దత్తన్నకు ఇల్లు కావాలి..! | Union min Dattatreya seeks in-depth probe into SIMI activities | Sakshi
Sakshi News home page

దత్తన్నకు ఇల్లు కావాలి..!

Published Sun, Apr 12 2015 3:46 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

దత్తన్నకు ఇల్లు కావాలి..! - Sakshi

దత్తన్నకు ఇల్లు కావాలి..!

సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యులు ఇంటి కోసం కష్టాలు పడ్డారంటే అర్థముంది. కానీ సాక్షాత్తు కేంద్రమంత్రికి కూడా ఇంటి కష్టాలు తప్పడం లేదు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు దేశరాజధాని ఢిల్లీలో అధికార నివాసం కరవైంది. ఆయనకు కేంద్రం కొపర్నికస్ మార్గ్‌లోని 20వ నంబర్ బంగళాను కేటాయించింది. అయితే దానిలో ఉన్న ఎంపీ ఖాళీ చేయకపోవడంతో దత్తన్న ఏపీభవన్‌లోని ఓ సాధారణ గదిలో బస చేయాల్సి వస్తోంది.

దత్తాత్రేయకు కేటాయించిన భవనంలో 2014 వరకు ఎంపీగా ఉన్న కల్యాణ్‌సింగ్ నివసించేవారు. ప్రస్తుతం కల్యాణ్‌సింగ్ రాజస్థాన్ గవర్నర్‌గా వెళ్లారు. అయితే ఆ బంగళాలో కల్యాణ్‌సింగ్ కుమారుడు, ఎంపీ రాజ్‌వీర్‌సింగ్ ఉంటున్నారు. రాజ్‌వీర్ ఈ బంగళాను ఎందుకు ఖాళీ చేయడం లేదంటే ఆయనకు కేటాయించిన ఇంట్లో మరో ఎంపీ దుష్యంత్‌సింగ్ ఉంటున్నారు. దుష్యంత్‌సింగ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు.

దుష్యంత్ ఆ బంగళాను ఎందుకు ఖాళీ చేయలేదంటే.. ఆయనకు కేటాయించిన బంగళా నవీకరణలో ఉంది. ఆ పని పూర్తయ్యే వరకూ ఆయన ఖాళీ చేయరట. దుష్యంత్ బంగళాను ఖాళీ చేస్తేగానీ రాజ్‌వీర్ దత్తన్నకు కేటాయించిన బంగళాను ఖాళీ చేసే పరిస్థితి లేదు. కల్యాణ్‌సింగ్, వసుంధర రాజే బీజేపీలో సీనియర్ నాయకులు. దీంతో దత్తాత్రేయ వారిని గట్టిగా నిలదీయలేని పరిస్థితి. వాళ్లతో కయ్యం ఎందుకని సౌమ్యుడైన దత్తన్న తనకు వేరే బంగళా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సఫ్దర్‌జంగ్‌లోని ఓ భవనాన్ని ఆయనకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement