న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్స్ కారణమని ఢిల్లీ సీఎం అతిషి అ న్నారు. నగరంలో గాలి కాలుష్యం పెరగడం,యమునా నది నీటిపై రసాయనాల నురగ కనబడటంపై ఆమె ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి బీజేపీ పాలిత హర్యానా,ఉత్తరప్రదేశ్‌లే కారణమని ఆరోపించారు.హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడం,ఇటుక బట్టీలు,యూపీ నుంచి వేల సంఖ్యలో డీజిల్ బస్సులు రావడం,నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని(ఎన్‌సీఆర్) థర్మల్ పవర్ ప్లాంట్లు కాలుష్యానికి కారణాలని అతిషి చెప్పారు.
యమునా నదిలోకి వదిలే పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకపోవడం వల్లే నదిపై నురగ ఏర్పడుతోందన్నారు. యమునా నది ఉపరితలంపై ఏర్పడిన నురగను ఆదివారం రాత్రి నుంచి తొలగిస్తామని తెలిపారు.అయితే ఢిల్లీ పొరుగున ఉన్న ఆప్ పార్టీ పాలిత పంజాబ్ మాత్రం ఢిల్లీ కాలుష్యానికి ఏ మాత్రం కారణమవడం లేదని అతిషి చెప్పడం విశేషం.
ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment