కార్మికులకు మెరుగైన వైద్యానికి నిమ్స్‌తో ఒప్పందం
- కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి
- తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో 13 సంచార వైద్యశాలలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో నిమ్స్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదు ర్చుకోనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆది వారం ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ఈఎస్‌ఐ మొబైల్ క్లినిక్‌లను ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ ఐ డిస్పెన్సరీలు లేని ప్రాంతాల్లో సేవలందిం చేందుకు మొబైల్ క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దేశంలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మొబైల్ క్లినిక్‌లను విని యోగిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో 8 మొబైల్ క్లినిక్‌లను ఆదిలా బాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్ల గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ .. మిగతా ఐదింటిని ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనం తపురం జిల్లాల్లోనూ సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి మొబైల్ క్లినిక్‌లో ఒక వైద్యుడు, ఫార్మాసిస్టు, అటెండర్, డ్రైవర్‌తో పాటు అవసరమైన సామగ్రి, మందు లు అందుబాటులో ఉంటాయన్నారు. వాహ నం రోజుకు 2 ప్రదేశాల్లో సంచరిస్తుందని, కార్మికులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహి స్తుందన్నారు. ప్రతి ప్రాంతాన్నీ వారంలో 2 రోజులు కవర్ చేస్తామన్నారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 పడకల స్థాయికి పెంచుతామన్నారు. ఈఎస్ ఐసీ వైద్య కళాశాలలో పడకల సంఖ్యను 500 కు పెంచనున్నట్లు తెలిపారు.
ఈఎస్‌ఐసీ లబ్ధి దారుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచామని, మహిళా ఉద్యోగు ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించడంతో మహిళ లకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు. జాతీయ ఓబీసీ కమిష న్‌కు చట్టపరమైన హోదా కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీ పార్లమెంట్ సభ్యుల సంఘం చైర్మన్‌గా ఓబీసీలపై ఒక స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పిం చానని, మండల్ కమిషన్ సిఫారసుల వెల్లడి తర్వాత కూడా వారికి అవకాశాలను నిరాకరిస్తున్న విషయాన్ని వివరించానన్నారు. తన నివేదికను ప్రధాని ఆమోదించారన్నారు.