ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఒక పాఠశాలలోగల హమాస్ స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 39 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని సమాచారం.
హమాస్‌కు చెందిన అల్-అక్సా టెలివిజన్ ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడిలో 39 మంది మృతి చెందారని తెలిపింది. అయితే పాలస్తీనియన్ న్యూస్ ఏజెన్సీ ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది మృతి చెందారని పేర్కొంది.
పాలస్తీనియన్లకు సహాయం అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నిర్వహిస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘హమాస్’, ‘ఇస్లామిక్ జిహాద్’ సంస్థలు తమ కార్యకలాపాలకు ఈ పాఠశాలను స్థావరంగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను చూపలేదు.
Comments
Please login to add a commentAdd a comment