బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ | Ex AAP leader Kailash Gehlot likely to join BJP day after resignation | Sakshi
Sakshi News home page

ఆప్‌కు రాజీనామా.. బీజేపీలోకి ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌

Published Mon, Nov 18 2024 11:33 AM | Last Updated on Mon, Nov 18 2024 2:04 PM

Ex AAP leader Kailash Gehlot likely to join BJP day after resignation

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌.. నేడు (సోమవారం) బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, దుష్యంత్ గౌతమ్, హర్ష్ మల్హోత్రా, పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

ఆప్‌ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి పదవికి కూడా గహ్లోత్‌ ఆదివారం రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే ఇది జరిగిన మరుసటి రోజే సోమవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కైలాష్ మాట్లాడుతూ.. ఆప్‌కు రాజీనామా, బీజేపీలో చేరిక నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒత్తిడితోనే తాను వైదొలిగినట్లు ఆప్ చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు.  పార్టీ ప్రధాన విలువలు, నైతికతలకు దూరమైందని ఆరోపించారు..

‘నేను ఎలాంటి ఒత్తిళ్ల వల్ల బీజేపీలో చేరలేదు.  ఆప్ దాని సిద్ధాంతాలపై రాజీ పడింది కాబట్టి ఈ  నిర్ణయం తీసుకున్నాను. సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఆప్‌లో చేరాను, కానీ ఇప్పుడు పార్టీ దాని అసలు లక్ష్యం డిస్‌కనెక్ట్ అయ్యింది, ఆప్‌ నాయకులు 'ఆమ్' (కామన్) నుంిచి 'ఖాస్' (ఎలైట్) గా మారుతున్నారు.

కేంద్రంతో పోరాడటంపైనే ఆప్‌ ప్రభుత్వం దృష్టి సారించింది., అలాంటి వైఖరి ఢిల్లీలో నిజమైన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కేంద్రంలో కలిసి పని చేస్తేనే  నిజమైన అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ రోజు బీజేపీలో చేరాను. ’ అని ఢిల్లీ మాజీ మంత్రి తెలిపారు.

కాగా నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యే అయిన గహ్లోత్  ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు.  అయితే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయలేని వాగ్దానాలు చేస్తోందని.. కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. ఇటీవల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇవన్నీ తన రాజీనామాకు కారణాలుగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్దతతో ఏర్పడిన పార్టీ తన ఆశయాలను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు.

ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని ఆరోపించారు , యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామని వాగ్దానం చేసి ఆ పని చేయలేకపోయిందని, బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని విమర్శించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా 'శీష్ మహల్' చుట్టూ వివాదం ముసురుకోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement