Minister Bandaru Dattatreya
-
పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ
సాక్షి, న్యూడిల్లీ : ప్రస్తుత (2016-17) సంవత్సరానికి గాను గత డిసెంబర్ లో నిర్ణయించిన విధంగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందిస్తామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వత్తిడి తెస్తోందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. డిపాజిటర్లకు వడ్డీ రేటును తగ్గించేది లేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ప్రత్యేక సమావేశానికి దత్తాత్రేయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అవసరమైతే ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని, ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖను కోరానని, వర్కర్లకు ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందించాల్సిందేనని దత్తాత్రేయ చెప్పారు. సమర్ధవంతమైన సేవలు అందించడానికి అనువుగా సమాచార సాంకేతికతను విరివిగా వినియోగించాలన్న ప్రభుత్వ విధానానికి లోబడి ఈపీఎఫ్ ప్రయోజనాల అందుబాటును విస్తరించడానికి ఆధార్ సీడింగ్ అప్లికేషన్ ను దత్తాత్రేయ ప్రారంభించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 2.5 లక్షల మేరకు కనీస హామీ ప్రయోజనం అందించాలన్న ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసింది. -
కార్మికులకు మెరుగైన వైద్యానికి నిమ్స్‌తో ఒప్పందం
- కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి - తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో 13 సంచార వైద్యశాలలు సాక్షి, హైదరాబాద్: కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో నిమ్స్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదు ర్చుకోనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆది వారం ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ఈఎస్ఐ మొబైల్ క్లినిక్‌లను ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ ఐ డిస్పెన్సరీలు లేని ప్రాంతాల్లో సేవలందిం చేందుకు మొబైల్ క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దేశంలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మొబైల్ క్లినిక్‌లను విని యోగిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 8 మొబైల్ క్లినిక్‌లను ఆదిలా బాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్ల గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ .. మిగతా ఐదింటిని ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనం తపురం జిల్లాల్లోనూ సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి మొబైల్ క్లినిక్‌లో ఒక వైద్యుడు, ఫార్మాసిస్టు, అటెండర్, డ్రైవర్‌తో పాటు అవసరమైన సామగ్రి, మందు లు అందుబాటులో ఉంటాయన్నారు. వాహ నం రోజుకు 2 ప్రదేశాల్లో సంచరిస్తుందని, కార్మికులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహి స్తుందన్నారు. ప్రతి ప్రాంతాన్నీ వారంలో 2 రోజులు కవర్ చేస్తామన్నారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 పడకల స్థాయికి పెంచుతామన్నారు. ఈఎస్ ఐసీ వైద్య కళాశాలలో పడకల సంఖ్యను 500 కు పెంచనున్నట్లు తెలిపారు. ఈఎస్ఐసీ లబ్ధి దారుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచామని, మహిళా ఉద్యోగు ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించడంతో మహిళ లకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు. జాతీయ ఓబీసీ కమిష న్కు చట్టపరమైన హోదా కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీ పార్లమెంట్ సభ్యుల సంఘం చైర్మన్‌గా ఓబీసీలపై ఒక స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పిం చానని, మండల్ కమిషన్ సిఫారసుల వెల్లడి తర్వాత కూడా వారికి అవకాశాలను నిరాకరిస్తున్న విషయాన్ని వివరించానన్నారు. తన నివేదికను ప్రధాని ఆమోదించారన్నారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి రూ.1729 కోట్లు - రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడి - పలు రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ మాత్రం నిధుల కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సకాలంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి బడ్జెట్లో రూ.1729 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు సమానంగా నిధులు కేటాయిస్తాయని, 25 శాతం మూలధనంగా సమకూర్చి మిగతా నిధులను తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను శనివారం ఆయన హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో వీడియో ద్వారా ప్రారంభించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కల్వకుంట్ల కవిత, ఏపీ జితేందర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, డి.శ్రీనివాస్, బి.బి.పాటిల్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు శ్రీవాస్గౌడ్, బి.గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్–మోర్తాడ్ మార్గం ప్రారంభం... ఈ కార్యక్రమంలో సురేశ్‌ప్రభు... నిజామాబాద్–మోర్తాడ్, దేవరకద్ర–జక్లేర్ కొత్త రైల్వే మార్గాలను, నిజామాబాద్– కరీంనగర్, మహబూబ్‌నగర్–జక్లేర్ మధ్య డెమూ ప్యాసిం జర్ రైళ్లను ప్రారంభించారు. మహబూబ్‌నగర్– సికింద్రా బాద్ కొత్త రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశారు. పూర్తిగా నగదు రహిత సేవలను అందుబాటులోకి తెచ్చిన నాంపల్లి, సికింద్రాబాద్, బాసర, గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, రాయచూర్, ఔరంగాబాద్, నాందేడ్ రైల్వేస్టేషన్లను డిజిటల్ పేమెంట్ స్టేషన్లుగా ప్రకటించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో 225 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పవర్, వాటర్ రీసైక్లింగ్ యూనిట్లు, పునరుద్ధరించిన నిజాం కాలం నాటి ఆలుగడ్డ బావిని మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి, మహారాష్ట్రలో గుడిపడవ పండుగల కానుకగా అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ఈ ఏడాది రూ.4 వేల కోట్లు ఆదా అయినట్లు మంత్రి చెప్పారు. ప్రతి రైల్వే స్టేషన్లో సోలార్ పవర్ యూనిట్‌ను ప్రారంభిస్తాం. ఆలుగడ్డబావి వంటి నీటి వనరులను పునర్వినియోగంలోకి తేవడంతో పాటు, వాటర్ రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా ద.మ.రైల్వేలో ఏటా రూ.2.5 కోట్లు ఆదా అవుతుంది. రాష్ట్రంలో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు రైల్వే స్థలాల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. లింగంపల్లిలో రెండు రైళ్లకు హాల్టింగ్... ప్రయాణికుల కోరిక మేరకు ముంబై–భువనేశ్వర్ (11019/11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–పుణే ఎక్స్‌ప్రెస్ (17014/17013) రైళ్లను లింగంపల్లి స్టేషన్లో హాల్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. భద్రాచలం రోడ్డు నుంచి భద్రాచలంటౌన్ వరకు రైల్వేలైన్ నిర్మించాలని దత్తాత్రేయ కోరారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపట్ల ఎంపీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో పెద్దపల్లి–నిజామాబాద్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. చిత్రంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు మల్లారెడ్డి, జితేందర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు -
బయ్యారంలో పీపీపీ విధానంలో స్టీలు ప్లాంటు
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా బయ్యారంలో విశాఖ తరహా భారీ స్టీలు ప్లాంటు సాధ్యం కాదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ముడి సరుకులో నాణ్యత లేనందున ఛత్తీస్‌గఢ్ తరహాలో పీపీపీ విధానంలో సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ఉక్కు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ తన కార్యాలయానికి వచ్చిన ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో ఈ అంశంపై సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘బయ్యారంలో భారీ స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తరువాత కేంద్రం ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి యోగ్యత అధ్యయనం చేయించింది. అయితే ఇక్కడ లభించే ఐరన్ ఓర్లో మ్యాగ్నటైట్ ఎక్కువగా ఉంది. హెమటైట్ తక్కువగా ఉంది. అందువల్ల విశాఖ తరహాలో భారీ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు యోగ్యత లేదని టాస్క్‌ఫోర్స్ తేల్చింది. దీనిపై నేడు మరోసారి ఉక్కు మంత్రితో సమీక్ష జరిపాం. ఉన్న ముడి వనరులతో పీపీపీ విధానంలో ఒక సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు సూత్ర ప్రాయ అంగీకారం తెలిపినట్టు ఉక్కు మంత్రి తెలిపారు. తగిన సర్వే చేసి ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు, సెప్టెంబరులోగా ఈ నివేదిక పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. మ్యాగ్నటైట్ గల ఓర్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలో స్టీలు ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో బయ్యారంలో కూడా కేంద్రం, రాష్ట్రం, సెయిల్, ప్రయివేటు భాగస్వామితో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నాం..’ అని దత్తాత్రేయ పేర్కొన్నారు. జాతీయ రూర్బన్ మిషన్ కింద... కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కూడా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రూర్బన్ మిషన్ కింద రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్, మెదక్ జిల్లాలోని రాయకల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లి ప్రాంతాలను ఎంపిక చేశారని వివరించారు. ఆయా ప్రాంతాలకు భారీగా నిధులు దక్కనున్నట్టు మంత్రి వివరించారు. ఇదే పథకం కింద చౌటుప్పల్, కల్వకుర్తి ప్రాంతాలను చేర్చాలని విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు. అలాగే యూపీఏ హయాంలో ‘పుర’ పథకం కింద వరంగల్లు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారని, ఈ పథకం రద్దయిన నేపథ్యంలో తిరిగి దీనిని పునరుద్ధరించాలని కోరినట్టు తెలిపారు. సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న సన్నూరు, అన్నారం షరీఫ్, కొలనుపాక గ్రామాలకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అనుసంధానించాలని కోరినట్టు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం
రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్రాన్ని కోరిన కాప్సీ, ఐఐఎస్‌ఎస్‌ఎం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నవారికి కనీస వేతనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కేంద్రాన్ని ‘ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (కాప్సీ), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ, సెఫ్టీ మేనేజ్మెంట్(ఐఐఎస్‌ఎస్‌ఎం)లు కోరాయి. ఈ మేరకు కాప్సీ ప్రతినిధులు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘అభినందన్ సమారోహ్’ కార్యక్రమంలో కాప్సీ అధ్యక్షులు వి. విశ్వనాథ్, కాప్సీ, ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ కున్వర్ విక్రంసింగ్ తదితరులు దత్తాత్రేయను సత్కరించారు. కార్యక్రమంలో ఐఐఎస్‌ఎస్‌ఎం ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఎంపీ అయిన ఆర్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
వాజ్‌పేయి అజాతశత్రువు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అజాత శత్రువు, ఆదర్శవాది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్ పేయి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ యువజన మోర్చా ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా దత్తాత్రేయ మాట్లాడుతూ స్వతంత్రంగా, స్వశక్తితో ఎదిగిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. వాజ్‌పేయి ప్రసంగాలు ఆసక్తికరంగా, సంపూర్ణ అవగాహనతో ఉండేవన్నారు. సంస్కరణలను అమలు చేయాలని చెప్పిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇప్పుడు పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించడం హాస్యాస్పదమని విమ ర్శించారు. రాబోయే రోజుల్లో 3 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయ తీలకు నిజమైన అధికారాలను ఇచ్చిన నాయకుడు ప్రధాని మోదీ అని దత్తాత్రేయ పేర్కొన్నారు. కె.లక్ష్మణ్ మాట్లాడు తూ. వాజ్‌పేయి జన్మదినాన్ని సుపరిపాలన దినంగా నిర్వ హిస్తున్నామన్నారు. వాజ్‌పేయి కలలను సాకారం చేసే విధంగా మోదీ పాలిస్తున్నారని చెప్పారు. ప్రతీ రూపాయి పేదవానికి, లబ్ధిదారునికి అందే విధంగా కేంద్రం అవినీతి రహిత సమాజంకోసం సంస్కరణలను తీసుకువచ్చిం దన్నారు. నగదురహిత లావాదేవీలను విస్తృతంగా ప్రచా రం చేయాలని లక్ష్మణ్ కార్యకర్తలకు సూచించారు. -
ఇంట్లో పనిచేసేవారికీ ఈఎస్ఐ సేవలు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ఇళ్లలో పనిచేసే వారికి కూడా ఈఎస్ఐ వైద్య సేవలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పెలైట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆదివారమిక్కడి ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఇళ్లలో పనిచేసే వారికి సామాజిక ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రులలో ఓపీ సేవలు కల్పించేందుకు నామమాత్రంగా ఏడాదికి రూ.1,200 వసూలు చేయనున్నట్లు వివరించారు. అయితే వీటిని కూడా పనిచేసే వారి నుంచి కాకుండా ... పనిచేయించుకునే వారి నుంచి వసూలు చేస్తామన్నారు. మొదటి 6 నెలల పాటు ప్రతి నెలా రూ.200 వసూలు చేస్తామన్నారు. మెటర్నిటీ బిల్లు ఆమోదం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 1.8 మిలియన్ల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. -
కార్మికుల పొట్టగొట్టడం సరికాదు
బిల్ట్‌పై సమీక్షలో కేంద్ర డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రవీంద్రనాథ్ మంగపేట : నష్టాల సాకు చూపి కార్మికుల పొట్టగొట్టడం సరికాదని కేంద్ర డిప్యూటీ లేబర్ కమిషనర్ కేవీ.రవీంద్రనాథ్ అన్నారు. జూలై 28న బిల్ట్ జేఏసీ నాయకులు కేంద్ర ఉపాధి కల్పన, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి కార్మికుల పరిస్థితిపై వినతిపత్రం అందజేశారు. మంత్రి ఆదేశాల మేరకు కర్మాగారాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. బిల్ట్‌లో పరిస్థితిపై ఇక్కడి ఏడీఏం కార్యాలయంలో హెచ్ఆర్డీజీఎం కేశవరెడ్డి, బిల్ట్ జేఏసీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్ట్ యాజమాన్యం కార్మికులకు పద్నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. 680 మంది కార్మికులు, సిబ్బందికి రూ.20కోట్ల మేర వేతన బకాయిలు, రూ.1.80కోట్ల పీఎఫ్ బకాయిలు నిలిపివేయగా కార్మికుల కుటుంబాల్లో ఏర్పడిన ఇబ్బందులను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. 30 ఏళ్ల పాటు కర్మాగారంలో విషపూరిత వాతావరణంలో పనిచేసి అనారోగ్యానికి గురైన కార్మికులకు నేడు ఫ్యాక్టరీ వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను కమిషనర్‌కు కార్మికులు వివరించారు. పీఎఫ్ కార్మిక జేఏసీ నాయకులు సైతం కమిషనర్ ఎదుట తమకు జరిగిన అన్యాయంపై గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం బిల్ట్‌లో పరిస్థితి, కార్మికుల దుస్థితిపై కేంద్రమంత్రి దత్రాత్రేయకు నివేదిక అందిస్తానని కమిషనర్ తెలిపారు. బిల్ట్ జేఏసీ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి, వడ్డబోయిన శ్రీనివాస్, వడ్లూరి రాంచందర్, రవిమూర్తి, లక్ష్మీనారాయణ, డీవీపీ.రాజు, శర్మ, కార్మికులు పాల్గొన్నారు. -
'ఆపరేషన్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళతాం'
-
వీణావాణిల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం
- వారికి శస్త్రచికిత్స కంటే సామాజిక భద్రతే ముఖ్యం: దత్తాత్రేయ - వీణావాణి ప్రస్తుతం చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారు - వైద్యుల సలహా మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ‘‘అవిభక్త కవలలు వీణావాణిలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. వారి లో శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి శస్త్రచికిత్స చేస్తే 90 శాతం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశంలో వైద్యుల నిర్ణయమే అంతిమం..’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయ పేర్కొన్నారు. ప్రస్తుతం వీణావాణిలకు శస్త్రచికిత్స చేయడం కంటే సామాజిక భద్రత కల్పించడమే ముఖ్యమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తమ పిల్లలకు శస్త్రచికిత్స చేయించాలని కోరుతూ వీణావాణిల తల్లిదండ్రులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సపై సాధ్యాసాధ్యాలను ఆరా తీసేందుకు దత్తాత్రేయ శనివారం నిలోఫర్ ఆస్పత్రికి వచ్చారు. వీణావాణిలతో మాట్లాడారు, వారితో కాసేపు చదరంగం ఆడారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘‘వీణావాణిలను చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ రోజు కుది రింది. వెల్ కం సార్.. అంటూ వారు నన్ను ఆప్యాయంగా పలకరించారు. వారి గదిలోకి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తాం వెళ్తారా? అని అడిగితే.. అమ్మ ఒడిలాంటి ఆస్పత్రిని వదిలి వెళ్లబోమన్నారు. వారికి చిన్నప్పుడే శస్త్రచికిత్స చేసి ఉంటే బాగుండేది. అయినా ఈ అంశాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతాను. ప్రాణాలతో వారిని కాపాడే అవకాశముంటే తప్పకుండా శస్త్రచికిత్స చేయించేందుకు కృషి చేస్తాం. కార్మిక శాఖ తరఫున వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం..’’ అని చెప్పారు. ఆస్ట్రేలియా బృందం చికిత్స: లక్ష్మారెడ్డి వీణావాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన వైద్య బృందం ముందుకు వచ్చిందని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇక నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో వీణావాణిలను ఉంచడం కుదరని, వారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకు రానందున స్టేట్‌హోమ్‌కు తరలించడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. శనివారం ఆయన నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రితో పాటు ఎర్రగడ్డలోని ఛాతీ, మానసిక చికిత్సాలయాలను సందర్శించి... మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కలరా, ఇతర సీజనల్ వ్యాధులపై భయపడాల్సిన అవసరం లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశామన్నారు. -
మూడేళ్లలో కోటి మందికి ఉద్యోగాలు
ప్రసూతి సెలవులు 12 నుంచి 26 వారాలకు పెంపు: దత్తాత్రేయ హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో టెక్స్టైల్, గార్మెంట్ రంగాల్లో కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. టెక్స్టైల్, అపెరల్ రంగాల్లో కేంద్రం రూ.6 వేల కోట్ల పెట్టుబడులు, రాయితీల ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలి పారు. ఈ రంగంలో 75 శాతం మహిళలకే అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. శనివారం ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో విలేకరులతో దత్తాత్రేయ మాట్లాడారు. ఫ్యాషన్ టెక్నాలజీని అనుసరించి ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి మహిళలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. టెక్స్టైల్, అపెరల్ విధానానికి సంబంధించి రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం తరఫున అత్యధిక సహాయం అందేలా చూస్తా నన్నారు. చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట తదితర ప్రాంతాలపై ప్రత్యేక ప్రణాళికలు అందజేయాలన్నారు. మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. ఐటీలో 18 లక్షల మందికి ఉపాధి చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. స్టార్టప్, స్టాండప్ కింద రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 18లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే వారికి భవిష్యనిధి డబ్బును కేంద్రమే చెల్లిస్తుందన్నారు. పరిశ్రమల ఉత్పత్తి పెంచడం కోసం పనిగంటలను పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలను వందశాతం ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా దత్తాత్రేయ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు దత్తాత్రేయను కలసి లండన్‌లో జూలై 17న నిర్వహించే బోనాల జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు. -
యోగ మనదే...
భాగ్యనగరం ‘యోగ’మంత్రం పఠించింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మంగళవారం సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు, పార్కులు, స్టేడియాలు, కాలనీలు, జైళ్లు...ఇలా అన్ని ప్రాంగణాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల నుంచి ప్రముఖల వరకు అందరూ యోగాసనాలు వేసి ఆరోగ్య ప్రాధాన్యతను చాటారు. గన్‌ఫౌండ్రీ : యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఎల్బి స్టేడియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... యోగా మతానికి చెందినది కాదని, భారతీయ సంస్కతికి చిహ్నమన్నారు. అరబ్ దేశాల్లో సైతం యోగాను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. యోగాకు ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగాతో వ్యక్తిత్వ వికాసం, క్రమ శిక్షణ అలవడుతుందన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... కొన్ని సంస్థలు, శక్తులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యోగాపై దుష్ర్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం పలు పాఠశాలలకు చెందిన విద్యార్ధుల యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట అధ్యక్షులు రామరాజు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యుత్’కు కేంద్రం వెన్నుదన్ను: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్ల రుణాలను విడుదల చేసేందుకు ముందుకు వచ్చిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వీటిల్లో రూ.11,300 కోట్ల రుణాలను ఇప్పటికే విడుదల చేసిందన్నారు. ఈ రుణాలతోనే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఆర్ఈసీ, ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థల అధికారులతో శుక్రవారం ఇక్కడ సమీక్ష నిర్వహించిన అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ఇంకా ఏమైన అవసరాలుంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడి తీరుస్తానని అన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు త్వరలో ప్రధాని నరేంద్ర మోదీచే శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఉత్తర-దక్షిణ భారత దేశాన్ని అనుసంధానించేందు కు నిర్మిస్తున్న వార్దా-డిచ్పల్లి-మహేశ్వరం విద్యుత్ కారిడార్ నిర్మాణాన్ని 2018 మేలోగా పూర్తి చేస్తామన్నారు. ఇందులో తెలంగాణకు 2000 మెగావాట్ల కారిడార్‌ను కేటాయించామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 2000 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రం లోని 12 మునిసిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చుతున్నామన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలను గట్టెక్కించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరి ప్రయోజనం పొందాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్ఈసీ ప్రాంతీయ డెరైక్టర్ ఎన్.వెంకటేశన్, పవర్ గ్రిడ్ ఈడీ వి.శేఖర్, ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాస్, బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంబలి కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ముషీరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నదని, వడదెబ్బతో 400మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం రాంనగర్ మీ-సేవా సమీపంలో హరేకృష్ణా మూవ్మెంట్, భోజనామృత్, దత్తాత్రేయ చొరవతో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశుగ్రాసం లేక పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం నీటి తొట్టిలను కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు నివారణకు రూ.385కోట్లు విడుదల చేసిందని రెండవ విడతగా మరో రూ.350కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. మంత్రులు జిల్లాల్లో పర్యటించి రైతలకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్ ఉపాధ్యక్షులు మాధవదాస, ఆపరేషన్స్ ఇన్చార్జి కౌంతయ్య దాస, బీజేపీ నాయకులు మాధవ్, విన్ను ముదిరాజ్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఓం ప్రకాష్, మోహన్, రమేష్, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు దత్తన్న 'మే డే' శుభాకాంక్షలు
హైదరాబాద్ : కార్మికుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. దీనిపై అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం మే డే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కార్మిక శక్తి ఎదగాలని ఆశించారు. కార్మికులే దేశ నిర్మాతలుగా అభివర్ణించారు. ఇటీవల ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ఆర్థిక శాఖ తగ్గించడంపై దుమారం రేగిన నేపథ్యంలో కార్మిక శాఖ, ఆర్థిక శాఖల మధ్య ఎటువంటి విబేధాలు లేవని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కార్మికుల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. -
కనీస వేతనం రూ.10 వేలు
♦ కాంట్రాక్టు కార్మికులకు దేశమంతా అమలయ్యేలా ఆర్డినెన్స్ తెస్తాం ♦ నిపుణులైన కార్మికులకు రూ.18 వేలు: కేంద్రమంత్రి దత్తాత్రేయ ♦ న్యాయశాఖకు ఫైలు పంపాం.. త్వరలోనే గెజిట్ ♦ పార్లమెంట్లో చట్టానికి కాంగ్రెస్, లెఫ్ట్ అడ్డుపడుతున్నాయని విమర్శ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నిపుణులైన (స్కిల్డ్) కార్మికులకు కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సమాన వేతనం అందించేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రికి సంబంధిత ఫైలు పంపామని, త్వరలో గెజిట్ విడుదల చేస్తామని వివరించారు. కనీస వేతన చట్టానికి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురావడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయని దుయ్యబట్టారు. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కనీస వేతన చట్టానికి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్, వామపక్ష పార్టీలే తమపై దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఇది వరకే కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి చేసిందని, బోనస్‌ను రూ.3,500 నుంచి రూ.7 వేలకు పెంచిందని గుర్తుచేశారు. అన్ని కంపెనీలు పాటించాల్సిందే.. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులకు రోజుకు రూ.160 మాత్రమే అందుతోందని, ఇకపై రూ.333 అందేలా చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలు, పరిశ్రమలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే కార్మిక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తమ నిర్ణయం వల్ల ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య కార్మికులు చేసిన సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కేంద్రం తీసుకురానున్న ఆర్డినెన్స్ ద్వారా వారికి ఇక నుంచి కనీసం రూ.10 వేలు అందుతుందన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికులను వేధించకుండా, ఇష్టానుసారం బదిలీలు చేయకుండా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్నిచోట్ల కార్మికులకు నెలవారీ వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కనీస వేతన చట్టం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే కార్మికులకు సొంత ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది వరకు ఇంటి నిర్మాణం కోసం కేంద్రం రూ.40 వేలు మాత్రమే ఇచ్చేదని, ప్రస్తుతం దాన్ని రూ.1.50 లక్షలకు పెంచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్థలాలు కేటాయిస్తే తామే ఇళ్లు నిర్మిస్తామన్నారు. -
యువతకు అండగా ఉంటాం
► స్కిల్స్‌పై శిక్షణకు ప్రణాళిక ► పరిశ్రమలకు ప్రోత్సాహం ► కేంద్ర మంత్రి దత్తాత్రేయ ► పరిశ్రమలు వృద్ధి చెందాలి ► ఉత్సాహంగా సృజన-16 తిమ్మాపూర్ : విద్యార్థులు మాస్టర్స్, రీసెర్చ్ చేయాలని, యువతకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న సృజన-16 రాష్ట్రస్థాయి టెక్నికల్ సింపోజియంను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఉన్నత విద్య చాలా ముఖ్యమని, టెక్నికల్ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రం రూ.18 వేల కోట్లు కేటాయించిందన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా లక్ష్యసాధన కోసం ప్రధాని నరేంద్రమోడీ దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లేనని, క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. యువత దేశాభివృద్ధికి, పునఃనిర్మాణానికి కృషి చేయాలని కోరారు. టెక్నాలజీలో దేశాన్ని నంబర్‌వన్‌గా నిలుపుతామన్నారు. చిన్న పరిశ్రమల స్థాపనను కేంద్రం ప్రోత్సహిస్తోందని, రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. పరిశ్రమలు వృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని, సాంకేతిక నైపుణ్యాలతో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోందన్నారు. సింగరేణిలాంటి సంస్థల్లో ఇంజినీర్ల అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ‘సృజన’ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, ఆలోచనను పెంచుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న అతి పెద్ద సంస్థ ఏబీవీపీ అని అన్నారు. పలు సంస్థలు కుల, మత, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తుంటే, తామంతా భారతీయలమని గర్వంగా చెబుతున్న ఏబీవీపీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జేఎన్టీయూ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి, శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ఎం.లక్ష్మారెడ్డి, సెక్రటరీ ముద్దసాని రమేశ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నకేశవరెడ్డి, అయ్యప్ప, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్జీ, సృజన కార్యక్రమ కన్వీనర్ రాకేశ్, జాయింట్ సెక్రటరీ జగదీశ్, రిసెప్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దత్తన్న లేఖే ‘సెంట్రల్’
రోహిత్ ఆత్మహత్యకు కేంద్రబిందువుగా కేంద్రమంత్రి లేఖ ♦ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై రోహిత్ దాడి చేసినట్లు రుజువులు లేవన్న వర్సిటీ విచారణ కమిటీ... దత్తాత్రేయను ఆశ్రయించిన సుశీల్‌కుమార్ ♦ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడి వినతిపత్రాన్ని జతచేస్తూ ఆగస్టు 17న హెచ్ఆర్డీకి ఉత్తరం రాసిన దత్తాత్రేయ ♦ ఏం చర్యలు తీసుకున్నారంటూ వర్సిటీ వీసీకి హెచ్ఆర్డీ నుంచి ఐదు వరుస లేఖలు ♦ సెప్టెంబర్ 3, 24, అక్టోబర్ 6, 20, నవంబర్ 19న లేఖల పరంపర ♦ ఆగస్టులోనే ప్రొఫెసర్ల ద్విసభ్య కమిటీ క్లీన్చిట్ ఇచ్చినా... చివరకు డిసెంబర్ 21న ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ ♦ హాస్టల్, పరిపాలన భవనంలోకి అడుగుపెట్టరాదంటూ కఠినమైన ఆంక్షలు ♦ రాజకీయ ఒత్తిళ్ల వల్లే హెచ్ఆర్డీ జోక్యం చేసుకుందన్న విద్యార్థి సంఘాలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హెచ్‌సీయూలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య వివాదానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆగస్టు 17న రాసిన లేఖ కేంద్ర బిందువైంది. విశ్వవిద్యాలయం పరిధిలోని లోక్‌సభ సభ్యుడి హోదాలో దత్తాత్రేయ లేఖ రాయడం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆ లేఖ వివరాలను ప్రస్తావిస్తూ ఐదు సార్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాయడం వల్లే విద్యార్థులు సస్పెన్షన్‌కు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ హోదాలో దత్తాత్రేయ రాజకీయంగా ఒత్తిడి తేవడం, వర్సిటీ నుంచి సస్పెన్షన్‌తో వదిలిపెట్టకుండా హాస్టల్ కూడా ఖాళీ చేయాలనడం, పరిపాలన భవనంలోకి అడుగుపెట్టవద్దని ఆంక్షలు విధించినందువల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఇచ్చిన వినతిపత్రాన్ని జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ దత్తాత్రేయ గతేడాది ఆగస్టులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా వర్సిటీలో నిరసనలు తెలిపిన ఘటనను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. మెమన్ ఉరిపై నిరసన తెలియజేయడం ఏమిటని ప్రశ్నించినందుకు సుశీల్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారని, ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరారని, దాడికి కారకులపై చర్య తీసుకోవాలని దత్తాత్రేయ ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నారంటూ హెచ్ఆర్డీ శాఖ పలుమార్లు వీసీకి లేఖలు రాసింది. లేఖల పరంపర ఇదీ..: హెచ్‌సీయూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ దత్తాత్రేయ లేఖ రాసిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఐదు లేఖలు రాసింది. దత్తాత్రేయ లేఖను జత చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ సెప్టెంబర్ 3, అదేనెల 24న హెచ్ఆర్డీ ఉప కార్యదర్శి పేరిట వర్సిటీ వీసీకి లేఖలందాయి. ఆగస్టు 17నాటి దత్తాత్రేయ లేఖ, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో ఉప కార్యదర్శి రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అక్టోబర్ 6, అదేనెల 20 తేదీల్లో సంయుక్త కార్యదర్శి పేరిట మరో లేఖ అందింది. అప్పటికీ వీసీ నుంచి సమాధానం లేకపోవడంతో నవంబర్ 19న హెచ్ఆర్డీ అండర్ సెక్రటరీ పేరిట ఇంకో లేఖ అందింది. దత్తాత్రేయ రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నదే ఈ లేఖల ఉద్దేశం. అండర్ సెక్రటరీ రాసిన చివరి లేఖలో మాత్రం... వర్సిటీలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్న విద్యార్థులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు. హెచ్ఆర్డీ శాఖ నుంచి లేఖలు రావడంతో వీసీ ఒత్తిడికి లోనై రోహిత్‌తో పాటు ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్‌లోనూ కఠినమైన ఆంక్షలు మామూలుగా విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే వర్సిటీలో తరగతులకు హాజరవకుండా సస్పెన్షన్ విధిస్తారు. సస్పెన్షన్ ముగిసేదాకా ఎలాంటి అకడమిక్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వీలుండదు. కానీ రోహిత్‌తోపాటు నలుగురు విద్యార్థులపై హాస్టల్, భోజనశాలతో పాటు క్యాంపస్ ఆవరణలోని పరిపాలన భవనంలోకి అడుగుపెట్టకూడదని ఆంక్షలు విధించారు. సాధారణంగా విద్యార్థుల సస్పెన్షన్‌లో ఇలాంటి ఆంక్షలు ఉండవని విద్యార్థి సంఘాలంటున్నాయి. దానికి తోడు దత్తాత్రేయ లేఖ ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు విద్యార్థులకు చెప్పడం కూడా వారి ఆగ్రహానికి కారణమని ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదించింది. మామూలుగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వీసీ లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఫిర్యాదులో నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అలాంటప్పు డు ఫిర్యాదు చేసినవారి వివరాలు బహిర్గతం చే యాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లు బుకడంతో వర్సిటీ అధికారులు తమ తప్పు లేదని చెప్పుకోవడానికి దత్తాత్రేయ లేఖను బహిర్గతం చేశారు.దాంతోపాటే హెచ్ఆర్డీ లేఖల వివరాలను కూడా విద్యార్థి సంఘాలకు అందించారు. వర్సిటీపై ఎలాంటి ఒత్తిడి తేలేదు: హెచ్ఆర్డీ సాక్షి,న్యూఢిల్లీ: రోహిత్ సస్పెన్షన్ విషయంలో హెచ్‌సీయూపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర మానవ వనరుల శాఖ ఖండించింది. తాము కార్యాలయ విధానాల మాన్యువల్‌కు అనుగుణంగా వ్యవహరించామని శాఖ ప్రతినిధి ఘనశ్యామ్ గోయల్ మంగళవారం తెలిపారు. నిబంధనల ప్రకారం వీఐపీ రాసిన ఉత్తరాలకు 15 రోజుల్లో అవి అందినట్లుగా ధ్రువీకరించాల్సి ఉంటుందని, మరో 15 రోజుల్లో జవాబు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అయితే వర్సిటీ నుంచి స్పందన రాకపోవడంతో రిమైండర్లు పంపించాల్సి వచ్చింద న్నారు. పెండింగ్‌లో ఉన్న హామీలు, వీఐపీల సూచనల వివరాలను కూడా కేబినెట్ సమావేశాల్లో మంత్రిత్వ శాఖ అందివ్వాల్సి ఉంటుందన్నారు. జనవరి 7న మంత్రిత్వ శాఖకు హెచ్‌సీయూ జవాబు పంపించిందని అధికారులు తెలిపారు. హెచ్‌సీయూలో గత ఆరు నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలివీ.. జూలై 30: యాకూబ్ మెమన్ ఉరి. అదే రోజు వర్సిటీలో ఉరికి వ్యతిరేకంగా అంబేద్కర్ విద్యార్థి సంఘం (ఏఎస్ఏ) నిరసనలు ఆగస్టు 3: అంబేద్కర్ విద్యార్థి సంఘంలో అవివేకులున్నారని, వారివి పోకిరి చేష్టలు అంటూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఫేస్బుక్ స్టేటస్‌ను అప్డేట్ చేశారు ఆగస్టు 4: హెచ్‌సీయూ క్యాంపస్‌లో రోహిత్, ఇతర విద్యార్థులు తనను కొట్టారంటూ సుశీల్‌కుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు ఆగస్టు 4-13: ఏబీవీపీ, ఏఎస్యూ మధ్య గొడవలు. క్యాంపస్‌లో మీటింగ్‌కు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరు. దాడి చేసిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని డిమాండ్. ఘటనపై విచారణకు ఆదేశించిన వైస్ చాన్స్‌లర్. సుశీల్‌కుమార్‌పై రోహిత్ దాడి చేసినట్లు ఎలాంటి రుజువులు లేవని తేల్చిచెప్పిన ప్రొఫెసర్ ఆర్.పి.శర్మ, ప్రొఫెసర్ అలోక్ పాండే విచారణ కమిటీ ఆగస్టు 17: హెచ్‌సీయూ క్యాంపస్‌లో సుశీల్‌కుమార్‌పై ఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన కేంద్రమంత్రి దత్తాత్రేయ సెప్టెంబర్ 3: దత్తాత్రేయ లేఖలో వివరాలను ఉటంకిస్తూ హెచ్‌సీయూ వీసీకి మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి లేఖ సెప్టెంబర్ 24: సెప్టెంబర్ 3 నాటి లేఖకు వివరణ కోరుతూ వీసీకి ఉప కార్యదర్శి లేఖ అక్టోబర్ 6: దత్తాత్రేయ లేఖ, ఉపకార్యదర్శి మెమోలకు సంబంధించి వివరణ కోరుతూ వీసీ కి లేఖ రాసిన హెచ్ఆర్డీ సంయుక్త కార్యదర్శి అక్టోబర్ 20: అంతకుముందు రాసిన లేఖలకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరణ కోరుతూ వీసీకి సంయుక్త కార్యదర్శి లేఖ నవంబర్ 19: దత్తాత్రేయ లేఖ, ఉప కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేఖలకు వివరణ ఇవ్వకపోవడంపై వైస్ చాన్స్‌లర్‌కు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లేఖ డిసెంబర్ 21: రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసిన వీసీ జనవరి 17: రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య -
ఎంఐఎంతో టీఆర్ఎస్ రహస్య ఒప్పందం
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కాచిగూడ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అ ధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో ర హస్య ఒప్పందం చేసుకోవడం హై దరాబాద్ మహానగరానికి ప్రమాదకరమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బం డారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంఐఎం కన్నుసన్నల్లో నడు స్తూ ఏకపక్ష నిర్ణయాలతో హై దరాబాద్ను ఉగ్రవాదనగరంగా మారుస్తున్నదని ఆ రోపించారు. ఈ ప్ర మాదాన్ని నివారించేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ తన మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నిర్థిష్టమైన విధానమం లేకుండా చేపట్టిన స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమయాన్ని విజయవంతం చేయలేకపోయారన్నారు. ఐడిహెచ్ కాలనీలో మిన హా నగరంలో ఎక్కడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, వాటిని చూపుతూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. గ్రేటర్ శివార్లలో నిరుపయోగంగా ఉన్న 35వేల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందన్నా రు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ (మిత్రపక్షాలు), టీఆర్ఎస్ మ ధ్యనే పోటి ఉంటుందని, ఇరుపార్టీల కార్యకర్తలు సమన్వయంతో విజయానికి కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మా ట్లాడు తూ మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థులను ప్రకటిం స్తామని, వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలపైనే ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు విబేధాలను పక్కన పెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, చింతల రాం చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర నాయకులు వెంకటరమణి, మంత్రి శ్రీని వాస్, రాజశేఖర్‌రెడ్డి, ఎక్కాల నందు, కన్నె రమేష్‌యాదవ్, రామన్‌గౌడ్, బండారి రాధిక, దేవిరెడ్డి విజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోనస్ బిల్లుకు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ఇరవై మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులు ఉన్న కర్మాగారాల్లో బోనస్ లెక్కింపు పరిమితిని రెట్టింపు చేస్తూ ‘బోనస్ చెల్లింపు (సవరణ) బిల్లు 2015’కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. బోనస్ లెక్కింపు పరిమితి ప్రస్తుతమున్న నెలకు రూ. 3,500 నుంచి 7,000 రూపాయలకు పెరగనుంది. అదే సమయంలో బోనస్ చెల్లింపుకు అర్హత పరిమితిని.. ప్రస్తుతమున్న రూ. 10,000 నెల వేతనం నుంచి రూ. 21,000 వేతనానికి పెంచటంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బిల్లు అమలులోకి వస్తే.. 2014 ఏప్రిల్ నుంచి వర్తిస్తుంది. ఈ బిల్లుపై చర్చకు కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిస్తూ.. కార్మిక ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ బిల్లు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 6,203 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. జాతీయ కనీస వేతనాన్ని తప్పనిసరి చేస్తూ త్వరలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ‘రెండో జాతీయ కార్మిక కమిషన్ సిఫారసులను అనుసరిస్తూ.. 44 కేంద్ర కార్మిక చట్టాలను - పారిశ్రామిక వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, కార్మికుల భద్రత, రక్షణ పరిస్థితుల కోడ్ అనే 4 కోడ్ల రూపంలోకి మారుస్తాం’ అని వివరించారు. బిల్లుపై చర్చలో టీఆర్ఎస్ ఎంపీ కె.విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనస్ చెల్లింపుకు అర్హత వేతనాన్ని నెలకు రూ. 10 వేల నుంచి రూ. 21 వేలకు పెంచటం లోపభూయిష్టమన్నారు. కర్మాగారాల్లో కాంట్రాక్టు కార్మికులతో ఎక్కువ చేయించుకుంటూ తక్కువ వేతనం ఇస్తున్నారన్నారు. శంకర్ప్రసాద్దత్తా(సీపీఎం) ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. టీడీపీ ఎంపీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలో కార్మిక చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయంటూ.. కార్మికులకు భద్రత, రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గత సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మె చేసినపుడు కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బోనస్ బిల్లును తీసుకువచ్చారు. -
బండారు దత్తాత్రేయకు అస్వస్థత
-
ఎక్స్‌గ్రేషియా రూ.6 లక్షలకు పెంపు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ బీమా పథకం కింద ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కేంద్ర ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ట్రస్టీల సమావేశం అనంతరం దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. డిపాజిట్ లింక్డ్ బీమా పథకం ద్వారా ప్రస్తుతం కార్మికుల కుటుంబాలకు రూ.3.60 లక్షలు మాత్రమే అందుతోందని పేర్కొన్నారు. దీనివల్ల 4 కోట్ల మంది భవిష్యత్నిధి చందాదారులకు(ఈపీఎఫ్) లబ్ధి చేకూరుతుందన్నారు. సంవత్సరంపాటు తప్పనిసరిగా ఉద్యోగం చేసుండాలన్న నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పారదర్శకతతో ఉద్యోగుల భవిష్యనిధి కార్యకలాపాలను నిర్వహించడానికి మొబైల్ అప్లికేషన్ రూపొందించామన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ విశిష్ట ఖాతానంబర్, భవన నిర్మాణ కార్మికులందరికీ ఈపిఎఫ్ వర్తింపచేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమనిధి వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించని రాష్ట్రాల కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేయడంతోపాటు, ఆయా రాష్ట్రాల నిధులను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ తెలిపారు. -
కార్మికులందరికీ సామాజిక భద్రత
కనీస వేతనం కోసం కృషి డిస్పెన్సరీల పనితీరుపై కమిటీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శంభునిపేటలో బీడీ కార్మికుల సదస్సు కరీమాబాద్/పోచమ్మమైదాన్: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖామంత్రి బండారు ద త్తాత్రేయ అన్నారు. నగరంలోని శంభునిపేట ఆర్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన బీడీ కార్మికుల సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రతి బీడీ కార్మికురాలికి రూ.1000 అందేలా చూస్తానన్నారు. కార్మికుల కోసం లక్ష ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బీడీ కార్మికుల కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల పిల్లల చదువుల కోసం రూ.8 కోట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి పని తీరు, మౌలిక సదుపాయూలపై ఓ కమిటీ వేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, పుప్పాల రాజేందర్, జలగం రంజిత్, దేవేందర్‌రెడ్డి, మండల పరశురాములు, సురేష్, రాంరెడ్డి, గందె నవీన్ పాల్గొన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే.. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని.. అందులోభాగంగా తెలంగాణ అని బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్‌లోని ములుగు రోడ్డులోని బీజేపీ నాయకుడు వంగాల సమ్మిరెడ్డి స్వగృహంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. 40 కోట్ల అసంఘటిత కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డులను అందజేసి సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. తెలంగాణలో ఈసారి పంటలకు గడ్డు పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి త్వరలో పంటల బీమా పతకాన్ని ప్రవేశపెట్టి.. రైతులు, వారి కుటుంబ సభ్యులను పరిధిలోకి తీసుకవస్తామన్నారు. కేంద్రం వరంగల్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి తొలి విడతగా రూ. 2 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2020 నాటికి అందరికి సొంత ఇళ్లు ఉండాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హృదయ్ పతకాన్ని తీసుకవచ్చిందని.. అందులో వరంగల్‌ను ఎంపిక చేశారని తెలిపారు. యాదగిరి గుట్ట నుంచి హన్మకొండ వరకు ఫోర్‌లేన్ నేషనల్ హైవే రోడ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 1900 కోట్టు మంజూరు చేసిందన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. వరంగల్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారయణ రెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునిల్, బీజేపీ నాయకులు రావు పద్మ, కనుకుంట్ల రంజిత్ కుమార్, కోమాకుల నాగరాజు, రఘునారెడ్డి, మార్టిన్ లూథర్, జగదీశ్వర్లు పాల్గొన్నారు. సాక్షి కథనానికి స్పందన... ఈఎస్ఐ ఆసుపత్రిలో కానరాని వైద్య సేవలు అనే శీర్షిక ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఆస్పత్రిపై సాక్షిలో వచ్చిన కథనం విషయం బీజేపీ నాయకులు తన దృష్టి తీసుకవచ్చారని దీంతో వెంటనే ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కార్యక్రమాలు ఆలస్యం కావడంతో రద్దు చేసుకున్నానని వివరించారు. త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శిస్తానని వెల్లడించారు. బయోమెట్రిక్ విధానంతో డాక్టర్లు, సిబ్బంది హాజరు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రసూతి సెలవు 24 వారాలకు పెంపు!
న్యూఢిల్లీ: గర్భిణులైన ఉద్యోగులకు ప్రసూతి సెలవును రెట్టింపు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ప్రస్తుతం 12వారాలు ఉన్న సెలవు పరిమితిని 24 వారాలకు పెంచేలా ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961కి అవసరమైన సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ద్వారా జూలై 16 వరకు 41వేల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ఉద్యోగులకు బోనస్ రెట్టింపు చేయటం, ఉద్యోగాలు మారినప్పుడు గ్రాట్యుటీ కోల్పోకుండా గ్రాట్యుటీ పోర్టబుల్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనేదీ లేదని కూడా మంత్రి చెప్పారు. -
ఉద్యోగుల విభజన వేగవంతం చేయిస్తా
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ హామీ సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణలోని వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీ ప్రతినిధిగా ఉండి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్, కమిటీలు, అధికారులతో సమావేశమై ఉద్యోగుల విభజన ఇంకా ఆలస్యం జరగకుండా సత్వరమే పూర్తిచేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి నేతృత్వంలో 13 ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై 14 నెలలు కావస్తున్నా ఉద్యోగుల విభజన అపరిష్కృతంగానే ఉండటం బాధాకరమని, దీనికి గత ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. ఆదరా, బాదరాగా విభజన చట్టాన్ని చేసి అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. సంక్లిష్టమైన విషయాలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించడానికి నైతిక బాధ్యత తీసుకుంటానన్నారు. ఉద్యోగుల విభజనలో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న మార్గదర్శకసూత్రాలను సవరించాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ కొత్త వివాదాలకు దారితీస్తు తెలంగాణకు నష్టం కలగజేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం.. ఉద్యోగుల విభజన సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోనుందని హెచ్చరించారు. సహకారం ఉంటేనే విభజన.. * ఉద్యోగ సంఘాల నేతలతో అర్చనా వర్మ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉంటేనే రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన సాధ్యపడుతుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ తనను కలిసిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం డీవోపీటీ కార్యాలయంలో అర్చనా వర్మను కలసి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆప్షన్ల పేరుతో ఏపీ ఉద్యోగులను భర్తీ చేసే విధానం సరికాదని, ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఆప్షన్లు ఒక ప్రాతిపదికే తప్ప పూర్తిగా అదే ప్రాతిపదికన చేయాలని చట్టం చెప్పలేదని వివరించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన డీవోపీటీ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే ఉద్యోగుల విభజన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. -
స్టాక్ మార్కెట్లో రూ.5000 కోట్ల పీఎఫ్ పెట్టుబడులు
సెన్సెక్స్, నిఫ్టీ ఆధారిత ఈటీఎఫ్‌ల ఎంపిక ముంబై: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 5,000 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి దీన్ని 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కి చెందిన రెండు ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్‌ల ద్వారా ఈ పెట్టుబడులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. వీటిలో ఒకటి బీఎస్ఈ సెన్సెక్స్‌పై, మరొకటి ఎన్ఎస్ఈ నిఫ్టీపై ఆధారితమై ఉంటాయి. ముందుగా ఈపీఎఫ్‌వో ఏటా తనకొచ్చే చందాలో సుమారు 5 శాతం (దాదాపు రూ. 5,000 కోట్లు) ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుందని దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో తమ చందాదారులకు ఇస్తున్న 8.75 శాతం రాబడితో పోలిస్తే ఈటీఎఫ్‌ల ద్వారా మరింత ఎక్కువ రాగలదని ఆయన పేర్కొన్నారు. సెబీ హోల్‌టైమ్ మెంబర్ ఎస్ రామన్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, బీఎస్ఈ చీఫ్ ఆశీష్ కుమార్ చౌహాన్, సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేకే జలాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టాక్మార్కెట్లో పెన్షన్ ఫండ్లు పెట్టుబడులు పెట్టడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదేనని, దీని వల్ల అధిక రాబడి ప్రయోజనాలూ ఉన్నాయని చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈపీఎఫ్‌వోకి ప్రస్తుతం రూ. 6.5 లక్షల కోట్ల మేర నిధులు ఉన్నాయి. 75% ఎన్ఎస్ఈ ఈటీఎఫ్‌లో: ప్రాథమికంగా చేసే ఇన్వెస్ట్మెంట్లో 75 శాతాన్ని ఎన్ఎస్ఈ ఆధారిత ఈటీఎఫ్‌లోనూ, మిగతాది బీఎస్ఈ ఈటీఎఫ్‌లోనూ పెట్టనున్నట్లు సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేకే జలాన్ తెలిపారు. అవసరమైతే సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. ఓఎన్జీసీ వంటి సంస్థలు కూడా తమ నిధులను ఈక్విటీల్లో పెట్టదల్చుకుంటే స్టాక్ మార్కెట్లో పీఎఫ్ చేసే ఇన్వెస్ట్మెంటు రూ. 7,000-8,000 కోట్ల దాకా పెరగొచ్చని జలాన్ చెప్పారు. ఎస్బీఐ ఎంఎఫ్.. ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలను తగ్గించడంతో ఇవి సుమారు అయిదు బేసిస్ పాయింట్ల స్థాయిలో ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్ పెట్టుబడుల పరిస్థితిని సమీక్షించి, వచ్చే సంవత్సరం నుంచి 15%పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో బీమా దిగ్గజం ఎల్ఐసీ తర్వాత ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతి పెద్ద సంస్థగా ఈపీఎఫ్‌వో నిలుస్తుంది. ఎల్ఐసీ ఏటా రూ. 50,000 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. -
‘గ్రేటర్’ పీటమే లక్ష్యం
బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానం సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీటాన్ని దక్కించుకోవడమే ధ్యేయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అత్యధిక స్థానాలు సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని పార్టీ సీనియర్ నేత, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్. కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని ఎన్కెఎంఎస్ గ్రాండ్ హోటల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన ‘జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని బూత్‌ల వారీగా పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించామన్నారు. మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో మజ్లిస్‌కు బీజేపీ ఒక్కటే పోటీ ఇవ్వగలదని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైందన్నారు. గ్రేటర్ ఎన్నికలకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని కమిటీ తీర్మానించిందన్నారు. గెలుపు గుర్రాలను గుర్తించి, కార్యాచరణ ప్రణాళికకు తుది రూపం ఇస్తామన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు, కృష్ణా 3వ దశ నీళ్ల తరలింపుపై హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. బీజేపీ పాలిత నగరాల్లో అందిస్తున్న స్వచ్ఛమైన పాలనను గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అందిస్తామని, ఇంటింటి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ‘హైదరాబాద్ మనది’ అనే నినాదంతో ప్రజల్లో విశ్వాసాన్ని కల్గించేందుకు కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆగస్టు నుంచే ప్రచారం చేపట్టాలని సమావేశం అభిప్రాయపడిందని, ఇందుకోసం అసెంబ్లీవారీగా ఇన్‌ఛార్జిలను నియమించడంతో పాటు ప్రచారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు. నోటిఫికేషన్ తర్వాతే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత నిర్ణయిస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధార్ కార్డ్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేస్తుండటంపై తమకు అభ్యంతరంలేదని, అయితే... ఆ నెపంతో ఓటర్లను తొలగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మజ్లిస్ అక్రమ పాలనను నగరవాసులు చవిచూశారని, మళ్లీ వారికి అవకాశం ఇవ్వరని తాము భావిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో నగరంలో బీజేపీ, టీడీపీ, మజ్లీస్ పార్టీలే గెలిచాయని, టీఆర్ ఎస్‌కు బలం లేదని తేలిపోయిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితిని తాము విశ్లేషిస్తున్నామని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. డిసెంబర్‌లోగా గ్రేటర్ ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించిందని, అయితే... ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బలమైన ఆర్థికశక్తిగా భారత్
‘నవశకానికి నాంది’ పుస్తకావిష్కరణలో కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, పథకాల్లో మార్పులు భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దుతాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ యువమోర్చా నేత, ఆర్థిక నిపుణులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రాసిన ‘నవశకానికి నాంది’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ కోసం జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతిరహిత సుపరిపాలనతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, వాటి లోతుపాతులు, భవిష్యత్‌లో రాబోయే సానుకూల పరిణామాలను ‘నవశకానికి నాంది’ పుస్తకంలో వివరించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ భారత్‌కు సరిపోయే ఆర్థిక విధానాలు, పథకాలతో మోదీ తెచ్చిన సం స్కరణలను, వాటి ప్రభావాలను ఈ పుస్తకంలో పొందుపర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ వి.రామారావు, జర్నలిస్టు దేవులపల్లి అమర్, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పేరాల చంద్రశేఖర్‌రావు, వేణుగోపాలరెడ్డి, కుటుం బరావు తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాల ప్రక్షాళన!
మూడు చట్టాలను ఏకీకృతం చేసే ప్రతిపాదన * కార్మిక నియామక, తీసివేత నిబంధనలు సరళీకృతం న్యూఢిల్లీ: దేశంలో కార్మిక చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కఠినంగా ఉన్న ఉద్యోగుల నియామకం, తీసివేత నిబంధనలను సరళీకృతం చేస్తోంది. సంఘాలను ఏర్పాటుచేసే నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో వ్యాపార కార్యకలాపాలు సులభంగా సాగేలా చేయడం, ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో మూడు చట్టాలను మిళితం చేసేందుకు కార్మిక శాఖ ముసాయిదా బిల్లును సిద్ధం చేసిందన్నారు. పారిశ్రామిక సత్సంబంధాల కోసం కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, పారిశ్రామిక ఉపాధి చట్టాలను ఏకీకృతం చేస్తామన్నారు. పరిశ్రమలకు, కార్మికులకు మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ముసాయిదా బిల్లు గురించి దత్తాత్రేయ ఇంకా ఏమన్నారంటే... ⇒ అధికారిక అనుమతి కోరకుండా కంపెనీ 300 మంది కార్మికులను నియమించుకునేందుకు ఈ ముసాయిదా అనుమతిస్తుంది. ⇒ ఉద్యోగులను తీసివేసేందుకు నెల రోజుల నోటీసు కాలాన్ని 3 నెలలకు పెంచుతాం. ⇒ సిబ్బందిని ఆకస్మికంగా తొలగించాలంటే గతంలో వారి సర్వీసుపూర్తయిన ఏడాది కాలానికి 15 రోజుల వేతనాన్ని ఇవ్వాల్సి ఉండగా, దీన్ని 45 రోజులకు పెంచుతాం. ⇒ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక సంప్రదింపులు జరుపుతాం. ⇒ ఉద్యోగులందరికీ కనీస వేతనాన్ని అమలుచేస్తాం. ⇒ సంఘాల ఏర్పాటుపై, సమ్మెలపై నిబంధనలు కఠినం చేస్తాం. ఆరు నెలల ముందస్తు నోటీసులేకుండా సమ్మెలకు అనుమతించం. ⇒ సిబ్బంది సామూహికంగా క్యాజువల్ సెల వు పెట్టినా,సగంకంటే ఎక్కువమంది క్యా జువల్ లీవ్‌పై వెళ్లినా సమ్మెగా పరిగణిస్తాం. ⇒ కార్మిక సంఘాల్లో బయటి వ్యక్తులను అనుమతించం. బయటివారెవరూ వ్యవస్థీకృత రంగంలోని సంఘాల్లో ఆఫీస్ బేరర్‌గా ఉండకుండా నిషేధిస్తాం. అవ్యవస్థీకృత రంగంలో మాత్రం బయటి వ్యక్తులు ఇద్దరు ప్రతినిధులుగా ఉండేందుకు వీలుకల్పిస్తాం. -
త్వరలో ఈపీఎఫ్ ఆఫీస్
ఖమ్మం: ‘సింగరేణి, గ్రానైట్ పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగంలో జిల్లాలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి సేవలందించేందుకు ఇక్కడ ఈపీఎఫ్ కార్యాలయం లేకపోవడం శోచనీయం. ఖమ్మంలో ఈపీఎఫ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను’ అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహా సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని టేకులపల్లి, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుతీరును తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఈపీఎఫ్ కార్యాలయ ఏర్పాటుకు సర్వే చేయించేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం జన్‌ధన్ యోజన, పేదలకు పెన్షన్ కోసం బీమా పథకం, మహిళా సంక్షేమం కోసం బేటీ బచావో.. బేటీ బడావో, స్వచ్ఛభారత్, ఆదర్శ గ్రామాలు, స్మార్ట్ సిటీలు, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా తదితర పథకాలను ప్రవేవపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఏడాది కాలంలో మోదీ దేశ ప్రజలకు దగ్గరయ్యారన్నారు. జిల్లాలో ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునేందుకు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయూలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ రావడమే ఆలస్యమన్నారు. సింగరేణిలో ఇప్పుడున్న గనులు కాకుండా అవకాశం ఉన్న ప్రతి చోటా గనులు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగాలి.. జిల్లాలో బలమైన రాజకీయశక్తిగా బీజేపీ ఎదగాలని దత్తాత్రేయ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఏడాది కాలంలో ప్రధాని మోదీ 48 దేశాలు తిరిగి దేశ ఔన్నత్యాన్ని చాటారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ధర్మారావు పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల సహాయ సహకారాలను కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి ప్రత్యేకతను తీసుకువచ్చారని చెప్పారు. జిల్లాలో భారతీయ జనతాపార్టీకి ఆదరణ లభిస్తోందని, అన్ని ప్రాంతాల నుంచి పార్టీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్‌రావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంగల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యుడు పొదిలి రాజలింగేశ్వరరావు, మారుతి వీరభద్రప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గల్లా సత్యనారాయణ, కార్యదర్శులు ఉపేందర్, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధన్, వెంకన్న, నాయకులు లలిత, హేమమాలిని, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, ఉదయప్రతాప్ పాల్గొన్నారు. -
దత్తన్నకు ఇల్లు కావాలి..!
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యులు ఇంటి కోసం కష్టాలు పడ్డారంటే అర్థముంది. కానీ సాక్షాత్తు కేంద్రమంత్రికి కూడా ఇంటి కష్టాలు తప్పడం లేదు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు దేశరాజధాని ఢిల్లీలో అధికార నివాసం కరవైంది. ఆయనకు కేంద్రం కొపర్నికస్ మార్గ్‌లోని 20వ నంబర్ బంగళాను కేటాయించింది. అయితే దానిలో ఉన్న ఎంపీ ఖాళీ చేయకపోవడంతో దత్తన్న ఏపీభవన్‌లోని ఓ సాధారణ గదిలో బస చేయాల్సి వస్తోంది. దత్తాత్రేయకు కేటాయించిన భవనంలో 2014 వరకు ఎంపీగా ఉన్న కల్యాణ్‌సింగ్ నివసించేవారు. ప్రస్తుతం కల్యాణ్‌సింగ్ రాజస్థాన్ గవర్నర్‌గా వెళ్లారు. అయితే ఆ బంగళాలో కల్యాణ్‌సింగ్ కుమారుడు, ఎంపీ రాజ్వీర్సింగ్ ఉంటున్నారు. రాజ్వీర్ ఈ బంగళాను ఎందుకు ఖాళీ చేయడం లేదంటే ఆయనకు కేటాయించిన ఇంట్లో మరో ఎంపీ దుష్యంత్‌సింగ్ ఉంటున్నారు. దుష్యంత్‌సింగ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు. దుష్యంత్ ఆ బంగళాను ఎందుకు ఖాళీ చేయలేదంటే.. ఆయనకు కేటాయించిన బంగళా నవీకరణలో ఉంది. ఆ పని పూర్తయ్యే వరకూ ఆయన ఖాళీ చేయరట. దుష్యంత్ బంగళాను ఖాళీ చేస్తేగానీ రాజ్వీర్ దత్తన్నకు కేటాయించిన బంగళాను ఖాళీ చేసే పరిస్థితి లేదు. కల్యాణ్‌సింగ్, వసుంధర రాజే బీజేపీలో సీనియర్ నాయకులు. దీంతో దత్తాత్రేయ వారిని గట్టిగా నిలదీయలేని పరిస్థితి. వాళ్లతో కయ్యం ఎందుకని సౌమ్యుడైన దత్తన్న తనకు వేరే బంగళా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సఫ్దర్‌జంగ్‌లోని ఓ భవనాన్ని ఆయనకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. -
ఉపాధి కల్పిస్తాం
జడ్చర్ల, కొత్తకోట: దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్ల మండల కేంద్రంలోని గౌడ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 4.80కోట్ల మంది ఉపాధి కల్పన కేంద్రాల్లో నమోదయ్యారని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇం డియా వంటి కార్యక్రమాలను తీసుకుని పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో శిక్షణకు సంబంధించి 2.80 లక్షల సీట్లు ఉంటే జపాన్‌లో కోటి, చైనాలో 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం శిక్షణ పొందుతున్నారని తెలిపారు. మన దేశంలో 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చే విదంగా చర్య లు తీసుకుంటామన్నారు. శిక్షణనివ్వడం లో చైనాతో పోటీపడే విధంగా కృషి చేస్తామన్నారు. నిరుద్యోగులకు శిక్షణ కాలంలో ఇచ్చే స్టయిఫండ్‌ను రూ:2 వేల నుండి రూ:7 వేల వరకు పెంచేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణలో ఐదు నేషనల్ సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాలో స్కిల్డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా మీదుగా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటవుతుందన్నారు. పాలమూరు జిల్లాలో వలసను నివారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించి మోదీకి బహుమతిగా అందించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురంగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, నాయకులు నాగురావ్ నామాజీ, ఆచారి, రామ్మోహన్, వడ్ల శేఖర్, విఠాల శ్రీనువాసులు, సామ నర్సింహులు, గాయత్రి, కట్టా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ కొత్తకోట: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా అని ఓ పక్క.. తెచ్చింది టీఆర్ఎస్ అని మరో పక్క ఎవరికి వారు గొప్ప లు చెప్పుకుంటున్నారు.. కానీ.. తెలంగా ణ రాష్ట్ర ప్రజల ఉద్యమం, భారతీయ జనతాపార్టీ భయంతోనే అప్పటి కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేంద్ర మంత్రి బం డారు దత్తాత్రేయ అన్నారు. కొత్తకోటలో ని శివగార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ బల పరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు గెలుపు కోసం బీజేపీ, టీడీపీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖలో తె లంగాణ రాష్ట్రం నుండి తానొక్కడినే మం త్రిగా ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడని, 9 నెలలు గడుస్తున్నా ఒక్క పనీ చేయలేదన్నారు. నిరుద్యోగ యువతపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం దని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా సర్కారు ఒంటెత్తు పోకడలకు కళ్లెం వేసినట్లు అవుతుందన్నారు. బీజేపీ నియోజ కవర్గ ఇన్చార్జి రాజవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేపీ సీనియర్ నాయకులు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీ వర్ధన్‌రెడ్డి, పి.బాల్‌రాజు, కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్, కె. మాధవరెడ్డి, టీడీపీ నాయకులు కొమ్ము భరత్ భూషణ్, దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, వాకిటి బాల్‌రాజు, కరేంద్రనాథ్, పబ్బ నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
'కార్మికులకు స్మార్ట్ కార్డులు'
భువనగిరి: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాలో మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో కార్మికులకు స్మార్టు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రై వేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు సంఖ్యను అందజేసి, వారిని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా చేస్తామన్నారు. కేంద్ర కార్మిక శాఖలోని రూ.27 వేల కోట్ల నిధులను రెండు నెలల్లోనే అన్ని రంగాల కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీడీ కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పారు. అలాగే, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తమని పేర్కొన్నారు. అనంతరం ఆయన భువనగిరి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. -
