
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై కిరోసిన్ పోసి నిప్పు
హైదరాబాద్: డబీర్పురాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆదివారం ఉదయం డబిర్ పురాలో ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. డబీర్పురా ఏసీపీ కార్యాలయానికి సమీపంలో ఘటన జరిగింది. కాగా బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయీమాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎంతటి వారినైనా వదలం
మహిళపై దాడి జరిపిన దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. దాడికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలబోమని డీసీపీ సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.