ఇజ్రాయెల్‌పై లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణీ దాడిలో కేరళకు చెందని ఓ భారతీయుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఉన్న పండ్లతోటలో ఈ దాడి చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కూడా భారతదేశంలోని కేరళకు చెందినవారుగా తెలుస్తోంది.
సోమవారం 11 గంటల సమయంలో ఈ క్షిపణిదాడి జరిగిందని.. మాగెన్ డేవిడ్ ఆడమ్ రెస్క్యూ సర్వీసెస్ ప్రతినిధి జాకీ హెల్లర్ తెలిపారు. ఈ దాడిలో కేరళలోని ఇడుక్కికి చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్ మృతిచెందాడు. మరో ఇద్దరు జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లు తీవ్రంగా గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోసెఫ్, పాల్ మెల్విన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక.. లెబనాన్‌లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ అక్టోబర్ 8 నుంచి ఇజ్రాయెల్‌పై తరచూ దాడులకు తెగపడుతన్న విషయం తెలిసిందే. గాజాలోని పాలస్తీనా ప్రజలు, హమాస్ నేతలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది.
దాడిపై స్పందించిన ఇజ్రాయెల్...
భారతీయులుపై జరిగిన హెజ్బుల్లా దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘ ఈ దాడి మాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తీవ్రవాదం కారణంగా గాయపడిన లేదా మరణించిన ఇజ్రాయెల్ లేదా విదేశీ పౌరులందరినీ తాము ఇజ్రాయెల్ పౌరులుగానే పరిగణిస్తాం. గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము’ అని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
We are deeply shocked and saddened by the death of one Indian national and the injury of two others due to a cowardly terror attack launched by Shia Terror organization Hezbollah, on peaceful agriculture workers who were cultivating an orchard at the northern village of Margaliot…
— Israel in India (@IsraelinIndia) March 5, 2024
Comments
Please login to add a commentAdd a comment