ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన జనతా అదాలత్‌లో తొలిసారి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేశారో కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు.
జనతా అదాలత్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి, అవినీతి చేయడానికో రాలేదు. దేశ రాజకీయాల్లో సమూలంగా మర్చేందుకే వచ్చా. అందుకే సీఎం పదవికి రాజీనామా చేశాను’అని చెప్పారు.
కోర్టులో నా తరుఫున మద్యం పాలసీ కేసులో వాదించిన లాయర్లు నాపై ఉన్న ఈ మద్యం పాలసీ కేసు పదేళ్లు ఇలాగే కొనసాగుతుందన్నారు. నేను ఈ మరకతో జీవించలేను. అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజా కోర్టుకు వెళ్లేందుకే సిద్దమైనట్లు కేజ్రీవాల్ తెలిపారు.
అంతేకాదు తాను అవినీతికి పాల్పడితే ఉచిత కరెంట్, ఇంటి అద్దె చెల్లింపులు, పిల్లల కోసం స్కూళ్లు నిర్మించను. బీజేపీ పేరును ప్రస్తావిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. అలా అయితే ఇక్కడ అవినీతికి పాల్పడింది నేనా? వాళ్లా? అని కేజ్రీవాల్ అన్నారు.
आज से मैं “जनता की अदालत” में जा रहा हूँ। आने वाले दिल्ली चुनाव में जनता का समर्थन और दिल्लीवासियों का एक-एक वोट ही मेरी ईमानदारी का सुबूत होगा। https://t.co/P78H87icop
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment