union Labour ministry
-
అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.94 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద అక్టోబర్ నెలలో కొత్తగా 12.94 లక్షల మంది నమోదయ్యారు. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 21,026 మంది అధికంగా వచ్చి చేరారు. కేంద్ర కార్మిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం, 1952 కింద 2,282 కొత్త సంస్థలు అక్టోబర్ నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. కొత్త సభ్యుల్లో మొదటిసారి చేరిన వారు 7.28 లక్షల మంది ఉంటే, 5.66 లక్షల మంది సభ్యులు ఒక చోట మానేసి, మరో సంస్థలో చేరిన వారు. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఖాతాను బదలాయించుకున్నారు. ఇలాంటి ఖాతాలను కొత్తవిగానే పరిగణిస్తుంటారు. యువత ఎక్కువ.. నికర కొత్త సభ్యుల్లో 18–21 వయసులోని వారు 2.19 లక్షల మంది ఉంటే, 22–25 ఏళ్ల వయసు గ్రూపులోని వారు 1.97 లక్షల మంది ఉన్నారు. కొత్త సభ్యుల్లో 57.25 శాతం 18–25 ఏళ్లలోపు వారే. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.63 లక్షలుగా ఉంది. వీరిలో 1.91 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి 7.78 లక్షల మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. క్రితం నెలతో పోలిస్తే అక్టోబర్‌లో న్యూస్‌పేపర్ పరిశ్రమ, షుగర్, రైస్ మిల్లింగ్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఈపీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్...!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు ఇక మీదట గరిష్టంగా రూ.7 లక్షల జీవిత బీమా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం గరిష్ట బీమా రూ.6 లక్షలుగా ఉండగా, రూ.7 లక్షలకు పెంచాలన్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌గంగ్వార్ తెలిపారు. 2020 సెప్టెంబర్ 9నాటి ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో.. మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన బీమా కవరేజీని రూ.7లక్షలకు పెంచాలని నిర్ణయించడం గమనార్హం. ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976’ (ఈడీఎల్ఐ) కింద బీమా కవరేజీ అమలవుతోంది. ఈ పథకం కింద కనీస బీమా రూ.2.5 లక్షలుగా ఉంది. మరణించడానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పనిచేసినా బీమా సదుపాయం వర్తింపజేయాలని గతేడాది మార్చిలోనే నిర్ణయించిన విషయం గమనార్హం. గతంలో అయితే చనిపోవడానికి ముందు 12 నెలల్లో సభ్యుడు ఒక్కటికి మించిన సంస్థల్లో పనిచేస్తే బీమా సదుపాయం ఉండేది కాదు. ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో అందుకున్న సగటు వేతనానికి (మూలవేతనం, కరువు భత్యం కలిపి) 30 రెట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది. బీమా కవరేజీకి ఉద్యోగి కనీసం ఇంతకాలం పనిచేయాలన్న నిబంధనేదీ లేదు. -
కార్మికులకు మెరుగైన వైద్యానికి నిమ్స్‌తో ఒప్పందం
- కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి - తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో 13 సంచార వైద్యశాలలు సాక్షి, హైదరాబాద్: కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో నిమ్స్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదు ర్చుకోనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆది వారం ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ఈఎస్ఐ మొబైల్ క్లినిక్‌లను ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ ఐ డిస్పెన్సరీలు లేని ప్రాంతాల్లో సేవలందిం చేందుకు మొబైల్ క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దేశంలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మొబైల్ క్లినిక్‌లను విని యోగిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 8 మొబైల్ క్లినిక్‌లను ఆదిలా బాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్ల గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ .. మిగతా ఐదింటిని ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనం తపురం జిల్లాల్లోనూ సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి మొబైల్ క్లినిక్‌లో ఒక వైద్యుడు, ఫార్మాసిస్టు, అటెండర్, డ్రైవర్‌తో పాటు అవసరమైన సామగ్రి, మందు లు అందుబాటులో ఉంటాయన్నారు. వాహ నం రోజుకు 2 ప్రదేశాల్లో సంచరిస్తుందని, కార్మికులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహి స్తుందన్నారు. ప్రతి ప్రాంతాన్నీ వారంలో 2 రోజులు కవర్ చేస్తామన్నారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 పడకల స్థాయికి పెంచుతామన్నారు. ఈఎస్ ఐసీ వైద్య కళాశాలలో పడకల సంఖ్యను 500 కు పెంచనున్నట్లు తెలిపారు. ఈఎస్ఐసీ లబ్ధి దారుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచామని, మహిళా ఉద్యోగు ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించడంతో మహిళ లకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు. జాతీయ ఓబీసీ కమిష న్కు చట్టపరమైన హోదా కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీ పార్లమెంట్ సభ్యుల సంఘం చైర్మన్‌గా ఓబీసీలపై ఒక స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పిం చానని, మండల్ కమిషన్ సిఫారసుల వెల్లడి తర్వాత కూడా వారికి అవకాశాలను నిరాకరిస్తున్న విషయాన్ని వివరించానన్నారు. తన నివేదికను ప్రధాని ఆమోదించారన్నారు.