
న్యూఢిల్లీ:ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్‌కు తెరపడనుంది. సీఎం పేరును సోమవారం(ఫిబ్రవరి17) జరిగే బీజేపీ కీలక నేతలో భేటీలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలన్నదానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు సాగిస్తోంది. దీనిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే సీఎం ఎవరన్నది బయటికి పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విషయంపై ఎవరూ నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేష్‌వర్మకే ఢిల్లీ సీఎంగా ఎక్కువ అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పర్వేష్‌వర్మతో పాటు ఢిల్లీ మాజీ ప్రతిపక్షనేత విజేందర్‌గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ,ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిష్ సూద్,ఆర్‌ఎస్‌ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీపై బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment