delhi cm
-
బీజేపీ డర్టీ పాలిటిక్స్ వల్లే కాలుష్యం: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్స్ కారణమని ఢిల్లీ సీఎం అతిషి అ న్నారు. నగరంలో గాలి కాలుష్యం పెరగడం,యమునా నది నీటిపై రసాయనాల నురగ కనబడటంపై ఆమె ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి బీజేపీ పాలిత హర్యానా,ఉత్తరప్రదేశ్లే కారణమని ఆరోపించారు.హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడం,ఇటుక బట్టీలు,యూపీ నుంచి వేల సంఖ్యలో డీజిల్ బస్సులు రావడం,నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని(ఎన్సీఆర్) థర్మల్ పవర్ ప్లాంట్లు కాలుష్యానికి కారణాలని అతిషి చెప్పారు.యమునా నదిలోకి వదిలే పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకపోవడం వల్లే నదిపై నురగ ఏర్పడుతోందన్నారు. యమునా నది ఉపరితలంపై ఏర్పడిన నురగను ఆదివారం రాత్రి నుంచి తొలగిస్తామని తెలిపారు.అయితే ఢిల్లీ పొరుగున ఉన్న ఆప్ పార్టీ పాలిత పంజాబ్ మాత్రం ఢిల్లీ కాలుష్యానికి ఏ మాత్రం కారణమవడం లేదని అతిషి చెప్పడం విశేషం.ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్ -
సాక్షి కార్టూన్ 23-09-2024
-
అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా: కేజ్రీవాల్
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన జనతా అదాలత్‌లో తొలిసారి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేశారో కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు.జనతా అదాలత్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి, అవినీతి చేయడానికో రాలేదు. దేశ రాజకీయాల్లో సమూలంగా మర్చేందుకే వచ్చా. అందుకే సీఎం పదవికి రాజీనామా చేశాను’అని చెప్పారు.కోర్టులో నా తరుఫున మద్యం పాలసీ కేసులో వాదించిన లాయర్లు నాపై ఉన్న ఈ మద్యం పాలసీ కేసు పదేళ్లు ఇలాగే కొనసాగుతుందన్నారు. నేను ఈ మరకతో జీవించలేను. అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజా కోర్టుకు వెళ్లేందుకే సిద్దమైనట్లు కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాదు తాను అవినీతికి పాల్పడితే ఉచిత కరెంట్, ఇంటి అద్దె చెల్లింపులు, పిల్లల కోసం స్కూళ్లు నిర్మించను. బీజేపీ పేరును ప్రస్తావిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. అలా అయితే ఇక్కడ అవినీతికి పాల్పడింది నేనా? వాళ్లా? అని కేజ్రీవాల్ అన్నారు. आज से मैं “जनता की अदालत” में जा रहा हूँ। आने वाले दिल्ली चुनाव में जनता का समर्थन और दिल्लीवासियों का एक-एक वोट ही मेरी ईमानदारी का सुबूत होगा। https://t.co/P78H87icop— Arvind Kejriwal (@ArvindKejriwal) September 22, 2024 -
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశి... మరో ఐదుగురు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్‌కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్‌కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా మంత్రి అతిషి ప్రమాణస్వీకారం 21న ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణస్వీకార తేదీని అతిషి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు అందజేసిన లేఖలో తెలపలేదు. అయితే ఎల్జీ మాత్రం 21న అతిషి ప్రమాణస్వీకారాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారమందించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు అతిషి అందించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపించారు. ఈ సందర్భంగా అతిషి ప్రమాణస్వీకారం 21న ఎల్జీ ప్రతిపాదించారు. అయితే అతిషి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఆమెతో ప్రమాణస్వీకారం చేస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.కాగా, అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖలో ఎల్జీకి కాకుండా రాష్ట్రపతిని ఉద్దేశించి ఒకే ఒక వ్యాఖ్యంలో రాశారు. లేఖ అందించడానికి మాత్రం కేజ్రీవాల్ స్వయంగా ఎల్జీ వద్దకు వెళ్లి అందిచడం గమనార్హం. ఇదీ చదవండి.. ‘అతిషి డమ్మీ సీఎంగా ఉంటారు’ -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం(సెప్టెంబర్17) సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకేసక్సేనా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు. ఎల్జీని కలిసేందుకు కేజ్రీవాల్ వెంట ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, కాబోయే సీఎం అతిషి, మంత్రులు ఉన్నారు. అతిషిని కొత్త సీఎంగా ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ తెలిపారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariateArvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024కాగా, రెండు రోజల క్రితం ఆప్ పార్టీ మీటింగ్‌లో చెప్పినట్లుగానే కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి ఇప్పటికే మంత్రి ఆతిషి పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం జరిగిన ఆమ్ఆద్మీపార్టీ శాసనాసభాపక్షంలోనూ అతిషి పేరును కొత్త సీఎం పదవికి ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరిన అతిషి..రాజీనామా చేసేందుకు ఎల్జీ వద్దకు వెళ్లిన మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటే కాబోయే సీఎం అతిషి కూడా వెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా సమర్పించిన తర్వాత ఆమె ఎల్జీని కలిశారు. తనను కొత్త సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె ఎల్జీని కోరారు. తనకు ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తూ సంతకం చేసిన పత్రాన్ని ఆమె ఈ సందర్భంగా ఎల్జీకి అందించినట్లు తెలిసింది. #WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariateArvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024ఇదీ చదవండి.. కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషీ మర్లీనా నియామకంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతిషీ ‘డమ్మీ సీఎం’ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్ని గుర్తు చేశారు. అప్జల్ గురు అమాయకుడని రాష్ట్రపతికి రాసిన లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలంటూ ఎక్స్‌లో పేర్కొన్నారుदिल्ली के लिए आज बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला को बनाया जा रहा है जिनके परिवार ने आतंकवादी अफ़ज़ल गुरु को फांसी से बचाने की लंबी लड़ाई लड़ी। उनके माता पिता ने आतंकी अफ़ज़ल गुरु को बचाने के लिए माननीय राष्ट्रपति को दया याचिकाऐं लिखी।उनके हिसाब से… pic.twitter.com/SbllONqVP0— Swati Maliwal (@SwatiJaiHind) September 17, 2024 అయితే స్వాతి మాలీవాల్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతి మాలీవాల్ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దిలీప్ పాండే మాట్లాడుతూ.. తమ పార్టీ పార్లమెంట్‌కు పంపినప్పటికీ .. ఆమె బీజేపీ స్క్రిప్ట్‌ను చదువుతున్నారని అన్నారు.‘ఆప్ నుంచి మాలీవాల్ రాజ్యసభ టికెట్ తీసుకున్నా, బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారు. అందుకే ఆప్ రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పదవి చేపట్టాలని సూచించారు. ఢిల్లీ సీఎంగా అతిషీ మర్లీనాఅతిషి మర్లీనా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టానున్నారు. -
వారంలోపు ఢిల్లీకి కొత్త సీఎం: సౌరభ్ భరద్వాజ్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు.. మంత్రి అతిశీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ వంటివారు తదుపరి సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేత, రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పిస్తారు. రాజీనామా ఆమోదించిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటాం. ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా మా వెంటే ఉన్నారు. మాకు స్పష్టమైన సంఖ్యా బలం ఉంది. మేము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తాం’’ అని అన్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, "Tomorrow, Chief Minister (Arvind Kejriwal) will submit his resignation and as soon as the resignation is accepted, there will be a meeting of the legislative party, the legislative party will elect a leader. The… pic.twitter.com/xmPu3X9gY7— ANI (@ANI) September 16, 2024చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే! -
రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా: కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషిగా నిరూణ అయ్యేవరకు సీఎం పదవి చేపట్టనని స్పష్టం చేశారు. ఆదివారం(సెప్టెంబర్15) ఢిల్లీలో జరిగిన ఆమ్ఆద్మీపార్టీ సమావేశంలో కేజ్రీవాల్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నా భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారు. నేను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి.’అని కేజ్రీవాల్ కోరారు.‘రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఇన్ని రోజులు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కొత్త సీఎం పేరును త్వరలో ప్రకటిస్తాం. నేను, సిసోడియా సీఎం పదవిలో ఉండం. ఆమ్‌ఆద్మీపార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే నన్ను జైలుకు పంపించింది’అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్ షరతుల ప్రకారం కేజ్రీవాల్ సీఎం ఆఫీసుకు వెళ్లడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. మరోపక్క బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదీ చదవండి.. తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 13) విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మద్యం పాలసీ కేసులో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. కానీ ఎందుకు అరెస్ట్ చేసిందో గల కారణాలపై స్పష్టతలేదు. సీబీఐ సమాధానాలు సైతం అర్ధవంతంగా లేవు. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్‌తో పాటు జైలు శిక్షను కొనసాగించలేము. కేజ్రీవాల్‌ని సైతం వాంగ్మూలం ఇవ్వమని బలవంతం చేయలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.సీబీఐపై ప్రశ్నలు సంధించిన సుప్రీంవిచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐపై విమర్శలు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి మార్చి 2023లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. విచారించిన 22 నెలల సమయం తీసుకుని కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేందుకు ఎందుకు అంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. షరతులతో కూడిన బెయిల్చివరగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం,అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఇదీ చదవండి : అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే సంపన్న మహిళ పోటీ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం ఈ నెల 5వ తేదీన రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్టు 5న ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేయడంతోపాటు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
కేజ్రీవాల్ కు క్రేజీ ప్రాబ్లమ్..
-
తీహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్‌తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ
మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కలిశారు.ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకుని అరగంట సేపు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్యలో గ్రిల్, అద్దం ఉంది. మరోవైపు సీఎం కూర్చున్నారు.తమ ఇద్దరి ఫోన్ సంభాషణలో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ అన్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా భరద్వాజ్ అన్నారు. #WATCH | Delhi: AAP leader and Delhi Minister Saurabh Bharadwaj says, "I met CM Arvind Kejriwal and talked to him for half an hour. There was a grill and a mirror in between, and on the other side CM was sitting; We communicated through a phone. He said that Delhiites should not… pic.twitter.com/J6AuUrfIzz— ANI (@ANI) April 24, 2024 -
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేదుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ ప్రజా ప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన డివిజన్ బెంచ్ బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే పిటిషనర్ ఈ అంశంపై రాజ్యాంగ అధికారులను(రాష్ట్రపతి లేదా గవర్నర్) సంప్రదించాలని హైకోర్టు కోరింది. ‘కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. కానీ అది అతని (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయం. ఇది న్యాయస్థానం, కోర్టు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించిన సందర్భాలు ఉన్నాయా? దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం ప్రభుత్వం పనిచేయడం లేదని మేము ఎలా చెప్పగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉంది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టాం ప్రకారం ఏం చేయాలో ఆయన చేస్తారు’ అని పేర్కొంది. అనంతరం పిటిషనర్ గుప్తా మాట్లాడుతూ.. తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దీనిని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. కాగా సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ హైకోర్టులో దాఖలైన రెండో పిటిషన్ ఇది. కాగా మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. -
సీఎం కేజ్రీవాల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు నేడు(ఆగస్టు16). ఈ ఏడాది ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేజ్రీవాల్‌కు పలువురు రాజకీయ నేతలు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. Thank you for your wishes Sir. https://t.co/pa74MlU12I — Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023 అయితే మోదీ ట్వీట్‌కు కేజ్రీవాల్ బదులిచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సెనా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, రాజీవ్ శుక్లాతో తదితరులు కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్ మనీష్‌ను మిస్ అవుతున్నా: కేజ్రీవాల్ కేజ్రీవాల్ తన పుట్టిన రోజున సీఎం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ ఈరోజు నా పుట్టినరోజు. చాలా మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. కానీ నేను మనీష్‌ను చాలా మిస్ అవుతున్నాను. ప్రస్తుతం అతను తప్పుడు కేసులో జైలులో ఉన్నారు. Today is my birthday. Many people are sending their wishes. Thank you so much! But I miss Manish. He is in jail in a false case. Lets all take a pledge today - that we will do everything within our means to provide best quality education to every child born in India. That will… — Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023 ఈ రోజు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. భారత్‌లో పుట్టిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన, నాణ్యమైన విద్యను అందించడానికి మా శక్తిమేర ప్రయత్నిస్తాం. అది పటిష్ట భారత్‌కు పునాది వేస్తుది. అది భారత్‌ను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలనే మన కలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది. అది మనీష్‌ను కూడా సంతోషపరుస్తుంది.’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని ప్రభుత్వం అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం తీసుకొచ్చిన చట్టం కారణంగా కేజ్రీవాల్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. చదవండి:మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు -
సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..?
న్యూఢిల్లీ: డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రూ.45కోట్లు వెచ్చించి రినోవేట్ చేయించారని బీజేపీ ఆరోపించింది. ఆయన 'విలాసవంతమైన రాజు' అని విమర్శలు గుప్పించింది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సీఎం ఉంటున్న ఇళ్లు 80 ఏళ్ల నాటిదని, ఇప్పుటికే పైకప్పు మూడు సార్లు కూలిపోయిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. ఇలాంటి ఇంట్లో సీఎం ఉంటారా? మరమ్మతులు చేయించవద్దా? అని ప్రశ్నించింది. ये दिल्ली के CM का सरकारी घर है। 3 बार छत टूट कर गिरा। तब जा कर उसे PWD ने बनाया। कौन CM ऐसे टूटे घर में रहता होगा? टूटने से पहले बनवा लिया होता। जोगी जी के बंगले की कीमत 300 करोड़ से ज्यादा है। आवाज तक किसी की आवाज नहीं निकली। बाकी चिल्लाने वाले मानसिक कोढ़ है। उनकी राजनीति, pic.twitter.com/oKEtNVk2qn — Naresh Balyan (@AAPNareshBalyan) April 26, 2023 అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై -
అందులో అన్నాహజరే కూడా ఉన్నారా సార్!
అందులో అన్నాహజరే కూడా ఉన్నారా సార్! -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ
►అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. ఆదివారం విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వక స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ► ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దాదాపు గంటన్నరగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ పాత్రపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరయ్యేందుకు ముందు ఓ వీడియో కూడా విడుదల చేశారు కేజ్రీవాల్. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని సీబీఐతో సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వినకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అయ్యాక అనేక మార్పులు తీసుకొచ్చానని, భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. -
'కేజ్రీవాల్ అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్క నిజాయితీపరుడు ఉండడు'
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరయ్యే ముందు వీడియో రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశా. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టా. 30 ఏళ్లలో గుజరాత్లో ఏం అభివృద్ధి చేశారు. నా జీవిత లక్ష్యం భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ చేయడం. నేను షుగర్ వ్యాధిగ్రస్తుణ్ణి. ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నా. అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశా. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెప్తా. దేశం కోసం పుట్టాను దేశం కోసం చస్తాను.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖలో ఒకప్పుడు కమిషనర్‌గా పనిచేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. బీజేపీ తాను అవినీతిపరుడ్ని అని ప్రచారం చేస్తోందని, అలాంటి వాడినైతే అప్పుడే రూ.కోట్లు సంపాదించేవాడినని పేర్కొన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాలే అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్కరు కూడా నిజాయితీ పరుడు ఉండడని అన్నారు. చదవండి: రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్ -
'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా.. వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం ఢిల్లీలో కలకలం రేపింది. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. చదవండి: ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం -
సీఎంను డిన్నర్‌కు ఆహ్వానించిన ఆటోవాలా
అహ్మదాబాద్: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఆప్ విజయం కోసం ఆటోవాలాలు తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో లాగా గుజరాత్‌లోనూ ఆప్ కోసం ప్రచారం నిర్వహించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అయితే ఈ సమావేశంలో ఓ ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు రావాలని ఆహ్వానించాడు. పంజాబ్‌లో ఓ ఆటోవాలా ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ భోజనం చేసిన వీడియో తాను చూశానని, ఇప్పుడు తన ఇంటికి కూడా డిన్నర్‌కు వస్తారా? అని అతను అడిగాడు. దీనికి స్పందించిన ఢిల్లీ సీఎం.. వెంటనే తాను డిన్నర్‌కు వస్తానని చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లుకొట్టారు. అయితే తనను తీసుకెళ్లేందుకు హోటల్‌కు రావాలని ఆటోడ్రైవర్‌కు కేజ్రీవాల్ సూచించారు. తనతో పాటు మరో ఇద్దరు ఆప్ నేతలు కూడా వస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఏ సమయానికి డిన్నర్‌కు రావాలని కూడా ఆటో డ్రైవర్‌ను అడిగారు. ఆ తర్వాత రాత్రి 8గంటలకు టైంను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn — AAP (@AamAadmiParty) September 12, 2022 చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్‌గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా పంపారు. అయితే ఇదంతా ఫేక్ అని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. 'ఈరోజుల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవర్ని జైలుకు పంపాలో ముందు కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారిపై కేసు నమోదవుతుంది. సిసోడియాపై చేస్తున్న ఆరోపణలను పరిశీలించాను. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అది ఫేక్ కేసు' అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్లుగా తెలుసునని, ఆయన ఎంతో నిజాయితీ పరుడని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్‌ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని, కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో సిసోడియా సమూల మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చదవండి: 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం -
పద్మ అవార్డులకు వైద్యుల పేర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ముగ్గురు వైద్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. డాక్టర్లు ఎస్కే సరిన్, సురేశ్ కుమార్, సందీప్ బుధిరాజలు ఇందులో ఉన్నారని చెప్పారు. కోవిడ్ 19 పోరాటంలో భాగంగా వీరు చేసిన సేవలను గుర్తుంచుకొని పేర్లను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కేవలం వైద్యుల పేర్లను మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొత్తం 9,427 మంది ప్రజలు కలసి 740 మంది పేర్లను సూచించారన్నారు. ఇందులో డాక్టర్లు, పారమెడిక్స్, ఇతర ఆరోగ్య రంగ నిపుణులు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఖరారు చేసిందన్నారు. వారిలో ఐఎల్‌బీఎస్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.కె సరిన్, ఎల్ఎన్జేపీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ డాక్టర్ సందీప్ బుధిరాజలు ఉన్నారని తెలిపారు.