కుంభమేళాపై లాలూ సంచలన వ్యాఖ్యలు | Rjd Chief Lalu Prasad Yadav Sensational Comments On Maha Kumbh | Sakshi
Sakshi News home page

మహాకుంభమేళాపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Sun, Feb 16 2025 4:44 PM | Last Updated on Sun, Feb 16 2025 5:01 PM

Rjd Chief Lalu Prasad Yadav Sensational Comments On Maha Kumbh

న్యూఢిల్లీ:మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహాకుంభమేళాకు అసలేమైనా అర్థం..పర్థం ఉందా..?అది ఓ అర్థం లేని వ్యవహారం’ అని లాలూ అన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని వ్యాఖ్యానించే సందర్భంలో లాలూ మహా కుంభమేళాపై ఈ వ్యాఖ్యలు చేశారు.

రైల్వేశాఖ విఫలమవడం వల్లే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగిందన్నారు. రైల్వే మంత్రి దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందేనన్నారు.అయితే మహాకుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 

ఈ వ్యాఖ్యలు హిందువులపై ఆర్జేడీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని బీహార్‌ బీజేపీ చీఫ్‌ మనోజ్‌శర్మ అన్నారు. బిహార్‌ ఎన్నికలు వస్తున్న వేళ ఓ వర్గం వారిని బుజ్జగించేందుకే లాలూ  మహాకుంభమేళాను టార్గెట్‌ చేశారని శర్మ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement