torture
-
ఇల్లాలినే అమ్మేసుకోవాలా?
హుబ్లీ: మైక్రోఫైనాన్స్ వేధింపుల వల్ల ప్రజలు ఊళ్లు విడిచి వెళ్లిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు భార్యలను అమ్మే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందని అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనేత అరవింద బెల్లద్ ఆరోపించారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తాండవం ఆడుతోందని ధ్వజమెత్తారు. కోట్ల కొద్ది రూపాయలను తీసుకొని పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఈ విధంగా పోస్టింగ్ తెచ్చుకున్న పోలీసులు సహజంగా దొంగలు, డ్రగ్స్ డీలర్లు, మీటర్ వడ్డీ దందాకోరులతో డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో బాధితులకు ఠాణాలలో రక్షణ దొరకడం లేదు. సీఎం విధానసౌధ ఏసీ రూములో కూర్చొని సమావేశాలను నిర్వహిస్తే వేధింపులకు అడ్డుకట్ట పడదు. ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరముందని అన్నారు. మైసూరు రాజులు మొత్తం రాష్ట్రానికే కానుకలు ఇచ్చిన వారు వారి పథకాలు అఖండ కర్ణాటక ఎదుగుదలకు దోహదపడ్డాయి. అలాంటి రాజవంశ ఆస్తిని దోపిడీకి పాల్పడుతున్న సీఎం సిద్దరామయ్య సిగ్గుపడాలని హేళన చేశారు. బెంగళూరులో ప్యాలెస్ భూములకు నష్టపరిహారం (టీడీఆర్) ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ, విద్వేష రాజకీయాలు చేయరాదు, ఇకనైనా రాజవంశస్తులకు అన్యాయం చేయడాన్ని మానుకోవాలి, లేకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పారు. -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం... అక్రమ కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులకు చిత్రహింసలు
-
జైల్లో టార్చర్ చేశారు: కేజ్రీవాల్
చండీగఢ్:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)చీఫ్,ఢిల్లీమాజీసీఎం అరవింద్కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆదివారం(సెప్టెంబర్29)హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘జైలులో నన్ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు.నేను షుగర్ పేషేంట్‌ను.నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు.అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.వాళ్లు నన్ను ఏమీ చేయలేరు.ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’అని కేజ్రీవాల్ అన్నారు.లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు. ఇదీ చదవండి: సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత -
దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి..
కొన్ని వ్యాధులు ఓ పట్టాన అర్థం కావు. ఎందుకొస్తాయో కూడా తెలియదు. అవి మొత్తం కుటుంబాన్నే అతలాకుతలం చేసేస్తాయి. ఆ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో ఇంటిల్లపాది పడే యాతన అంతా ఇంతకాదు. ఇటు బాధితులకి, వారి కుటుంబానికి ఓ ప్రత్యక్ష నరకం లాంటిది ఆ సమస్య అని చెప్పొచ్చు. ఇక్కడొక మహిళ ఎంత దయనీయమైన వ్యాధితో బాధపడుతుందో వింటే కంగుతింటారు. ఇదేం వ్యాధిని రా బాబు! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన 49 ఏళ్ల కరెన్ కుక్ 'హైపరాక్యుసిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా చిన్న శబ్ధాన్ని కూడా భరించలేదు. ఎంతలా అంటే గాలి వీచినా..చెట్ల ఆకుల శబ్దం వరకు ఏ చిన్న శబ్దం విన్నా.. తట్టుకోలేక అల్లాడిపోతుంది. ఈ వ్యాధి కారణంగా భర్త, పిల్లలకు దూరంగా ఒంటరిగా బతుకుతోంది. చెప్పాలంటే తన ఇంట్లోనే ఆమె ఓ ఖైదీలా జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ వ్యాధి. ఎందుకంటే? భర్త మాట్లాడినా.. ఆఖరికి తన పిల్లలు నవ్వినా తట్టుకోలేదు. కనీసం క్రిస్మస్ పండుగ రోజు కూడా ఆమె వేరే గది కిటికి నుంచి తన కుంటుంబం ఆనందంగా సెలబ్రేట్ చేసుకువడాన్ని చూడాల్సిందే తప్ప వారితో కలిసి ఎంజాయ చేయలేదు. ఆమెకు ఈ వ్యాధి 2022లో అకస్మాత్తుగా వచ్చింది. తర్వాత క్రమక్రమంగా పరిస్థితి దిగజారి తన ఇంట్లోనే తాను వేరుగా ఉండే స్థితికి వచ్చేసింది. ఇంతకీ హైపరాక్యుసిస్ అంటే ఏమిటంటే .. హైపరాక్యుసిస్ అంటే.. హైపరాక్యుసిస్ అనేది ఆ వ్యాధి తీవ్రత బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడ్డ వారికి నిత్యం వినిపించే శబ్దాలే వాళ్లకి బిగ్గరగా వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా బాధకరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తలకు నాణేలు శబ్దం నుంచి.. కుక్క అరవడం, కారు ఇంజిన్ శబ్దం, ఎవరైనా చూయింగ్ గమ్ నమలడం, వాక్యూమ్ క్లీనర్ శబ్దం ఇలా దేన్ని భరించలేరు. ప్రతీ శబ్దం వారిపై ప్రభావం చూపిస్తుంటుంది. తల పగిలిపోయేంత నొప్పి.. ఇక కరెన్ ఈ వ్యాధి కారణంగా ఇయర్ ప్లగ్స్, ఇయర్ డిఫెండర్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటుంది. కేవలం సైగలు, రాతలతోనే కుటుంబంతో సంభాషిస్తారామె. ఇది తనకు ఎగజిమ్ముతున్న లావా లాంటి పదార్థాన్ని చెవిలో పోసినట్లు అనిపిస్తుందని వేదనగా చెబుతోంది కరెన్. అంతేగాదు తల పగిలిపోయేలా, తలంతా నొప్పిగా అనిపిస్తుందట. ఒకరకమైన మైగ్రెన్ నొప్పిలా ఉంటుందని అంటోంది. ఒక్కోసారి ఇది భరించలేకు తలను రెండు ముక్కలు చేయాలనిపిస్తుందని ఆవేదనగా చెబుతోంది. ఈ వ్యాధి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యింది. తన ఏడేళ్ల, పదుకొండేళ్ల పిల్లలకు దూరమయ్యానని వేదనగా చెప్పుకొచ్చింది. చివరికి తన భర్తతో కలిసి ఆనందంగా బయటకు వెళ్లలేను, అస్సలు ఏం చేయలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకరకంగా తన జీవితాన్ని మొత్తం కోల్పోయానని బాధగా చెప్పారామె. ఇక కరెన్ విమాన సిబ్బందిగా పనిచేసేది. దాన్నేమె ఉద్యోగం గాక గుర్తింపుగా భావించేదని కరెన్ భర్త నిక్ అన్నారు. తాము ఎప్పుడూ ఎలాంటి ప్లాన్లు లేకుండా హాయిగా ట్రిప్స్‌కి వెళ్లిపోయి ఎంజాయ్ చేసేవాళ్లం ఇప్పుడూ పరిస్థితి అర్థంకానీ విధంగా భారంగా మారిపోయిందన్నారు. అయితే ఈ వ్యాధికి చికిత్స మాత్రం లేదట. ఇలాంటి సమస్యతో బాధపడే కొందరు రోగులకు వైట్ నాయిస్ వంటి శబ్దాలను వినేలా చేసి ఆ శబ్దాలను భరించే స్థాయిలను అభివృద్ధి చేస్తున్నట్లు యూకే జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఇక్కడ వైట్ నాయిస్ అంటే నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే చిన్న శబ్దాలు. అయితే ఈ వినసొంపైన చిన్న శబ్దాలు ప్రకృతికి సంబంధించివైనా ఉండొచ్చు. కానీ కరెన్ విషయంలో ఇది కూడా పనిచేయలేదు. ఆఖరికి పలురకాల థెరఫీలను ప్రయత్నించారు. అవి కూడా పనిచేయలేదు. తన పిల్లల గురించే తాను ఈ వ్యాధి చికిత్స కోసం 18 నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కరెన్ ఏదో ఒక రోజు తన వ్యాధి నయమయ్యే చికిత్స లభిస్తుందని ఆశగా ఎదురచూస్తుంది. నిజంగా ఇది మాటల్లో చెప్పలేనంత దయనీయమైన స్థితి కదూ.! (చదవండి: రెడ్‌లైట్ థెరఫీతో షుగర్ వ్యాధిని తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
అనాథశ్రమం ముసుగులో అరాచకాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మధ్య ప్రదేశ్‌లో అనాథాశ్రయం పేరుతో జరుగుతున్న అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నిర్వహిస్తున్న సిబ్బంది చిన్నారులను తీవ్ర వేధింపులకు గురిచేశారు. పసివాళ్లనే జాలి లేకుండా చిన్న చిన్న తప్పుల పేరుతో భయంకరంగా చిత్రహింసలకు గురిచేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇండోర్‌లోని అనాథ శరణాలయంలో సుమారు 21 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఆశ్రమంలో గతవారం సీడబ్ల్యూసీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దీంతో అనాథ బాలలు తమ బాధలను, వేధింపులను అధికారులకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న తప్పిదాలకే ఆశ్రమం సిబ్బంది తీవ్రంగా వేధించేవారని వాపోయారు. ‘చిన్నారులను తలకిందులుగా వేలాడదీయడం, వేడి ఐరన్ రాడ్‌తో కొట్టడం, బట్టలు తీసేసి ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. ఎర్ర మిరపకాయలను కాల్చడం వల్ల వచ్చే పొగను కూడా పీల్చుకునేలా చేశారు’ అని అధికారులు తెలిపారు. మరీ దారుణంగా నాలుగేళ్ల పిల్లవాడు ప్యాంట్లో బాత్రూం వెళ్లాడని అతడిని రెండు మూడు రోజులు వాష్‌రూమ్‌లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదు మేరకు అయిదుగురు అనాథాశ్రయం సిబ్బందిపై కేసు నమోదైంది. అనాథ శరణాలయాన్ని వెంటనే సీజ్ చేశారు. చిన్నారులను ప్రభుత్వం షెల్టర్‌కు తరలించినట్లు ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. చిన్నారులపై వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా హోంలోని పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనాథలుగా గుర్తించారు. అయితే ఆ అనాథశ్రమాన్ని వాత్సల్యపురం జైన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది, దీనికి బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. చదవండి: ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
‘నారాయణ’ కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
మీర్‌పేట: ‘సారీ అమ్మానాన్న.. ఇదే నా చివరి రోజు. మార్కులు ఎక్కు వగా తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. అప్పుడప్పుడూ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వైభవ్ మంగళవారం తెల్లవారుజామున పని ముగించుకొని కళాశాలకు వెళ్తానని ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్లో ‘మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఒత్తిడి, టార్చర్ చేస్తున్నారు. సారీ అమ్మానాన్న, తమ్ముడు.. దయచేసి ఎవరూ నారాయణ కళాశాలలో చేరొద్దు. ఇదే నా జీవితంలో చివరి రోజు. దయచేసి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. నా తమ్ముడిని మంచి కళాశాలలో చేర్పించండి. అతని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా. చివరగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు క్షమాపణలు’ అని లేఖలో రాశాడు. దీంతో నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు, స్థానికులు, ఏబీవీపీ నాయకులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. -
విడాకులు తీసుకున్న కూతుర్ని మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి
అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. కానీ సమాజం, చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఏదైనా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోమ్మని సలహా ఇస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అత్తింట్లో కూతురి కష్టాలు చూడలేక విడాకులు తీసుకుంటానన్న ఆమె నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా దీన్ని ఒక వేడుకలా నిర్వహించి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లంటే నూరేళ్ల పండుగ. కానీ అందరి జీవితాల్లో అది నిజం కాదు. పెళ్లితో మరింత అందంగా మారిపోతుందనుకున్న జీవితం తలకిందులైతే? ఆ బాధ వర్ణణాతీతం.మరోవైపు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించిన ఆ తండ్రికి అత్తగారింట్లో కూతురు ఆనందంగా లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు. అయితే అప్పటికే భర్తతో ఇక కలిసి ఉండలేనంటూ కూతురు తీసుకున్న విడాకుల నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా ఘనంగా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. వివాహం సమయంలో నిర్వహించిన ఊరేగింపు మాదిరిగానే బ్యాండు బాజాలు, టపాసుల చప్పుళ్ల మధ్య ఆమెకు స్వాగతం పలికారు. బాణసంచా సందడి మధ్య ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..రాంచీలో కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు.ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అతడు అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని,అంతేకాకుండా అతడికి ముందే వివాహం అయినట్లు తెలిసి షాక్ అయ్యామని ప్రేమ్ గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దల సమక్షంలో అతడితోనే బంధం కొనసాగించాలని కూతురికి సర్దిచెప్పామని, అయినా అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భర్త నుంచి విడిపోవాలని తన కూతురు నిర్ణయం తీసుకుందని, దీన్ని తాము కూడా అంగీకరించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే సాక్షిని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చేందుకు బరాత్ మాదిరిగా ఊరేగింపు చేశామని అన్నారు. ప్రస్తుతం విడాకుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
ఆమె టార్చర్ కోసం పురుషుల క్యూ.. ఎందుకంటే..
మనిషి ఎంత విచిత్రమైన జీవి అంటే ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చని అనుభవం మరొకరికి నచ్చవచ్చు. కొందరు పురుషులు తమ భాగస్వామితో మాత్రమే రొమాన్స్ చేయాలని అనుకుంటారు. మరికొందరు రొమాన్స్‌లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. అలాంటి తాపత్రయం కలిగిన పురుషులకు కావాల్సినంత టార్చర్ చూపిస్తూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది ఇంగ్లండ్ కు చెందిన ఓ అమ్మడు. ఆమె పురుషులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వారిని తీవ్రంగా వేధిస్తుంది. ఇందుకోసం వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. సర్రేలోని ఫర్న్హామ్ నివాసి అయిన అరి మక్టాన్స్ పురుషులను కొట్టడం ద్వారా డబ్బు సంపాదిస్తూ వెనకేసుకుంటోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా డబ్బులిచ్చి కొట్టించుకునేందుకు పురుష పుంగవులు ఆమె ముందు బారులు తీరుతున్నారు. డైలీ మెయిల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఒక డామినేట్రిక్స్ అంటే శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ. ఆమె ఒక గంటకు 17 వేల రూపాయలు సంపాదిస్తుంది. తిట్టడం మొదలుకొని తోలు బెల్టుతో కొట్టడం వరకు.. ఇలా వివిధ పనులు చేయించుకునే మగవారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది. తాను చాలా మంది వివాహాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లు ఆ మహిళ తెలిపింది. చాలా మంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమలో హింస ఉందనుకుంటారని, అందుకే వారు భార్యకు దూరంగా ఉంటారని ఆమె పేర్కొంది. అయితే తాను ప్రేమలోని హింసను వారికి అర్థమయ్యేలా చెప్పి, పలువురి కాపురాలు నిలబెడుతున్నానని ఆమె తెలిపింది. కాగా ఆమె తన 19 సంవత్సరాల వయసు నుంచే ఈ పనిని ప్రారంభించింది. ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తి స్థాయి డామినేట్రిక్స్ గా మారింది. ఆమె ఒక నెలకు దాదాపు 20 మంది పురుషుల డిమాండ్లను నెరవేరుస్తుందని సమాచారం. ఇలా వచ్చేవారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారి వింత కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. ఆమె కెరీర్‌కు మద్దతు పలికే బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమెకు ఉన్నాడు. ఆమె తన పాదాలతో పురుషుల ముఖాన్ని తన్నుతుంటుంది. ఈ తన్నుల కోసం పురుషులు ఆమె దగ్గరికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
అది 'టార్చర్ సమయం'.. నెట్టింట సమంత షాకింగ్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే యాక్షన్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా, ఇండియన్ వెర్షన్లో వరున్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. చదవండి: పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని ప్రస్తుతం ముంబైలో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. సిటాడెల్ సిరీస్ కోసం బాగానే కష్టపడుతుంది సమంత. ఇటీవలే షూటింగ్లో భాగంగా రెండు చేతులకు గాయమైన ఫోటోలను పోస్ట్ చేసిన సమంత తాజాగా మరో ఓ ఫోటోను షేర్ చేస్తూ 'ఇట్స్ టార్చర్ టైమ్' అని రాసుకొచ్చారు. ఇందులో ఐస్ బాత్ టబ్‌లో కూర్చున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో ఐస్‌బాత్‌తో ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు -
'జైలులో నన్ను టార్చర్ పెట్టారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి..'
ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా తనను గతేడాది జైల్లో టార్చర్ పెట్టారని ఆరోపించారు. ఎంత హింసించినా తన నమ్మకాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. ఆ రోజులు తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. అసలు ఎందుకు జైలుకు వెళ్లావు? ఏం చేశావు? అని తన పిల్లలు తరచూ అడిగేవారని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది హనుమాన్ జయంతి సందర్భంగా అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హునుమాన్ చాలీసా చదువుతానని శపథం చేశారు నవనీత్ రానా. తనతో పాటు వేలాది మంది కలిసిరావాలని పిలుపునిచ్చారు. దీంతో శివసేన కార్యకర్తలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ముందుజాగ్రత్తగా చర్యగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నవనీత్ రానా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి సీఎం థాక్రేకు తగిన శాస్తి జరిగిందని, పదవి పోయిందని విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడు కూడా పార్టీని కాపాడలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తప్పుడు నిర్ణయమని తండ్రి ఆవేదన -
యజమాని జంట పైశాచిక ఆనందం.. బాలికను చిత్ర హింసలు పెడతూ...
ఇంట్లో పని నిమిత్తం చేరిన ఓ మైనర్ బాలికను దంపతులైన యజమానులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. బాలికకు అన్నం పెట్టకుండా పస్తులుంచి ఆమెను శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. అయితే ఎట్టకేలకు బాధితురాలిని వేధించిన రాక్షస జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఉద్యోగస్తులైన ఓ దంపతుల ఇంట్లో పని మనిషిగా చేరింది. కాగా బాలికపై దంపతులు గత కొంత కాలంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. సరిగా పనిచేయడం లేదని, ఇంట్లోని వస్తువులను దొంగిలించిందనే నిందలు వేస్తూ కర్రలు, ఇనుప వస్తువులను వేడి చేసి ఆమెపై దాడికి పాల్పడుతున్నారు. ముఖం, చేతులపై కొడుతూ దారుణంగా గాయపరిచారు. రోజులపాటు ఆమెకు అన్నం పెట్టకుండా హింసిస్తూ రాక్షస ఆనందం పొందారు. దీంతో ఆకలికి అలమటించి యజమానులు తిని చెత్తబుట్టలో పడేసిన ఆహారాన్ని బాలిక తినేది. అయితే దీపక్ నారాయణ అనే యాక్టివిస్ట్ బాలిక ఘోర పరిస్థితిని తెలుసుకొని ఆమె ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బాలిక ముఖం, పెదాలు, చెంపలు, చేతులపై కాలిపోయిన గాయాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి. దీనిపై స్పందించిన గురుగ్రామ్‌కు చెందిన ఓ స్వంచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పైశాచిక యజమానుల బారి నుంచి మంగళవారం సాయంత్రం బాలికను రక్షించారు. గత కొన్ని నెలలుగా ఆమెను భయంకరంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను రక్షించే సమయంలో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఏడాది కిత్రం ఓ ఏజెన్సీ ద్వారా తమ మూడు నెలల పాపను సంరక్షణ కోసం బాలికను నియమించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై సంబంధింత సెక్షన్ల ప్రకరం కేసు నమోదు చేశారు. అయితే దంపతుల ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అరెస్ట్ అయిన మహిళను ఆమె పనిచేస్తున్న సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. -
నన్ను మానసికంగా చిత్రహింసలు పెట్టాడు: రాఖీ సావంత్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ వివాహం రోజుకో మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన భర్త అదిల్ దురానీతో ఎలాంటి వివాదం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఈ జంట మధ్య సయోధ్యం కుదిరినట్లు భావించారు. కానీ కథ మరోసారి అడ్డం తిరిగింది. మొదట ఈ పెళ్లి ఫేక్ అని కొట్టి పారేసిన ఆమె ప్రియుడు ఆదిల్ మళ్లీ ప్లేట్ ఫిరాయించాడు. అతనికి మరొకరితో వివాహేతర సంబంధముందని ఆరోపించిన రాఖీ సావంత్ ఆమె పేరును సైతం మీడియాకు వెల్లడించింది. ఈ క్రమంలోనే కన్నీటి పర్యంతమైంది రాఖీ. ఆమె ఏడుస్తూ తన బాధలను మీడియాకు వివరించింది. ఆదిల్ ఆ అమ్మాయితోనే ఉండాలనుకుంటున్నాడని రాఖీ ఆరోపిస్తోంది. రాఖీ బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. నా వద్ద వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆదిల్.. తను అనే అమ్మాయితో వెళ్లాడని వివరించింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్.. తను అనే అమ్మాయితోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్లో నా సొంత కష్టంతోనే ఎదిగాను. బాలీవుడ్ల సంపాదించిన నా డబ్బు అంతా ఆదిల్ తీసుకున్నాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా నన్ను టార్చర్ చేశాడు. పెళ్లి తర్వాత అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. ఆదిల్ తనను అత్యంత దారుణంగా హింసించాడు.' అంటూ రోదించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరికొందరు రాఖీ సావంత్‌కు అండగా ఉంటామని పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by India Forums (@indiaforums) View this post on Instagram A post shared by @varindertchawla . View this post on Instagram A post shared by @varindertchawla -
అల్లరి చేస్తున్నాడని బాలుడి దారుణ హత్య
కడప అర్బన్: అల్లరి చేస్తున్నాడని ఓ బాలుడిని మేనత్త, మామలు చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా కడపలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడి నానమ్మ ఇందిరమ్మ, తాత జానయ్య, పోలీసుల కథనం మేరకు..అన్నమయ్య జిల్లా కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచెర్ల శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఆశ్రిత్‌కుమార్ (8)ను బాగా చదివించాలని శివకుమార్, భాగ్యలక్ష్మిల అనుమతితో కడప ఓంశాంతి నగర్లో ఉంటున్న మేనత్త ఇంద్రజ వద్ద పది రోజుల క్రితం నానమ్మ, తాతయ్యలు వదిలిపెట్టారు. ఇంద్రజ, ఆమె భర్త అంజన్‌కుమార్ వై–జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు. ఆశ్రిత్‌ను తమ బిడ్డలాగా చూసుకుంటామని చెప్పిన వీరు..బాగా అల్లరి చేస్తున్నాడనే నెపంతో చిత్రహింసలు పెట్టేవారు. ఈ నెల 3న రాత్రి రోజూ మాదిరిగానే మేనత్త,మామలు బాలుడిని బాగా కొట్టారు. బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించి రిమ్స్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఇంద్రజ దంపతులు వారి కుమార్తెతో కలిసి పరారయ్యారు. రిమ్స్ మార్చురీలోని బాలుడి మృతదేహాన్ని కడప డీఎస్పీ శివారెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అంజన్‌కుమార్‌ను ఇంద్రజ ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇంద్రజ అమ్మా, నాన్న, అన్నా, వదినకు ఇష్టం లేదు. దీంతో వారి మధ్య రాకపోకలు లేవు. ఇంద్రజ కుమార్తె పుట్టిన రోజును ఇటీవల ఘనంగా నిర్వహించారు. దీంతో వీరి మధ్య మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఈ ఘోరం జరిగింది. అన్నయ్యా..మమ్మల్ని క్షమించు! తాము చేయరాని తప్పు చేశామని, ఆశ్రిత్ చనిపోయాడని ఇంద్రజ, కువైట్‌లో ఉన్న తన అన్న శివకుమార్‌కు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టింది. తరువాత సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి భర్త, కుమార్తెతో కలిసి పరారైంది. మెసేజ్ చూసిన శివకుమార్ ఇంద్రజకు ఫోన్ చేయగా..స్విచ్ఛాఫ్ రావడంతో తన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు సమాచారమిచ్చాడు. వారు కడప రిమ్స్‌కు హుటాహుటిన చేరుకుని బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. -
Hyderabad: పోలీసుల ఓవర్‌యాక్షన్! ఉదయాన్నే స్టేషన్‌కు వస్తానన్నా వినకుండా..
సాక్షి, హైదరాబాద్: పోలీసులంటే రక్షక భటులని, ప్రజలను కాపాడాల్సి బాధ్యత వారిపై ఉంటుందని అంటుంటారు. ఈ మాటలని నిజం చేస్తూ కొందరు నిజాయితీగా పని చేస్తూ పతకాలు, ప్రమోషన్లు సాధిస్తుంటే, మరికొందరు పోలీసులు మాత్రం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో మూడు గంటల పాటు ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు కొందరు పోలీసులు. పొడుగాటి దుడ్డుకర్రతో గుచ్చుతూ ఇష్టానుసారంగా దాడి చేసి, ఆఖరికి వ్యక్తి కాలు విరగొట్టారు. ఈ ఘటన సికింద్రాబాద్ మెట్టుగూడలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లాలాగూడ చెందిన సూర్య ఆరోక్యరాజ్ (25) జిమ్ నడిపస్తున్నాడు. ఈనెల 3న రాత్రి ఇంటి వద్ద బస్తీలో ఓ వ్యక్తికి ఇతనికి ఇద్దరి మధ్య బైకు విషయంపై గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురు కానిస్టేబుళ్లు.. సూర్య ఇంటి వద్దకు వెళ్లి తమతో స్టేషన్‌కి రావాలని ఆదేశించారు. అయితేరాత్రి 11 గంటలు అవుతుందని, ఉదయాన్నే వస్తానని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ నలుగురు పోలీసులు సూర్యపై ఇష్టానుసారంగా దాడి చేశారు. మాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ దుడ్రుకర్రను రెండు కాళ్ల మధ్య ఉంచి బూటు కాళ్లతో తొక్కుతూ చిత్రహింసలు పెట్టారు. సూర్య తల్లి తన కొడుకును కొట్టకండని పోలీసుల్ని ఎంత ప్రాధేయ పడుతున్నప్పటికీ అతనిపై కనికరం చూపకుండా చితకబాదేసి వెళ్లిపోయారు. పేదరికం కారణంగా మందులు కొనుక్కోలేని పరిస్థితి వాళ్లది. సూర్య ఎడమ కాలు విరిగిపోగా, కుడి కాలుకు తీవ్ర గాయం ఏర్పడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్విటర్లో కేటీఆర్ ప్రశ్నల వర్షం -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్‌కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
భార్య వేధింపులు.. రోజూ గొడవ.. జీవితంపై విరక్తితో భర్త ఆత్మహత్య
సాక్షి,ధర్మపురి( జగిత్యాల): భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కమలాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం, మృతుడి తండ్రి రాజలింగు ఫిర్యాదు మేరకు.. గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్(30)కు రోజాతో తొమ్మిదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్లకొడుకు అవినాశ్ ఉన్నాడు. ఇద్దరూ కూలీపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొద్దిరోజులుగా దంపతుల మధ్య ఏదో ఓ కారణంపై గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా రోజా భర్తతో గొడవపడడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ అర్ధరాత్రి గ్రామంలోని కుమ్మరి శంకరయ్య వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బుధవారం జాలర్లసాయంతో బయటకు తీసి పోస్టుమార్టంకోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కోడలి వేధింపుల కారణంగానే తన కొడుకు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి గోలి రాజలింగు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని.. -
కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్ చేసి..
అహ్మదాబాద్: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ దళిత యువకుడిని అపహరించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మేఘానినగర్‌కు చెందిన రాహుల్ చమర్ అనే యువకుడు వినోద్ దుతానియా కూతురితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని అతనికి తెలిసింది. దీంతో ఆగ్రహించిన దుతానియా అతని సహచరులతో కలిసి రాహుల్‌ని అక్టోబర్ 1న బాపూర్ నగర్‌లోని డి-మార్ట్ దుకాణం వెలుపల ఉన్నప్పుడు అపహరించారు. ఈ విషయం బాధితుడి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అక్టోబర్ 2 రాత్రి, ఆ యువకుడిని షహేర్కోటలోని విజయ్ మిల్లో బందీగా ఉంచినట్లు తెలుసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, బాధితుడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలతో కనిపించాడు. అంతేకాకుండా రాహుల్ చేతులు, కాళ్లని కట్టేసి నిందితులు తీవ్రంగా హింసించారు. రాహుల్‌ని కాపాడిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు వినోద్ దుతానియా, అతనికి సహాయం చేసిన వారిని అరెస్ట్ చేశారు. చదవండి: తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు -
కానిస్టేబుల్ వేధించాడని యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం రూరల్: పోలీసు బెదిరింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ యువకుడు.. తన ఫ్రెండ్స్‌కు పంపిన సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ ప్రారంభమైన వీడియోలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఏకరువు పెట్టాడు ఆ యువకుడు. వివరాలిలా ఉన్నాయి.. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన ఆటోడ్రైవర్ పిచ్చుక మజ్జియ్య(23) గతేడాది తెలంగాణ నుంచి వస్తూ రెండు మందు బాటిళ్లు వెంట తెచ్చుకుంటున్నాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లు వద్ద తనిఖీల సందర్భంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పెట్టీ కేసు పెట్టి విడిచి పెట్టేశారు. తాజాగా మంగళవారం ఉదయం మజ్జియ్యకు శివ అనే కానిస్టేబుల్ ఫోన్‌చేసి కేసు విషయం మాట్లాడాలి..ఆధార్‌కార్డు తీసుకుని రమ్మని చెప్పగా వెళ్లాడు. అయితే కేసు మాఫీ చేసినందున రూ.లక్ష ఇవ్వాలని యువకుడిని సదరు కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు. లేకపోతే గంజాయి కేసు బుక్‌చేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురయిన మజ్జియ్య బుధవారం వెంకటగిరిలోని అమ్మమ్మ ఇంటిలో ఫ్యాన్‌కు స్కార్ఫ్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి, ఎస్ఐ శివాజీ, ఎస్బీ ఎస్ఐ గౌరినాయుడు వివరాలు సేకరిస్తున్నారు. ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువకుడిని డబ్బులు డిమాండ్ చేసింది ఎవరు? 2 బాటిళ్లతో దొరికితే.. 5బాటిళ్లు అని కేసు ఎందుకు పెట్టారు? తదితర విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి.. ఐదుగురితో కలిసి కారులో
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఈ క్రమంలోనే బలవంతంగా కారులో ఎక్కించుకుని మరో నలుగురితో కలిసి ఆమెను రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి మొబైల్ ఫోన్, పర్సు గుంజుకున్నాడు. తెల్లవారుజామున ప్రధాన రహదారిపై ఆపి బయటకు తోసేసి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న 37ఏళ్ల మహిళతో ఎనిమిది నెలలుగా జడ్చర్లకు చెందిన పెద్ద వెంకటేశ్‌గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కలువలేకపోతున్నానని చెప్పాడు. తాను పెద్ద దిక్కుగా ఉంటానంటూ నమ్మబలికి భార్యతోనూ మాట్లాడించాడు. ఇటీవల మహబూబ్‌నగర్‌కు చెందిన మిత్రుడు వెంకటేశ్ తదితరులతోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈనెల 2న జడ్చర్లలోని తన ఇంటికి రప్పించాడు. అనంతరం కారులో ఎక్కించుకుని తన బావమరిదితో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి క్రిస్టియన్‌పల్లి మీదుగా భూత్పూర్కు తీసుకెళ్లారు. అక్కడి దాబాలో ఉన్న పెద్ద వెంకటేశ్‌గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేశ్‌గౌడ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. కాలినడకన మహబూబ్‌నగర్‌లోని పాత డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడును వెళ్లబోసుకుంది. చివరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చి బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ధర్నాకు అనుమతివ్వండి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సిగ్నల్‌గడ్డపై ధర్నా చేసేందుకు అనుమతివ్వాలని కోరగా పోలీసులు నిరాకరించారు. అనంతరం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. నిందితులు ధన బలంతో పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తన మొబైల్లోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ఇప్పుడు కూడా కార్పొరేట్ యాజమాన్యాల కక్కుర్తి..!
ప్రైవేటు ఉద్యోగి అయిన సురేశ్ కుమారుడు వర్షిత్. ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. వార్షిక ఫీజు రూ.77 వేలు. అందులో ఇప్పటికే రూ.35 వేలు కట్టేశారు. కరోనా ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని,ఫీజు తగ్గించాలని ప్రిన్సిపాల్‌ను కోరినా ప్రయోజనం లేదు. మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫీజు కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వబోమని, పరీక్షలు రాయనివ్వమని అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక సురేశ్ అప్పుల వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఇంతటి కరోనా సమయం లోనూ రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల దోపిడీ కొనసాగుతోంది. ఏదో ఒకలా ఫీజులు వసూలు చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షలు రద్దయినా.. మిగతా తరగతులకు పరీక్షలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. ఫీజులు పూర్తిగా కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజుల కోసం టీచర్లతో ఫోన్లు చేయించడం, వినకుంటే పరీక్షలు రాయనివ్వబోమని, పైతరగతికి పంపబోమని బెదిరించడం చేస్తున్నాయి. అసలే కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు.. చివరికి అప్పులు చేసైనా ఫీజులు కడుతున్నారు. మరోవైపు పలు కాలేజీలు ఇంటర్ విద్యార్థులకు జేఈఈ కోచింగ్ పేరిట ప్రత్యక్ష బోధనకు రావాలని ఒత్తిడి తెస్తున్నాయి. వినకుంటే తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. ‘ఫీజు’ బాధలో లక్షల మంది తల్లిదండ్రులు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ పరిస్థితులతో సుమారు లక్షన్నర వరకు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, మరో 2 లక్షల మంది వరకు ఇతర రంగాల వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. కుటుంబం గడవటమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వారు పిల్లల ఫీజుల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. పరీక్షల తర్వాత టీసీ తీసుకునేప్పటి వరకు ఫీజుల సొమ్మంతా చెల్లిస్తామంటున్నా యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కడితేనే పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తామని, పరీక్షలు రాయనిస్తామని అంటున్నాయి. టెన్త్ విద్యార్థులపైనా.. పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులు ఇచ్చే ఆలోచనలు చేస్తోంది. స్కూళ్లు ఇదే అదనుగా ఫీజు మొత్తం వసూలు చేసుకునే పనిలో పడ్డాయి. ఫీజులు కడితేనే ఎఫ్ఏ–1 మార్కులను ప్రభుత్వానికి పంపుతామని బెదిరిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది అంతంతే.. అయినా పూర్తి ఫీజులు రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కార్పొరేట్ కాలేజీలే 700పైగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 10,807 ఉంటే.. అందులో 4 వేల వరకు బడా ప్రైవేటు స్కూళ్లు, మరో 2 వేల వరకు కార్పొరేట్ స్కూళ్లు, మిగతావి చిన్న పాఠశాలు. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచీని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. స్కూళ్లలో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా.. చాలా స్కూళ్లు, కాలేజీలు 75 శాతం సిబ్బందిని తొలగించి, మిగతా 25 శాతం మందితోనే క్లాసులు చెప్తున్నాయి. ప్రత్యక్ష బోధన మొదలైనా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఈ 25 శాతం మంది సిబ్బందికి కూడా అరకొర వేతనాలే చెల్లిస్తున్నాయి. కానీ విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న విద్యా శాఖ గానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి నెలవారీ ట్యూషన్ ఫీజులు తీసుకోవాలంటూ గతంలో జీవో 46 జారీ చేసినా.. అది అమలుకాలేదు. అసలు స్కూళ్లలో ఎందరు టీచర్లు ఉన్నారు, ఎందరిని తొలగించారు, ఆన్లైన్ బోధన ఎంత మంది చేశారు, విద్యార్థులకు ఏ మేర పాఠాలు జరుగుతున్నాయన్న దానిపై విద్యాశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బడా, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటు పాఠశాల విద్యా శాఖకు, అటు ఇంటర్ బోర్డుకు రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా ఫీజుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..! -
అసోం పోల్స్: అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు
సాక్షి,గౌహతి: జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్టు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశచూపిందంటూ అఖిల్ లేఖ రాశారని ఆయనకు చెందిన రైజోర్ దళ్ వెల్లడించింది. కోర్టు అనుమతిలేకుండా అఖిల్‌ను 2019 డిసెంబర్లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలపై పడుకోవాల్సివచ్చిందని అఖిల్ లేఖలో తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో చేరితే బెయిల్ పొందవచ్చన్న ఆఫర్‌ను తిరస్కరించగా కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రికావచ్చని ఆశ చూపారన్నారు. అంతేకాకుండా కేఎంఎస్ఎస్(కృషిక్ ముక్తి సంగ్రామ్ సమితి)ని వీడి ఒక ఎన్జీఓ ఆరంభించి, అసోంలో క్రిస్టియన్ మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు. ఇవేవీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం మరియు ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎన్ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. కోవిడ్ కారణంగా అఖిల్‌ను గౌహతి మెడికల్ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్‌ను ఎన్ఐఏ 2019లో అరెస్టు చేసింది. అయితే అఖిల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్‌కు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తున్న గొగోయ్ శివసాగర్ సీటు నుండి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
భర్తపై కోపంతో పిల్లలకు వాతలు
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): భర్తపై ఉన్న కోపాన్ని అభంశుభం తెలియని కన్నపిల్లలపై ప్రదర్శించింది ఓ తల్లి. కట్టెతో కొట్టి, కర్రుకాల్చి వాతలు పెట్టింది. బాధను భరించలేక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరించలేదు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండ రా మారావునగర్కు చెందిన రాజు, పావని భార్యభర్తలు. వీరికి జ్ఞానేశ్వర్(5), మహాలక్ష్మీ(4) సంతానం. ఈ నెల 23వ తేదీన భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్త మీద కోపంతో ఉన్న పావని విచక్షణ కోల్పోయి తన ఇద్దరు పిల్లలను కట్టెతో తీవ్రంగా కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా పొయ్యిలో కాల్చిన గిన్నెతో చిన్నారుల తొడలు, అరికాళ్లపై వాతలు పెట్టింది. స్థానికులు అడ్డుకోగా ‘మా కుటుంబ విషయాలు మీకెందుకు’అంటూ విరుచుకుపడింది. అటుగా వెళ్తున్న అంగన్వాడీ టీచర్ గమనించి మేడ్చల్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని లీగల్ సెల్ అధికారిణి సుజాత దృష్టికి తీసుకువెళ్లింది. ఆమె సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు చిన్నారులను తీవ్రంగా హింసించిన తల్లి పావనిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చదవండి: (చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య) -
శిగం ఊగుతుందని..
యాదగిరిగుట్ట: వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆలనాపాలనా చూడాల్సిన కొడుకులు కర్కోటకులయ్యారు. నవ మాసాలు మోసి కని పెంచిందని కనీసం కనికరం లేకుండా వ్యవహరించారు. శివసత్తి శిగం ఊగుతుందని, కర్రలతో కొట్టి.. రోడ్డున పడేశారు. ఈ సంఘటన గురువారం యాదగిరిగుట్టలో వెలుగుచూసింది. వివరాలు.. హైదరాబాద్‌లోని సీతారామబాద్‌కు చెందిన యాదమ్మ (65), విఠల్ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. యాదమ్మ మంగళవారం, శనివారం శిగం ఊగుతుంటుంది. దీంతో భర్తతో పాటు కుమారులు, కోడళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో రోజూ ఆమెను కొట్టడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారు. చివరికి ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించారు. వారం క్రితం యాదగిరిగుట్టకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు. లక్ష్మీ సినిమా థియేటర్ సమీపంలో ఓ ఇంటి అరుగుపై అనారోగ్యంతో బాధపడుతున్న యాదమ్మను గమనించిన స్థానికులు.. వంగపల్లిలోని అమ్మఒడి అనాథ ఆశ్రమానికి పంపించారు. కుటుంబ సభ్యులు నిత్యం చిత్రహింసలకు గురిచేసేవారని యాదమ్మ తమతో చెప్పినట్లు ఆశ్రమ నిర్వాహకులు జెల్లా శంకర్ తెలిపారు. కుటుంబ సభ్యుల పేరు ఎత్తితేనే ఆమె భయపడుతుందని చెప్పారు. -
పీపాలో నెల రోజులు.. మలం తిని బతికాడు
బ్రెసీలియా : కన్నతండ్రి, పిన తల్లి కర్కశత్వంతో ఓ బాలుడు నరకం అనుభవించాడు. పీపా(బ్యారెల్)లో బందీ అయి, తినడానికి సరైన తిండి లేక మలం తిని బ్రతికాడు. ఈ దారుణ సంఘటన బ్రెజిల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ బ్రెజిల్‌లోని జార్డిమ్ ఇటాటియాయాకు చెందిన పదకొండేళ్ల బాలుడ్ని అతడి తండ్రి, పినతల్లి బాల్కనీలోని పీపాలో బంధించి, చైన్లతో కట్టేశారు. పీపాలోంచి బయటకు అడుగు పెట్టనిచ్చేవారు కాదు. తినడానికి కేవలం అరటి పండు తొక్కలు మాత్రమే ఇచ్చేవారు. దీంతో ఆకలికి తట్టుకోలేక తన మలాన్ని తిని బతికాడు. దాదాపు నెల రోజుల పాటు నరకం అనుభవించాడు. సరైన పోషకాహారం లేక బక్కచిక్కిపోయి చావుకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితి గమనించిన పొరిగింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. ( 2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోటిలో బంగారు నాలుక ) గత శనివారం అక్కడకు వెళ్లి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. బాల్కనీలోని పీపాలో ఓ బాలుడు నగ్నంగా నిలుచుని ఉన్నాడు. పీపా చాలా వరకు మూత్రం, మలంతో నిండిపోయింది. అతడి శరీరం ఎముకల గూడును తలపిస్తోంది. పోలీసులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితికి కారణమైన తండ్రి, పినతల్లి, అక్క(పినతల్లి కూతురు)ని అరెస్ట్ చేశారు. నిందితులు దీనిపై మాట్లాడుతూ.. బాలుడి మానసిక పరిస్థితి బాగోలేదని, తమ పనులకు ఎప్పుడూ ఇబ్బంది కలిగిస్తున్నాడని చెప్పారు. అందుకే అతడ్ని పీపాలో ఉంచి చైన్‌తో కట్టేశామని తెలిపారు. -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
కార్పొరేట్ టార్చర్
-
కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి
లక్నో: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జంతువుల పట్ల హింస పెరిగిపోతుంది. కేరళలో ఏనుగు మృతి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కోతికి ఉరేసిన ఘటనల గురించి విన్నాం. ఈ దారుణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రలతో కొడుతూ.. వెనక నుంచి పిన్నులతో గుచ్చుతూ ఆనందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చివరకు కోతి మీద నలుపు రంగు పోసి ఆ తర్వాత వదిలేశారు ఆ సైకోలు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోతిని హింసించిన నలుగురిని అరెస్ట్ చేశారు. వారికి రూ.60వేలు జరిమానా విధించారు.(వీళ్లు మనుషులు కాదు రాక్షసులు) -
ముసలి తల్లికి కొడుకు, మనవడు వేధింపులు
బెంగళూరు: జన్మినిచ్చిన తల్లిని రాచిరంపాన పెడుతూ రాక్షసానందం పొందాడో ప్రబుద్ధుడు. నానమ్మ అని గౌరవించకుండా తండ్రిని మించిపోయి చిత్రహింసలు పెట్టాడో యువకుడు. వయసు మీద పడ్డ ముసలి తల్లిని తాగిన మత్తులో ప్రతిరోజు కొడుతూ నరకం చూపించారు తండ్రీకొడుకులు. ఈ దారుణం కర్ణాటకలో చోటు చేసుకుంది. బెళతంగాడీకి చెందిన శ్రీనివాస్ శెట్టి తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించేవాడు. (ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది..) శ్రీనివాస్‌తో పాటు, అతని కొడుకు ప్రదీప్ శెట్టి కూడా రోజూ తాగొచ్చి ఆమెను కొట్టేవారు. ఈ క్రమంలో ఓ రోజు శ్రీనివాస్ తల్లిపై చేయి చేసుకోవడమే కాక ఆమెను నేలపై ఈడ్చుకుంటూ వెళ్లి మూలకు విసిరేసాడు. ఈ వీడియోను ఆమె రెండో మనుమడు వీడియో తీయగా బయటకు వచ్చింది. ఈ వీడియోలో ముసలితనంలో ఉన్న ఆమె నిస్సహాయురాలై సాయం కోసం అర్థించటం అందరినీ కలిచివేస్తోంది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. (అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి) -
వృద్ధాశ్రమం పేరిట చిత్రహింసలు
కీసర: మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు కొందరు.. మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలైనవారు మరికొందరు.. పిల్లలకు దూరమైన వృద్ధులు ఇంకొందరు.. ఇలా 85 మందిని వృద్ధాశ్రమం పేరిట ఓ భవనంలో ఉంచి యజమానులు చిత్రహింసలు పెట్టేవారు. అనుమతి లేకుండానే నడుపుతున్న ఈ ఆశ్రమంలో ఇరుకు గదుల్లో అందరినీ కలిపి ఉంచి ఇబ్బందులకు గురి చేసేవారు. స్థానికుల ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో సాగుతున్న ఈ ఆశ్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. నాగారంలోని శిల్పానగర్ కాలనీలో రెండు చిన్న భవనాలను జాన్ రతన్‌పాల్, కె.భారతి, అరుణాచలం, భాను అద్దెకు తీసుకొని నాలుగేళ్ల క్రితం మమత వృద్ధాశ్రమం ఆశ్రమం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక వికలాంగులతో పాటు మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వారి తల్లిదండ్రులు, బంధువులు.. నిర్వాహకులకు నెలకు రూ.4,000 నుంచి 15,000 వేల వరకు ఇచ్చి ఈ ఆశ్రమంలో చేర్పించారు. అయితే వీరికి సరిపోయే వసతులు ఇక్కడ లేకపోగా మానసిక పరిస్థితి సరిగా లేని వారిని గొలుసులతో నిర్బంధిం చారు. ఎవరైనా చెప్పినట్లు వినకుంటే నిర్వాహకులు కొట్టేవారని ఆరోపణలున్నాయి. అధికారుల విచారణ... రెండ్రోజుల క్రితం ఆశ్రమం నుంచి కేకలు వినిపించాయి. పక్కనే ఉన్న మోడీ అపార్ట్‌మెంట్‌వాసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చగా నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడి కాలనీవాసులు వారిని పక్కకు నెట్టి లోపలికి వెళ్లి చూడగా, గదుల్లో వృద్ధులు, మానసిక దివ్యాంగులు కనిపించారు. కొందరి శరీరంపై గాయాలుండటం గమనించి నిర్వాహకులను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి, కుషా యిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌తోపాటు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా సఖి కేంద్రం అధికారి పద్మావతి ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. ఓ భవనంలో 22 మంది మహిళలను, మరో భవనంలోని ఇరుకు గదుల్లో 63 మంది పురుషులను ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు. ఆశ్రమాలకు తరలింపు... మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవి. రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆశ్రమంలోని వారిని శుక్రవారం ఇతర ఆశ్రమాలకు తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.నారాయణ, మండల వైద్యాధికారి డా.సరిత వైద్య బృందంతో ఆశ్రమంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐదుగురి మానసిక స్థితి బాగానే ఉండటంతో వారిని బంధువులకు అప్పగించా రు. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు. -
రెస్టారెంట్లో దారుణం.. వర్కర్స్‌ని రూమ్‌లో బంధించి
సాక్షి, మంచిర్యాల : పట్టణంలోని ఓ రెస్టారెంట్లో దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న కుకింగ్ మాస్టర్స్, వేటర్స్‌ను గదుల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల పట్టణం హైటెక్ కాలనీ సమీపంలోని టేబుల్7 రెస్టారెంట్లో పనిచేస్తున్న మొత్తం 11మందిని మూడు గదుల్లో బంధించి యాజమాన్యం విచక్షణా రహితంగా చితకబాదింది. రెస్టారెంట్ ఓనర్ ప్రవీణ్‌కు వీడియో కాల్లో చిత్రహింసల దృశ్యాలను చూపిస్తూ యాజమాన్యం కిరాతకంగా వ్యవహరించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులు 100కు డయల్ చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు. అయితే పనివాళ్లను చిత్రహింసలకు గురిచేయటానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. -
గాడిదపై రాజకీయ చిత్ర హింసలు
-
గాడిదలపై రాజకీయ దాడులు.. ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : జూలై 17వ తేదీ, కరాచీ నగరంలో గుర్తుతెలియని దుండగులు ఓ గాడిదను చిత్ర హింసలకు గురిచేశారు. ఇష్టమొచ్చినట్లు ముష్ఠి ఘాతాలు తగిలించారు. ముక్కు రంధ్రాలను గట్టిగా చిదిమారు. పక్క టెముకలు విరిగేలా తన్నారు. కన్ను కింద రక్తం కారేలా గీరారు. దాని శరీరంపై ‘నవాజ్’ అని అక్షరాలు రాసివెళ్లారు. రోడ్డుపక్కన పడిపోయి ఆ గాడిద బాధను భరించలేక మెలితిరిగి పోతుంటే చూసిన ఓ బాటసారి దాన్ని ఎలాగైనా ఆదుకోవాలనుకున్నారు. ఎలా ఆదుకోవాలో తెలియలేదు. దాన్ని ఫొటోలుతీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి చేతనైన వాళ్లు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి స్పందించి.. ‘అయేషా చుండ్రిగర్ ఫౌండేషన్ (ఏసీఎఫ్)’ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ కార్యకర్తలు ఆ గాడిదను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. కాస్త కోలుకున్నప్పటికీ ఇప్పటికీ అది నిలబడలేక, నడవలేక పోతోంది. ఈ నెల 25వ తేదీన జరగనున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలకు ఈ గాడిదకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దేశ ప్రధాని పదవి కోసం ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్ ఖాన్, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన నవాజ్ షరీఫ్ మద్దతుదారులను ఏమీ తెలియని గాడిదలని, మూర్ఖులని, వెదవలని తిట్టారు. అంతే, ఆ రోజు నుంచి గాడిదల మీద దాడులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ ‘తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడుతున్నారని నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్)’ పార్టీ కార్యకర్తలు ఆరోపించగా, తమకు ఈ దాడులతో సంబంధం లేదని, సానుభూతి కోసం నవాజ్ షరీఫ్ కార్యకర్తలే ఈ దాడులు జరిపి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ఖాన్ కార్యకర్తలు వాదిస్తున్నారు. తాము దాడులు చేస్తే గాడిదపై ‘నవాజ్’ అని పేరు కూడా ఎందుకు రాస్తామని షరీఫ్ పార్టీ కార్యకర్తలు వాదిస్తున్నారు. అందులోనే సానుభూతి ఉందని అవతలి వారంటున్నారు. ఇందులో ఏ పార్టీ వారు ఒకరికొకరు తీసిపోరు. గాడిదలపై దాడులు చేసే మూర్ఖత్వం వారిది. ఈ నెల 25వ తేదీన నాలుగు ప్రాంతీయ అసెంబ్లీ స్థానాలతోపాటు జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. బిల్వాల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి ప్రజల మద్దతు అంతగా కనిపించడం లేదు. నవాజ్ షరీఫ్ పార్టీయే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తుండగా, అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ, సైన్యం కుట్ర పన్నుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మొహమ్మద్ అలీ జిన్నా’ వారసులం తామంటే, ‘అల్లమా ఇక్బాల్’ వారసులమని తామని, అక్బర్ వారసులమంటే తాము బాబర్ వారసులమంటూ ఇరు పార్టీల వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వారు ఎవరి వారసులైనా ప్రజల వారసత్వం మాత్రం వారికి అసలే లేదు. వాస్తవానికి ఇరు పార్టీల వారికి ప్రజలంటే ప్రేమగానీ, ఓటర్లంటే గౌరవంగానీ బొత్తిగా లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వారి హక్కనుకుంటారు. గెలిపించడం ప్రజల ఖర్మ అంటారు. గెలిస్తే ప్రధాని పదవిలో వెలగబెడతాం అంటారు. ఓడిపోతే ఏ సౌదీ అరేబియాకో, మరో దేశానికి వెళ్లి వచ్చే ఎన్నికలకు వస్తామంటారు. వారు ప్రజలను నిజంగా గాడిదలనుకుంటారు. అలాగే చూస్తారు. 2009లో తాలిబన్లు ఓ గాడిదకు పేలుడు పదార్థాలు కట్టి అఫ్ఘానిస్థాన్లోని సైనిక శిబిరంలోకి పంపించారు. ఆ పేలుడులో ఆ గాడిద వెంటనే చచ్చి పోయింది. అంతటి భాగ్యం కూడా పాకిస్థాన్ గాడిదలకు లేదు. (పాక్ ఎన్నికలపై లాహోర్ మానవ హక్కుల కార్యకర్త రిమ్మెల్ మొహిద్దిన్ అభిప్రాలకు అక్షరరూపం) -
గన్నుతో భర్త చెవులు కాల్చేసి..
కోల్‌కతా : భర్త తనను వదిలి ఇంటి నుంచి తరుచూ పారిపోతున్నాడనే కోపంతో గన్నుతో అతని రెండు చెవులను కాల్చేసిందో భార్య. ఈ ఘటన మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతాకు సమీపంలోని నర్కెల్‌గంగకు చెందిన తన్వీర్(20) రెండు సంవత్సరాల క్రితం తనకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దదైన ముంతాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముంతాజ్ తన్వీర్‌ను తరుచూ చిత్రహింసలకు గురిచేసేది. ముంతాజ్ పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి పారిపోయిన ప్రతిసారి వెనక్కు పట్టుకువచ్చి చిత్రహింసలు పెట్టేది. తమ కొడుకును విడిచి పెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ఆమెను బ్రతిమాలినా వినలేదు. భర్త ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని అతన్ని ఇంటికి పంపించలేదు. తన్వీర్ గత కొద్దిరోజులుగా ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని సొంత ఊరికి పోనివ్వకుండా, తల్లిని కలవనీయకుండా ఆంక్షలు విధించింది. కొద్దిరోజుల క్రితం అతడు ఆ ఇంటి నుంచి మల్లిక్‌పుర్‌కు పారిపోయినా.. తన మనషుల సహాయంతో వెనక్కి రప్పించిన ముంతాజ్, ఆమె చెల్లెళ్లు అతన్ని తీవ్రంగా హింసించారు. మంగళవారం రాత్రి ముంతాజ్ గన్నుతో తన్వీర్ రెండు చెవులను కాల్చేసింది. దీంతో తన్వీర్ చనిపోయాడని అక్కాచెల్లెళ్లు భావించారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ తన్వీర్ అక్కడినుంచి తప్పించుకుని దగ్గరలోని ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తన్వీర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముంతాజ్, ఆమె చెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
తల్లిదండ్రులు కాదు.. సైకోలు
కాలిఫోర్నియా : ప్రేమగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు క్రూరత్వానికి ప్రతిరూపంగా మారారు. తమ పది మంది పిల్లలను తీవ్రంగా హింసించారు. ప్రతి రోజూ వారికి పత్యక్ష నరకాన్ని చూపించారు. ఎట్టకేలకు వారి పాపం పండింది. పొరుగుంటి వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పది మంది పిల్లలకు అక్కడి నుంచి విముక్తి కలిగించారు. ఆ తల్లిదండ్రులిద్దర్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జొనాధన్ అల్లెన్, ఇనా రోజర్స్ భార్యాభర్తలు వీరికి పదిమంది పిల్లలు. ఏమైందో తెలియదు గత కొద్ది నెలలుగా వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పిల్లలను ఏ తప్పు చేయకపోయినా కొట్టడం, కాల్చడం, గాయపర్చడం చేసేవారు. ఒక రోజు రాత్రి పెద్ద కుమారున్ని తీవ్రంగా కొట్టడంతో అతడు ఇంటి నుంచి పారిపోయి పక్కింటి గార్డెన్లో నిద్రపోయాడు. అదే సమయంలో అటుగా రౌండ్సుకు వెళుతున్న పోలీసులు అతన్ని గమనించి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటి పరిస్థితి, అల్లెన్, రోజర్స్ మాటలపై అనుమానం రావడంతో ఇంటి లోపల సోదాలు నిర్వహించారు. ఇంటి లోపలికి వెళ్లిన వాళ్లకు ఆ పిల్లాడి తల్లిదండ్రులు సైకోలని అర్థమయ్యింది. ఇల్లు బయటకు మాత్రం అందంగా కనిపించినా లోపల మొత్తం చెత్త చెదారంతో, మనుషుల, జంతువుల మల మూత్రాలతో నిండి పోయింది. బాత్ రూమ్ గోడల నిండా పక్షుల వ్యర్థాలతో నిండి ఉండటం పోలీసులు గమనించారు. పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు చేస్తున్న అకృత్యాలను పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు పిల్లలను అక్కడి నుంచి సంరక్షణా కేంద్రానికి తరలించి ఆ దంపతులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. -
కథువా కన్నా దారుణం..
-
కథువా కన్నా దారుణం.. హింసించి చంపారు!
సూరత్: కథువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో గుజరాత్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరత్‌లో ఓ మైనర్ బాలిక(11)ను వారం రోజులు లైంగిక దాడి చేసి, చిత్రహింసలు పెట్టిన మృగాళ్లు, చివరికి గొంతునులిమి హత్యచేశారు. ఏప్రిల్ 6న సూరత్‌లోని భెస్తన్‌లోని క్రికెట్ మైదానంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్ట్‌మార్టంకు పంపారు. బాలిక మృతదేహంపై 86 గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం అనంతరం సూరత్ సివిల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం చీఫ్ గణేశ్ గొవేకర్ తెలిపారు. చెక్కతో చేసిన ఆయుధంతో ఆమె మర్మాంగాలను కూడా మృగాళ్లు గాయపర్చారని వెల్లడించారు. వారంరోజుల పాటు ఆమెను చిత్రవధకు గురిచేసిన అనంతరం చివరగా గొంతునులిమి హత్యచేశారన్నారు. బాలికపై అత్యాచారం జరిగిందా? లేదా? తెలుసుకునేందుకు ఆమె నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనల్లో దోషులెవరినీ విడిచిపెట్టబోమని ప్రధాని మోదీ హామీఇచ్చిన మరుసటి రోజే ఆయన సొంత రాష్ట్రంలోనే ఈ దారుణం వెలుగులోకిరావడం గమనార్హం. కాగా, మృతురాలి గురించి తమకు ఎలాంటి వివరాలు తెలియరాలేదని, ఆమె వివరాలు చెప్పినవారికి రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. -
దారుణం : అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి..
సాక్షి, లక్నో: సాధారణ కూలీ.. ఎదుటి వారికి ఏమీ చెప్పలేడు. తనకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అతనో మూగ, చెవిటితో బాధపడే దివ్యాంగుడు. అలాంటి వాడిని దొంగతనం నేరం మోపి చిత్రవధ పెట్టాడు అతని యజమాని. చెప్పుకోలేని విధంగా హింసించాడు. శరీరంలోని అతి సున్నిత భాగాలకు సైతం కరెంట్ షాక్ ఇచ్చి నరకం చూపించాడు. అనంతరం ఎవరీ తెలియకుండా ఊరికి దూరంగా పడేసి వచ్చాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఉత్తరప్రదేశ్‌లోని షహజహనాపూర్కు చెందిన కమలేష్ కుమార్ చెవుడు, మూగతో బాధపడే దలిత దివ్యాంగుడు. ఇతను యోగేష్ వర్మ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. అయితే గత గురువారం పనికి వెళ్లిన కమలేష్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం కొత్తబస్తీ ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అనంతరం మెలుకువ వచ్చి ఇంటికి చేరుకొని యజమాని తనని ఏవిధంగా హింసించాడో కుటుంబ సభ్యులకు తనదైన శైలిలో వివరించాడు. డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టినట్లు చెప్పాడు. అంతేకాకుండా శరీరంలోని సున్నిత భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారని రోదించాడు. స్పృహ తప్పిపడిపోయిన తనను దూరంగా తీసుకువచ్చి పడేశాడని వాపోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలేష్ శరీరంపై కాలిన మచ్చలు ఉన్నాయని, అతడిని తీవ్రంగా హింసించారని పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు యజమాని యోగేష్ వర్మపై ఐపీసీ 323తోపాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. -
నరకం చూపారు..
నాలుగు నెలల క్రితం ఓ యువకుడు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. కుటుంబసభ్యులు,బంధువులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు..నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు ఆ యువకుడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరాడు. తనను కొందరు మోసం చేసి తీసుకువెళ్లి నాలుగునెలలపాటు చిత్రహింసలకు గురిచేశారని వారి చెర నుంచి తప్పించుకు వచ్చానని తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి,పిఠాపురం: కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన కోడ జయరాజు (20) పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్ ప్రైవేటుగా చదువుతూ కాకినాడలో ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 20వతేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అన్ని ప్రాం తాల్లో గాలించినా అతడి బంధువులు కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నాలుగు నెలలు దాటినా ఆయువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఇంతలో బుధవారం రాత్రి ఆయువకుడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆ యువకుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మాయమాటలతో నమ్మించారు. తనను కొవ్వూరుకు చెందిన బెణుగు శ్రీను మరి కొందరు మాయ మాటలతో నమ్మించి సుదూర ప్రాంతలకు తీసుకెళ్లి నిర్బంధించి చేపల వేట చేయించారని ఆ యువకుడు చెబుతున్నాడు. గతేడాది నవంబర్ 20న అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కోడ జయరాజు తుని వెళ్లాడు. అక్కడ తన బంధువుల ఇంటికి వెళదామని భావించినా చివరకు తన దగ్గర రూ.400 ఉండడంతో వాటితో రెండు రోజులు తునిలో తిరుగుతూ చివరికి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బు అయిపోవడంతో తినడానికి ఏమీ లేక ఆకలితో రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం బస్టాండ్‌లో ఉన్న అతడి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆరా తీశారు. భోజనం పెట్టి డబ్బులు ఇస్తామని తాము చెప్పిన పని చేయాలని చెప్పడంతో ఆకలితో ఉన్న బాధితుడు దానికి అంగీకరించి వారి వెంట వెళ్లాడు. చిత్రహింసలకు గురిచేసేవారు తొలుత కొవ్వూరు తీసుకెళ్లిన వారు నాలుగు రోజుల అనంతరం కడప దగ్గరలోని ఒంటిమిట్టకు దూరప్రాంతమైన కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ నదీపాయలలో చేపల వేట చేయమని చెప్పారని బాధితుడు తెలిపాడు. తాను మత్స్యకార కుటుంబానికి చెందిన వాడినైనా వేటకు ఎప్పుడు వెళ్లలేదని తనకు రాదని చెప్పడంతో తీవ్రంగా కొట్టిన వారు బలవంతంగా చేపల వేట చేయించేవారన్నాడు. ప్రతి రోజూ రాత్రి సమయాల్లో వేటకు తీసుకువెళ్లే వారని, వారు చెప్పినట్టు చేయకపోతే చిత్రహింసలు పెట్టేవారని వాపోయాడు. మూడు సార్లు తప్పించుకోడానికి ప్రయత్నించగా పట్టుకున్న వారు తాళ్లతో బంధించి చితక్కొట్టేవారని కన్నీరుమున్నీరవుతున్నాడు. రెండు సార్లు తనపై హత్యాయత్నం చేశారని, చేసేదేం లేక వారు చెప్పినట్టు వేట చేసే వాడినన్నాడు. చివరకు ఈనెల నాలుగో తేదీన అర్ధరాత్రి చేపల వేట సాగిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళతానని చెప్పి తప్పించుకున్నానని తెలిపాడు. ఓ గ్రామంలో గొర్రెల కాపరులు తనను రెండు రోజుల పాటు తమ దగ్గర ఉంచుకుని చివరకు డబ్బులిచ్చి ఇంటికి వెళ్లిపొమ్మని పంపించడంతో బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నానని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయాన్ని కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కడప పరిసర ప్రాంతాల్లో ఇలాగే చాలా మందితో నిర్బంధంగా వేట చేయిస్తుంటారని తమ కుమారుడిని చిత్రహింసలకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జయరాజు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: మాతృత్వానికే మచ్చ తెచ్చింది!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు. చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి లలితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్నిరోజులుగా లలిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం కారణంగానే చిన్నారిని వదిలించుకునేందుకు ఆమె ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టింది
-
కువైట్‌లో మహిళకు చిత్రహింసలు
మలికిపురం, (రాజోలు): ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ యజమాని చేతుల్లో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కువైట్ నుంచి ‘చింతలమోరి నేటి పౌరుల సంఘం’ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన నల్లి పద్మ ఉపాధి నిమిత్తం 2011లో కువైట్ వెళ్లింది. ఏడాదిపాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేది. అయితే 2012 నుంచి పద్మ ఫోన్ చేయడం లేదు. దీంతో ఆమె చనిపోయిందని వారు భావించారు. కానీ పద్మ తీవ్ర గాయాలపాలై సోమవారం కువైట్‌లోని అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రవాసాంధ్రులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఆమె కుటుంబీకులకు తెలియజేశారు. పద్మను ఇంట్లో యజమాని చిత్రహింసలు పెట్టేవాడని అక్కడి వారు చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు సాయం చేసి స్వదేశం తీసుకురావాలని ‘నేటి పౌరుల సంఘం’ సభ్యులు కృషి చేస్తున్నారని, భారత ప్రభుత్వం కూడా సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సౌదీలో మరో మహిళకు నరకం..
సౌదీ అరేబియాలో భారతీయ మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన వారిని నరకయాతన చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే గుర్బక్ష్ కౌర్‌ను సౌదీ అరాచకుల చేతుల్లోంచి కాపాడి, భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత మరో పంజాబి మహిళ కూడా ఇవే కష్టాలు పడుతున్నానంటూ తన గోడును వెల్లుబుచ్చుకుంది. వాట్సాప్ ద్వారా తన బాధలను భారత్‌కు చేరవేసింది. సౌదీలో నరకం చూస్తున్నానంటూ... కేంద్ర ప్రభుత్వం తనను రక్షించాలంటూ అభ్యర్థించింది. శుక్రవారం ఈమె మూడు వాట్సాప్ వీడియోలను పంపింది. కేంద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ తనను రక్షించాలంటూ వేడుకుంది. తాను చాలా దుర్భర జీవితం అనుభవిస్తున్నానని, తన యజమాని గత నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. మూడు వీడియోల్లో తాను అనుభవిస్తున్న నరకాన్ని చెబుతూ కన్నీరుమున్నీరైంది. ''నా జీవితం నరకంలో ఉన్నట్టు ఉంది. అర్థరాత్రి రెండు గంటలకు ముందు వరకు నేను పడుకోవడానికి వీలులేదు. గొడ్డు చాకిరి చేయాల్సి వస్తోంది. భగవత్ మాన్జీ నన్ను కాపాడండి ప్లీజ్. లేదా నేను ఇక్కడ చచ్చిపోవాల్సి వస్తుంది. నన్ను నా యజమాని హింసిస్తున్నాడు'' అని పేర్కొంది. ఉచిత నివాసం, నెల నెల వేతనం ఇస్తామంటూ నాలుగు నెలల క్రితం తన భార్యను న్యూఢిల్లీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ సౌదీ పంపించాడంటూ బాధితురాలి భర్త చెప్పాడు. గత మూడు నెలలుగా తన భార్య ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. తన భార్యను ట్రాప్ చేశారని గోడును వెల్లబుచ్చుకున్నాడు. -
సౌదీలో నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి!
సాక్షి, న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఉపాధి కోసం ఏడాది కిందట సౌదీకి వచ్చానని ఆమె వీడియోలో తెలిపారు. ఈ నరకకూపం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 'భగవంత్ మాన్ సాబ్ దయచేసి నాకు సాయం చేయండి. నేను ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా. ఎంతో వేదనలో ఉన్నా. గత ఏడాదిగా నన్ను హింసిస్తున్నారు. మీరు హోషియార్పూర్ యువతిని కాపాడారు. నన్ను కూడా కాపాడండి. నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను. నాకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ కన్నీళ్లు రాలుస్తూ దీనంగా ఆమె వీడియోలో విజ్ఞప్తి చేసింది. సౌదీ పోలీసులు కూడా తనకు సాయం చేయడం లేదని పేర్కొంది. తన యజమాని తనను ఓ గదిలో బంధించి శారీరకంగా హింసిస్తున్నాడని, కొన్నిరోజులుగా తనకు ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆమె తన దీనగాథను వివరించింది. సాయం కోసం పోలీసుల వద్దకు వెళితే.. వాళ్లు తనను తన్ని.. మళ్లీ ఆ ఇంట్లోకి తరిమేశారని తెలిపింది. 20-22 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఆమె తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని, తన తల్లి బాగా లేదని, ఆమెను వెంటనే చూసేందుకు తాను స్వదేశం వచ్చేలా సాయం చేయాలని వేడుకుంది. పంజాబీలు ఎవరూ సౌదీ అరేబియాకు రావొద్దని, ఇక్కడి వారు పెద్ద మూర్ఖులని ఆమె పేర్కొంది. ఆమె దీన వీడియోపై ఎంపీ భగవంత్ మాన్ ఇంకా స్పందించలేదు. -
అనంతపురం జిల్లాలో బాలుడిపై అమానుషం
► గొర్రెలు పోగొట్టాడని యజమాని చిత్రహింసలు ► ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు హింసించి, మర్మాంగంపై కొట్టి.. నాలుకపై గాట్లు పెట్టిన యజమాని ► బాలుడి పరిస్థితి చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు ధర్మవరం అర్బన్: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన గొర్రెలు మేపే బాలుడి పట్ల అతని యజమాని అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. తనవద్ద పనికి ఉంటున్న సమయంలో గొర్రెలు పోగొట్టాడనే నెపంతో బాలుడిని గదిలో నిర్బంధించి మర్మాంగంపై కొట్టి.. కర్రతో చావబాది, నాలుకపై కొడవలితో గాట్లు పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు. బాధితుడి తల్లిదండ్రులు నాగమ్మ, ముత్యాలప్ప కథనం మేరకు.. మేడాపురానికి చెందిన చెందిన మల్లి అనే వ్యక్తి వద్ద ముత్యాలప్ప రూ.30 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ అప్పు తీర్చడానికి తమ కుమారుడు ఆదినారాయణ (16) చదువు మాన్పించి మల్లి వద్ద గొర్రెలు మేపేందుకు పెట్టాడు. ఆ బాలుడు గత ఏడాది పదో తరగతిలో 8.5 పాయింట్లతో పాసయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాలుడు ఐదు నెలలపాటు గొర్రెలను మేపాడు. దీంతో అప్పులో రూ. 15 వేలు పోగా, మిగతా నగదును ఆ బాలుడి తల్లిదండ్రులు శనివారం యజమానికి చెల్లించారు. తమ కుమారుడిని వదిలిపెట్టాలని కోరగా.. ఐదు గొర్రెలు పోగొట్టినందున మరికొన్ని రోజులు తమ వద్దే పనిలో ఉంచుకుంటామని యజమాని చెప్పాడు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు వెనక్కి వచ్చారు. వారు వెళ్లిన తర్వాత యజమాని మల్లి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గదిలో బాలుడిని బందించి విచక్షణా రహితంగా కొట్టాడు. ఆదివారం సాయంత్రం ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాడు. కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రాత్రి ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడు ఆదినారాయణ కాళ్లు, చేతులు వాపులు రావడంతోపాటు నాలుకపై కొడవలి గాట్లు పడటంతో మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. బాలుని తల్లిదండ్రుల నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి చెన్నేకొత్తపల్లి పోలీసులకు సమాచారాన్ని అందించారు. -
ఇంటికి వెళ్లను.. నన్ను చంపేస్తారు..
►రోజుకు 16 గంటలు పనిచేస్తున్నా ►అమ్మానాన్నలు చిత్రహింసలు పెడుతున్నారు ►పోలీసులను ఆశ్రయించిన బాలిక అమీర్‌పేట: మా అమ్మానాన్నలు రోజుకు నాతో 16 గంటలు పనిచేయిస్తున్నారు..ఒళ్లు హూనమైపోతోంది.. వెళ్లకపోతే చిత్రహింసలు పెడుతున్నారు..నన్ను చంపేస్తారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సొంత తల్లి, సవతి తండ్రి బాలికతో వెట్టిచాకిరీ చేయిస్తూ వచ్చే సంపాదనను దర్జాగా ఖర్చుచేస్తున్నారు. బడికి వెళ్లాల్సిన బాలిక భారంగా బతుకులాగుతోంది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. రాజమండ్రికి చెందిన పుష్ప బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనుక నివాసముంటోంది. భర్తను వదిలిపెట్టిన ఆమె అంకిరెడ్డి అనే వ్యక్తితో జీవనం సాగిస్తోంది. మొదటి భర్త కూతురు అయిన రాణి (11)కూడా వారితోపాటే ఉంటోంది. తల్లిదండ్రులు బాలిక చదువు మాన్పించి ఒక ఇంటర్నెట్ సెంటర్, రెండు హాస్టళ్లలో పనిచేయిస్తున్నారు. దాదాపు రోజుకు 16 గంటలపాటు వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.అలా వచ్చే నాలుగు వేల రూపాయలను సైతం తీసుకుని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తాను పనికి వెళ్లనని రాణి చెప్పింది. ఆగ్రహించిన తల్లి, సవతితండ్రి ఇనుప కత్తెరతో ఎడమ కన్నుపై తీవ్రంగా దాడిచేశారు. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ బాధలు భరించలేక నేరుగా ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తల్లి పుష్ప, సవతి తండ్రి వలన తనకు ప్రాణభయముందని, వారితో ఉండనని పోలీసులను వేడుకుంది. అయితే ఈ విషయంపై పోలీసులు ఆదివారం రాజీ కుదిర్చి బాలికను తల్లి, హాస్టల్ నిర్వాహకులతో పంపినట్లు తెలిసింది. రాజీ చేయడమేమిటి: బాలల హక్కుల సంఘం తనకు ప్రాణభయం ఉందని బాలిక కన్నీరు పెట్టుకున్నా తల్లితో రాజీ కుదిర్చి తిరిగి పంపించడం ఏమిటని బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షురాలు అనురాధరావు మాట్లాడుతూ వెంటనే బాలికను రక్షణ కల్పించి తల్లి,సవతి తండ్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. చాకిరి చేయించుకున్న ఇంటర్నెట్, çహాస్టల్స్ నిర్వాహకులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిశుసంక్షేశాఖ అధికారులకు సమాచారమిచ్చాం బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై ధర్యాప్తు జరుపుతున్నామని ,చిత్రహింసలు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు. స్త్రీశిçశుసంక్షేమశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. -
'భర్త నుంచి రక్షణ కల్పించండి'
- భర్తకు భయపడి ఆశ్రయ కేంద్రానికి చేరిక నెల్లూరు: మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న భర్త.. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో కత్తితో పొడిచి చంపబోయాడు. జిల్లాలోని మాచర్లవారిపాలెం గణపతినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్రా రామయ్య, కృష్ణమ్మల కుమార్తె అయిన విజయమ్మకు అదే గ్రామానికి చెందిన గా సుబ్రహ్మణ్యంతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లులు. అయితే మద్యానికి బానిసైన సుబ్రమణ్యం గత కొంత కాలం నుంచి భార్యను వేధిస్తువస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన సుబ్రహ్మణ్యం భార్యపై గొడవతో గొడవపడ్డాడు. ఇక చేసేదేమి లేక అదే రోజు రాత్రి విజయమ్మ పిల్లల్ని తీసుకొని స్థానికంగా ఉన్న పుట్టింటికి వెళ్లింది. దీంతో కోపోద్రేకుడైన సుబ్రహ్మణ్యం మరుసటి రోజు కత్తి తీసుకొని పుట్టింటిలో ఉన్న విజయమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన విజయమ్మ, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు. ఆ తర్వాత రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎప్పటికైనా భర్త నుంచి తనకు ప్రాణహాని ఉంటుందని, పోలీసులు రక్షణ కల్పించే వరకూ ఊళ్లో ఉండలేనంటూ నెల్లూరులో గల నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంలో ఉంటోంది విజయమ్మ. -
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
-
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
కృష్ణా: అల్లరి చేస్తున్నాడన్న కోపంతో వాళ్ల పెద్దమ్మ ఓ చిన్నారికి వాతలు పెట్టింది. యనమనలకుదురు ప్రియదర్శినినగర్‌కు చెందిన కోవెల ప్రభు, శైలజ దంపతులకు రాజ్‌కుమార్(6), శివకుమార్(4) ఉన్నారు. నాలుగురోజుల క్రితం ఊరెళుతూ రాజ్‌కుమార్‌ను ఇంటి పక్కనే ఉండే మేడే భవానికి అప్పజెప్పి వెళ్లింది. మంగళవారం రాజ్‌కుమార్ అల్లరి ఎక్కువగా చేస్తుండటంతో విసుగు చెందిన భవాని గరిట కాల్చి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది. ఊరు నుంచి వచ్చిన తర్వాత బిడ్డకు గాయాలైనా పట్టించుకోకుండా వదిలేసింది శైలజ. కాగా, కాలిన గాయాలతో స్ధానిక అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం బాలుడు వచ్చాడు. బాలుడి శరీరంపై ఉన్న గాయాలను చూసిన అంగన్వాటీ కార్యకర్త ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బాలుడిని హింసించిన ఘటనను నవజీవన్ బాల భవన్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి శైలజ, పెద్దమ్మ భవానీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ప్రేమలేని శైలజ వారి ఆలనాపాలనలను చూడటం మానేసింది. గతంలో ఓ సారి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది శైలజ. దీంతో విజయవాడ చైల్డ్‌లైన్ నిర్వాహకులు పిల్లల్ని తీసుకువెళ్లి సంరక్షించారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. కేసును విచారించిన పోలీసులు శైలజ, భవానీలను అదుపులోకి తీసుకున్నారు. -
ఇక చాలు
కవర్‌స్టోరీ ఇంటా బయటా తేడా లేకుండా మహిళలు హింసకు గురవుతూనే ఉన్నారు. అట్టడుగు దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యాల్లోనూ ఇదే పరిస్థితి. ఇల్లు, బడి, గుడి, ఆఫీసు, బస్టాపు, సినిమా హాల్, షాపింగ్ మాల్... ఇవేవీ మహిళలకు వందశాతం సురక్షితమైన ప్రదేశాలని నమ్మకం పెట్టుకునే పరిస్థితులే లేవు. వయో తారతమ్యాలు, చదువు సంధ్యలు, సామాజిక హోదా, ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండ దాదాపు మహిళలందరూ ఏదోరకమైన హింసను అనుభవిస్తూనే ఉన్నారు. అయిన వారు, కాని వారు అనే తేడా లేకుండా పురుషాధిక్య సమాజంలో భాగస్వాములైన వారందరూ మహిళలపై యథేచ్ఛగా హింసకు పాల్పడుతూనే ఉన్నారు. దేశ దేశాల్లో ఎన్ని చట్టాలు ఉన్నా మహిళల భద్రతకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఎన్నాళ్లీ ‘హింస’ధ్వని? ఇక చాలు... అని ముక్తకంఠంతో మహిళలు చేస్తున్న ఆక్రందనలన్నీ అరణ్యరోదనలుగానే మిగిలిపోతున్నాయి. అంతర్జాతీయ సమస్య అతివలపై హింసాకాండ అనాదిగా కొనసాగుతున్న అంతర్జాతీయ సమస్య. అభివృద్ధి గణాంకాలు ఎలా ఉన్నా, ప్రపంచంలో మహిళలపై హింస మాత్రం అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. ఐక్యరాజ్య సమితి ఈ పరిస్థితి తీవ్రతను దాదాపు రెండు దశాబ్దాల కిందటే గుర్తించింది. మహిళలపై హింసను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను 1993లోనే ప్రకటించింది. అయితే, దీనివల్ల ఒరిగిందేమీ లేదు. పైగా మహిళలపై అఘాయిత్యాలు మరింతగా పెరిగాయి. ఐక్యరాజ్య సమితి మహిళలపై హింసను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఇరవయ్యేళ్ల తర్వాత చూసుకుంటే, ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక దోపిడీకి, భౌతిక దాడులకు బాధితులుగా ఉంటున్నట్లు అంతర్జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. అత్యాచార బాధితుల్లో దాదాపు 35 శాతం మంది బాగా తెలిసిన వారి చేతుల్లోనే లైంగిక దాడులకు గురవుతున్నట్లు ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లైంగిక అత్యాచారాల బారిన పడిన బాలికల సంఖ్య 12 కోట్లకు పైమాటేనని కూడా ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. ఆడ శిశువులపై హింస పుట్టుకకు ముందే మొదలవుతోందని, చాలామంది మహిళలు జీవిత చరమాంకంలోగా ఏదో రకమైన హింసను అనుభవిస్తూనే ఉన్నారని పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లెక్కలకు అందని హింస మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, పలు దేశాల ప్రభుత్వాలు లెక్కలు సేకరిస్తూనే ఉన్నా, లెక్కలకు అందని నేరాలు చాలానే ఉంటున్నాయి. యుద్ధవాతావరణం నెలకొన్న దేశాల్లో, సంఘర్షణలు జరుగుతున్న దేశాల్లో మహిళలపై జరుగుతున్న హింస చాలా వరకు లెక్కలకు అందకుండా పోతోంది. చాలా దేశాల్లో మహిళలపై నేరాలను అరికట్టేందుకు చట్టాలు ఉన్నా, వాటి అమలు తీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. చాలా దేశాల్లో బాధిత మహిళలు న్యాయం కోరుతూ కనీసం ఫిర్యాదు చేసే పరిస్థితులు కూడా లేవు. తెగించి ఫిర్యాదు చేసినా, వారికి న్యాయం దక్కుతుందనే భరోసా కూడా లేదు. ఇదీ పరిస్థితి ► మహిళలపై హింస నానా రూపాల్లో సాగుతోంది. లింగ వివక్ష, భౌతిక దాడులు, లైంగిక దాడులు, మానసిక వేధింపులు... ► లైంగిక దాడులు, గృహహింస బారిన పడుతున్న మహిళల్లో 15-44 సంవత్సరాల మధ్య వయసులో గలవారే ఎక్కువ. ► మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిలో సన్నిహితులు, పరిచితులే ఎక్కువ మంది. ► లైంగిక దాడుల్లో దాదాపు 95% మంది నిందితులు బాధితులకు పరిచితులే ► 48% జీవిత భాగస్వాముల చేతిలో హింసకు గురవుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా 48 శాతం పైగానే ఉంటారు. మీకు తెలుసా? ►హత్యలకు గురవుతున్న మహిళల్లో దాదాపు సగం మంది భర్తలు, సహజీవన భాగస్వాముల చేతిలో హతమారిపోతున్నవారే ► వెనుకబడిన ఆఫ్రికన్ దేశాల్లో ప్రతి 6గంటలకు ఒక మహిళ జీవిత భాగస్వాముల హత్యకు గురవుతోంది అంటే రోజుకు నాలుగన్నమాట లైంగిక హింస ► లైంగిక హింసకు సంబంధించి అంతర్జాతీయంగా లెక్కలకు అందుతున్న వివరాలు తక్కువే. ► గణాంకాలకు అందుతున్న వివరాలు అతి తక్కువ మాత్రమేనని ఐరాస చెబుతోంది. ► 22.3% భాగస్వాములు కాని వారి చేతిలో లైంగిక హింసకు గురవుతున్న మహిళలు ► 54% 15-19 వయసు గల యువతుల్లో లైంగిక బెదిరింపులకు గురవుతున్న వారు. యుద్ధ పరిస్థితుల్లో లైంగిక హింస ► యుద్ధం, ఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాల్లో సైనిక బలగాల చేతిలో లైంగిక దాడులకు గురవుతున్న మహిళల సంఖ్య లెక్కలకు అందనిది. ► 36 ఆఫ్రికన్ దేశాల్లో సగటున రోజుకు నమోదవుతున్న లైంగిక దాడుల కేసులు ► 5,00,000 రువాండాలో 1994లో నెలకొన్న కల్లోలంలో బలైన మహిళలు మహిళలపై జరుగుతున్న ఈ నేరాలు సమాజానికి సిగ్గుచేటు ఇకనైనా మహిళలపై జరుగుతున్న నేరాలకు చరమగీతం పాడాలని ఐరాస ఆకాంక్షిస్తోంది. వివిధ దశల్లో మహిళలపై హింస గర్భస్థ పిండం : లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు బాల్యం : ఆడ శిశువుల హత్యలు, మానసిక వేధింపులు, భౌతిక, లైంగిక దాడులు, బాల్య వివాహాలు, లైంగిక దోపిడీ, పోర్నోగ్రఫీ, జెనిటల్ మ్యుటిలేషన్, అక్రమ రవాణా కౌమారం, యవ్వనం : ఆర్థిక ప్రలోభాలతో లైంగిక దోపిడీ, బాయ్‌ఫ్రెండ్స్ చేతిలో హింస, ప్రేమ పేరిట వేధింపులు, బెదిరింపులు, యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, లైంగిక బానిసత్వం, భౌతిక, లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో వేధింపులు, వివక్ష, కక్ష సాధింపులు, శారీరక, మానసిక హింస, హత్యలు వార్ధక్యం : శారీక, మానసిక హింస, పిల్లల నిరాదరణ వివిధ రూపాల్లో హింస మహిళలు నిత్యం వివిధ రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లో కుటుంబ సభ్యుల నుంచి గృహహింస, వరకట్న వేధింపులు, శారీరక, మానసిక హింసతో చాలామంది మహిళలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు ఈ హింసాకాండ ఆత్మహత్యలకు దారితీస్తున్న సందర్భాలూ లేకపోలేదు. వరకట్నం కోసం అత్తింటి వారి చేతిలో హత్యలకు గురవుతున్న మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. నచ్చిన వ్యక్తిని ప్రేమించిన పాపానికి కొందరు యువతులు పరువు హత్యలకు గురవుతున్నారు. విద్యాలయాలు కూడా సురక్షితంగా ఏమీ లేవు. పాఠశాల స్థాయిలోనే లైంగిక వేధింపులు, లైంగిక దాడుల బారిన పడ్డ బాలికల సంఖ్య ఐరాస అంచనా ప్రకారం దాదాపు 24.6 కోట్లు ఉంటుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హెచ్ఐవీ/ఎయిడ్స్ బారినపడ్డ మహిళల్లో ఎక్కువ శాతం అత్యాచార బాధితులు, లైంగిక బానిసత్వంలో చిక్కుకున్న వారే ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ఇంటి నుంచి ఏదైనా పని మీద బయటికొస్తే గమ్యం చేరేలోగా వెంటాడే పోకిరీల వేధింపులు, అసభ్య వ్యాఖ్యలతో మానసిక వేదనకు గురవుతున్న మహిళలు మన దేశంలో దాదాపు 88 శాతం వరకు ఉన్నారు. కాయకష్టాన్ని నమ్ముకున్న మహిళా కార్మికులకు, కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఇలాంటి కష్టాలు తప్పడం లేదు. లైంగిక దాడులు, అత్యాచార యత్నాలు, పనిప్రదేశంలో లింగ వివక్ష, అసభ్య వ్యాఖ్యలు, సందేశాలతో మానసిక వేధింపులు మహిళల పురోగతికి అడుగడుగునా అడ్డుతగులుతున్నాయి. హైటెక్ కాలం మొదలయ్యాక మహిళలకు సైబర్ వేధింపులూ ఎదురవుతున్నాయి. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా దాదాపు ప్రతిచోటా మహిళలు ఇలాంటి హింసను నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నారు. మారుమూల పల్లెల్లోనైతే పరిస్థితులు మరీ దారుణం. చేతబడుల వంటి ఆరోపణలతో భౌతిక దాడులకు, అత్యాచారాలకు, చివరకు హత్యలకు గురవుతున్న మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. లెక్కలకు చిక్కుతున్నవి తక్కువే! మహిళలపై హింసకు సంబంధించి లెక్కలకు చిక్కుతున్న వివరాలు తక్కువే. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ వివరాలను సేకరించడంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. దాదాపు వంద దేశాలు మాత్రమే 1995 నుంచి 2014 మధ్య కాలంలో ఈ వివరాల కోసం ఒక్కసారి సర్వే చేసి సరిపెట్టుకున్నాయి. వాటిలో నలభైకి పైగా దేశాలు మాత్రమే ఈ మధ్య కాలంలో రెండోసారి సర్వే చేశాయి. గృహహింసకు వ్యతిరేకంగా 119 దేశాలు చట్టాలను అమలు చేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాలు చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే, ఈ అన్ని దేశాల్లోనూ అమలవుతున్న చట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయనేమీ లేదు. అలాగే, ఈ చట్టాలన్నీ బాధిత మహిళలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు కూడా లేవు. చాలా దేశాల్లో మహిళల రక్షణ కోసం పేరుకు చట్టాలు అమలవుతున్నా బాధిత మహిళలు కనీసం ఫిర్యాదు చేసేందుకైనా అనుకూలమైన పరిస్థితులు లేవు. ఫిర్యాదులు చేసేందుకు పోలీసులను ఆశ్రయించే బాధిత మహిళలపై సాక్షాత్తు పోలీసులే అత్యాచారాలకు, మానసిక, శారీరక వేధింపులకు తెగబడుతున్న సందర్భాలూ లేకపోలేదు. మహిళల శాంతియుత జీవనానికి, మహిళలకు పూర్తి భద్రత కోసం, మహిళల పట్ల లింగవివక్ష రూపుమాపడం కోసం ఐక్యరాజ్య సమితి గడచిన కొన్ని దశాబ్దాలుగా లెక్కలేనన్ని తీర్మానాలు చేసినా, అవేవీ సజావుగా అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. మన దేశంలో మరీ దారుణం అట్టడుగు దేశాల సంగతి సరే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన భారత్‌లోనూ మహిళల పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. మహిళల పట్ల నేరాల సంఖ్య మన దేశంలో నానాటికీ పెరుగుతోందని జాతీయ నేర గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ‘నిర్భయ‘ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత సైతం మన దేశంలో మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2014లో 36,735 అత్యాచారం కేసులు నమోదైతే, 2015లో 34,651 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ఆధారంగా అత్యాచారం కేసుల్లో 5.7 శాతం తగ్గుదల నమోదైందని జాతీయ నేర గణాంకాల విభాగం చెబుతున్నా, ఇది నామమాత్రపు తగ్గుదల మాత్రమే. గత ఏడాది అత్యాచారాలకు బలైన బాధితుల్లో 8,800 మంది చిన్నారులే ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచార యత్నాలు, లైంగిక వేధింపులకు సంబంధించి 2014లో 82,235 కేసులు నమోదైతే, 2015లో ఇవి 84,222 కేసులకు పెరిగాయి. బాలికలు, యువతుల కిడ్నాప్‌లకు సంబంధించి 2014లో 57,311 కేసులు నమోదవగా, 2015లో 59,277 కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 54 శాతం కిడ్నాప్‌లు బలవంతపు పెళ్లిళ్ల కోసం జరిగినవేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. మహిళల పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితుల్లో దాదాపు 95 శాతం మంది బాధితులకు బాగా తెలిసిన వారేనని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. చిన్నారులపై అత్యాచారాలకు తెగబడే వారిలో ఎక్కువగా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, ఇరుగు పొరుగు తెలిసిన వ్యక్తులు, ఉపాధ్యాయులు వంటి వారే నిందితులుగా ఉంటున్నారు. మరోవైపు పేదవర్గాలకు చెందిన బాలికలు, మహిళలు ఎక్కువగా మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. మానవ అక్రమ రవాణా బారిన పడిన బాలికలు, మహిళలు వ్యభిచార కూపాల్లో చిక్కుకుని, లైంగిక బానిసలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. మానవ అక్రమ రవాణా బాధితుల్లో చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది దేశవ్యాప్తంగా 6,877 మంది మానవ అక్రమ రవాణా బారిన పడితే, వారిలో 3,490 మంది మైనారిటీ తీరని బాలికలే ఉన్నారు. గృహహింస నిత్యకృత్యం మన దేశంలో గృహహింస దాదాపు నిత్యకృత్యంగా ఉంటోంది. దేశ మహిళల్లో దాదాపు 70 శాతం మంది గృహహింస బాధితులేనని 2006 లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. వరకట్నం కోసం భర్త, అతడి తరఫు బంధువుల చేతిలో చాలామంది మహిళలు నిత్య యాతన అనుభవిస్తున్నారు. గృహహింసకు తట్టుకోలేక, దుర్భర జీవితం నుంచి తప్పించుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు భర్త, అత్తింటి వారి చేతిలో హత్యలకు గురవుతున్నారు. 2012-14 కాలంలో... అంటే, మూడేళ్ల వ్యవధిలో 24,771 మంది మహిళలు అత్తింటి వారి వరకట్నదాహానికి ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడేళ్ల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 3.48 లక్షల గృహహింస కేసులు నమోదయ్యాయి. గృహహింసకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 61,259 కేసులు నమోదైతే, రాజస్థాన్‌లో 44,311 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 34,835 కేసులు నమోదయ్యాయి. వరకట్న నిషేధ చట్టం 1961లోనే అమలులోకి వచ్చినా, మన దేశంలో వరకట్నానికి సంబంధించిన కేసులు తగ్గకపోగా, నానాటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. మహిళలపై నేరాలను అరికట్టే లక్ష్యంతో ఎన్ని చట్టాలు వచ్చినా, ఆశించిన ఫలితం మాత్రం కనిపించకపోవడం శోచనీయం. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండటం వల్లనే పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లభించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ► మన దేశంలో 2015లో మహిళలపై జరిగిన నేరాలు 34,651 లైంగిక దాడులు ► 84,222 అత్యాచార యత్నాలు, లైంగిక వేధింపులు ► 59,277 బాలికలు, యువతుల కిడ్నాప్‌లు ► 6,877 మానవ అక్రమ రవాణా బాధితులు ► మూడేళ్ల వ్యవధిలో గృహహింస కేసులు 3,48,000 దేశవ్యాప్తంగా నమోదైనవి ► 61,259 పశ్చిమబెంగాల్లో... ►44,311 రాజస్థాన్‌లో... ► 34,835 ఆంధ్రప్రదేశ్‌లో... -
దొంగతనం నెపంతో చిత్రహింసలు
భీమవరం టౌన్ : ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు చిన్నారులను చెట్టుకు కట్టి కొట్టడంతో పాటు ఒకరికి వాతలు పెట్టిన çఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక దుర్గాపురం ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల వయసున్న కాపవరపు డేవిడ్‌రాజు, బొద్దూరి నాగేశ్వరరావు అనే చిన్నారులు కొవ్వాడ సెంటర్లో పి.పద్మ అనే మహిళ ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఈనెల 11న ఆమె తరఫు వ్యక్తులు చెట్టుకు కట్టి కొట్టారు. దొంగిలించిన సొమ్ము, సెల్‌ఫోన్, బంగారు వస్తువు ఇవ్వాలని దౌర్జన్యం చేశారు. డేవిడ్‌రాజుకు వాతలు కూడా పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై బొద్దూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శనివారం టూ టౌన్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. డేవిడ్ తల్లి కువైట్‌లో ఉండగా తండ్రి లేకపోవడంతో మావ య్య ఇంట్లో ఉంటున్నాడు. 6వ తరగతి వరకు ^è దువుకుని మానేశాడు. బొద్దూరి నాగేశ్వరరావుకు తల్లి ఉండగా తండ్రి లేడు. 3వ తరగతి వరకూ చదువుకుని మానేశాడు. దీనిపై సీఐ ఎం.రమేష్‌బాబు మాట్లాడుతూ ఇద్దరు బాలురను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించామని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
వివాహిత బలవన్మరణం
భర్తతో మనస్పర్థలు.. తరచూ గొడవలతో విసిగి వేసారిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కామారుపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. శింగనమలకు చెందిన మహాలక్ష్మి (28)కి అనంతపురం మండలం కామారుపల్లికి చెందిన పాల వ్యాపారి సుబ్బరాయుడుతో ఏడేళ్లక్రితం వివాహమైంది. వీరికి కుమార్తె భవిత, కుమారుడు కుమార్ ఉన్నారు. ప్రారంభంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనంతరం దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రతి చిన్న విషయానికీ గొడవపడేవారు. కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషులు రాజీ చేసి మళ్లీ భర్త వద్దకు పంపారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాక.. మహాలక్ష్మి ఫ్యానుకు ఉరి వేసుకుంది. కొద్దిసేపటి అనంతరం తిరిగి వచ్చిన సుబ్బరాయుడు ఉరికి వేలాడుతున్న భార్యను చూసి హుటాహుటిన సర్వజనాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ జగదీష్ తెలిపారు. -
డాక్టర్ వేధింపులపై సిబ్బంది నిరసన
కొడవలూరు: స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి సయ్యద్ అబ్షా తమను వేధిస్తున్నారంటూ పీహెచ్సీ ఎదుట సిబ్బంది శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత డిసెంబర్లో వైద్యశాఖ రీజినల్ డైరెక్టర్ పీహెచ్‌సీని సందర్శించి డాక్టర్ విధుల్లో లేకపోవడంతో రెండు రోజులు ఆబ్సెంట్ వేశారని, దీనికి సిబ్బందే కారణమంటూ వేధింపులకు దిగారని ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బందికి వేతనాలను సకాలంలో ఇవ్వకుండా రెండు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. డాక్టర్‌కు పీఆర్సీ రాకపోయినా సిబ్బంది జీతాలను నిలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వేధింపులు తాళలేక రెండో ఏఎన్ఎంగా ఉన్న విజయలక్ష్మి ఏడాది పాటు సెలవు పెట్టారని చెప్పారు. ఈ విషయాలను శుక్రవారం డీఎంహెచ్ఓ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. హెచ్ఎస్ షఫీఉల్లా, సిబ్బంది సుగుణ, అనితాకుమారి, శైలసుధ, తబిత, హిమజకుమారి, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయం ఆవరణలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
వడ్డీ వ్యాపారి దాడుల నుంచి పోలీసులు కాపాడడం లేదనే... ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మనస్తాపం గుంటూరు ఈస్ట్: వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు వరుస దాడులు చేస్తున్నా పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి గురయిన ఓ వృద్ధురాలు, ఆమె కుమారుడు, కుమార్తె సోమవారం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితురాలి రెండో కుమారుడు సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... బొంగరాలబీడు రెండో లైనులో నేలపాటి నిర్మల అనే 60 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె పెద్ద కుమార్తె తెనాలి కుమారి, పెద్ద కుమారుడు భానుప్రకాశ్, రెండో కుమారుడు సంజీవరావు పక్కపక్క అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. 2011 సంవత్సరంలో నిర్మల తమ ఎదురింటిలో నివసించే పాలపాటి అంబేద్కర్ వద్ద తన అత్తగారు కనకమ్మ పేరు మీద అదే ప్రాంతంలో ఉన్న 72 గజాల బీఫాం స్థలాన్ని తాకట్టు పెట్టి లక్షరూపాయలు డబ్బు వడ్డీకి తీసుకున్నారు. నెల నెల వడ్డీ కడుతున్నారు. కొద్ది నెలలకే అంబేద్కర్ ఆ స్థలాన్ని ఆక్రమించి అందులో ఉన్న పూరిల్లు తొలగించి రేకుల షెడ్ నిర్మించాడు. ఈ విషయమై నిర్మల కుటుంబ సభ్యులు అంబేద్కర్‌తో గొడవ పడి పోలీస్టేçÙన్లో ఫిర్యాదు చేసి కోర్టులో దావా వేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సార్లు నిర్మల, ఆమె సంతానం అంబేద్కర్‌కు లక్ష రూపాయలు వడ్డీ డబ్బులు ఇచ్చేందుకు యత్నిం చగా అతను తిరస్కరించి 5 లక్షలు వరకు ఇవ్వాలని డిమాండు చేశాడు. 8 నెలల క్రితం వీరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అంబేద్కర్ అనుచరులతో నిర్మల, ఆమె కుటుంబ సభ్యులపై దాడులు చేశాడు. నిర్మల కుమార్తె తెనాలి కుమారికి దుగ్గిరాల నుంచి∙లక్షా డైబ్బై ఐదు వేలు ఇవ్వాలంటూ వేరే పేరుమీద నోటీసులు వచ్చాయి. ఇదంతా అంబేద్కర్ చేస్తున్నదే అని కుటుంబ సభ్యులంతా మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 21 వ తేదీ రాత్రి అంబేద్కర్ అనుచరులతో నిర్మల, ఆమె కుమారుడు, కుమార్తెతో పాటు కోడలు మల్లిపై దాడి చేసి గాయపరిచాడు. మల్లి ఆసుపత్రిలో చికిత్స పొందింది. నిర్మల కుటుంబ సభ్యులు అరండల్ పేట పోలీస్టేçÙన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అంబేద్కర్ ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకుని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అప్పటికే నిర్మల కుటుంబ సభ్యులు సంవత్సర కాలంలో 3 సార్లు ఎస్పీ గ్రీవెన్స్‌లో, పలుసార్లు అరండల్ పేట పోలీస్టేçÙన్లో అంబేద్కర్ చేస్తున్న వరుస దాడులపై ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్మల, ఇతర కుటుంబసభ్యులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. మల్లి ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు చేస్తుండగా నిర్మల, కుమారి, భానుప్రకాశ్ వెంట తెచ్చుకున్న ఎలుకల మందును కూల్ డ్రింక్ బాటిల్లో కలిపి తాగిన కొద్ది సేపటికే కింద పడిపోయారు. అక్కడే ఉన్న సంజీవరావు పోలీసుల సహాయంతో ముగ్గురినీ ఆటోలో జీజీహెచ్‌కు తరలించాడు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. పలుసార్లు తమపై దాడి చేసిన అంబేద్కర్‌తో పాటు తమమీద కేసులు పెట్టడం అన్యాయమని, ఆత్మహత్య చేసుకుంటేనన్నా దయ కలుగుతుందని తమ కుటుంబ సభ్యులు ఇలా చేశారని సంజీవరావు వాపోయాడు. -
చిన్నారిపై పైశాచికత్వం
- 10 రోజుల పాటు చిత్రహింసలు - మేనమామ, మరో ఇద్దరి దుశ్చర్య కర్నూలు(హాస్పిటల్) : అభం శుభం తెలియని చిన్నారిపై మృ గాళ్లు పైశాచికత్వం ప్రదర్శించారు. పదిరోజుల పాటు శారీరకంగా, మానసికంగా హింసించారు. ఆసుపత్రికి తీసుకెళ్లి బాగు చేయిస్తానని చెప్పి, ఆ చిన్నారిని ఆసుపత్రి పాల్జేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దకుమార్తె(10)కు ఓ చేయి, ఓ కాలు సరిగ్గా పనిచేయవు. ఆర్నెల్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.దీంతో తల్లి కుమారుణ్ణి హాస్టల్లో ఉంచి, కుమార్తెలను వెంటబెట్టుకుని కర్నూలుకు వలస వచ్చింది. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని గురుబ్రహ్మనగర్‌లో ఓ గుడిసెలో ఉంటూ కూలిపనులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె పదేళ్ల కూతురుపై ఆటోడ్రైవర్ అయిన మేనమామ రాము(22) కన్నుపడింది. పాపను మంచి డాక్టర్ వద్ద చూపించుకుని వస్తానని తిరుపతికి తీసుకెళ్లాడు. పదిరోజులైనా కూతురు రాకపోవడంతో తల్లి అతనికి ఫోన్ చేస్తూనే ఉంది. చివరికి ఆరు రోజుల కిందట అతనే ఆ చిన్నారిని తీసుకొచ్చి తల్లి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి వద్దకు చేరుకున్న పాప జరిగిన సంఘటనను మొత్తం చెప్పింది. రాముతో పాటు శిరీష్, వెంకటేశ్వర్లు అనే వాళ్లు రోజూ తనను తీవ్రంగా కొట్టేవారని, నోట్లో కారం పోసేవారని, చేతులు మెలితిప్పేవారని ఏడుస్తూ తెలిపింది. ఒక్కొక్కరు బట్టలు విప్పి తన వద్దకు వ చ్చే వారని వివరించింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ తల్లి చికిత్స కోసం కూతుర్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ నెల 12న చేర్పించింది. దీనిపై వైద్యులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. నాల్లో పట్టణ సీఐ నాగరాజుయాదవ్ అక్కడికి చేరుకుని ఆ చిన్నారితో మాట్లాడి వివరాలు సేకరించారు. -
సాటిదని చూడకుండా బట్టలిప్పి.. కారం చల్లి..
