Dabirpura
-
ఫర్హత్ నగర్లో టెన్షన్..టెన్షన్
చార్మినార్/డబీర్‌పురా: డబీర్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని ఫర్హత్‌నగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పౌర సరఫరాల విభాగం సర్కిల్–2 ఎసీఎస్‌ఓ పరిధిలో ట్రాన్స్‌పోర్టు వ్యాపారిగా కొనసాగుతున్న వృద్ధుడు (58) ఒకరు కరోనా వైరస్ పాజిటివ్‌తో శనివారం రాత్రి మృతి చెందాడు. అతని అంత్య క్రియలు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఆదివారం ముగిశాయి. అంత్యక్రియలు ఇక్కడ చేయరాదంటూ ఈ శ్మశాన వాటికకు దగ్గర్లోని రాజనర్సింహ్మ నగర్ బస్తీ ప్రజలు వ్యతిరేకించారు. శవాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు. అన్ని రకాల శానిటైజేషన్ చర్యలు తీసుకుని ఖననం చేస్తామని డబీర్‌పురా పోలీసులు స్థానికులకు నచ్చచెప్పడంతో బస్తీవాసులు శాంతించారు. కేవలం ఐదుగురు కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. వృద్ధుని మృతితో అధికారులు ఫర్హత్‌నగర్‌ను కంటైన్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించారు. రాత్రికి రాత్రే పర్హత్‌నగర్ బస్తీ ప్రధాన రోడ్డును మూసి వేశారు. పోలీసులు, నోడల్ అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతోంది. 20 మంది తరలింపు.. మృతి చెందిన వ్యక్తి రెండతస్తుల భవనంలో ఉండేవాడు. అతనికి ఐదుగురు కుమారులు. ఇద్దరు దుబాయ్‌లో ఉంటారు. మిగిలిన ముగ్గురు కుమారులు, కోడల్లు, మనువలు, మనుమరాళ్లు ఈ భవనంలోనే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఇదే భవంతిలో కిరాయిదారులు కూడానివసిస్తున్నారు. వృద్ధునికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న వారితో పాటు ఇదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మొత్తం 20 మందిని యునానీ ఆసుపత్రికి క్వారంటైన్‌కు తరలించారు. కాంపౌండర్ సేవలతో బెంబేలు డబీర్‌పురాలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ క్లినిక్‌లో పని చేసే కాంపౌండర్ ఒకరు రోగుల కోరిక మేరకు ఇంటింటికి వెళ్లి ఇంజెక్షన్స్, మందులు ఇస్తుంటాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తికి గతంలో ఈయన వైద్య సేవలు అందించారు. ఇంజెక్షన్లు ఇవ్వడం,సెలైన్ పెట్టడం తదితర వైద్య సేవలను నిర్వహించారు. చుట్టుపక్కల ఇళ్లల్లో సైతం అతను రోగులకు వైద్య సేవలందించారు. ఫర్హత్‌నగర్‌లోని కరోనా పాజిటివ్ వ్యక్తి మృతి చెందడంతో అందరి దృష్టి ఈ యువకుడిపై పడింది. విషయం తెలిసిన వైద్య సిబ్బంది ఆ యువకుడిని క్వారంటైన్ కోసం తరలించారు. అతని రక్త నమూనాలు సేకరించి రిపోర్టుల కోసం వేచి ఉన్నారు. లాక్డౌన్ కారణంగా స్థానికంగా ఉన్న చిన్నచిన్న క్లినిక్‌లు మూత పడడడంతో చుట్టు పక్కన బస్తీల్లోని రోగులు ఈ కాంపౌండర్ అందజేసే వైద్య సేవలపై ఆధారపడ్డారు. ఫర్హత్‌నగర్‌లోని చనిపోయిన వ్యక్తికి వైద్యం అందజేసిన కాంపౌండర్‌తోనే ఆ తర్వాత చాలా మంది వైద్యసేవలు పొందారు. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. -
పాపం పసివాడు..రెండు చేతులు విరిగిపోయి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడు డబీర్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలోని ముళ్ల పొదల్లో తీవ్ర గాయాలతో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చేతులు విరిగిపోయి దీనస్థితిలో ఉన్న అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంచారు. అతడిని సోమవారం యకుత్పురాలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడిగా గుర్తించారు. కాగా బాలుడు తప్పిపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించేకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను దారుణంగా హత్యచేసి రైల్వేట్రాక్‌పై పడేసిన భర్త
-
స్నూకర్ సెంటర్లో దారుణ ఘటన
-
వాళ్లు లాక్కెళ్లింది రోల్డ్‌గోల్డ్ చైన్!
చాంద్రాయణగుట్ట : చైన్ స్నాచింగ్ జరిగిన 24 గంటల్లోనే సీసీ టీవీ కెమెరాల సాయంతో దక్షిణ మండలం పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపారు. అయితే నిందితులు లాక్కెళ్లింది రోల్డ్ గోల్డ్ చైన్ అని తేలింది. శనివారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోదేఅలీషా కిడికీ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన ఒంటరిగా నడిచి వెళుతున్న కొప్పెర్ల రాణి (26) మెడలోని మంగళ సూత్రాన్ని బైక్‌పై వచ్చిన యువకులు తెంచుకుపోయారు. దీనిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా స్థానికంగా ఉన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నిందితులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజి లభించింది. దీని ఆధారంగా నిందితులను పహాడీ షరీఫ్ షాయిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తల్హా అలియాస్ అహ్మద్ (23), తలాబ్‌కట్టా అమన్‌నగర్ బి ప్రాంతానికి చెందిన ఉమర్ బిన్ ఆబేద్ అలియాస్ ఉమర్ ఖాన్(21)గా గుర్తించారు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన వీరు తాగుడుకి డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ చేశారు. అయితే అది బంగారు గొలుసు కాదని తెలుసుకున్న నిందితులు కంగుతిన్నారు. నిందితుల నుంచి లాక్కెళ్లిన గొలుసుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
డబీర్‌పురాలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ : పాతబస్తీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోమటివాడిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు రాణి(35) స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తొంది. స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు కరిజ్మా వాహనంపై వచ్చి స్నాచింగ్ చేసిటనట్లు బాధితురాలు తెలిపింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై కిరోసిన్ పోసి నిప్పు
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై కిరోసిన్ పోసి నిప్పు
హైదరాబాద్: డబీర్‌పురాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆదివారం ఉదయం డబిర్ పురాలో ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. డబీర్‌పురా ఏసీపీ కార్యాలయానికి సమీపంలో ఘటన జరిగింది. కాగా బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయీమాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతటి వారినైనా వదలం మహిళపై దాడి జరిపిన దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. దాడికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలబోమని డీసీపీ సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.