ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది.
అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment