
డాక్టర్ వేధింపులపై సిబ్బంది నిరసన
సిబ్బందికి వేతనాలను సకాలంలో ఇవ్వకుండా రెండు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. డాక్టర్‌కు పీఆర్సీ రాకపోయినా సిబ్బంది జీతాలను నిలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వేధింపులు తాళలేక రెండో ఏఎన్‌ఎంగా ఉన్న విజయలక్ష్మి ఏడాది పాటు సెలవు పెట్టారని చెప్పారు. ఈ విషయాలను శుక్రవారం డీఎంహెచ్‌ఓ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. హెచ్‌ఎస్ షఫీఉల్లా, సిబ్బంది సుగుణ, అనితాకుమారి, శైలసుధ, తబిత, హిమజకుమారి, తదితరులు పాల్గొన్నారు.