
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడు డబీర్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలోని ముళ్ల పొదల్లో తీవ్ర గాయాలతో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చేతులు విరిగిపోయి దీనస్థితిలో ఉన్న అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంచారు. అతడిని సోమవారం యకుత్‌పురాలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడిగా గుర్తించారు. కాగా బాలుడు తప్పిపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించేకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment