తిరువనంతపురం: ఇజ్రాయెల్-హమాస్ దళాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరువైపుల నుంచి దాదాపు 1000 మందికి పైగా మరణించారు. ఇందులో ఇజ్రాయెల్‌లో ఉన్న విదేశీయులు కూడా ఉన్నారు. కేరళకు చెందిన ఓ భారతీయురాలు కూడా హమాస్ దాడుల్లో తీవ్రంగా గాయపడింది.
కేరళకు చెందిన షీజా ఆనంద్(41) ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఆమె క్షేమంగానే ఉన్నట్లు ఇక్కడి కుటుంబ సభ్యులతో చెప్పారు. హమాస్ దాడుల క్రమంలో షీజా భర్త ఫోన్ చేయగా.. అకస్మాత్తుగా కాల్ కట్ అయిపోయింది. ఆ సమయంలో భారీ శబ్దం వినిపించింది.
మరుసటి రోజు ఓ భారతీయుడు షీజా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె గాయపడినట్లు చెప్పాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించాడు. షీజా యోగక్షేమాలను కనుగొనడం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment