staff protest
-
పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఉద్రిక్తత.. సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న(గురువారం) ఓ పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా.. బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆ రోగి విధుల్లో ఉన్న వర్కర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టారంటూ ఇతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా నిర్థారణకు రాకుండానే చోరీ పేరుతో వర్కర్‌ను కొట్టారంటూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళన చేపట్టారు.ఇదీ చదవండి: దీని వెనుక ఏదో మతలబు ఉంది -
జీజీహెచ్ వైద్య సిబ్బంది నిరసన
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గోతరగతి ఉద్యోగులు గురువారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రిలో మూడేళ్లుగా నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ఆస్పత్రి అధి కారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు వినతిపత్రాలు అందజేసి, సమ్మె నోటీసులు ఇచ్చినా తమ సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించటం లేదన్నారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులు స్పందించని పక్షంలో ఈనెల 12 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని వెల్లడిం చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పనితీరుపై జి ల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రిగా ఫిర్యాదు చేస్తామ ని యూనియన్ నేతలు తెలిపారు. శుక్రవారం కూ డా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉద్యోగుల డిమాండ్లు... ఉద్యోగులకు ప్రత్యేక క్లినిక్‌లో మందులు సరిపడా ఇవ్వటంలేదు. నెలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించి మందులు అందజేయాలి. చనిపోయిన, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో పలువురికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు త్వరగా అందించాలి. నాల్గో తరగతి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలి. సీనియారిటీ లిస్ట్‌లు ఇవ్వాలి. ఉద్యోగుల మెడికల్ లీవ్, ఎరన్డ్ లీవ్, ఇంక్రిమెంట్ల బిల్లులు ట్రెజరీకి పంపినప్పుడు ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలి. యూనియన్ ఆఫీకు మరమ్మతులు చేయిం చాలి. ఉద్యోగుల సెలవుల మంజూరు విషయంలో జాప్యం లేకుం డా చూడాలి. ఏడాదికి ఒకసారి ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ జిరాక్స్ కాపీలను అందజేయాలి. నిరసనలో పాల్గొన్న నేతలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) జీజీహెచ్‌శాఖ కార్యదర్శి వడ్డే బా లయ్య, అధ్యక్షుడు సీహెచ్ వీరరాఘవులు, కోశాధికారి కె. వెంకటకృష్ణ, గౌరవ అధ్యక్షుడు కోట మాల్యాద్రి, జిల్లా మహిళా కార్యదర్శి కోలా స్వాతి, రావుల అంజిబాబు, కె. రమేష్‌బాబు, కె. దుర్గాప్రసాద్, పి. నాగరాజు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో పారితోషికాలుఇవ్వకపోతే ఎలా? గుంటూరు మెడికల్:గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది గురువారం ఆస్పత్రి అసిస్టెంట్ డైరక్టర్ మాజేటి రత్నరాజును కలిసి తమకు ఏడు నెలలుగా ఆరోగ్యశ్రీ పారితోషికాలు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. పారితోషికాలు నిలిపివేయటానికి గల కారణాలు తమకు తెలియజేయాలని కోరారు. పారితోషికాలు నిలిపివేయటం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. గతంలో పారితోషికాల కోసం ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేస్తే ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు పారితోషికాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి తమకు పారితోషికాలు నిలిపివేయటంపై ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్యాలయ ఉద్యోగుల పనితీరు వల్లే తమకు పారితోషికాలు రావటం లేదని తక్షణమే ఏడునెలల బకాయిలు ఇప్పించాలని అసిస్టెంట్ డైరక్టర్‌ను కోరారు. నిధుల కొరత వల్లే పారితోషికాలు ఇవ్వటం లేదని రత్నరాజు చెప్పి నిధులు రాగానే పారితోషికాలు చెల్లిస్తామని వైద్య సిబ్బందికి హామీ ఇచ్చారు. -
మాకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తారా?
