కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే!
ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే.. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఢిల్లీ సీఎం పీఠంపై ఆప్ ఎవరీ కూర్చోబెడుతుందనే చర్చ ఇప్పటికే పార్టీ వర్గాల్లో మొదలైంది. సీఎం పదవికీ మంత్రులు అతిషీ, గోపాల్ రాయ్, కైలేశ్ గహ్లోత్, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు తెరమీదకు వస్తున్నాయి.మనీష్ సిసోడియా ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇవాళ (సోమవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్నారు. ఇరు నేతలు లిక్కర్ స్కామ్ కేసులో బైయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సమావేశం కావటం ఇదే తొలిసారి. ఇక.. నిన్న కేజ్రీవాల్ రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇరునేతలు భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై ఇరు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎం రేసులో మనీష్ సిసోడియా కూడా ఉన్నారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సునీతా కేజ్రీవాల్కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ, హర్యానా, గుజరాత్లో ఆప్ నుంచి సునితా కేజ్రీవాల్ ప్రచారాల్లో ముందుండి నడిపించారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో ఆమె క్రమం తప్పకుండా మీడియా సమావేశాలలో నిర్వహించారు. సీఎం కేజ్రీవాల్ సందేశాలను ప్రజలకు చదివి వినిపించారు. ఢిల్లీ, రాంచీలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీల్లో కూడా పాల్గొంన్నారు. తన భర్త కేజ్రీవాల్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకోవటంపై విమర్శలు గుప్పించారు.అతిషీవిధాన సంస్కరణలు, సామాజిక సమస్యలపై అతిశీ డైనమిక్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసిన ఆప్ పార్టీ వ్యవహారాలను అన్నీ తానై చూశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషించారామె. క్యాబినెట్ మంత్రుల్లో ఆమె 14 శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్ మరియు ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్నారామె. అతిషి ఢిల్లీ అసెంబ్లీలో విద్యకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె బలమైన వాక్చాతుర్యం ఉన్న నేతగా ఆప్‌లో గుర్తింపు పొందారు. ఈ అనుకూలతలన్ని ఆమెను తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి పోటీదారుల్లో ముందువరసలో నిలబెట్టాయి.గోపాల్ రాయ్ఆప్లో మంత్రి గోపాల్ రాయ్.. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. 49 ఏళ్ల గోపాల్ రాయ్ విద్యార్థి క్రియాశీలక రాజకీయ నేపథ్యం కలిగిన ఉన్నారు. ప్రస్తుతం పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి, సాధారణ పరిపాలన వంటి శాఖల మంత్రి ఉన్నారు. గోపాల్ రాయ్ ఢిల్లీలోని శ్రామిక వర్గ సంఘాలతో అనుబంధం ఉంది. కార్మిక హక్కులు, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు విస్తృతంగా కృషి చేశారు. కాలుష్య నియంత్రణ నుంచి కార్మిక సంక్షేమం వరకు ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకంగా వ్యవహరించినఅనుభవ ముఖ్యమంత్రి పోటీదారుల్లో ఒకరిగా చేర్చింది.ఆయనపై ప్రచారంలో కాల్పులు జరగగా.. పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు.కైలాష్ గహ్లోత్ఢిల్లీ రాజకీయల్లో కీలకమైన వ్యక్తి ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో.. ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసుల విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల పరిచయం, రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నాలతో రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటంలో గణనీయమైన పురోగతి సాధించింది. 50 ఏళ్ల కైలాష్ గహ్లోత్.. బలమైన పరిపాలనా సామర్థ్యాలను కలిగిన ఆప్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.