
న్యూఢిల్లీ: డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రూ.45కోట్లు వెచ్చించి రినోవేట్ చేయించారని బీజేపీ ఆరోపించింది. ఆయన 'విలాసవంతమైన రాజు' అని విమర్శలు గుప్పించింది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సీఎం ఉంటున్న ఇళ్లు 80 ఏళ్ల నాటిదని, ఇప్పుటికే పైకప్పు మూడు సార్లు కూలిపోయిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇలాంటి ఇంట్లో సీఎం ఉంటారా? మరమ్మతులు చేయించవద్దా? అని ప్రశ్నించింది.
ये दिल्ली के CM का सरकारी घर है। 3 बार छत टूट कर गिरा। तब जा कर उसे PWD ने बनाया। कौन CM ऐसे टूटे घर में रहता होगा? टूटने से पहले बनवा लिया होता। जोगी जी के बंगले की कीमत 300 करोड़ से ज्यादा है। आवाज तक किसी की आवाज नहीं निकली। बाकी चिल्लाने वाले मानसिक कोढ़ है। उनकी राजनीति, pic.twitter.com/oKEtNVk2qn
— Naresh Balyan (@AAPNareshBalyan) April 26, 2023
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు.
చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై