photo courtesy :ndtv.com
ముంబై: ఆరేళ్ల చిన్నోడు తాను నివసించే మురికివాడలో ఇంటి ముందే స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూనే ఎవరికీ కనిపించకుండా మిస్సయ్యాడు. ఇంట్లో వాళ్లు ఎంత సేపు వెతికినా దొరకలేదు. ఇక లాభం లేదనుకున్న బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి జాగిలాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి రంగంలోకి దించారు. ఇంకేముంది ఆ కుక్క కేవలం మూడున్నర గంటల్లోనే బాలుడి ఆచూకీని పట్టిచ్చింది. బాలుడు దొరకడంతో ఇంట్లో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన ముంబై సబ్ అర్బ్ పోవైలోని అశోక్‌నగర్ స్లమ్‌లో గత వారం జరిగింది. బాలుడు మిస్సయ్యాడన్న ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కొంత టెన్షన్ పడ్డారు. బాలుడు ఆడుకుంటున్న ప్రదేశం మురికివాడ కావడంతో అక్కడ ఎలాంటి సీసీ కెమరాలు లేవు. దీంతో తమ వద్ద ఉన్న స్నిఫర్ డాగ్ లియోకు బాలుడిని వెతికే టాస్క్‌ను పోలీసులు అప్పజెప్పారు.
రంగంలోకి దిగిన వెంటనే లియో ఇంట్లోని బాలుడి టీషర్ట్ వాసన చూసి అతడిని వెతికేందుకు బయలుదేరింది. బాలుడి ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ గ్రౌండ్‌కు వెళ్లి ఆగింది. అక్కడ బాలుడు పోలీసులకు కనిపించాడు. దీంతో కథ సుఖాంతం అయింది.
ఇదీచదవండి..బుల్లెట్ ట్రైన్‌పై కీలక విషయం వెల్లడించిన రైల్వే మంత్రి
Comments
Please login to add a commentAdd a comment