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకి దత్తాత్రేయ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ, మలేరి యా వంటి వ్యాధుల నివారణలో భాగంగా వాటిపై మరింత లోతైన పరిశోధన కోసం హైదరాబాద్‌లో ఒక వైరాలజీ ల్యాబొరేటరీని ఏర్పా టు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పరి స్థితిని వివరించడంతోపాటు, రాష్ట్రం లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరుతూ దత్తాత్రేయ ఆరోగ్యశాఖ మంత్రికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో ఆయన మంత్రి జేపీ నడ్డాను కలిశారు. దత్తాత్రేయతోపాటు కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఉన్నా రు. నడ్డాతో సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్, రంగారెడ్డితోపాటు మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా దృష్టికి తెచ్చాను’ అని దత్తాత్రేయ తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఏటా ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాం తాల్లో చాలామంది మలేరియాతో చనిపోతున్నారని, కొత్తగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని ఈ నేపథ్యంలో వ్యాధులపై పరిశోధనకు హైదరాబాద్‌లో వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చినట్టు తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌తో త్వరలోనే సమావేశమవుతానని చెప్పారు. -
అసోచామ్ అవార్డును అందుకున్న చంద్రవదన్
సాక్షి, న్యూఢిల్లీ: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన ప్రతిష్టాత్మక అసోచామ్ అవార్డును రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి ఆర్.వి.చంద్రవదన్ అందుకున్నారు. ఇక్కడి లీమెరీడియన్ హోటల్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఈ అవార్డును ప్రదానం చేశారు. -
2019లో బీజేపీదే అధికారం
మొయినాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయే పార్టీలని, అప్పటి వరకు అధికార టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, అప్పడు ప్రత్యామ్నాయంగా నిలిచేది బీజేపీనే అన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం కంటే బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం మొయినాబాద్ మండలం చిలుకూరులోని బ్లూమ్స్ గార్డెన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించింది బీజేపీనేనని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక జాతీయ పార్టీ కూడా తమదేనన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మాణంకోసం కృషి చేయాలన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలనిసూచించారు. భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపేందుకు మోదీ కృషి ప్రపంచంలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. గ్రామాలు, పట్టణాలను ఆధునికీకరించి అభివృద్ధి చేసేవిధంగా బృహత్తర కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. దేశంలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలే తీసుకోవాలన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కృష్ణదాస్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ మార్పునకు ఇదే మంచి అవకాశమన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేంరాజ్, నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డి, కంజర్ల ప్రకాష్, జంగయ్య యాదవ్, ప్రహ్లాదరావు, శంకర్‌రెడ్డి, పాపయ్యగౌడ్, బోసుపల్లి ప్రతాష్, ప్రభాకర్‌రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బొక్క నర్సింహారెడ్డి, రాములు, శివరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, సంగీత, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, శోభ, నాయకులు శేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీరాములు, ప్రశాకర్రెడ్డి, నర్సింహారెడ్డి, సుదీంధ్ర తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ పథకంలో రాష్ట్రీయ పాస్ట్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన, వృద్ధాప్య పింఛన్ తదితర మూడు అంశాలను పొందుపరుస్తామన్నారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మోడల్ ఐటీఐగా తీర్చిదిద్దేందుకు మల్లేపల్లిలోని ఐటీఐకి రూ.10 కోట్లు కేటాయించినట్టు చెప్పా రు. శ్రామికుల నైపుణ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్‌కు దగ్గరలో వృత్తి విద్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి నాయిని మాట్లాడుతూ కార్మికుల డబ్బులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.600 కోట్లు రావాల్సి ఉందన్నారు. రూ.420 కోట్లను ఏపీ సీఎం చంద్రబాబు అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్టు చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐలయ్య, అధ్యక్షులు కాలేబు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాములు, కోశాధికారి లక్ష్మయ్య, కార్యదర్శి అల్వాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో తెలంగాణ గొంతుక.. దత్తన్న
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు పౌర సన్మాన సభలో సీఎం కేసీఆర్ పక్కరాష్ట్రం పెట్టే ఇబ్బందులను కేంద్రం దృష్టికి తేవాలి ఆయన బండారు కాదు... బంగారు దత్తాత్రేయ మోదీ టీమ్‌లో కేసీఆర్ కూడా ఒకరని విశ్వసిస్తున్నా : దత్తాత్రేయ కరెంటు కష్టాలు తీర్చేందుకు.. కేసీఆర్ - మోదీలను కలిపేందుకు సిద్ధం హైదరాబాద్: కరెంటు విషయంలో పక్క రాష్ట్రం ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ముద్దుబిడ్డ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో తెలంగాణ గొంతుకగా మారాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిలషించారు. తాజా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదని మధనపడుతున్న తరుణంలో.. దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటు దక్కటంతో ఆ లోటు భర్తీ అయిందన్నారు. బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తెలంగాణ బీజేపీనేత చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు కొద్దిరోజుల క్రితం ఇదే తరహాలో పౌరసన్మానం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఒరవడిని కొనసాగిస్తూ బండారు దత్తాత్రేయను సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి కేంద్రమంత్రిగా దత్తాత్రేయ పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సౌమ్యులు, మృదుభాషి, చక్కటి మనస్తత్వం కలిగిన బండారు దత్తాత్రేయ.. తన దృష్టిలో ‘బంగారు’దత్తాత్రేయ అని పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా కేంద్రంలో పనిచేసే ఈ ప్రాంత ముద్దుబిడ్డ దత్తాత్రేయను సన్మానించటమంటే తెలంగాణ సమాజం తనను తాను సన్మానించుకోవటమేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో దత్తాత్రేయ పాత్ర కీలకమైందని, ‘అలయ్ బలయ్’ పేరుతో అన్నివర్గాల ప్రముఖులను ఒక్క వేదికపైకి తేవటం ద్వారా ఉద్యమానికి ఆయన ఊతమిచ్చారని ప్రశంసించారు. ఏటా నిర్వహించే ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అభిలషించారు. కరెంటు కష్టాల పరిష్కారం కోసం మోదీతో మాట్లాడిస్తా.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకునే కార్యక్రమాలకు కేంద్రమంత్రి హోదాలో తాను పూర్తి అండగా ఉంటానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ముందుకొస్తే.. ప్రస్తుతం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరెంటు కష్టాల విషయంలో కేంద్రం చొరవ చూపేలా మోదీ -కేసీఆర్‌లను కలిపేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కేంద్రమంత్రిగా తాను తెలంగాణకు ఓ ప్రపంచస్థాయి మెడికల్ కళాశాలను బహుమతిగా ఇస్తున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు. రూ.435 కోట్లతో సనత్‌నగర్‌లో దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మోదీ టీమ్‌లో కేసీఆర్ కూడా ఒకరనే తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. ఇక బీడీ కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన మొత్తాన్ని రూ.45 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. గతంలో ఇది రూ. 25 వేలుగా ఉంటే అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ దాన్ని రూ. 45 వేలకు పెంచారని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రాంత నేతలకు అచ్చొచ్చినట్టు అనిపిస్తోందని, గతంలో ఇదే శాఖను అంజయ్య, వెంకటస్వామి, కేసీఆర్ నిర్వహిస్తే ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందన్నారు. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కొత్తగా వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని, వారు దోపిడీకి గురికాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పత్తి రైతులకు రూ.4050 మద్దతు ధర లభించేలా సంబంధిత కేంద్రమంత్రులు, అధికారులతో ఇటీవలే తాను ప్రత్యేకంగా భేటీ అయి ఆదేశాలు ఇప్పించానన్నారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టు అద్భుతమని, హుస్సేన్‌సాగర్‌కు పూర్వవైభవం తెచ్చి మంచినీటి చెరువుగా మార్చే ఆలోచన గొప్పదన్నారు. తెలంగాణ సంస్కృతిలో ఆత్మీయత ఓ భాగమని, ఈ సన్మానమే దానికి నిదర్శనమన్నారు. తన ఈ ఉన్నతికి సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావే కారణమని పేర్కొన్నారు. సీఎల్పీనేత జానారెడ్డి, బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్, టీడీపీ నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కరెంట్ లేకనే రైతు ఆత్మహత్యలు తెలంగాణలో వ్యవసాయం బోరు బావులపై ఆధారపడడం, విద్యుత్ సమస్య తదితర కారణాల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. వరి పరిశోధనా సంచాలయంలో శనివారం జరిగిన రైతు దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 2019 నాటికి మోదీ ప్రభుత్వం గ్రామ గ్రామానికి 24 గంటల కరెంటు ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. రబీలో వరి వేసుకోవచ్చని వరి పరిశోధనా సంచాలయం ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ రవీంద్రబాబు రైతులకు సూచించారు. సభలో, అంతకుముందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ రబీలో వరి వేయొద్దంటూ చేస్తున్న విజ్ఞప్తులను ఆయన తోసిపుచ్చారు. రెండు మూడేళ్లలో సాంబమసూరి అన్ని చీడపీడలన్నింటినీ తట్టుకునే విధంగా బహుళ నిరోధక శక్తి ఉండేలా తయారు చేస్తామన్నారు. రెండేళ్లలో న్యూట్రిషన్, ఐరన్, జింక్‌లు ఉండే వరిని అభివృద్ధి చేస్తామని రవీంద్రబాబు చెప్పారు.