missing boy
-
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీసీ కెమెరా లేని లోటు తీర్చిన కుక్క...ఎలా అంటే..!
ముంబై: ఆరేళ్ల చిన్నోడు తాను నివసించే మురికివాడలో ఇంటి ముందే స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూనే ఎవరికీ కనిపించకుండా మిస్సయ్యాడు. ఇంట్లో వాళ్లు ఎంత సేపు వెతికినా దొరకలేదు. ఇక లాభం లేదనుకున్న బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి జాగిలాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి రంగంలోకి దించారు. ఇంకేముంది ఆ కుక్క కేవలం మూడున్నర గంటల్లోనే బాలుడి ఆచూకీని పట్టిచ్చింది. బాలుడు దొరకడంతో ఇంట్లో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ముంబై సబ్ అర్బ్ పోవైలోని అశోక్‌నగర్ స్లమ్‌లో గత వారం జరిగింది. బాలుడు మిస్సయ్యాడన్న ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కొంత టెన్షన్ పడ్డారు. బాలుడు ఆడుకుంటున్న ప్రదేశం మురికివాడ కావడంతో అక్కడ ఎలాంటి సీసీ కెమరాలు లేవు. దీంతో తమ వద్ద ఉన్న స్నిఫర్ డాగ్ లియోకు బాలుడిని వెతికే టాస్క్‌ను పోలీసులు అప్పజెప్పారు. రంగంలోకి దిగిన వెంటనే లియో ఇంట్లోని బాలుడి టీషర్ట్ వాసన చూసి అతడిని వెతికేందుకు బయలుదేరింది. బాలుడి ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ గ్రౌండ్‌కు వెళ్లి ఆగింది. అక్కడ బాలుడు పోలీసులకు కనిపించాడు. దీంతో కథ సుఖాంతం అయింది. ఇదీచదవండి..బుల్లెట్ ట్రైన్‌పై కీలక విషయం వెల్లడించిన రైల్వే మంత్రి -
గాలిపటం వెంట పరుగెత్తి... దారితప్పిన బాలుడు .. ఆ తర్వాత!
బంజారాహిల్స్: తెగిన గాలిపటం కోసం పరుగులు తీస్తూ ఓ బాలుడు తప్పిపోయిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా సీసీ కెమెరాల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సింహాద్రి, అనసూయ దంపతులకు వినోదకుమార్ అనే 9 ఏళ్ల కొడుకు ఉండగా సంక్రాంతి పండుగకు 3 రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో వుండే అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం వినోద్ తన తల్లి, అమ్మమ్మ తోకలిసి కేబీఆర్ పార్క్ వైపు వచ్చారు. అంతలోనే ఓ పతంగి తెగి గాలిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొద్దిసేపట్లో తల్లి గమనించి కొడుకు కోసం గాలించింది. అక్కడే ఉన్న పోలీసులకు చెప్పి అంతటా వెతికింది. కేబీఆర్ పార్క్ ఇంటర్‌సెప్టర్ 10 మెయిన్ గేట్ పోలీసు పీసీలు అక్షయకుమార్, మహేష్ కుమార్, హెచ్‌జీలు దినకర్, నరేష్, కృష్ణంరాజు స్పందించి పార్కు చుట్టూ గాలించారు. అనంతరం సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అదే సమయంలో బాలుడు ఓ చోట కనిపించాడు. వెంటనే బాలుడిని గుర్తించి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓవైపు నెమళ్లు ఇంకోవైపు పతంగులు చూసి ఆనందంలో మునిగిపోయి వాటిని పట్టుకోవడానికి పరుగెత్తానని వినోద్ తెలిపారు. -
కిడ్నాప్ అయిన బాలుడు ఆచూకీ లభ్యం
-
బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం.. ప్రమాదమా? హత్యా?
సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్లో కలకలం రేపిన బాలుడి మిస్సింగ్ విషాదాంతమైంది. జలాల్‌బాబానగర్‌లో శుక్రవారం ఉదయం రెండేళ్ల బాలుడు అబుబకర్ కిడ్నాప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి సమీపంలోని స్మశాన వాటిక నీటి గుంటలో శనివారం బాలుడు శవమై తేలాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు రాజేంద్ర నగర్లో పోలీసులకు సమాచారమివ్వడంతో బాలుడిది హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. తమ చిన్నారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడిని చంపేసి నీటి గుంటలో పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా?
సాక్షి, తాడేపల్లి (మంగళగిరి): తాడేపల్లి మండల పరిధిలోని మెల్లెంపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదృశ్యమైన బాలుడు తమ ఇంటికి 200 మీటర్ల దూరంలో పంట పొలాల్లో ఉన్న కందకంలో మృతి చెందినట్లు స్థానికులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం... మెల్లెంపూడి ఎస్టీ కాలనీలో నివాసం ఉండే కుర్ర భగవానియా నాయక్, అమల దంపతుల రెండో కుమారుడు భార్గవ తేజ (6). ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండే నాగేశ్వరరావు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా కందకంలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కందకంలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. బహుశా కుక్కలు కానీ, కోతులు కానీ వెంటపడటంతో కందకంలో పడి ఉంటాడని, అక్కడ బాలుడిని అవి గాయపరిచి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు ఈ ఘటనపై కుటుంబసభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే బాలుడిని దారుణంగా కొట్టి చంపి ఉంటారని పేర్కొంటున్నారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో కుక్కలు గాని, కోతులు గాని దాడి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అవే దాడిచేసి ఉంటే కుడి కాలు విరిగి, ఎముక బయటకు వచ్చేంత పరిస్థితి ఉంటుందా? చెయ్యి ఎందుకు విరుగుతుంది? కందకంలో పడినంత మాత్రాన అంత పెద్ద దెబ్బలు తగులుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి రూరల్ సీఐ అంకమ్మరావు, ఎస్సై వినోద్‌కుమార్ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. గుంటూరు నుంచి డాగ్ స్క్వాడ్‌ను, వేలిముద్రల నిపుణులను పిలిపించి దర్యాప్తు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? మండల పరిధిలోని వడ్డేశ్వరంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న అదృశ్యమైన బండి అఖిల్ (8), మెల్లెంపూడిలో మృతిచెందిన భార్గవతేజ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. వడ్డేశ్వరం బాలుడి తల్లి, మెల్లెంపూడి బాలుడి తండ్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కలిసి పనిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలూ ఒకే విధంగా ఉండటంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు.. మనస్తాపంతో! పీహెచ్డీ చేసి.. కళ్లు కాంపౌండ్‌లో ‘మత్తు’ -
విషాదం: అదృశ్యమైన బాలుడు మృతి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.. సాయి సద్గురు కాలనిలో పండుగ పూట పతంగులు ఆడుకుంటూ ఇంటినుంచి వెళ్లిన నిశాంత్ అనే ఆరేళ్ల ఏళ్ల బాలుడు నిన్న అదృశ్యం అయ్యి ఇవాళ ఇంటి సమీపంలొని మురికి కాలువలో శవం అయి కనిపించాడు. బాలుడు మృతితో సాయి సద్గురు కాలనిలో విషాదఛాయలు అలముకున్నాయి. దేవుని పల్లి గ్రామంలోని సాయి సద్గురు కాలనిలో మధుకృష్ణ, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల బాలుడు నిశాంత్, మూడేళ్ల మరో బాబు ప్రజ్వల్ ఉన్నారు. మధుకృష్ణ, సుజాత లు టీచర్లు గా పని చేస్తున్నారు. చదవండి: మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు సంక్రాంతి పండుగ కావడం తో నిశాంత్ గాలిపటాలు ఎగురవేసేందుకు మధ్యాహ్నం సమయం లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రి అయిన నిశాంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనంతరం కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. ఇంటి పక్కన గల మురికి కాలువలో నిశాంత్ మృత దేహం కనిపించడంతో షాక్ కు గురయ్యారు.. మురికి కాలువలో పడి నిశాంత్ మృతి చెందడం తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చదవండి:హైదరాబాద్ లో సంచలనం రేపిన కిరాతక హత్య -
ఉప్పొంగిన పేగుబంధం
సాక్షి, పటాన్చెరు టౌన్: ఏడాది కిందట తప్పిపోయిన ఓ బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కిషన్‌దాస్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ మాదాపూర్‌కు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో వినాయక చవితి రోజున బాలుడు రాజ్‌కుమార్ దాస్ తప్పిపోయాడు. ఏడుస్తూ కూర్చొన్న ఆ బాలుడిని గమనించిన పాతబట్టలు అమ్ముతున్న హరణ్.. తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. పటాన్చెరు పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలో ఉండే హరణ్ మామ యాకోబ్‌కు పిల్లలు లేని కారణంగా వారికి అప్పజెప్పాడు. ఆ బాలుడికి కిరణ్ అని పేరు పెట్టి పోషిస్తున్నారు. అయితే.. స్థానికుల ఫిర్యాదు మేరకు.. జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరణ్, యాకోబ్, సరోజపై పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించారు. దర్యాఫ్తులో భాగంగా బాలుడి తల్లిదండ్రులది పశ్చిమ బెంగాల్ అని గుర్తించిన పోలీసులు.. తండ్రి కిషన్‌దాస్, తల్లి పూజకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సదరు బాలుడు వారి కొడుకే అని నిర్ధారించారు. సోమవారం సంగారెడ్డిలోని బాలరక్ష భవన్ వద్ద తల్లికి అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు, బాలల సంక్షేమ సమితి అధ్యక్షురాలు శివకుమారికి, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మైనర్ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్‌లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు. -
తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన
-
అపురూప దృశ్యం..
సాక్షి, హైదరాబాద్: ఇదొక భావోద్వేగపూరిత సన్నివేశం. ఎనిమిది నెలల పాటు కనిపించకుండా పోయిన కన్నకొడుకు కళ్లెదుట ప్రత్యక్షమైనప్పుడు ఆ మాతృమూర్తి చూపించిన అవాజ్య ప్రేమకు నిలువుటద్దం. ఏమైపోయాడో తెలియని బిడ్డ ఊహించని విధంగా తిరిగిరావడంతో పట్టరాని ఆనందంతో ఆ అమ్మ తన గారాల కొడుకుని ముద్దులతో ముంచెత్తింది. ‘ఇన్నాళ్లు ఎక్కడున్నావురా కన్నా’ అంటూ గుండెలకు హత్తుకుని రోదించింది. తన ‘ప్రాణాన్ని’ తిరిగి తెచ్చిన పోలీసులకు వందనాలు అంటూ మొక్కింది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఈ ఘటనకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ వేదికగా నిలిచింది. దర్పణ్.. ఇది తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్. తప్పిపోయిన పిల్లలను వెతికి ఈ యాప్ సహాయంతో వారి గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎంతో మంది పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తాజాగా ఓ పిల్లాడిని దర్పణ్ యాప్ సహాయంతో ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ద్వారా గుర్తించిన కుషాయిగూడ పోలీసులకు బాలుడి తల్లిదండ్రులకు కబురు పంపారు. ఎంతో ఆతృతగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. పిల్లాడి తల్లి కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఐజీ(మహిళల భద్రత) స్వాతి లక్రా ట్విటర్లో షేర్ చేశారు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులను అభినందిస్తూ నెటిజనులు ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: మరో అమ్మ కథ) -
నాన్న ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల కోసం ఒత్తిడిని భరించలేక పారిపోయి హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో తలదాచుకున్న ప్రతిభావంతుడైన విద్యార్థిని విజయవాడ పోలీసులు కాపాడి సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన కళాశాల నుంచి అదృశ్యమైన విద్యార్థి తన ఆవేదనను ‘సాక్షి’కి వివరించాడు. ‘నాపేరు మాతూరి జగదీష్ సాయి. మాది ప్రకాశం జిల్లా మార్టూరు మండలం. నాన్న నాయీబ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. నాకు పదో తరగతిలో 9.3 గ్రేడ్ వచ్చింది. నన్ను బాగా చదివించాలనే తపనతో విజయవాడ నిడమానూరులోని చైతన్య కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేర్పించారు. కానీ ఇక్కడి పరిస్థితులు, అధ్యాపకుల తీరు, ఫీజుల కోసం పదేపదే గుర్తు చేసే యాజమాన్యం తీరుతో నవంబర్ 27 తెల్లవారుజామున కళాశాల నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకుని ఓ రిసార్టులో క్యాటరింగ్ పనిలో చేరా. కొద్ది రోజుల తరువాత తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కానీ వారికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. నాకు బావ వరుస అయ్యే సాయితేజ్‌ని డిసెంబరు 14న నా స్నేహితుడి ఫేస్బుక్ ఖాతా ద్వారా పలకరించా. అందులో మా నాన్న రాసిన ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు. నేను క్షేమంగానే ఉన్నా, నాకోసం వెతకొద్దని మెసేజ్ పెట్టా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆదివారం పోలీసులతో కలసి నా వద్దకు వచ్చిన నాన్నను చూడగానే ఏడుపు ఆగలేదు. క్షమించమని కోరా. ఆయన అక్కున చేర్చుకుని ఓదార్చడం చూశాక ఇక ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని జగదీష్ తెలిపాడు. విద్యార్థి అదృశ్యంపై నవంబరు 28న ఫిర్యాదు అందుకున్న విజయవాడ పటమట పోలీసులు పలు మార్గాలో కేసు దర్యాప్తు జరిపారు. ఫేస్బుక్ ఖాతాను విశ్లేషించి విద్యార్థి జాడను గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు సమక్షంలో విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాగా చదువుకోవాలనుకున్నా. కానీ కళాశాల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫీజు కట్టాలని పదేపదే ఒత్తిడి చేయడంతో మనస్తాపంతో కాలేజీ నుంచి పారిపోయా – జగదీష్ సాయి -
కనిపించకుండా పోయిన బాలుడు శవమై తేలాడు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని వీరవాసరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన కొణితివాడకు చెందిన ఏడేళ్ల బాలుడు శవమై కనిపించాడు. వివరాలు.. నిన్న సాయంత్రం నుంచి మోక్ష గౌతమ్(7) కనిపించకుండాపోయాడు. ఊరులోని చెరువులో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున బాలుని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పాపం పసివాడు..రెండు చేతులు విరిగిపోయి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడు డబీర్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలోని ముళ్ల పొదల్లో తీవ్ర గాయాలతో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చేతులు విరిగిపోయి దీనస్థితిలో ఉన్న అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంచారు. అతడిని సోమవారం యకుత్పురాలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడిగా గుర్తించారు. కాగా బాలుడు తప్పిపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించేకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహ వేడుకల్లో బాలుడి అదృశ్యం
సాక్షి, రాయపర్తి(పాలకుర్తి): వివాహ వేడుకల్లో ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కృష్టాపురం క్రాస్‌లోని వీఆర్గార్డెన్లో ఆదివారం జరిగింది. స్థానిక ఎస్సై లక్ష్మణ్‌రావు కథనం ప్రకారం... వరంగల్ పట్టణ శివారులోని రంగశాయిపేటకు చెందిన కాటుకొజ్యల వెంకటరమణాచారి తన కుటుంబ సభ్యులతో రాయపర్తి మండలానికి చెందిన బంధువుల వివాహానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అతడి కుమారుడు కాటుకొజ్యల రిషికేష్(2) తప్పిపోయాడు. బాలుడి తండ్రి వెంకటరమణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు
విజయనగరం ఫోర్ట్ : ఇంటి నుంచి పారిపోయిన బాలుడిని చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే... తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన విశాఖపట్నం ఆరిలోవకు చెందిన అహముల్లా జైబుల్ రైలు ద్వారా మంగళవారం విజయనగరం వచ్చేశాడు. రాత్రి 8:30 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది బాలుడ్ని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. బుధవారం బాలుడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉన్న చైల్డ్‌లైన్ కార్యాలయానికి రావడంతో బాలుడిని చైల్డ్‌లైన్ సభ్యులు బాలల సంక్షేమ కమిటి ముందు ప్రవేశ పెట్టారు. కమిటీ చైర్మన్ ఆదేశానుసారం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వావిలాల లక్ష్మణ్, సభ్యులు పట్నాయక్, చైల్డ్‌లైన్ 1098 సంస్థ కో ఆర్డినేటర్ ఎస్. రంజిత, సతీష్, కృష్ణారావు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
24 ఏళ్ల తర్వాత కొడుకును కలిశాడు!
బీజింగ్ : చైనాలో ఓ వ్యక్తి తప్పిపోయిన తన కుమారుడి కోసం ఏకంగా 24 ఏళ్లు అన్వేషించిన అనంతరం అతడ్ని కలుసుకున్నాడు. 1994, ఆగస్ట్ 8న మూడేళ్ల కుమారుడ్ని కోల్పోయిన తండ్రి చైనా అంతటా 1,80,000 అదృశ్య ప్రకటనలు ఇచ్చిన అనంతరం ఇటీవల కొడుకును కలుసుకోగలిగాడు. రెండు దశాబ్ధాల పాటు కుమారుడి ఆచూకీ లభ్యం కాకున్నా నిరాశకు లోనవని లీ షుంజీ తన ప్రయత్నాలు కొనసాగించారు. 24 సంవత్సరాల అనంతరం ప్రస్తుతం 27 ఏళ్లున్న లి లీ పోలీసులు చేపట్టిన డీఎన్ఏ పరీక్షల అనంతరం శుక్రవారం తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులను కలుసుకున్నాడు. స్ధానిక పోలీసులు నిర్వహిస్తున్న తప్పిపోయిన పిల్లల డీఎన్ఏ డేటాబేస్‌తో అతడిని గుర్తించినట్టు మెయిల్ ఆన్లైన్ పేర్కొంది. తల్లితండ్రుల నుంచి విడిపోయిన తర్వాత బాలుడిని చేరదీసిన ఓ జంట అతడిని వారికి అప్పగించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో వారే పెంచిపెద్దచేశారు. ఇక తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో లి షుంజీ తన వ్యాపారం మానివేసి మరీ చిన్నారి కోసం వెతుకులాట చేపట్టారు. చైనా అంతటా తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ పెద్ద ఎత్తున ప్రకటనలతో గాలించారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించి దాదాపు రెండున్నర దశాబ్ధాల అనంతరం కుమారుడ్ని కలుసుకోగలిగారు. -
బాలుడి ఆచూకీ లభ్యం
ద్వారకాతిరుమల : ఇంటి నుంచి తప్పిపోయి ద్వారకాతిరుమలకు చేరిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులకు ఆ బాలుడిని పోలీసులు సోమవారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడు తప్పిపోయి ఆర్టీసీ బస్సెక్కి ఆదివారం ద్వారకాతిరుమలకు చేరుకుని, అక్కడి నుంచి పోలీసుల సంరక్షణలోకి వెళ్లిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా ఆ బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బాలుడి పేరు ఏసు అని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడని అతడి పిన్ని బత్తుల బుజ్జి పోలీసులకు తెలిపింది. తన సంరక్షణలోనే పెరుగుతున్నాడని చెప్పింది. తమది కర్ణాటక రాష్ట్రంలోని గంగసముద్రమని, బతుకుదెరువు కోసం ఏలూరుకు వచ్చి స్థిరపడినట్టు వివరించింది. దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిన ఏసు ఆడుకుంటూ బస్సెక్కి ద్వారకాతిరుమలకు వెళ్లిపోయాడని, ఆ విషయం తెలియక తాము కంగారుగా చుట్టుపక్కల వెతికినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ రైటర్ రామకృష్ణ బాలుడు ఏసుని అతడి పిన్ని బుజ్జికి అప్పగించారు. -
తప్పిపోయిన చిన్నారి చైల్డ్ ప్రొటెక్షన్‌కు అప్పగింత
ఏలూరు టౌన్ : ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని ఒక వ్యక్తి చేరదీసి బంధువుల కోసం ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవటంతో ఆ బాలుడిని ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. బంధువుల సమాచారం తెలియకపోవటంతో బాలుడిని శిశు గృహకు తరలించారు. ఏలూరు పాత బస్టాండ్‌లో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాలుగేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. ఏలూరు మరడాని రంగారావు కాలనీకి చెందిన కాటూరి వెంకన్న ఆ బాలుడిని గమనించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బుధవారం ఉదయం మళ్లీ పాతబస్టాండ్‌కు తీసుకు వచ్చి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశించాడు. రాత్రి వరకూ చూసినా ఎవరూ రాకపోవటంతో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి సీఐ జి.మధుబాబుకు అప్పగించారు. వెంటనే ఆయన ఐసీడీఎస్ పీడీకి సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేష్ పోలీస్‌స్టేషన్‌కు రాగా, ఆ బాలుడిని సీఐ మధుబాబు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. బాలుడి చిరునామా తెలిసిన వారు ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ మధుబాబు కోరారు. -
తప్పిపోయి.. తల్లి చెంతకు చేరి
పాలకొండ: పాలకొండలో నాలుగేళ్ల బాలుడు తల్లి దండ్రుల నుంచి తప్పిపోయి వాట్సాప్ సాయంతో చివరకు తల్లి చెంతకు చేరాడు. బధిరుడైన ఈ బా లుడిని తల్లి చెంతకు చేర్చడానికి దాదాపు పాలకొం డ పట్టణమంతా సోమవారం వెతుకులాట సాగిం చడం విశేషం. మండలంలోని గోపాపురం గ్రామానికి చెందిన వారాడ వెంకటరమణ, సుమలతలు తమ నాలుగేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌తో సోమవా రం ఉదయం 10 గంటలకు ఆంధ్రాబ్యాంకుకు వ చ్చారు. పనుల్లో మునిగిపోయి గంట తర్వాత చూస్తే బాలుడు కనిపించలేదు. బ్యాంకు సీసీ కెమెరాల్లోనూ బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనతో అందరికీ విషయం చెప్పారు. అక్కడున్న పాత్రికేయులతో సహా బ్యాంకుకు వచ్చిన వా రు తమ వాట్సాప్ గ్రూపుల్లో ఈ సమాచారాన్ని పం చుకున్నారు. స్థానిక యువకులు కూడా బైకులు తీసుకుని బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. వెతుకులాట జరుగుతుండగా స్థానిక ఆంధ్రా బ్యాం కు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయంలో అయ్యప్ప మాలధారులు చెరువు వద్ద బాలుడిని గమనించారు. బాలుడు మాట్లాడలేకపోవడంతో అతడికి భిక్షను భోజనంగా పెట్టి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిం చారు. కొంత మంది స్వాముల సెల్ఫోన్లో బాలు డు తప్పిపోయినట్లు సమాచారం రావడంతో తల్లి దండ్రులను సంప్రదించి తమ వద్దే ఉన్న విషయం తెలిపారు. వెంటనే వారు ఆలయానికి వెళ్లడంతో పి. మునిస్వామి, ఎల్.శంకరస్వాములు బాలుడిని అప్పగించారు. కొడుకును చూసి తల్లి సుమలత ఏడుపు ఆపుకోలేకపోయారు. బాలుడిని అప్పగించినందుకు స్వాములకు, వెతికినందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. -
తల్లి ఒడి చేరిన చెన్నకేశవుడు
టెక్నాలజీ, పోలీసుల కృషితో దొరికిన కిడ్నాపర్లు వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే బాలుడి కిడ్నాప్ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు తిరుపతి క్రైం: ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం ముందు గొల్లమండపం వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారి చెన్నకేశవులును డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఆయన అర్బన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడు నామక్కల్ జిల్లా రాసిపురం తాలూకా సింగనందాపురం గ్రామం మెల్కొత్తూరుకు చెందిన ఎం. అశోక్ (24)కు, అదే జిల్లాలోని శాంతిమంగళం తాలూకా మల్లెవేపగుంటకు చెందిన పెరీస్వామి భార్య తంగే (24)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2015లో తంగే భర్తతో గొడవపడి అశోక్‌తో పాటు బెంగళూరుకు వెళ్లిపోయింది. గత నెల 10వ తేదీ రాత్రి ఇద్దరు రైలు ఎక్కి తిరుపతికి వచ్చారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. 14వ తేదీన ఉదయం 5.45 నిమిషాలకు గొల్లమండపం వద్ద చెన్నకేశవులును కిడా్నప్ చేసి బస్సులో తిరుపతికి వచ్చి ప్రైవేటు ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు. వారం రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అశోక్ తన తండ్రికి ఫోన్ చేసి తమకు మగబిడ్డ పుట్టాడని తెలిపాడు. వారి పిలుపు మేరకు సొంత ఊరుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చిన్నారి కిడ్నాప్‌పై పోలీసులు విస్తృతంగా ప్రకటనలు చేయడంతో ఆ విషయం గ్రామస్తులకు తెలిసింది. వారు భయపడి శుక్రవారం నామక్కల్ జిల్లా మేల్‌కుర్చి పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. అక్కడి పోలీసులు అర్బన్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఎస్వీ యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని బాబును, నిందితుల్ని తిరుపతికి తీసుకువచ్చారు. వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే.. ఇద్దరు నిందితులు తమ వివాహేతర సంబంంధాన్ని నిలుపుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు లేకుండా కలుగకుండా ఉండేందుకు పన్నాగం పన్నారు. తమకు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటారని, గ్రామస్తులు కూడా ఏమీ చేయరని భావించారు. పిల్లల కోసం అనాథాశ్రమాల్లో ప్రయత్నించారు. అక్కడ కుదరకపోవడంతో తిరుమలకు చేరుకుని బాలుడిని కిడ్నాప్ చేశారు. చిన్నారికి తల్లిపాలు ఇవ్వకపోవడం, తంగే ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, వాట్సాప్, పేస్‌బుక్‌లో వీరి చిత్రాలు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానించి హెచ్చరించారు. దీంతో వారు చేసేది లేక పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ కేసును ఛేదించడంలో ఏఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీలు మునిరామయ్య, కొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, తులసీరామ్, వెంకటరవి, శరత్చంద్ర, భాస్కర్, సత్యనారాయణ, రామకృష్ణ, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఐజీ తెలిపారు. అదేవిధంగా సీసీ టీవీల కమాండెంట్ కంట్రోల్ రూమ్‌లు నిరంతరం కష్టపడడం వల్లే కిడ్నాప్ కేసును ఛేదించామన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికీ డీజీపీ సాంబశివరావు ప్రత్యేక అభినందనలు తెలిపినట్టు డీఐజీ పేర్కొన్నారు. -
హిజ్రాల వలలో 13 ఏళ్ల బాలుడు
- ఐదు రోజుల తర్వాత తల్లి చెంతకు వెంకోజీపాలెం (విశాఖ తూర్పు) : ఇంటిని వదిలి హిజ్రాల వలలో చిక్కుకున్న తగరపువలసకు చెందిన పదమూడేళ్ల బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు. వివరాల్లోకి వెళ్తే..భీమిలి మండలం చిట్టివలస గ్రామం పెరుకువీధికి చెందిన జీరు రెడ్డి (13) తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో మధ్యలోనే చదువు ఆపేశాడు. అనంతరం తన బాబాయ్ నూడుల్స్ దుకాణంలో చేరి తల్లికి చేదోడుగా ఉండేవాడు. శనివారం ఎప్పటిలాగే పనికి వెళ్లినా రాత్రి ఇంటికి చేరకపోవడంతో బాలుడి తల్లి భీమిలి పోలీసులను ఆశ్రయించింది. బాలుడి కోసం తల్లితో పాటు బంధువులు కూడా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ద్వారకానగర్ బస్‌స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద హిజ్రాలతో ఉన్న జీరు రెడ్డి తల్లికి కనిపించాడు. వెంటనే తల్లి వారి వద్దకు చేరుకుని ఎందుకు తన కొడుకుని ఇలా చేశారని ప్రశ్నించడంతో.. ‘‘మేం మీ అబ్బాయిని ఏమీ చేయలేదు. రోడ్డు మీద కనిపించి ఆకలిగా ఉందనడంతో మాతో తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాం.’’ అని హిజ్రాలు బదులిచ్చారు. అనంతరం బాలుడిని తల్లికి అప్పగించారు. -
నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
కుమారుడిని చూసి ఆనందబాష్పాలు రాల్చిన తల్లిదండ్రులు గుత్తి : చదువు మీద ఇష్టం లేక హాస్టల్ నుంచి పారిపోయిన ఓ బాలుడు పోలీసుల చొరవతో నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన సంఘటన గుత్తిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ, సువర్ణ దంపతుల కుమారుడు రమేష్ గుత్తిలోని నంబర్–3 హాస్టల్లో 4వ తరగతి చదువుతూ ఉండేవాడు. ఈ క్రమంలో చదువు మీద ఇష్టం లేక 2013, మే 5న హాస్టల్ నుంచి పారిపోయి గుంటూరు చేరాడు. గుంటూరులో తన పెద్దమ్మ గాయత్రి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అడ్రస్ తెలియకపోవడంతో గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాడు. అక్కడ ఏంచేయాలో తెలియక రోడ్డుపై తిరుగుతుండేవాడు. ఒక రోజు ఎస్కేసీవీ చిల్డ్రెన్ ట్రస్ట్ సభ్యులు ఆ బాలున్ని గమనించారు. దగ్గరకు తీసుకుని ఆరా తీశారు. తనకు ఎవరూ లేరని, అనాథనని చెప్పాడు. దీంతో ట్రస్ట్ సభ్యులు బాలుడిని గాంధీ నగర్లో ఉన్న అనాథ ఆశ్రమంలో చేర్పించి చదివించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు. అయితే ఏ కారణం చేతనో బాలుడికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. వెంటనే అనాథ ఆశ్రమం వారిని కలిసి తాను అనాథను కాదని, తల్లిదండ్రులు గుంతకల్లులో ఉన్నారని చెప్పాడు. దీంతో అనాథ ఆశ్రమం, ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని గుంతకల్లు పోలీసులకు ఫోన్లో సమాచారమిచ్చారు. అయితే వారు స్పందించలేదు. దీంతో గుత్తి ఎస్ఐ చాంద్ బాషాకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఆ బాలున్ని గుత్తికి రప్పించారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆ బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారున్ని నాలుగేళ్ల తర్వాత చూడటంతో తల్లిదండ్రులు సంతోషంతో తబ్బిబ్బైయ్యారు. చొరవ చూపి తమ కుమారున్ని అప్పగించిన ఎస్ఐ చాంద్‌బాషాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊబిలో పడ్డాడా?ఇంకేమైనా జరిగిందా?
-
VTPS కూలింగ్ కెనాల్లో బాలుని డెడ్‌బాడీ