సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న(గురువారం) ఓ పేషెంట్ ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా.. బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆ రోగి విధుల్లో ఉన్న వర్కర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టారంటూ ఇతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా నిర్థారణకు రాకుండానే చోరీ పేరుతో వర్కర్‌ను కొట్టారంటూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: దీని వెనుక ఏదో మతలబు ఉంది
Comments
Please login to add a commentAdd a comment