ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు.. మంత్రి అతిశీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ వంటివారు తదుపరి సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేత, రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు.
‘‘రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పిస్తారు. రాజీనామా ఆమోదించిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటాం. ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా మా వెంటే ఉన్నారు. మాకు స్పష్టమైన సంఖ్యా బలం ఉంది. మేము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తాం’’ అని అన్నారు.
#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, "Tomorrow, Chief Minister (Arvind Kejriwal) will submit his resignation and as soon as the resignation is accepted, there will be a meeting of the legislative party, the legislative party will elect a leader. The… pic.twitter.com/xmPu3X9gY7
— ANI (@ANI) September 16, 2024
Comments
Please login to add a commentAdd a comment