యాచ్‌పై బోర్డు ఆలోచన!
న్యూఢిల్లీ: ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఒక ఇన్స్ట పోస్ట్‌తో ఎమ్మెస్ ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినా... బీసీసీఐ మాత్రం తగిన రీతిలో అతనికి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. భారత క్రికెట్‌కు అతను చేసిన సేవలకు గుర్తింపుగా వీడ్కోలు మ్యాచ్ లేదా సిరీస్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ‘ఐపీఎల్ ముగిశాక ధోని కోసం చేయాల్సిందంతా చేస్తాం. దేశానికి అతను ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాడు. అదే స్థాయిలో ధోనికి కూడా గౌరవం దక్కాలి. మేమెప్పుడూ ధోనికి వీడ్కోలు మ్యాచ్ ఉండాలనే అనుకున్నాం. కానీ ఎవరూ ఊహించని రీతిలో అతి సాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ సందర్భంగా ధోనితో మాట్లాడి తనకు నచ్చినట్లు మ్యాచ్ లేదా సిరీస్ ఏర్పాటు చేస్తాం. అనంతరం అతనికి నచ్చినా నచ్చకపోయినా మేం ధోనిని సత్కరిస్తాం. ధోనికి సన్మానించడం మాకు దక్కిన గౌరవం’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత మాజీ వికెట్ కీపర్ మదన్ లాల్ కూడా ధోనికి తగిన గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్ నిర్వహిస్తే తనతో పాటు అభిమానులు చాలా సంతోషిస్తారని అన్నారు. ‘అతనో దిగ్గజం. ధోనిని ఒక్క ప్రకటనతో క్రికెట్ నుంచి వెళ్లనివ్వకూడదు. అభిమానులంతా అతని చివరి మ్యాచ్ చూడాలని కోరుకుంటున్నారు’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. -
ధోని ఇంటికి చేరుకున్న రిటైర్మెంట్ గిఫ్ట్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలసిందే. దీంతో క్రీడల్లో అద్భుతమైన శకం ముగిసింది. ఇక నుంచి ధోని జెర్సీని చూసే అవకాశాన్ని ఆయన అభిమానులు కోల్పోనున్నారు. అయితే ధోని తన రిటైర్మెంట్ను ఒక అద్భుతమైన గిఫ్ట్‌తో జరుపుకున్నట్లు తెలుస్తోంది. పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్‌తో ధోని తన రిటైర్మెంట్ను గొప్పగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దానికి సంబంధిన ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. డ్యూయల్ రేసింగ్ గీతలతో ఎరుపు రంగుతో ఉన్న ట్రాన్స్ యామ్ ధోని కార్ గ్యారేజీలో అద్భుతంగా కనిపిస్తోంది. View this post on Instagram Welcome home ! @mahi7781 missing you ...#transam A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 15, 2020 at 5:03am PDT పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్ 1970 లలో తయారు చేసిన ఒక అమెరికన్ కారు. ఇది భారతదేశంలో దొరకడం చాలా అరుదు. ధోని కారు 1971-1973 మధ్య తయారు చేసిన ప్రారంభ మోడల్‌గా కనిపిస్తుంది. ఈ కారు V8 బిగ్ బ్లాక్ ఇంజిన్ 455 ఇంజిన్‌తో నడిచే లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌ను కలిగి ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ కారు ధోని వద్దకు చేరుకుంది. ఈ వీడియోలో ట్రాన్స్ యామ్ కాకుండా, ధోని గ్యారేజీలో ఉన్న మరిన్ని కార్లను కూడా చూడవచ్చు. ఇందులో హమ్మర్ హెచ్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ అలాగే రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో సిరీస్ 1, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్ , పాత తరం టయోటా కరోలాతో సహా మరిన్ని వాహనాలను కూడా చూడవచ్చు. వీటితో పాటు మొదటి తరం ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక ఈ కార్లతో పాటు మాహీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దగ్గర కాన్ఫెడరేట్ ఎక్స్ 132 హెల్కాట్, కవాసాకి నింజా హెచ్ 2, డుకాటీ 1098, యమహా ఆర్డి 350, రాయల్ ఎన్ఫీల్డ్ మాచిస్మో, సుజుకి షోగన్, యమహా వైజెడ్ఎఫ్ 600 ఆర్, బిఎస్ఎ గోల్డ్స్టార్తో సహా మరిన్ని మోటర్ బైక్‌లు కలవు. ఇక ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెఫ్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Major Mahi missing @mahi7781 ! A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 15, 2020 at 4:42am PDT చదవండి: వ్యాపారులకు ధోని పాఠాలివే.. -
ధోనితో ఉన్న వీడియో షేర్ చేసిన యువీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విటర్లో స్పందించారు. ధోనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మైదానంలో తనతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను యువీ షేర్ చేశారు. ‘నీ గోప్ప కేరీర్‌కు అభినందనలు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయంలో నీతోపాటు భాగస్వామిగా ఉండటం పట్ల ఎంతో ఆనందించాను. రిటైర్మెంట్ అనంతరం మంచి భవిష్యత్‌కు నీకివే నా శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ ఇచ్చారు యువీ. ఆయన షేర్ చేసిన వీడియోలో ధోనితో కలిసి దిగిన మరపురాని ఫొటోలు ఉన్నాయి. కాగా, మిడిల్ ఆర్డర్లో విజయవంతంగా రాణించిన యువీ, ధోని జంట టీ-20, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట) -
ఏడీబీ ఉపాధ్యక్షుడిగా అశోక్ లావాస
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస(62) ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషనర్‌గా రెండేళ్ల పదవి కాలం మిగిలుండాగానే ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దానిని తిరస్కరించి ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో సుశీల్ చంద్రగత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ నియమావళిని ఉల్లఘించిన కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల పట్ల అశోక్ లావాస నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో ఆయన కుటుంబీకులపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని అశోక్ లావాస నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. -
ఆ రికార్డు సృష్టించనున్న భారత క్రికెటర్!
ముంబై: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే క్రికెట్ ప్రియులందరికి తెలిసిన వ్యక్తే. 41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు. ఇప్పడు ప్రవీణ్ తాంబే మరోసారి రికార్డు సృష్టించబోతున్నాడు. 48 ఏళ్ల తాంబే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు ఎంపికయ్యాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. సోమవారం జరిగిన సీపీఎల్ ఆటగాళ్ల వేలంలో ప్రవీణ్ తాండేను టిన్‌బాగో నైట్ రైడర్స్ దక్కించుకున్నది. అయితే తాంబే సీపీఎల్‌లో ఆడాలంటే బీసీసీఐ అనుమతి ఉండాలి. (చదవండి: ఐపీఎల్లో బ్యాన్ చేశారు కదా.. ఇంకా ఏంటి?) కానీ ఇండియన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం తాంబే సీపీఎల్ ఆడటానికి అవకాశం ఇవ్వదు. బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతే ఇతర దేశాలలో జరిగే లీగ్‌లలో ఆడాలనుకునే ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుంది. అంతకముందు కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ ఆడటానికి వెళ్లడానికి యువరాజ్ సింగ్ కూడా అదే చేశాడు. అయితే తాంబే రిటైర్మెంట్కు సంబంధించి ముంబై క్రికెట్ అసోసియేషన్ క్లారిటీనిచ్చింది. ప్రస్తుతం అతను రిటైర్డ్ అయ్యాడు అని తెలిపింది. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాండే రిటైర్డ్ అయ్యారు. మొదట ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు, కానీ తరువాత దానిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రిటైర్డ్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశం పంపించారు. (ఐపీఎల్ 2020: అతడు ఔట్) ఇక తాంబే క్రికెట్ ఆట విషయానికి వస్తే... 2013-16 మధ్య కాలంలో ప్రవీణ్ తాంబే 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. ఇక ప్రవీణ్తాంబే సీపీఎల్ విషయానికి వస్తే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్ కొత్త సీజన్.. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు షెడ్యూల్ చేశారు. భారత ప్రభుత్వం జూలై 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ దానిని పొడిగిస్తే తాంబే ఆశల మీద నీళ్లు చల్లినట్లే అవుతుంది. -
2021 ప్రపంచకప్‌తోనే ముగిస్తా
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఎప్పుడంటూ తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ సమాధానమిచ్చింది. తన సుదీర్ఘ కెరీర్‌ను వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌తో ముగిస్తానంటూ ఆమె ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ... 2021లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ‘2021 వన్డే ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది. అప్పడు భారతే టైటిల్‌ను గెలుస్తుందని భావిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్ధికి గొప్ప మలుపు అవుతుంది. ఎందరో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం’ అని మిథాలీ వివరించింది. తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఐసీసీ ఈవెంట్లలో ఇప్పుడు భారత్ కూడా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోందన్న ఆమె... దీనికి ఆటగాళ్ల కృషితోపాటు బీసీసీఐ సహాయక సిబ్బంది తోడ్పాటే కారణమని చెప్పింది. ‘మహిళల క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో విదేశీ పర్యటనల సమయంలో ఆట గురించి చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు షెఫాలీ వర్మ లాంటి యువ క్రీడాకారిణిలకు అరంగేట్రానికి ముందే అంతర్జాతీయ అనుభవం ఉంటుంది. దేశవాళీ టోర్నీలు, చాలెంజర్ ట్రోఫీలు ఆడటం ద్వారా వారు చాలా నేర్చుకుంటున్నారు. మాకు అప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిబిరాల గురించి కూడా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి. ఆదాయం పెరగడంతో కేవలం ఆటపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతోంది’ అని మిథాలీ వివరించింది. -
న్యాయవ్యవస్థ సమగ్రతే శిరోధార్యం కావాలి
న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ గుప్తా బుధవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. లాక్డౌన్ కారణంగా, బార్బర్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్యనే ఈ రోజు తనకు హెయిర్ కట్ చేసిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి. -
అందం అల్విదా చెప్పింది
ఆటతో పాటు అందం కూడా కలిసి నడిచే మహిళల టెన్నిస్‌లో ఒక శకం ముగిసింది. 16 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన రష్యన్ బ్యూటీ మారియా షరపోవా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గినా... వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించినా... తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ తన రాకెట్‌ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తన పేరుతో పెట్టిన క్యాండీ ‘షుగర్‌పోవా’లాగే ఎన్నో తీపి జ్ఞాపకాలను పదిలపర్చుకొని వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. పారిస్: రష్యా టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ మారియా షరపోవా ఆట నుంచి తప్పుకుంది. ‘టెన్నిస్–నేను గుడ్‌బై చెబుతున్నా’ అంటూ ప్రకటించింది. నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో ఆమె కూడా ఉండటం విశేషం. 32 ఏళ్ల షరపోవా కొన్నేళ్లుగా వరుస గాయాలతో సతమతమవుతోంది. కోలుకొని అప్పుడప్పుడూ బరిలోకి దిగుతున్నా ఫలితాలు అన్నీ ప్రతికూలంగా వచ్చాయి. ఒకప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు 373వ ర్యాంక్‌కు పడిపోయింది. దాంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో పుట్టినా... ఏడేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. ఆటలో మాత్రం రష్యాకు ప్రాతినిధ్యం వహించడాన్ని షరపోవా కొనసాగించింది. 2004 వింబుల్డన్ ఫైనల్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ను ఓడించి 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె చక్కటి ఆటకు అందం తోడై అత్యంత పాపులర్ ప్లేయర్‌గా షరపోవాకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. వరుసగా 11 ఏళ్ల పాటు అత్యధిక ఆర్జన ఉన్న మహిళా క్రీడాకారిణిగా ‘ఫోర్బ్స్’ జాబితాలో నిలిచింది. 28 ఏళ్ల ఆట, 5 గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. వేరే రంగంలో పోటీ పడి మరింత ఎత్తుకు ఎదిగే సత్తా నాలో ఇంకా ఉంది. నేను నా జీవితాన్ని టెన్నిస్‌కు ఇస్తే టెన్నిస్ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఎంతగా శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు సాధించవచ్చని నేను నమ్మా. గతం గురించో, భవిష్యత్తు గురించో అతిగా ఆలోచించకుండా వర్తమానంలో కష్టపడటం వల్లే ఈ విజయాలు దక్కాయనేది నా భావన. టెన్నిస్ కోర్టుకు సంబంధించి అన్ని జ్ఞాపకాలూ పదిలంగా నా మనసులో ఉంటాయి. అవి కోల్పోతున్న బాధ నాకూ ఉంది. టెన్నిస్ అనేది నాకు శిఖరంలాంటిది. అక్కడికి చేరే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసినా ఒక్కసారిగా పైకి ఎక్కిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. ఇక ముందు కూడా జీవితంలో కొత్త లక్ష్యాలు పెట్టుకొని శ్రమిస్తా. మరిన్ని విజయాలు అందుకున్నా. –వీడ్కోలు సందేశంలో షరపోవా మొత్తం గెలిచిన మ్యాచ్‌లు: 645 మొత్తం ఓడిన మ్యాచ్‌లు: 171 కెరీర్లో సాధించిన ప్రైజ్‌మనీ: 3,87,77,962 డాలర్లు (రూ. 277 కోట్ల 76 లక్షలు) షరపోవా సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్: 5 (2004–వింబుల్డన్; యూఎస్ ఓపెన్–2006; ఆస్ట్రేలియన్ ఓపెన్–2008; ఫ్రెంచ్ ఓపెన్–2012, 2014) కెరీర్లో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 36 అత్యుత్తమ ర్యాంకింగ్ (ఆగస్టు 22, 2005): 1 ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది: 2001 ప్రస్తుత ర్యాంక్: 373 కెరీర్లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగిన వారాలు: 21 -
సీజేఐ గొగోయ్‌కి వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్ డే. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. వివాదం.. సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్ గొగోయ్.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్ గొగోయ్‌కి క్లీన్చిట్ ఇచ్చింది. తిరుగుబాటు.. 2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జీల్లో(గ్యాంగ్ ఆఫ్ ఫోర్) జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్‌లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కీలక తీర్పులు జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని. జస్టిస్ గొగోయ్ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్ గొగోయ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ వారికి చెప్పారు. కష్టాల వల్ల పట్టుదల మరింత పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగోయ్‌కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎవరూ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అట్టహాసాలు లేకుండా, నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే సహా అత్యున్నత న్యాయస్థానంలోని దాదాపు అందరు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ గొగోయ్ ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఎస్సీబీఏ కార్యదర్శి ప్రీతి సింగ్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పనిచేసిన అత్యున్నత న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరని ఎస్సీబీఏ అధ్యక్షుడు రాకేశ్‌ఖన్నా ప్రశంసించారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణల పక్కన కూర్చున్న జస్టిస్ గొగోయ్.. ఇతర న్యాయమూర్తులతో కబుర్లు చెబుతూ, న్యాయవాదుల నుంచి బొకేలు స్వీకరిస్తూ సరదాగా కనిపించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు కూడా జడ్జీలతో పాటు కూర్చున్నారు. -
వైదొలిగిన ‘ప్రిన్సిపాల్ సెక్రటరీ’ మిశ్రా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. పదవీ విరమణ పొందనున్న మిశ్రాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను పీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్తలో మిశ్రా చాలా సహాకారం అందించారని, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆయనకు విరమణానంతరం అంతా మంచే జరగాలి’ అని ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ప్రభుత్వంలో పనిచేయ డం గర్వంగా భావిస్తు న్నానని మిశ్రా తెలిపా రు. 1967 బ్యాచ్ ఐఏ ఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు. కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొందిన పీకే సిన్హాకు పీఎంవోలో ఓఎస్డీగా ప్రభుత్వం బాధ్యతలు కల్పించింది. -
గేల్‌కు వీడ్కోలు టెస్టు లేదు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఒకే ఒక్క టెస్టు... సొంతగడ్డపై తన చివరి టెస్టు మ్యాచ్ ఆడి రిటైర్ అవుతానని ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఆశలను ఆ దేశ సెలక్టర్లు తుంచేశారు. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో గేల్‌కు చోటు దక్కలేదు. ఈ నెల 30 నుంచి జమైకాలోని కింగ్‌స్టన్‌లో భారత్, విండీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆడి నిష్క్రమించాలనే కోరికను గేల్ ప్రపంచ కప్ సమయంలో వెలిబుచ్చాడు. అయితే ఐదేళ్ల క్రితం 2014లో తన చివరి టెస్టు ఆడిన గేల్‌ను ఇప్పుడు టెస్టు మ్యాచ్ కోసం పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదని రాబర్ట్ హేన్స్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావించింది. ‘గేల్ వన్డేలు, టి20ల్లో కొనసాగుతానంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అతను ఆ ఫార్మాట్లలో ఇప్పటికీ విధ్వంసక బ్యాట్స్‌మన్. కానీ టెస్టు ఆడతానంటే మాత్రం కుదరదు. అతను ఐదేళ్లుగా టెస్టు బరిలోకి దిగలేదు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ కోసం తీసుకురావడం అంటే మళ్లీ వెనక్కి వెళ్లినట్లే. యువ ఆటగాళ్లకు ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుంది’ అని దిగ్గజ పేసర్ కర్ట్లీ ఆంబ్రోస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సెలక్టర్లను ప్రభావితం చేసి ఉండవచ్చు. విండీస్ తరఫున 103 టెస్టులు ఆడిన గేల్ 42.18 సగటుతో 7,214 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉండగా... అతని అత్యధిక స్కోరు 333 కావడం విశేషం. అల్జారీ జోసెఫ్ ఔట్! ఇంగ్లండ్‌తో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన జట్టులో రెండు మార్పులతో వెస్టిండీస్ తమ టీమ్‌ను ప్రకటించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఆడుతూ గాయపడిన అల్జారీ జోసెఫ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడిని ఎంపిక చేయలేదు. లెఫ్టార్మ్ స్పిన్నర్ జోమెల్ వారికాన్ మాత్రం జట్టులో చోటు కోల్పోయాడు. వీరిద్దరి స్థానంలో విండీస్ ఒకే మార్పు చేసింది. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ రహ్కీమ్ కార్న్‌వాల్‌ను తొలిసారి జట్టులోకి తీసుకుంది. తాజాగా భారత్‌తో ముగిసిన ‘ఎ’ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన కార్న్‌వాల్ రెండు అర్ధసెంచరీలు చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అటాకింగ్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సామర్థ్యం వల్ల కార్న్‌వాల్‌కు అవకాశం కల్పించినట్లు విండీస్ సెలక్టర్లు చెప్పారు. భారత్, విండీస్ మధ్య ఆగస్టు 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. విండీస్ టెస్టు జట్టు వివరాలు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, షమర్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, రహ్కీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్, షనాన్ గాబ్రియెల్, షిమ్రాన్ హెట్‌మైర్, షై హోప్, కీమో పాల్, కీమర్ రోచ్. -
ఆమ్లా అల్విదా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు రోజుల వ్యవధిలో మరో దిగ్గజ క్రికెటర్ సేవలు కోల్పోయింది. సోమవారం స్టెయిన్ టెస్టుల రిటైర్మెంట్ తర్వాత మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. దశాబ్దన్నర కాలం పాటు సఫారీ బ్యాటింగ్ మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచిన హషీమ్ మొహమ్మద్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. జొహన్నెస్‌బర్గ్: రుషిలాంటి ఏకాగ్రత...వీరుడిలాంటి పోరాటపటిమ... హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్ సందర్భంగా సహచర క్రికెటర్ ఒకరు చేసిన ప్రశంస ఇది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోయే తత్వం, చూడముచ్చటైన స్ట్రోక్‌లు, వివాదాలు లేని, బ్యాట్‌తోనే తప్ప ఏనాడూ నోటితో సమాధానం చెప్పని తనదైన ప్రత్యేక వ్యక్తిగత జీవన శైలి...ఇవన్నీ హషీం ఆమ్లాను విశేష క్రికెటర్‌గా నిలబెట్టాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆమ్లా కెరీర్లో చివరిది. లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ సఫారీ స్టార్ చివరకు ఆట ముగించాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు ల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన అతను... వన్డే ప్రపంచ కప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 203 పరుగులే చేయగలిగాడు. అద్భుతమైన ప్రదర్శనలతో... 2002 అండర్–19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమ్లా కోల్‌కతాలో భారత్‌పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి 3 టెస్టుల్లో కలిపి 62 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 15 నెలల తర్వాత తిరిగి వచ్చి కివీస్‌పై భారీ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కొంత తడబడ్డా 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది. మరుసటి ఏడాది లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతూ సెంచరీతో తన జట్టును రక్షించడంతో ఆమ్లా పోరాటపటిమ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 2012 సిరీస్‌లో చేసిన రెండు సెంచరీలు, అంతకు ముందు ఏడాది స్వదేశంలో అదే జట్టుపై సాధించిన రెండు వరుస శతకాలు ఆమ్లా కెరీర్లో చెప్పుకోదగ్గవి. 2012లో ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో 13 గంటలకు పైగా క్రీజ్‌లో నిలిచి అజేయంగా సాధించిన 311 పరుగులు అతని కెరీర్లో హైలైట్. 2006నుంచి 2015 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా జట్టు విదేశాల్లో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదంటే అందులో ఆమ్లా పోషించిన పాత్ర అద్భుతం. 14 టెస్టుల్లో సఫారీ జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్‌లో సూపర్... ఆమ్లా భారత్‌లో 3 సార్లు పర్యటించాడు. 2004లో విఫలమైన అతను 2008 సిరీస్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 2010 సిరీస్‌లోనైతే ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 253 నాటౌట్, 114, 123 నాటౌట్ పరుగులతో మన బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 2015లో కెప్టెన్‌గా వచ్చి 0–3తో సిరీస్ చేజార్చుకున్నా...ఢిల్లీ టెస్టులో మ్యాచ్‌ను కాపాడేందుకు 244 బంతుల్లో 25 పరుగులు చేసిన అతని పట్టుదలను ఎవరూ మరచిపోలేరు. వన్డేల్లోనూ దూకుడు... శైలిపరంగా చూస్తే టెస్టు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా అనిపించినా...వన్డేల్లోనూ ఆమ్లాకు అద్భుతమైన రికార్డు ఉంది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో అతని వన్డే సత్తా బయటపడింది. ఇదే ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 75 సగటు, 104 స్ట్రైక్‌రేట్‌లో 1058 పరుగులు చేయడం విశేషం. ఒక దశలో అతను వేగంలో కోహ్లితో పోటీ పడ్డాడు. కెరీర్లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగుల వరకు ప్రతీ వేయి పరుగుల మైలురాయిని అందరికంటే వేగంగా ఆమ్లానే చేరుకోవడం మరో ఘనత. దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (27) సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్ ఆమ్లా -
విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్!!
న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు. ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్, బోర్డు సభ్యుడు అయిన రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది. ‘దేశ టెక్నాలజీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అయిన అజీం ప్రేమ్‌జీ దాదాపు 53 ఏళ్లు కంపెనీకి సారథ్యం వహించిన తర్వాత జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కంపెనీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు విప్రో తెలియజేసింది. మరోవైపు చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆబిదాలి జెడ్ నీముచ్‌వాలాను మరో విడత అయిదేళ్ల పాటు సీఈవో, ఎండీ హోదాల్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విప్రో ఎంటర్ప్రైజెస్, విప్రో–జీఈ హెల్త్‌కేర్ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ కొనసాగుతారు. షేర్‌హోల్డర్ల అనుమతుల మేరకు జూలై 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని విప్రో వివరించింది. ‘ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అని రిషద్ పేర్కొన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు.. వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా అజీం తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు. ‘ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరం. భవిష్యత్‌లో మా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్థ్యాలు రిషద్‌కు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. -
తదుపరి నేవీ చీఫ్‌గా కరమ్‌బీర్
న్యూఢిల్లీ: నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌ను కేంద్రం నియమించింది. మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్(ఎఫ్‌వోసీ–ఇన్– సీ)గా ఉన్న కరమ్‌బీర్ మే 31వ తేదీన విధుల్లో చేరుతారని పేర్కొంది. హెలికాప్టర్ పైలెట్ ఒకరు నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే ప్రథమం. అత్యంత సీనియర్ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి ప్రతిభే గీటురాయిగా కరమ్‌బీర్‌ను ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. కరమ్‌బీర్ గురించి ఇంకొంత స్వస్థలం: పంజాబ్‌లోని జలంధర్ ∙పుట్టిన తేదీ: నవంబర్ 3, 1959 నేవీలో చేరింది: జూలై 1, 1980 హెలికాప్టర్ పైలెట్‌గా ఎంపిక: 1982 శిక్షణ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (పూణె), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్(వెల్లింగ్టన్), చేతక్, కమోవ్ హెలీకాప్టర్ల పైలెట్‌గా విశేష అనుభవం. అనుభవం: 37 ఏళ్ల సర్వీసులో కరమ్‌బీర్ సింగ్ ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ చాంద్బీబీ, మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ విజయ్‌దుర్గ్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ రాణా నౌకలకు కమాండర్‌గా పనిచేశారు. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
రాజకీయాల్లోకి రాను!
న్యూఢిల్లీ: రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (టి20, వన్డే)లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లాడిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆటకు తెరపడింది. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు బైబై చెప్పాడు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తల్ని 37 ఏళ్ల గంభీర్ కొట్టిపారేశాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అవన్నీ వదంతులే. నేను ట్విట్టర్ వేదికగా సామాజిక, వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా స్పందించడం వల్లే బహుశా కొందరు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుకోవచ్చు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. నేను ఏ పార్టీలో చేరను, ఎన్నికల్లో పోటీ చేయను. నాకు క్రికెట్లోనే సుదీర్ఘ అనుభవం ఉంది. రాజకీయాలనేవి పూర్తిగా భిన్నం. ఆటతో అనుబంధం కొనసాగించాలంటే క్రికెట్ వ్యాఖ్యాతగా ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ చేయడం మాత్రమే కాదనేది నా అభిప్రాయం. నేనో ముక్కుసూటి మనిషిని. నన్నెవరూ క్రికెట్ సంఘంలో సభ్యుడిగా కోరుకోరు. కోచింగ్‌పై మాత్రం ఆసక్తి ఉంది. కొంత విశ్రాంతి తర్వాత యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతా’ అని అన్నాడు. -
జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గురువారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులోని ప్రముఖ న్యాయమూర్తుల్లో జస్టిస్ జోసెఫ్ ఒకరని సుప్రీం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్ జోసెఫ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన ధర్మాసనంలో జోసెఫ్ ఉన్నారు. కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్ పరిరక్షణపై జస్టిస్ జోసెఫ్ చాలాసార్లు బహిరంగ లేఖలు రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ చట్టాన్ని జస్టిస్ జోసెఫ్ బెంచ్ కొట్టివేసింది. 1,035 తీర్పులతో టాప్–10 సుప్రీం జడ్జీల జాబితాలో పదో స్థానం దక్కించుకుని జస్టిస్ జోసెఫ్ అరుదైన ఘనత సాధించారు. కాగా, ఉన్నత న్యాయస్థానాలు యువ న్యాయవాదులను జడ్జీ బాధ్యతలు స్వీకరించేలా ఆకర్షించలేకపోతున్నాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి మొదలైన ప్రస్థానం.. జస్టిస్ జోసెఫ్ కేరళలో 1953, నవంబర్ 30న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎర్నాకులం జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూలులో పూర్తిచేశారు. అనంతరం తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం జస్టిస్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చివరకూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చి8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు. -
బ్రేవో వీడ్కోలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చిర పరిచితమైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే, టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని తెలిపాడు. 35 ఏళ్ల బ్రావో... 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై జార్జిటౌన్లో తొలి వన్డే ఆడాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు చేసి, 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు తీశాడు. టి20ల్లో మరింత ప్రభావవంతుడైన ఈ ఆల్‌రౌండర్ 2012, 2016 టి 20 ప్రపంచ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. ఈ ఫార్మాట్లో 66 మ్యాచ్‌ల్లో 1,142 పరుగులు చేసి, 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. కెరీర్ అలా ముగిసింది: బ్రావో టెస్టు కెరీర్ 2010లోనే ముగిసింది. 2014లో భారత్‌లో పర్యటించిన విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రావోకు ఆ సిరీసే చివరిదైంది. బోర్డుతో వివాదాల నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ధర్మశాలలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ వేసేందుకు జట్టంతటినీ మైదానంలోకి తీసుకొచ్చి సంచలనం రేపాడు. తర్వాత విండీస్ జట్టు చివరిదైన ఐదో వన్డే, ఏకైక టి20, మూడు టెస్టులు ఆడకుండానే స్వదేశం వెళ్లిపోయింది. దీంతో ధర్మశాల మ్యాచ్‌తోనే ఆల్‌రౌండర్ వన్డే కెరీర్ ముగిసినట్లైంది. 2016లో అబుదాబిలో పాకిస్తాన్‌తో చివరి టి20 ఆడిన బ్రావో... ప్రస్తుతం విండీస్ దీవులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్లలో నిర్వహించే టి20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. మారిన పరిణామాలతో దేశం తరఫున 2019 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ సారథి
లండన్: ఇంగ్లండ్ మూడు సార్లు యాషెస్ సిరీస్ గెలిచింది ఆతడి సారథ్యంలోనే.. టీ20 ప్రపంచకప్ ముద్దాడింది కూడా ఆయన కెప్టెన్సీలోనే. 22 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన ఇంగ్లండ్ మాజీ సారథి పాల్ కాలింగ్‌వుడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడని కాలింగ్ వుడ్.. వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందంటూ ప్రకటించాడు. 1996లోనే తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 2001లో వన్డే (పాకిస్తాన్‌పై), 2003లో టెస్టు(శ్రీలంకపై) అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరుపున 68 టెస్టులు, 197 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌తోనూ కాలింగ్ వుడ్‌కు అనుబంధం వుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ దిగ్గజ ఆటగాడి రిటైర్మెంట్పై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైకెల్ వాన్, ఇయాన్ బోథమ్‌లు ‘గొప్ప ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు’అంటూ ట్వీట్ చేశారు. 2011లో కాలింగ్ వుడ్‌పై వివాదం చిన్న తప్పు కాలింగ్ వుడ్ జీవితాన్నే మార్చేసింది. భారత్‌లో జరిగిన 2011 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఇంగ్లండ్ జట్టులో అతడు సాధారణ సభ్యుడు. అప్పటికే ఇంగ్లండ్ నాన్ స్టాప్ సిరీస్‌లు ఆడుతూ వచ్చింది. ఆ సందర్భంలో ‘ నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్నాము. ఇంటికి వెళ్లక చాలా రోజులయింది. నా కూతురయితే మ్యాచ్ ఓడిపోయి ఇంటికి త్వరగా వచ్చేయండి నాన్న’ అంటుందని కాలింగ్‌వుడ్ మీడియాతో పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఆటగాడిపై విమర్శల వర్షం కురిసింది. క్రికెట్ బోర్టు అతడిని ప్రపంచకప్ నుంచి అర్థంతరంగా తప్పించింది. అనంతరం అతనికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.. కౌంటీ క్రికెట్లో మాత్రమే ఆడాడు. -
‘సుప్రీం’ కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదివారం కొత్త రోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రోస్టర్ జూలై 2 నుంచి (వేసవి సెలవుల ముగిసి కోర్టు ప్రారంభం అయ్యాక) అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రిటైరైన రెండ్రోజుల్లోనే ఈ జాబితా సిద్ధవమడం గమనార్హం. ఈ రోస్టర్ ప్రకారం.. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సామాజిక న్యాయం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, కోర్టు ధిక్కరణతోపాటు అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించనుంది. రెండో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలు, పరోక్ష పన్నులు, పర్సనల్ లా– కంపెనీ లా కేసులను విచారించనుంది. జస్టిస్ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనం పర్యావరణ అసమతుల్యత, అటవీ సంరక్షణ, జంతు సంరక్షణ, భూగర్భ జలాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. మరో సీనియర్ జడ్జి జోసెఫ్ కురియన్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలతోపాటు అద్దె చట్టం, కుటుంబ వివాదాలు, కోర్టు ధిక్కరణ, పర్సనల్ లా కేసులను విచారిస్తుంది. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియంలో కొత్తగా చేరిన జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. పరోక్ష పన్నులతోపాటు ఎన్నికలు, క్రిమినల్ కేసులు, ఆర్డినరీ సివిల్ కేసులు, న్యాయాధికారుల నియామకం తదితర అంశాలను విచారిస్తుంది. ఈ ఐదుగురితోపాటు.. మరో ఆరుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోనూ ధర్మాసనాలు ఏర్పాటుచేసినట్లు కొత్త రోస్టర్ పేర్కొంది. ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్, ఏఎమ్ సప్రేల నేతృత్వంలోనూ పలు కేసుల కేటాయింపులతో ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. -
రిటైరయ్యాక కూడా పెట్టుబడి!
మనలో చాలా మంది రిటైర్మెంట్ గురించి వయసులో ఉన్నపుడు పెద్దగా ఆలోచించరు. అదంతా రిటైరయ్యాక చూసుకుందాంలే... అనుకుంటారు. కాకపోతే... రిటైర్మెంట్ గురించి రిటైరయ్యాక ఎలా ఆలోచిస్తామనే చిన్న లాజిక్ అప్పట్లో అర్థం కాదు. అది అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. అప్పుడు తీరిగ్గా విచారించినా చేసేదేమీ ఉండదు. గణాంకాలను బట్టి చూసినా... ప్రభుత్వరంగంలోని వారు కాకుండా ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలో రిటైర్మెంట్ గురించి ప్రణాళిక వేసుకునే వారు చాలా తక్కువ. తీరా రిటైర్మెంట్కు వచ్చిన తర్వాత... చేతిలో ఉన్న ఆ కాసింత డబ్బును నెలవారీ ఆదాయం కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న సందేహంలో పడిపోతారు. నిజానికి రిటైర్మెంట్ అనేది 35–40 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత వచ్చే దశ. ఉద్యోగం చేస్తున్నంత కాలం నెలనెలా వేతనం బ్యాంకు ఖాతాలో పడిపోతూ అన్ని అవసరాలనూ తీర్చేస్తుంది. తీరా ఉద్యోగ కాలం ముగిశాక ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి!!. ఏదో తెలియని ఆందోళన ఎదురవుతుంది. అందుకే తగినంత నిధిని ముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి. ఇది రిటైర్మెంట్ తరువాతి జీవనానికి తగినంత ఆదాయాన్నిచ్చేదిలా ఉండాలి. దానికోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియజేసే కథనమే ఇది... సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : దాదాపు మనమంతా గమనించాల్సిందొకటుంది. అది... పొదుపు వేరు; ఇన్వెస్ట్మెంట్ వేరు. రిటైరయ్యాక ఆదాయం కావాలంటే ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇన్వెస్ట్ చేయకుండా పొదుపు చేసిన దాన్నుంచి ఖర్చు చేస్తూ వెళితే ఉన్నదంతా కరిగిపోతుంది. పెద్ద వయసులో ఈ పరిస్థితి ఊహించజాలం. చిన్న వయసులో ఉన్న వారైతే రిస్క్ భయం లేకుండా ఇన్వెస్ట్ చేయగలరు. రిస్క్‌ను భరించే సామర్థ్యం వారికి ఎక్కువ. అదే 30–40 ఏళ్ల వయసులో ఉన్న వారైతే కాస్తంత భద్రతతో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిటైరయ్యాక తమ దగ్గరున్న నిధి నుంచే ఆదాయం రాబట్టుకోవాలి కనుక వారు చేసే పెట్టుబడులు భిన్నంగా ఉండాలి. స్థిర ఆదాయాన్నిచ్చేలా ఉండాలి. ముఖ్యంగా రిటైర్మెంట్కు మూడేళ్ల ముందే కార్పస్ ఎంతుందన్నది సమీక్షించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు చాలదనుకుంటే రిటైర్మెంట్ను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇన్వెస్ట్ చేయడం ఎలా? రిటైరయ్యాక చాలా మందికి ఎదురయ్యే ప్రశ్నే ఇది. వేతన జీవులు తాము సర్వీసులో ఉన్నంత సేపూ కంపెనీకి సేవలందించి ఉంటారు. అందరికీ ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన ఉండదు. దీంతో ఇన్వెస్ట్మెంట్లో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంటుంది. రిటైరయ్యాక సంప్రదాయ సాధనాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడులు 7 శాతాన్ని మించవు. అధిక రాబడులు రావాలంటే రిస్క్ అధికంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ దశలో అధిక రిస్క్ తీసుకోలేరు. అందుకే ఇది డెట్, ఈక్విటీల కలబోతగా ఉండాలి. అధిక శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేసి, కొంత మేర ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే... రాబడులు 7 శాతం కంటే ఎక్కువే వస్తాయి. అలాగే, రిటైర్మెంట్ నిధిని ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా ఆదాయం తీసుకునేలా ఉండకూడదు. ఏడాది అవసరాలకు సరిపడేలా రిడెంప్షన్ ఉండాలి. ప్రతి నెలా ఎంతో కొంత వెనక్కి తీసుకోవడం వల్ల కార్పస్ తగ్గిపోతుంది. తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం, కార్పస్ వృద్ధి చెందేలా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. నెలవారీ బడ్జెట్ తప్పనిసరి... రిటైర్మెంట్ నిధిని పెట్టుబడులకు మళ్లించే ముందే నెలవారీ బడ్జెట్‌ను ఖరారు చేసుకోవాలి. రోజువారీ అవసరాల కోసం ప్రతినెలా ఎంత కావాలో తేల్చుకోవాలి. కిరాణా, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు, వినోదం, ఆహారం, వైద్యం ఇలా అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని రెండు భాగాలు చేయాలి. అవసరమైనవి, అవసరం లేనివి. నిధి రెండు భాగాలు చేయాలి... మొత్తం రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలు చేయాలి. ఒక భాగాన్ని స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. దీనిపై వచ్చే ఆదాయం మీ నెలవారీ అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. స్థిరాదాయాన్నిచ్చే పథకాలైన పెన్షన్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం దీనికి అనువైనవని చెప్పొచ్చు. రెండో భాగాన్ని రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడులను ఇచ్చే ఫండ్స్, ఈక్విటీ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో రిటైరయిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం నిధుల్ని తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టకూడదు. అధిక భాగం డెట్‌లోనే ఉంచాలి. ఈక్విటీలకు కేటాయించేది స్వల్పంగానే ఉండాలి. సగటున ఈక్విటీ ఫండ్స్‌లో 30 శాతం మించి పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. డబ్బు ఎంతున్నా దాని విలువను ద్రవ్యోల్బణం కొద్ది కొద్దిగా హరించేస్తుంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అలాగని అధిక రాబడుల కోసం దీర్ఘకాలం పాటు లాకిన్‌లో ఉండే సాధనాలు రిటైర్ అయిన వారికి సూచనీయం కావు. ఎందుకంటే వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ డబ్బుల్ని వెనక్కి తీసుకునేలా (లిక్విడిటీ) ఉండాలి. అందుకే ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయవచ్చు... ఉదాహరణకు ఓ రిటైర్ అయిన వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు ఉన్నాయనుకోండి. నెలవారీ బడ్జెట్ రూ.28,000–32,000. సదరు వ్యక్తి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే... ముందు ఈ నిధి నుంచి కొంత మేర పక్కన పెట్టాలి. ♦ అత్యవసర నిధి = నెలకు రూ.32,000 చొప్పున ఆరు నెలల కోసం = రూ.1,92,000 ♦ ఏడాది అవసరాలకు అయ్యే వ్యయాలు = రూ.32,000 చొప్పున 12 నెలలకు = రూ.3,84,000 ♦ ఈ రెండూ కలిపి మొత్తం రూ.5,76,000. ఇప్పుడు అత్యవసర నిధి రూ.1,92,000ను ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయాలి. ఏడాది అవసరాల కోసం ఉద్దేశించిన రూ.3,84,000ను తీసుకెళ్లి అధిక వడ్డీరేటునిచ్చే బ్యాంకు ఖాతాలో ఉంచాలి. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని 6% వడ్డీని ఇస్తున్నాయి. ఈ రెండూ మినహాయించగా రిటైర్మెంట్ కార్పస్ రూ.44,24,000 ఉంటుంది. దీన్ని రెండు భాగాలు చేయాలి. ♦ 70 శాతం డెట్ విభాగంలో పెట్టుబడులకు = రూ.31,00,000 ♦ 30 శాతం ఈక్విటీలో పెట్టుబడుల కోసం = రూ.13,24,000 ♦ 70 శాతం నిధుల్ని (రూ.31,00,000) మ్యూచువల్ ఫండ్స్ అందించే మంత్లీ ఇన్కమ్ ప్లాన్లలో (ఎంఐపీ) ఇన్వెస్ట్ చేయాలి. వీటి రాబడులు వార్షికంగా 11 శాతం స్థాయిలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు 80 శాతం నిధుల్ని డెట్‌లోనూ, 15 శాతం నిధుల్ని ఈక్విటీలోనూ, 5 శాతం నిధుల్ని ఇతర విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. రూ.31,00,000పైన సగటున 11 శాతం రాబడి అంచనా వేసి చూస్తే నెలవారీగా వచ్చే ఆదాయం రూ.28,416 అవుతుంది. దీంతో నెలవారీ అవసరాలు తీరిపోతాయి. 30 శాతం నిధుల్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఐదేళ్ల కాలం కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఇవి వార్షికంగా సగటున 16 శాతం రాబడులను ఇవ్వగలవు. ఆ విధంగా చూస్తే ఇది అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం రిటైర్మెంట్ కార్పస్‌పై పడకుండా ఈ పోర్ట్‌ఫోలియో సాయపడుతుంది. ఐదారేళ్లకు పెట్టుబడులు రెట్టింపవుతాయి. -
ఆలయ ఉద్యోగుల పదవీ విరమణా 60 ఏళ్లకే..
-2014 జూన్ నుంచి వర్తింప చేస్తూ జీఓ -అన్నవరం దేవస్థానంలో 9 మందికి ప్రయోజనం అన్నవరం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టుగానే తమకూ పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని ఆందోళన చేస్తున్న దేవాలయ ఉద్యోగుల వినతిని రాష్ట్రప్రభుత్వం అంగీకరించి మంగళవారం రాత్రి జీఓ విడుదల చే సింది. దీంతో ఆ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ జీఓ వలన అన్నవరం దేవస్థానంలో తొమ్మిది మందికి ప్రయోజనం చేకూరుతుండగా, అన్ని రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలలోను సుమారు వంద మంది వరకూ ప్రయోజనం పొందనున్నారు. అన్నవరం దేవస్థానంలో వెంటనే ఎనిమిది మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాదరావును తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై కమిషనర్ అనుమతి తీసుకోవల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జూన్ 6, 2014న జీఓ విడుదల చేసింది. అయితే దేవాలయాల ఉద్యోగులకు మాత్రం ఈ పెంపు అమలు కాక 58 సంవత్సరాలకే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. పదవీ విరమణ చేసిన దేవాలయ ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు పొందగా కొన్ని దేవస్థానాల్లో మాత్రమే అమలు చేశారు. అన్నవరం దేవస్థానంలో ఆరుగురికి కోర్టు స్టే వచ్చినా వివిధ కారణాలతో ఒక్కరిని మాత్రమే వి«ధుల్లోకి తీసుకున్నారు. 2016 అక్టోబర్‌లో ఆలయ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయోపరిమితి పెంచుతూ మరో జీఓ విడుదలైంది. అందులో 2016 అక్టోబర్‌లో పదవీ విరమణ చేసేవారికే వర్తిస్తుందని పేర్కొనడంతో 2014 జూన్ 6 నుంచి 2016 సెప్టెంబర్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి అవకాశం లేకుండా పోయింది. ఈ జీఓ మీద కూడా ఉద్యోగులు పోరాటం చేయడంతో చివరకు ప్రభుత్వం 2014 జూన్ నుంచి పదవీ విరమణ వయో పరిమితి పెంచుతూ జీఓ విడుదల చేసింది. ప్రభుత్వ జీఓ ప్రకారం 8 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఈఓ కే నాగేశ్వరరావు బుధవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. -
కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె విరమణ
కంబాలచెరువు : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 33 రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మె బుధవారం విరమించారు. ఈ మేరకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి హేప్సీరాణిని కలిసి సమ్మె విరమణ పత్రం అందజేశారు. స్పెషల్ క్వాలిఫైడ్ టెస్ట్ ద్వారా కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమించినట్టు ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు యార్లగడ్డ రాజాచౌదరి, వి.కనకరాజు తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారందరికీ మూడు దశలుగా టైం స్కేలు వర్తింపజేసి ఉద్యోగభద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సంక్రాంతి సెలవులు అనంతరం జీవోను విడుదల చేస్తామని చెప్పారన్నారు. సమ్మె కారణంగా విద్యార్థులు వెనుకబడిన పాఠాలను అదనపు తరగతుల ద్వారా బోధిస్తామని చెప్పారు. తమ సమ్మెకు మద్దతిచ్చిన విద్యార్థి, కార్మిక, ప్రజాసంఘాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జి.ఎల్.మాణిక్యం, కె.ఎన్.వి.ఎల్.నరసింహం, లక్ష్మణరావు, గణేశ్వరరావు, ప్రకాశ్‌బాబు, రెడ్డి రాజబాబు పాల్గొన్నారు. -
సోనియాతో వీహెచ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని శనివారం ఆమె నివాసంలో కలిశారు. వచ్చే జూన్‌లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లి సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. మూడుసార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో ఓబీసీ రిజర్వేషన్లపై పోరాడానని, పదవిలో ఉన్నా, లేకున్నా బీసీల సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తానని వివరించారు. పార్టీ అభివృద్ధి కోసం ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లపై పోరాడతానని చెప్పారు. వీహెచ్ వెంట భార్య చంద్రకళ, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
నేటితో ముగియనున్న కేయూ రిజిస్ట్రార్ పదవీకాలం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. క్యాంపస్‌లో ని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభా గంలో ప్రొఫెసర్ అయిన సాయిలు మూడేళ్ల పాటు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించారు. అ యితే, కేయూ ఇన్చార్జ వీసీ ఆర్ఎం డోబ్రి యాల్ రిజిస్ట్రార్‌గా సాయిలునే కొనసాగిస్తా రా, లేదా అనేది తేలడం లేదు. కాగా, సాయి లును కొనసాగించే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలువురు ప్రొఫెసర్లు ఇన్చార్జ వీసీ డోబ్రియాల్‌ను కలిసి రిజిస్ట్రార్‌కు సంబంధించి పలు అంశాలపై ఫిర్యాదు చేశా రు. యూనివర్సిటీలో నిబంధనలకు విరు ద్ధం గా పలువురిని నియమించారని, పరీక్షల విభాగం పనులను ప్రైవేట్ కంపెనీకి అప్పగిం చారని, నిబంధనలకు వ్యతిరేకంగా టైం స్కేల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఇన్చార్జ వీసీ దృష్టికి తీసుకువె ళ్లారు. కొత్తగూడెం ఇం జినీరింగ్ కాలేజీలో నూ అక్రమాలు జరిగా య ని ఫిర్యాదులో పేర్కొ న్నారు. దీంతో సాయి లును రిజిస్ట్రార్‌గా కొన సాగిస్తారా, లేదా అనేది వేచిచూడాల్సిందే.