official residence
-
చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట..
సాక్షి, విజయవాడ: కరకట్ట నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు గృహాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే కరకట్ట నివాసంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇది అక్రమ నిర్మాణం అంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అదే అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్ నుంచి చంద్రబాబు తీసుకున్నారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..కాగా, చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారనే ఆరోపణలున్నాయి. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనూ, సీఎం హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు.ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్.. చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి. -
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అధికార నివాసం నిర్మాణంలో అవకతవకలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ కోసం చేపట్టిన నూతన అధికారిక నివాసం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని అధికారులపై ఈ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే పూర్తిస్థాయి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీఎం కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని సీబీఐ సోమవారం ఢిల్లీ ప్రజా పనుల విభాగానికి లేఖ రాసింది. కేజ్రివాల్ కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.43.70 కోట్లు కేటాయించింది. కానీ, రూ.44.78 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. 2020 సెప్టెంబర్ 9 నుంచి 2022 జూన్ దాకా ఈ సొమ్ము ఖర్చు చేశారు. -
కేజ్రీవాల్ నివాసానికి మరమ్మతులపై నివేదిక కోరిన ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది. -
సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..?
న్యూఢిల్లీ: డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రూ.45కోట్లు వెచ్చించి రినోవేట్ చేయించారని బీజేపీ ఆరోపించింది. ఆయన 'విలాసవంతమైన రాజు' అని విమర్శలు గుప్పించింది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సీఎం ఉంటున్న ఇళ్లు 80 ఏళ్ల నాటిదని, ఇప్పుటికే పైకప్పు మూడు సార్లు కూలిపోయిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. ఇలాంటి ఇంట్లో సీఎం ఉంటారా? మరమ్మతులు చేయించవద్దా? అని ప్రశ్నించింది. ये दिल्ली के CM का सरकारी घर है। 3 बार छत टूट कर गिरा। तब जा कर उसे PWD ने बनाया। कौन CM ऐसे टूटे घर में रहता होगा? टूटने से पहले बनवा लिया होता। जोगी जी के बंगले की कीमत 300 करोड़ से ज्यादा है। आवाज तक किसी की आवाज नहीं निकली। बाकी चिल्लाने वाले मानसिक कोढ़ है। उनकी राजनीति, pic.twitter.com/oKEtNVk2qn — Naresh Balyan (@AAPNareshBalyan) April 26, 2023 అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై -
కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?
భోపాల్: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన అధికారిక భవనంలో కళాశాల విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్‌కు చెందిన అధికారిక భవనంగా పోలీసులు తెలిపారు. శ్యామల హిల్స్ ప్రాంతంలో జరిగిన సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తీరథ్ సింగ్ అనే విద్యార్థి గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే భవనంలోనే ఉంటూ చదువుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. క్యాన్సర్‌తో విద్యార్థి బాధపడుతున్నాడని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సూసైడ్ నోట్‌ను చేతిరాత నిపుణుల వద్దకు పంపించి అది అతడిదేనా అనే కోణంలో విచారిస్తున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉమేశ్ యాదవ్ తెలిపారు. ‘ ప్రొఫెసర్ కాలనీలో ఉన్న దిడోద్రి ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్ అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అక్కడ సూసైడ్ నోట్ సైతం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం.’ అని తెలిపారు. ప్రభుత్వ భవనంలో బాధితుడితో పాటు ఉంటున్న మరో వ్యక్తితో మాట్లాడినట్లు చెప్పారు. అతడికి క్యాన్సర్ ఉందని భోపాల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఇదీ చదవండి: Hyderabad: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి -
అది అబద్ధం: ప్రియాంక గాంధీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని ప్రభుత్వ బంగళాను ఆగస్టు లోపు ఖాళీ చేయాలని జూలై1న పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం ప్రియాంక గాంధీ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసత్యపు వార్త. బంగళాలో ఉండేందుకు కాల పరిమితి పెంచాలని నేను ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన పెట్టుకోలేదు. నేను జూలై 1న పొందిన లేఖ ప్రకారం ఆగస్టు 1లోగా లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేస్తాను’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. (ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి కేటాయింపు) ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా స్పందిస్తూ.. ‘మాపై వస్తున్న వార్తలు నిజం కాదు. బంగళాలో ఉండేందుకు మేము ఎటువంటి పొడగింపు అడగలేదు. నెల రోజుల్లో బంగ్లాను ఖాళీ చేయాలని లేఖ వచ్చింది. ఆ మేరకు మేము ఇంటి సామాన్లను ప్యాక్ చేశాము. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే వారం రోజుల ముందుగానే ఖాళీ చేస్తాము’ అని ఆయన ట్విటర్లో తెలిపారు. (‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’) దీనిపై పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ‘నిజాలు ఎప్పుడూ వాటంతట అవే బయటకు వస్తాయి. కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత జూలై 4న నాకు ఫోన్‌చేసి 35, లోడీ ఎస్టేట్స్‌లోని బంగళాను మరో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించాలని కోరారు. దాంతో ప్రియాంక గాంధీ అక్కడే కొనసాగడానికి వీలుంటుందని తెలిపారు. ప్రతి విషయాన్ని సంచలనం చేయొద్దు’ అని ఆయన ట్విటర్లో అన్నారు. ప్రియాంక తనపై వస్తున్న వార్తలను అసత్యమని ఖండించిన తర్వాత మంత్రి స్పందించటం గమనార్హం. -
ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి కేటాయింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలంటూ ప్రియంక గాంధీకి కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బంగాళాను బీజేపీ ఎంపీ, మీడియా సెల్ ఇన్‌ఛార్జి అనిల్ బలూనికి కేటాయిస్తూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గురుద్వారాలోని రాకాబ్ గంజ్ రోడ్లో ఉంటున్నారు. అయితే అనారోగ్య కారణాలతో తన నివాసాన్ని మార్చాలంటూ బలూని విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నప్పటికీ అనేక జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలోనే బలూనీకి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉన్న లోథీ బంగాళాను కేటాయిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని లేఖ ) 'బంగళా ఖాళీ ఏర్పడినప్పుడు అర్హత ఉన్న మరొకరికి కేటాయించడం అనేక సందర్భాల్లో చూశాం.. ఇది కూడా అలాంటిదే దీన్ని రాద్ధాంతం చేయనవసరం లేదు. ప్రియాంక గాంధీ ఖాళీ చేసిన వెంటనే బలూని అక్కడికి మారతారు' అని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని ఇటీవల పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ నోటిసులు జారీ చేసింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. (ప్రియాంకకు నోటీసులు.. కాంగ్రెస్ స్పందన) -
‘ద్వేషం, ప్రతీకారానికి నిదర్శనం’
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం ప్రియాంక గాంధీకి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై కాంగ్రెస్ విరుచుకుపడింది. మోదీ ద్వేష, ప్రతీకార రాజకీయాలకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ‘ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ భయపడదు. మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత ద్వేషం, పగ ఉన్నాయో దేశం మొత్తానికి తెలుసు. వారు ఇప్పుడు అని హద్దులు దాటారు. ప్రియాంక గాంధీని బంగళా ఖాళీ చేయమంటూ నోటీసులు పంపి ప్రధాని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ ఆందోళనను వెల్లడించారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ భయపడదు’ అంటూ ఆయన ఓ వీడియో మెసేజ్‌ను షేర్ చేశారు. (షాకింగ్ వీడియో: కళ్లు మూసుకోండి అంటూ..) ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. -
ప్రియాంక వాద్రాకు కేంద్రం షాక్
-
ప్రియాంక వాద్రాకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్ 1లోగా ఖాళీ చేయాలని ఆమెను కోరింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి : నేను ఇందిరా గాంధీ మనువరాలిని.. -
అధికారిక నివాసం ఖాళీ చేసిన సుష్మాస్వరాజ్
-
అఖిలేశ్ ఇలా కోపం తీర్చుకున్నారా...!?
లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈనెల(జూన్) 2న తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే అఖిలేశ్ ఖాళీ చేసిన 4- విక్రమాదిత్య మార్గ్‌లోని బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి శనివారం ఉదయం మీడియాతో సహా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ అధికారులు షాక్‌కు గురయ్యారు. ‘ఇదొక దుర్దినం, జీవితం చాలా చిన్నది.. బాధ పడాల్సిన అవసరం లేదంటూ’ గోడలపై రాసి ఉండటంతో పాటు విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్స్, టైల్స్, ఏసీలు మాయమవడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయమై స్పందించిన ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ.. 2016లో 45 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అఖిలేశ్ కుటుంబ సభ్యుల అభిరుచికి తగినట్లుగా బంగ్లాను పునరుద్ధరించామన్నారు. స్విమ్మింగ్ పూల్‌లోని టర్కిష్ టైల్స్‌తో పాటు, ఇటాలియన్ మార్బుల్, ఏసీలు, గార్డెన్ లైట్స్ మాయమయ్యాయని తెలిపారు. మార్బుల్స్ తీసుకోవడానికి స్విమ్మింగ్‌పూల్ సహా పలు చోట్ల తవ్వకాలు జరిపడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అంతేకాకుండా అఖిలేశ్ యాదవ్ తన కోసం ఏర్పాటు చేసుకున్న జిమ్ కూడా మొత్తం ఖాళీగా ఉందని ఆయన వాపోయారు. చర్యలు తీసుకుంటాం.. బంగ్లా నుంచి మాయమైన వస్తువుల జాబితా తయారు చేస్తున్నామని, అదే విధంగా పలు చోట్ల తవ్వకాలు జరపడం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మాజీ సీఎం అయి ఉండి ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనాగరిక చర్య అని వారు పేర్కొన్నారు. మిలియనీర్ అయి ఉండి ఇలా చేస్తారా.. అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ చూస్తే ఆయన ఎంత సంపన్నుడో తెలుస్తుందని యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. లక్నోలో ఎన్నో ఆస్తులను కలిగి ఉన్న ఆయనకు అమెరికా, లండన్లలో కూడా అనేక బంగ్లాలు ఉండగా ఈవిధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తన కోసం కొత్తగా నిర్మించుకుంటున్న విల్లా కోసమే ఆయన ఇలా అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా బంగ్లా ఖాళీ చేయడం ఇష్టంలేనందు వల్లే అఖిలేశ్ ఈవిధంగా కోపాన్ని తీర్చుకున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి స్పందించారు. తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై ప్రభుత్వ అధికారులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. కేవలం ఆయన ఇష్టపడి కొనుక్కున్న, బహుమతులుగా లభించిన వాటినే తన వెంట తీసుకెళ్లారని తెలిపారు. -
సీఎం నివాసంలో అస్తిపంజరం ; మళ్లీ కలకలం
అగర్తలా : త్రిపుర అభివృద్ధిబాటలో మాణిక్ సర్కార్‌ను కూడా కలుపుకొని వెళతామంటూనే.. ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ! కాషాయదళం విజయానికి కారకుడైన సునీల్ దేవ్‌ధర్ శనివారం పేల్చిన ఓ ట్వీట్.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘‘త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌కు నాదొక విన్నపం.. అధికారిక నివాసాల్లోకి చేరబోయేముందు అక్కడి సెప్టిక్ ట్యాంకులను ఓ సారి శ్రుభ్రం చేయించండి. గతంలో మాణిక్ సర్కార్ నివాసంలో మహిళ అస్తిపంజరం లభించిన అనుభవం దృష్ట్యా మీరీ పని తప్పక చెయ్యాలి..’ అని దేవ్‌ధర్ కామెంట్ చేశారు. సీఎం నివాసంలో అస్తిపంజరమా? : అగర్తలాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాణిక్ సర్కార్ 1998 నుంచి మొన్నటిదాకా ఉన్నారు. కాగా, 2005 జనవరి4న ఆ అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం బయటపడటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది దానిని గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మాణిక్ సర్కార్ కేసును సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత అది సీబీఐకి బదిలీ అయింది. 13ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చినట్లైంది. ‘ఇది మాణిక్ నియంత పాలనకు నిదర్శనమని’ సీపీఎం ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇప్పుడు ఉన్నపళంగా సునీల్ దేవ్‌ధర్ ‘అస్తి పంజరం’ ఉదంతాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేయడం వ్యూహంలో భాగమా, లేక యాదృశ్చికమా తెలియాల్సిఉంది. ఇంతకీ ఆ స్కెలిటన్ ఎవరిది? : సీఎం నివాసంలోని సెప్టిక్ ట్యాంక్‌లో తేలిన అస్తిపంజరం ఎవరిదనేదానిపై త్రిపురలో భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేపాల్‌కు చెందిన పని అమ్మాయిని.. సీఎం సిబ్బందిలో ఒకరు లేదా కొందరు అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని నాటి కాంగ్రెస్ నేత సమీర్ రాజన్ బర్మన్ ఆరోపించారు. హత్యాచారం కేసును తొక్కిపెట్టేక్రమంలో మృతురాలి కుటుంబాన్ని బలవంతంగా నేపాల్‌కు పంపించేశారని ఆయన పేర్కొన్నారు. మాణిక్ సర్కార్‌పై దినేశ్ కాంజీ అనే రచయిత రాసిన ‘మాణిక్ సర్కార్ : ది రియల్ అండ్ వర్చువల్’ అనే పుస్తకంలోనూ అస్తిపంజరం వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘అప్పట్లో జాతీయ స్థాయి మీడియాలో సైతం చర్చనీయాంశమైన ఈ కేసులో బర్మన్(కాంగ్రెస్ నేత) ఆరోపణలను ఏఒక్కరూ పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంద’ని రచయిత రాసుకొచ్చారు. దేవ్‌ధర్ తాజా ట్వీట్‌పై సీపీఎం శ్రేణులు ఇంకా స్పందించాల్సిఉంది. I request @BjpBiplab, new CM of Tripura, to get septic tanks of all minister quarters cleaned before occupying them. It should be recollected that a woman’s skeleton was found in septic tank of Ex CM Manik Sarkar's quarter on Jan 4, 2005 but the case was deliberately suppressed. — Sunil Deodhar (@Sunil_Deodhar) 10 March 2018 -
అయ్యో.. పన్నీర్ సెల్వం!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన పన్నీర్ సెల్వంకు అధికార లాంఛనాలు దూరమవుతున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెల్వం కారుకు ఉన్న ఎర్ర బుగ్గను అధికారులు తొలగించారు. పన్నీర్ సెల్వం నివాసం వద్ద భద్రతను పోలీసులు తగ్గించారు. సోమవారం ఆయన ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేయనున్నారు. ఈ నెల 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) రోజు శశికళపై తిరుగుబాటు చేశారు. గవర్నర్ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో దాదాపు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది. సీఎం కుర్చీ చివరకు శశికళ, పన్నీర్ సెల్వం దక్కలేదు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఈ నెల 18న శాసనసభలో పళనిస్వామి బలం నిరూపించుకోనున్నారు. -
సీఎం కొత్త అధికారిక నివాసానికి శంకుస్థాపన
నూతన సముదాయంలో అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మం దిరంతో కూడిన నూతన భవన సముదాయానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయం పక్కనే కొత్త భవన సముదాయం నిర్మించేందుకు అత్యంత నిరాడంబరంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలుసుకోవడానికి ప్రస్తుత క్యాంపు కార్యాలయం ఏ మాత్రం అనువుగా లేనందున కొత్త కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. నూతన భవన సముదాయం అవశ్యకతను వివరిస్తూ ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేసింది. హోటళ్లు, వర్సిటీల్లో సమావేశాలు.. రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహాల్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిర్వహణకు కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా, ఇతర ముఖ్య సమావేశాలు జరుపుకోవాలన్నా సరైన సమావేశ మందిరం అందుబాటులో లేదు. దీంతో హోటళ్లలో సమావేశాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలంటే జేఎన్టీయూ, వ్యవసాయ వర్సిటీలకు వెళ్లాల్సిందే. మిషన్ కాకతీయ సమావేశం జేఎన్టీయూలో, మిషన్ భగీరథ సమావేశాన్ని వ్యవసాయ వర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది. మంత్రివర్గ సమావేశం నిర్వహించినప్పుడు భోజనాల కోసం మంత్రులు బయట హోటల్‌కు వెళ్తున్నారు. ఈ అవసరాలకు సరిపడా సమావేశ హాలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోగానీ, సచివాలయంలో కానీ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ముఖ్యమంత్రి కూడా తన అధికారిక నివాసంలో ప్రతీ రోజు సమీక్షలు నిర్వహిస్తారు. విధాన నిర్ణయాల కోసం, పరిపాలన సమన్వయం కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. దీనికి కూడా ఎంసీఆర్హెచ్ఆర్డీకో.. మరో చోటికో వెళ్లాల్సి వస్తోంది. 8.9 ఎకరాల స్థలంలో నూతన సముదాయం ఇక ముఖ్యమంత్రిని కలవడానికి నిత్యం వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశవిదేశీ ప్రముఖులు వస్తున్నారు. కానీ, వారి కార్లు కూడా క్యాంపు కార్యాలయంలో పార్క్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంపు కార్యాలయంలో ఒక్క ముఖ్యమంత్రి కారు తప్ప మిగతా కార్లు సరిపోవు. మిగతా కార్లన్నీ రోడ్డుపై ఉండాల్సిందే. ఓ ఐదొందల మంది సీఎం కార్యాలయానికి వస్తే వారికి నిలువ నీడ కూడా ఉండడం లేదు. ఫలితంగా సందర్శకులను ముఖ్యమంత్రి కలవలేకపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిత్యం సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా, కనీసం వెయ్యి మంది పట్టే సమావేశ మందిరంతో కూడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆర్అండ్బీ శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం ఉండే విధంగా పంజగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు దీనిలో భాగంగానే సీఎం అధికారిక నివాస సముదాయానికి శనివారం శంకుస్థాపన చేశారని సీఎంవో తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్అండ్బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
దత్తన్నకు ఇల్లు కావాలి..!
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యులు ఇంటి కోసం కష్టాలు పడ్డారంటే అర్థముంది. కానీ సాక్షాత్తు కేంద్రమంత్రికి కూడా ఇంటి కష్టాలు తప్పడం లేదు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు దేశరాజధాని ఢిల్లీలో అధికార నివాసం కరవైంది. ఆయనకు కేంద్రం కొపర్నికస్ మార్గ్‌లోని 20వ నంబర్ బంగళాను కేటాయించింది. అయితే దానిలో ఉన్న ఎంపీ ఖాళీ చేయకపోవడంతో దత్తన్న ఏపీభవన్‌లోని ఓ సాధారణ గదిలో బస చేయాల్సి వస్తోంది. దత్తాత్రేయకు కేటాయించిన భవనంలో 2014 వరకు ఎంపీగా ఉన్న కల్యాణ్‌సింగ్ నివసించేవారు. ప్రస్తుతం కల్యాణ్‌సింగ్ రాజస్థాన్ గవర్నర్‌గా వెళ్లారు. అయితే ఆ బంగళాలో కల్యాణ్‌సింగ్ కుమారుడు, ఎంపీ రాజ్వీర్సింగ్ ఉంటున్నారు. రాజ్వీర్ ఈ బంగళాను ఎందుకు ఖాళీ చేయడం లేదంటే ఆయనకు కేటాయించిన ఇంట్లో మరో ఎంపీ దుష్యంత్‌సింగ్ ఉంటున్నారు. దుష్యంత్‌సింగ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు. దుష్యంత్ ఆ బంగళాను ఎందుకు ఖాళీ చేయలేదంటే.. ఆయనకు కేటాయించిన బంగళా నవీకరణలో ఉంది. ఆ పని పూర్తయ్యే వరకూ ఆయన ఖాళీ చేయరట. దుష్యంత్ బంగళాను ఖాళీ చేస్తేగానీ రాజ్వీర్ దత్తన్నకు కేటాయించిన బంగళాను ఖాళీ చేసే పరిస్థితి లేదు. కల్యాణ్‌సింగ్, వసుంధర రాజే బీజేపీలో సీనియర్ నాయకులు. దీంతో దత్తాత్రేయ వారిని గట్టిగా నిలదీయలేని పరిస్థితి. వాళ్లతో కయ్యం ఎందుకని సౌమ్యుడైన దత్తన్న తనకు వేరే బంగళా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సఫ్దర్‌జంగ్‌లోని ఓ భవనాన్ని ఆయనకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. -
ఆ ఇంట్లో 31 ఏసీలు.. 12 గీజర్లు!!
ఒక ఇంట్లో ఎన్ని ఏసీలు అవసరం అవుతాయి.. మహా అయితే మూడు లేదా నాలుగు అంతే కదా. కానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో ఎన్ని ఏసీలుండేవో తెలుసా? ఏకంగా 31 ఏసీలు!! వాటితో పాటు 25 రూం హీటర్లు కూడా ప్రత్యేకంగా ఉండేవట. ఈ విషయం అంతా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలన్నీ వచ్చాయి. నెం.౩ మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో 31 ఏసీలు, 15 డిజర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లు.. ఇవన్నీ ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా బంగ్లాకు మార్పుచేర్పులు చేయడానికి రూ. 16.81 లక్షలు ఖర్చుచేసినట్లు సీపీడబ్ల్యుడీ తెలిపింది. కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆమె వెళ్లిపోయేటప్పుడు ఆ ఇంటినుంచి వాటన్నింటినీ తీసేశారు. వాటిలో కొన్నింటిని ప్రస్తుతం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాల మేరకు ఉపయోగిస్తున్నారు. మిగలిన వాటిని అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తామన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్ నివసించిన ఈ బంగ్లాను 1920లో కట్టారు. ఇది దాదాపు మూడున్నర ఎకరాల్లోవిస్తరించింది. ఇప్పుడీ బంగ్లాను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేటాయించారు. ఆ సమయంలో దానికి రూ. 35 లక్షలతో మరమ్మతులు చేశారు. -
హమ్మయ్య... ఇల్లు దొరికింది!!
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఓ ఇల్లు దొరికింది. అద్దె ఇంటి కోసం ఆయన గత కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలో ఆయనకు ఇప్పుడు ఓ ఇల్లు దొరికింది. దీంతో వచ్చే నెల మొదటివారంలోనే ఆయన తన అధికారిక నివాసమైన తిలక్ లేన్ ఇంటిని ఖాళీ చేస్తారని తెలుస్తోంది. నరేన్ జైన్ అనే ఆయన తనకు ఇల్లు ఇచ్చారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలని కేజ్రీవాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ భుకు రాం జైన్ కుమారుడే ఈ నరేన్ జైన్. ఈయనకు ఢిల్లీలో అనేక ఆస్తులున్నాయి. వాటిని అద్దెలకు ఇస్తూ ఉంటారు. ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాల్సిందిగా తన బ్రోకర్‌కు చెప్పానని, చివరకు అది కేజ్రీవాల్‌కే వెళ్లిందని నరేన్ జైన్ తెలిపారు. ఈ ఇంట్లో నాలుగు బెడ్రూంలు, నాలుగు బాత్రూంలు, ఒక కిచెన్, డైనింగ్ రూం, హాలు ఉన్నాయి. ఇంటిముందు, వెనక భాగాల్లో చిన్న చిన్న తోటలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇది ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తండ్రిది. కానీ, ఆయన 1960లలోనే అమ్మేశారు. తర్వాత 2005లో జైన్ దీన్ని కొన్నారు. సాధారణంగా అయితే ఈ ఇంటికి నెలకు 50 వేల నుంచి 60 వేల వరకు అద్దె ఉంటుందని జైన్ చెప్పారు. అయితే, గత తొమ్మిదేళ్లుగా ఇది ఖాళీగా ఉన్నందున చాలా మరమ్మతులు చేయాల్సి ఉందని, వాటికి కనీసం 15 రోజులు పడుతుందని అన్నారు. I have finally decided upon a house offered by Sh Naren Jain in Civil Lines area. Thanks Naren ji. — Arvind Kejriwal (@ArvindKejriwal) June 20, 2014 -
మోడీ కోసం.. 7 రేస్ కోర్స్ రోడ్డు సిద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం 7 రేస్ కోర్స్ రోడ్డు కొత్త హంగులు సంతరించుకుంది. ఈ భవనానికి రంగు వేసి, పూలతో అలంకరించారు. భారత 15వ ప్రధాన మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఈ ఇంట్లోకి రానున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మోడీ ఇంట్లోకి రావాలని భావిస్తే ఆయన కోసం 3 నెంబర్ బంగ్లాను సిద్ధంగా ఉంచారు. మోడీ బస చేయడానికి వీలుగా ఈ అతిథి గృహంలో ఏర్పాట్లు చేశారు. రేసు కోర్సు రోడ్డుకు రాష్ట్రపతి భవన్‌కు కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో పాటు అధికార నివాసాన్ని ఖాలీ చేశారు.