sniffer dog
-
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్‌కు అరుదైన గౌరవం
బెంగళూరు: సినీ ప్రముఖులు పాల్గొని సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డ్రగ్స్‌ను పట్టించిన స్నిఫర్ డాగ్స్‌పై ప్రశంసలు గుప్పించిన బెంగళూరు సీపీ దయానంద.. వాటికి సన్మానం చేశారు.హెబ్బాగోడిలో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో మే 19వ తేదీన బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకుని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దాడులు చేశారు. అయితే రేవ్ పార్టీని భగ్నం చేసిన వెంటనే K9 స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు.ఐదు స్నిఫర్ డాగ్స్ ఆ ప్రాంతంలో వాసన చూసి.. చివరకు చెట్ల పొదల్లో దాచిన డ్రగ్స్‌ను కనిపెట్టాయి. దీంతో ఆ ఐదు డాగ్స్‌ను నగర సీపీ దయానంద పరేడ్ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారిప్పుడు.From rave bust to parade honors! Shoutout to Mailu, Ram, Bhumi, Rana, and Mickey for their top-notch detection skills in Hebbagodi. Honoured by the Commissioner in today's monthly parade.#PawsOnDuty pic.twitter.com/BvubLmNXLp— Bengaluru Paw Patrol (@BLRK9Cops) June 7, 2024 -
సీసీ కెమెరా లేని లోటు తీర్చిన కుక్క...ఎలా అంటే..!
ముంబై: ఆరేళ్ల చిన్నోడు తాను నివసించే మురికివాడలో ఇంటి ముందే స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూనే ఎవరికీ కనిపించకుండా మిస్సయ్యాడు. ఇంట్లో వాళ్లు ఎంత సేపు వెతికినా దొరకలేదు. ఇక లాభం లేదనుకున్న బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి జాగిలాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి రంగంలోకి దించారు. ఇంకేముంది ఆ కుక్క కేవలం మూడున్నర గంటల్లోనే బాలుడి ఆచూకీని పట్టిచ్చింది. బాలుడు దొరకడంతో ఇంట్లో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ముంబై సబ్ అర్బ్ పోవైలోని అశోక్‌నగర్ స్లమ్‌లో గత వారం జరిగింది. బాలుడు మిస్సయ్యాడన్న ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కొంత టెన్షన్ పడ్డారు. బాలుడు ఆడుకుంటున్న ప్రదేశం మురికివాడ కావడంతో అక్కడ ఎలాంటి సీసీ కెమరాలు లేవు. దీంతో తమ వద్ద ఉన్న స్నిఫర్ డాగ్ లియోకు బాలుడిని వెతికే టాస్క్‌ను పోలీసులు అప్పజెప్పారు. రంగంలోకి దిగిన వెంటనే లియో ఇంట్లోని బాలుడి టీషర్ట్ వాసన చూసి అతడిని వెతికేందుకు బయలుదేరింది. బాలుడి ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ గ్రౌండ్‌కు వెళ్లి ఆగింది. అక్కడ బాలుడు పోలీసులకు కనిపించాడు. దీంతో కథ సుఖాంతం అయింది. ఇదీచదవండి..బుల్లెట్ ట్రైన్‌పై కీలక విషయం వెల్లడించిన రైల్వే మంత్రి -
ఆ శునకం ఎలా గర్భం దాల్చింది? సరిహద్దు భద్రతా దళం దర్యాప్తు!
షిల్లాంగ్: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్ డాగ్ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. మేఘాలయ రాష్ట్ర బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్ షిల్లాంగ్ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సేకరించింది. స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై డిసెంబర్ 19న బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బార్డర్ ఔట్ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్ డాగ్ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్ఎఫ్ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్ లాల్సీ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కాపలా కాస్తోంది. ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా -
పోలీస్ స్నైపర్ డాగ్ (టైసన్) మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ స్నైపర్ డాగ్ (టైసన్) మంగళవారం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. కమిషనరేట్‌లో సీపీ వి.సత్యనారాయణతోపాటు పోలీసు అధికారులు నివాళులరి్పంచారు. ఈ డాగ్ 2015 నుంచి కమిషనరేట్‌లో సేవలందిస్తోంది. మానేరు డ్యామ్ తీరంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. టైసన్ మోయినాబాద్లో ఒక సంవత్సరం శిక్షణ తీసుకోగా.. తర్వాత ఆరేళ్లు పోలీసుశాఖలో సేవలందించింది. రెండుసార్లు రాష్ట్రపతి, రెండుసార్లు ప్రధానమంత్రి, మూడుసార్లు గవర్నర్, పది సార్లు ఇతర వీఐపీలు, 20 మినిస్టర్ డ్యూటీలు, 5 సార్లు అసెంబ్లీ విధులు, 2 మేడారం, 150 ఆర్‌వోపీలు, 6 వినాయకచవితి విధులు, 6 శివరాత్రి, 6 రమజాన్, 10 త్రెట్ కాల్స్, 5 రిఫ్రెషర్స్ కోర్సుల విధులు నిర్వహించింది. కార్యక్రమంలో అడిషినల్ డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్.శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి.చంద్రమోహన్, ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్, ఆర్ఐలు కిరణ్ కుమార్, రమేశ్, మల్లేశం, సురేశ్, పశువైద్యాధికారి నరేశ్ రెడ్డి, ట్రైనర్ రాజు పాల్గొన్నారు. -
వైరల్: మీనా.. గుడ్‌బై నేస్తమా
చిన్నముక్క బిస్కెట్, ఒక ఆప్యాయ స్పర్శ చాలు.. కుక్కను మనవైపు తిప్పుకోవడానికి. ఆ పనిని మనం వాటిని మరిచిపోయినా.. అవి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని కనబరిచే ఆ మూగజీవాలు.. ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గుజరాత్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్ డాగ్ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. దాని అంతిమ సంస్కారాలకు ముందు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్ డాగ్స్.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఐపీఎస్ అధికారి శంషేర్ సింగ్ ఆ ఫొటోను అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఆ ఫొటోకి నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. Final salute to their colleague , Meena. pic.twitter.com/bYuceNlsee — Shamsher Singh IPS (@Shamsher_IPS) June 17, 2021 ఇక వర్జీనియాలో జరిగిన ఓ ఘటనలో.. యజమాని నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్లిన ఓ కుక్క.. వాగులో కొట్టుకుపోతున్న జింక పిల్లను ఒడ్డుకు చేర్చింది. ‘హీరో డాగ్’గా పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకుంది. హర్లే అనే కుక్క ఆ జింక పిల్లను కాపాడుతున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: బుడగలు ఊదుతూ రిలాక్స్‌గా.. -
వైరల్ : 11 ఏళ్లపాటు సేవలు.. జాగిలానికి ఘనంగా వీడ్కోలు
ముంబై : పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన స్నిఫర్ డాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 11 ఏళ్లపాటు విశేష సేవలందించిన జాగిలానికి నాసిక్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. 'స్నిఫర్ స్పైక్' సేవలను ప్రశంసిస్తూ గులాబీలు,బెలూన్స్‌తో డెకరేట్ చేసిన పోలీసు వాహనంపై దాన్ని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సైతం స్పైక్ సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. 'స్నిఫర్ జాగిలం(కుక్క) మాత్రమే కాదు, పోలీసు కుటుంబంలో తను కూడా భాగమయ్యాడు. దేశం పట్ల అతడు అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ స్పిఫర్ స్పైక్ గత 11 సంవత్సరాలుగా విధి నిర్వహాణలో ఎన్నో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడంలో చురుకైన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో నాసిక్ పోలీసులు స్పిఫర్ సేవలను గుర్తుచేస్తూ దానికి వీడ్కోలు పలికారు. ఇక చిన్నవయసు నుంచే స్పిఫర్ జాతికి చెందిన జాగిలాలకు అధికారులు శిక్షణ ఇప్పిస్తారు. వీటిని ఎక్కువగా తుపాకీలు, మాదక ద్రవ్యాలు, బాంబులు వంటి వాటిని గుర్తించడానికి వాడతారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటాయి. విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ -19 కణాలను గుర్తించే అంశంపై జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని పలు దేశాలు భావిస్తున్నాయి. మనిషి చెమట, మూత్రాన్ని వాసనను పసిగట్టి వారికి కరోనా కణాలు ఉన్నాయో లేదో గుర్తించేలా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే ఇందుకు అనుగుణంగా ఢిల్లీలోని ఓ క్యాంప్‌లో ప్రత్యేకంగా ఎనిమిది కుక్కలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆర్మీ డాగ్ ట్రైనర్ కల్నల్ సురేందర్ సైని అన్నారు. ముఖ్యంగా కాకర్ స్పానియల్స్, లాబ్రడార్స్ జాతులకు చెందిన కుక్కలను వీటి కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చదవండి : (వైరల్: మీకెంత ధైర్యం.. నన్నే ఫాలో అవుతారా?) (ఆ బిల్లు పెట్రోల్ బంక్‌లో ఇచ్చింది కాదు!) -
12 కిలోమీటర్లు పరిగెత్తి పట్టేసింది!
బనశంకరి(కర్ణాటక): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు ఏకధాటిగా పరిగెత్తి పోలీసు జాగిలం నేరస్తుడిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేరస్తుడిని పట్టుకోవడంలో తమకు సహకరించిన శునకాన్ని పోలీస్ బాస్‌లు సముచితరీతిలో సన్మానించారు. దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో ఉన్న తొమ్మిదేళ్ల తుంగా అనే డాబర్‌మెన్ శునకం రెండుగంటల్లో 12 కిలోమీటర్లు వెళ్లి హంతకుడి ఆచూకీ కనిపెట్టింది. చేతన్ అనే వ్యక్తి తన స్నేహితుడు చంద్రానాయక్ తదితరులతో కలిసి ధారవాడ జిల్లాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒక సర్వీస్ రివాల్వర్, బంగారు నగలు దోచుకెళ్లి అందరూ సమానంగా పంచుకున్నారు. కానీ చంద్రానాయక్ తనకు వాటా ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో చేతన్ ఆ సర్వీస్ రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలాన్ని జాగిలం తుంగాతో కలిసి పరిశీలించారు. వాసన పసిగట్టిన తుంగా పరుగులు తీస్తూ రెండు గంటల తర్వాత కాశీపుర తాండాలో వైన్‌షాప్ వద్దకు వెళ్లి అక్కడ హోటల్ వద్ద నిలబడింది. సమీపంలోని ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా మొరగసాగింది. ఆ ఇల్లు చేతన్ బంధువుది కాగా, చేతన్ అక్కడే మొబైల్లో మాట్లాడుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ, హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడని చెన్నగిరి డీఎస్పీ ప్రశాంత్ మున్నోళ్లి తెలిపారు. పోలీసు జాగిలాలు గరిష్టంగా 8 కిలోమీటర్ల వరకూ వెళ్తాయి. కానీ తుంగా అంతదూరం వెళ్లడం గొప్ప విషయమని ఎస్పీ హనుమంతరాయ కొనియాడుతూ శునకాన్ని సన్మానించారు. తుంగా ఘనత కొద్ది నెలల క్రితమే దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో చేరిన తుంగా కీలక కేసులను ఛేదించడంలో ప్రధానపాత్ర పోషించింది. 30 హత్య కేసులతో 60 కేసుల్లో పోలీసులకు సహాయపడింది. ప్రతిరోజు ఉదయం 5 గంట నుంచే తుంగా దినచర్య ప్రారంభమతుంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు నడక, జాగింగ్ చేస్తుంది. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు) -
శునకాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు!
పెన్సుల్వేనియా : కరోనా మహమ్మారి వ్యాధిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు, మెడిసిన్ల కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వైరస్ బారిన పడిన వారిని క్వారంటైన్లో ఉంచడమే ఇప్పటికిప్పుడు అందరి ముందున్న ఒకే ఒక మార్గం. అయితే కరోనా బారిన పడిన వారిని గుర్తించడం ఇప్పుడు అందరి ముందున్న అతిపెద్ద సవాలు. ముఖ్యంగా చాలా మందిలో కరోనా వైరస్ సోకినా 14 రోజుల వరకు ఎలాంటి లక్షణాలు బయటపడటం లేదు. వీరి ద్వారా మరింత మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వీటికి తోడూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో కొత్త పద్దతుల్లో కరోనా వ్యాధి సోకిన వారిని గుర్తించడానికి చేస్తున్న పరిశోధనల్లో భాగంగా బ్రిటన్, అమెరికాలు శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. పెన్సిల్వేనియా యూనివర్శిటీలో లాబ్రెడార్ రిట్రీవరస్ జాతికి చెందిన 8 కుక్కులకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ రోగుల నుంచి వచ్చే వైరస్ వాసనను అవి పసిగట్టలవా? లేదా? వాటికి అలాంటి సామర్థ్యం ఉందా? అనే దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కూడా గతంలో ఇలాంటి పరీక్షలు నిర్వహించింది. మనుషుల్లో మలేరియా లక్షణాలు ఉన్న రోగులను కుక్కలు పసిగట్టగలవని గుర్తించింది. ఒకవేళ కుక్కలు కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించగలిగితే.. విమానాశ్రయాలు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రుల్లో కుక్కలు కూడా సేవలు అందించే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్‌ను వాసన ద్వారా కుక్కలు పసిగట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో సార్స్తోపాటు డ్రగ్స్, మారణాయుధాలు, మలేరియా ఇన్ఫెక్షన్లు, కేన్సర్లను గతంలో కుక్కలు వాసన ద్వారా గుర్తించి సేవలందిస్తున్నాయని తెలిపారు. వైరస్‌లకు ప్రత్యేకమైన వాసన ఉంటుందని పెన్సిల్వేనియాలో స్కూల్ ఆఫ్ వెటర్నిటీ మెడిసిన్‌లో వర్కింగ్ డాగ్ సెంటర్లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సింథియా ఎమ్ ఓట్టో తెలిపారు. ఒకవేళ కుక్కలు వాసనతో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను పసిగట్టగలిగితే ఒక కుక్క గంటకు 250 మంది వరకు పరీక్షించగలదని శిక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ రోగుల నుంచి సేకరించిన మూత్రం, లాలాజలం ద్వారా కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత కరోనా వ్యాధి గ్రస్తుల నుంచి వచ్చే వాసన ద్వారా కుక్కలు వారిని గుర్తించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. -
13న 'ధోని' రిటైర్మెంట్ !
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే అనంతరం ధోని తన కెరీర్‌కు ముగింపు పలకబోతున్నాడు. మొహాలీలో జరగనున్న రెండో వన్డే అనంతరం రిటైర్ అవబోతున్నాడు. ధోని ఏంటీ రిటైర్మెంట్ ఏంటీ అనుకుంటున్నారా... అవునండీ ధోని రిటైర్ అవబోతున్నాడు. అయితే ఇక్కడ చెప్పేది భారత మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని గురించి కాదు. మొహాలీ పోలీసు భద్రతా జాగిలం ధోని గురించి.. పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న జాగిలం ధోని రిటైర్ కాబోతోంది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్ డాగ్ విశేష సేవలు అందిస్తోంది. ధోని కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో భద్రత విభాగంలోకి వచ్చిన ఈ జాగిలానికి ధోని పేరుపెట్టుకున్నారు. ధోని గ్రౌండ్లో విజృంభిస్తే ఈ స్నిఫర్ డాగ్ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు తెలిపాయి. మొహాలీలో డిసెంబర్ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈజాగిలం సేవలకు అధికారులు స్వస్తి పలకనున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఈ స్నిఫర్ డాగ్‌తోనే తనిఖీ చేశారు. ఇది రోజుకు ఏడు గంటలే నిద్రపోయేదని, ప్రేలుడు పదార్ధాలు, బాంబులను పసిగట్టడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. ఎవరైన దీనిని దత్తత తీసుకోవాలి అంటే నామమాత్రపు ధర రూ.800లకే ఇస్తామని అధికారులు తెలిపారు. -
తనిఖీలకు వెళ్లిన కుక్కను పాము కరిచింది
బీజాపూర్: చత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు తనిఖీలకు వెళ్లిన స్నిఫర్ డాగ్‌ను పాము కరిచింది. దీంతో దానిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శనివారం సుక్మా జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన సీఆర్పీఎఫ్ బలగాలు 2 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసినట్లు సీఆర్పీఎఫ్ బలగాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్ కోసం సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు వెళ్లిన స్నిఫర్ డాగ్ పాముకాటుకు గురైందని అధికారులు వెల్లడించారు. Chhattisgarh:2 Kg IED detected and defused by CRPF personnel in Sukma. A sniffer dog got bitten by a snake during the ops,rushed to hospital — ANI (@ANI_news) 15 April 2017