-
మా కష్టాన్ని దోచుకోవద్దు
ఎంపీ కేశినేని ట్రావెల్స్ కార్యాలయం వద్ద 500 మంది కార్మికుల ధర్నా సాక్షి, అమరావతి బ్యూరో: ‘మీరు టీడీపీ ఎంపీ... రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంత మాత్రాన అంతా మీ ఇష్టమా? పేదల కష్టాన్ని దోచుకుంటారా? మాకు జీతాలు ఇవ్వకుండా వేధి స్తారా? చెప్పాపెట్టకుండా ట్రావెల్స్‌ను మూసివేసి మా జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారు. బ్యాంకులను మోసం చేసేందుకే ఇలా చేశారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యాం. ఇంకా మాకు అన్యాయం చేయొద్దు’ అంటూ కేశినేని ట్రావె ల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటా నికి దిగారు. బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చారు. జీతాలు అందక తమ బాధలను చెప్పుకునేందుకు వచ్చిన కార్మికులను ఎంపీ కేశినేని కార్యాలయంలోకి అనుమతించ లేదు. ఆ సమయంలో కేశినేని నాని తన కార్యాలయంలో లేరు. ఆయన ప్రతినిధులు అప్పటికే పోలీసులను పిలిపించారు. డ్రైవర్లు, సిబ్బందిని ఎంపీ కార్యాలయానికి వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. -
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
-
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
-
3 నెలలుగా జీతాలు లేవు!
కేజీబీవీలకు అందని మూడు నెలల వేతనాలు అయోమయంలో బోధన, బోధనేతర సిబ్బంది బిల్లుల భారంతో ఏజెన్సీ నిర్వాహకుల తిప్పలు కరీంనగర్‌ఎడ్యుకేషన్ : బడిబయట ఉన్న అనాథలను చేరదీసి అక్షరాస్యులను చేయాలనే లక్ష్యంతో నెలకొల్పిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) పరిస్థితి గందరగోళంగా మారుతోంది. మౌలిక వసతుల లేమితోపాటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు అనేక ఇక్కట్ల పాలవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 51 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 200 మంది విద్యార్థినులను చేర్చుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం జిల్లాలో 10,200 మంది విద్యార్థినులు ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతం 7,594 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 510 మంది బోధన, 357 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు ఓ ప్రత్యేక అధికారి, సీఆర్టీలు(8మంది), కంప్యూటర్ ఆపరేటరు, అకౌంటెంట్, స్వీపర్ కం స్కావెంజర్, ఏఎన్ఎం, వాచ్మెన్లు ఇద్దరు చొప్పున సరాసరి 17 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి జూన్ వరకే వేతనాలు అందారుు. అప్పటినుంచి వేతనాలు రాకపోవడంతో వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినుల భోజనం కోసం టెండర్ల ద్వారా బియ్యం, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లను అందించాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో నాసిరకం భోజనం పెడుతున్నారు. దీంతో పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల్లో బతుకమ్మ, ఆ వెంటనే దసరా పండుగలు వస్తున్నాయని, అప్పటి వరకైనా తమకు వేతనాలు ఇప్పించాలని సిబ్బంది కోరుతున్నారు. అలాగే భోజన కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పొంతన లేని ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదు. కేజీబీవీల్లో మూడు నెలలుగా బోధన, బోధనేతర సిబ్బంది, సరుకుల టెండర్ల నిర్వాహకులకు బిల్లులు చెల్లించకపోవడం శోచనీయం. నిరుపేదలు చదివే పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సింది పోరుు నెలల తరబడి జాప్యం చేయడం సరికాదు. ధనిక రాష్ట్రమంటూ గొప్పులు చెప్పుకునే ప్రభుత్వం పేద పిల్లలు చదువుకునే విద్యాలయాలకు బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటు. - బండారి శేఖర్, కేజీబీవీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
డాక్టర్ వేధింపులపై సిబ్బంది నిరసన
కొడవలూరు: స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి సయ్యద్ అబ్షా తమను వేధిస్తున్నారంటూ పీహెచ్సీ ఎదుట సిబ్బంది శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత డిసెంబర్లో వైద్యశాఖ రీజినల్ డైరెక్టర్ పీహెచ్‌సీని సందర్శించి డాక్టర్ విధుల్లో లేకపోవడంతో రెండు రోజులు ఆబ్సెంట్ వేశారని, దీనికి సిబ్బందే కారణమంటూ వేధింపులకు దిగారని ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బందికి వేతనాలను సకాలంలో ఇవ్వకుండా రెండు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. డాక్టర్‌కు పీఆర్సీ రాకపోయినా సిబ్బంది జీతాలను నిలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వేధింపులు తాళలేక రెండో ఏఎన్ఎంగా ఉన్న విజయలక్ష్మి ఏడాది పాటు సెలవు పెట్టారని చెప్పారు. ఈ విషయాలను శుక్రవారం డీఎంహెచ్ఓ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. హెచ్ఎస్ షఫీఉల్లా, సిబ్బంది సుగుణ, అనితాకుమారి, శైలసుధ, తబిత, హిమజకుమారి, తదితరులు పాల్గొన్నారు.