లఖింపూర్ ఖేరి: కన్న కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ తల్లిని బజారుపాలు చేసింది. తన కుమారుడు ఓ యువతితో వెళ్లిపోయాడనే కారణంతో ఆ యువకుడి తల్లికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నరకం చూపించారు. ఆమె వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అందరిముందు బట్టలూడదీసి కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీలో ప్రేమించుకున్న ఇద్దరు యువతీయువకులు ఆదివారం సాయంత్రం ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారు. దీంతో బాలిక తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు. 60 ఏళ్ల వయసున్న అతడి తల్లిని బయటకు లాగి తీవ్రంగా కొట్టడంతోపాటు బట్టలూడదీశారు. అనంతరం ముఖంపై, చెప్పరాని చోట్ల కారంపోసి పొర్లించి కొట్టారు. తన భార్యకు సహాయం చేయాల్సిదిగా ఆమె భర్త గ్రామస్తులను బ్రతిమాలుకున్నా ఎవరూ సాయం చేయలేదు. అదే సమయానికి పోలీసులు వచ్చి దుశ్చర్యను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేయగా నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలే. -
కోడల్ని వేధిస్తున్నాడని కొట్టి చంపారు..
కోడలిని వేధిస్తున్న మామపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిన్నారం మండలం బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిగూడెం గ్రామంలో జరిగింది. బొల్లారం ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. గండిగూడెం గ్రామానికి చెందిన రాజంగారి యాదయ్య (65) కుమారుడు ఏడాది క్రితం ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో యాదయ్య, అతని భార్య పోచమ్మ, కోడలు అరుణ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా కోడలు అరుణ పట్ల యాదయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పినా అతడు మానలేదు. విసుగుచెందిన అరుణ తన పుట్టింటి వారికి ఈ విషయాన్ని చెప్పింది. ఆదివారం రాత్రి యాదయ్యను అరుణ కుటుంబీకులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయాలపాలైన యాదయ్య అక్కడికక్కడే చనిపోయాడు. పోచమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హీటర్‌పై మూత్రం పోయించాడు
లక్నో : వరుస చోరీ కేసుల్లో అరెస్ట్ చేసిన ఇద్దరి వ్యక్తులను విచారణలో భాగంగా వారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి... తన ఉద్యోగానికి ఎసరు పెట్టుకున్నాడు ఓ ఎస్ఐ. వివరాలు ఇలా ఉన్నాయి... ఉత్తరప్రదేశ్ బరిచా జిల్లాలోని దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సోను (23), కాలు (24) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు. విచారణలో భాగంగా ఎస్ఐ అజిత్ వర్మ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు. ఆ క్రమంలో వారితో మూత్రం తాగించడమే కాకుండా... కరెంట్ హీటర్‌పై మూత్రం పోయించాడు. అలాగే ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోశాడు. దీంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనంతరం వారిని బుధవారం సాయంత్రం ఇంటికి పంపించారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది... జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించారు. జిల్లా పోలీస్ అధికారి వెంటనే స్పందించి.... వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేయాలని బాధితుల కుటుంబసభ్యుల పోలీసు ఉన్నతాధికారులు డిమాండ్ చేసి ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ ఐ అజిత్ వర్మపై సస్పెన్షన్ వేటు వేశారు. -
క్రూరమైన చైనా ఇంటరాగేషన్
నిందితుల చేత నేరాన్ని ఒప్పించడానికి ఇంటరాగేషన్‌లో చైనా ఇప్పటికీ మధ్యయుగాల నాటి కాలంలో వాడిన మొరటైన పద్ధతులనే ఉపయోగిస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా చైనాలో నిర్వహిస్తున్న ఇంటరాగేషన్ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల కార్యకర్తలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా పలువురు లాయర్లను ఇంటర్వ్యూ చేసి, పలు కేసుల్లో కోర్టు తీర్పులను వెల్లడించిన తీరును పరిశీలించిన తరువాత ఆమ్నెస్టీ సంస్థ ఈ నివేదికను తయారుచేసింది. దీనిలో చైనాలో ఇంటరాగేషన్ సందర్భంగా పోలీసులు, అధికారులు వ్యవహరించే తీరుపై విస్తుగొలిపే వివరాలను వెల్లడించింది. నిందితులను నిర్బంధించడం, ఇంటరాగేషన్ విధానంలో అధికారుల ప్రవర్తనపై చైనాకు చెందిన మాజీ లాయర్ తంగ్ జితియాన్ ఆమ్నెస్టీతో పంచుకున్న వివరాలను వెల్లడించారు. ఓ కేసులో ఇంటరాగేషన్ సందర్భంగా తనను ఇనుప కుర్చీలకు బంధించి, మొహంపై బాటిల్‌తో మొదడం లాంటి క్రూరమైన చర్యలకు పాల్పడినట్లు జితియాన్ వెల్లడించారు. ఒక లాయర్‌కే ఇలాంటి క్రూరమైన ఇంటరాగేషన్ తప్పలేదంటే ఇక సామాన్య పౌరుల విషయంలో ఎలాంటి సానుకూలతను ఊహిచలేమని నివేదిక వెల్లడించింది. నిందితులకు అహారం అందించకుండా ఉండటం, నిద్రకు దూరం చేయడంలాంటి విధానలు చైనా ఇంటరాగేషన్‌లో ఓ భాగమయ్యాయని ఆమ్నెస్టీ వెల్లడించింది. నిందితులను ఇంటరాగేషన్ చేసే సమయంలో క్రూరమైన పద్ధతులు నిషేధించాలని గతంలో ఐక్యరాజ్యసమితి చైనాకు సూచించింది. ఈ మేరకు చైనా తన చట్టంలో మార్పుల చేపట్టినప్పటికీ అమలులో మాత్రం విజయవంతం కాలేదని ఆమ్నెస్టీ ప్రకటించింది. వచ్చే వారం జెనీవాలో చైనా టార్చర్ విధానంపై సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నివేధిక వెల్లడైంది. -
వాళ్లిద్దరు నన్ను టార్చర్ పెట్టారు
ఇండోర్: ఇప్పటికే పలు కేసుల్లో కటకటాలపాలైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ, ఆయన కుమారుడు నరయాన్ సాయి మరోసారి చిక్కుల్లో పడ్డారు. తనను మానసికంగా శారీరకంగా చిత్ర హింసలు పెట్టారని ఆశారం కోడలు, నరయాన్ భార్య జానకీ(38) ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నరయాన్ నుంచి విడిపడి వేరుగా ఉంటున్న ఆమె తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు భద్రత కల్పించాలని కోరింది. తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేదనంటే చంపేస్తామంటూ ఆశారాం తరుపు బంధువులు కూడా బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. అయితే, బెదిరిస్తున్నవారి పేర్లు మాత్రం స్పష్టంగా బయటపెట్టలేదు. ఇప్పటికే తండ్రి కొడుకులు పలువురిపై లైంగిక దాడులు చేశారనే కేసులో జైలులో ఉంటున్నారు. -
న్యాయం కోసం ఓ వివాహిత ఆందోళన
-
అయ్యో చిన్నారి..!
పని బాలికకు చిత్రహింసలు అచేతన స్థితిలో జార్ఖండ్ చిన్నారి ఆశ్రయం కల్పించిన దివ్యదిశ ప్రతినిధులు సికింద్రాబాద్ : ఇంట్లో పనిచేసే జార్ఖండ్ బాలికను యజమానురాలు చిత్రహింసలకు గురిచేసింది. పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీనివాస్ పలాస్ అనే ఏజెంటు జార్ఖండ్‌కు చెందిన రేష్మాబిర్లా (13) తండ్రితో ఇళ్లలో పాచిపని చేయించడానికి ఒప్పందం చేసుకున్నాడు. కొంతమేర అడ్వాన్స్ తీసుకున్న రేష్మ తండ్రి ఆమెను శ్రీనివాస్ పలాస్‌కు అప్పగించాడు. కొంతకాలం క్రితం బాలికను అతడు సోమాజిగూడ సెల్లా మేరీ కళాశాల సమీపంలోని వ్యాపారవేత్త భార్య అనితా రాంపురియా ఇంట్లో పాచిపని కోసం చేర్పించాడు. కాగా బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్న రేష్మాబిర్లాను గుర్తించిన జీఆర్పీ కానిస్టేబుల్ ఆమెను దివ్యదిశ చైల్డ్‌హెల్ప్ డెస్క్ ప్రతినిధులకు అప్పగించాడు. సంస్థ ప్రతినిధులు నింబోలి అడ్డాలోని బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. వంటిపై కాలిన, కొట్టిన దెబ్బల గాయాలను చూపించిన బాలిక తనను అనితా రాంపురియా అనే మహిళ చిత్రహింసలు పెట్టిన తీరును వివరించింది. రోజూ మూడు కార్లను శుభ్రం చేయడంతో పాటు ఇంటి పని మొత్తం చేయాలని వేధించేదని బాలిక కంటతడి పెట్టింది. బాలిక పరిస్థితిని సమీక్షించిన రైల్వే సికింద్రాబాద్ ఎస్పీ జనార్దన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసును విచారణ జరిపి బాలికను గృహ హింసకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు రైల్వే ఎస్పీ సిఫారసు చేసినట్టు తెలిసింది. మరో నలుగురికి ఆశ్రయం.. రేష్మాబిర్లాతో పాటు మరో నలుగురు బాలలకు దివ్య దిశ ప్రతినిధులు వసతిగృహంలో బుధవారం ఆశ్రయం కల్పించారు. బిహార్‌కు చెందిన వసీమ్ (11), మహ్మద్ రెహాన్తోపాటు మరో ఇద్దరు చిరునామా సైతం చెప్పే పరిస్థితిలో లేని బాలలను చేరదీసి వసతిగృహానికి తరలించారు. వీరంతా బిహార్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నగరంలో వివిధ కర్మాగారాల్లో పనికోసం వచ్చినట్టు భావిస్తున్నారు. వీరిని నగరానికి తీసుకువచ్చిన వారికోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
జొన్నాడ (ఆలమూరు) : ఆలమూరు మండలం జొన్నాడలో పెనుగొండ దేవి (24) అనే వివాహిత శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త బాలకృష్ణ అత్త, మామ వెంకన్న, సత్యవతి వేధింపులు భరించలేకే ఉరి వేసుకుని ఉండవచ్చని స్థానికులు... అత్తింటివారే చిత్రహింసలు పెట్టి హతమార్చారని దేవి తల్లి దండ్రులు అంగర కొండయ్య, లక్ష్మి ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం స్థానిక తారక రామ కాలనీలో నివాసముంటున్న దేవి, బాలకృష్ణ దంపతులకు 2007 మే నెలలో వివాహమైంది. వీరికి పిల్లలు సంధ్య, ఉదయ్ కుమార్ ఉన్నారు. మూడేళ్ల పాటు సఖ్యతగానే ఉన్న భర్త బాలకృష్ణ అక్కడ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ఇటీవల తరచూ ఇంట్లో గొడవలు పడటంతో స్థానిక పాత కాలనీకి బాలకృష్ణ, దేవి దంపతులు మకాం మార్చారు. అయినా పరిస్థితి మారలేదు. శనివారం రాత్రి మీ అమ్మాయికి ‘ఒంట్లో బాగోలేదు-కడుపు నొప్పి వస్తోంది’ అంటూ సంధిపూడిలోని దేవి తల్లిదండ్రులకు ఆమె మరిది శ్రీను ఫోన్ చేశాడు. కలవ రం చెందిన వారు ఒక గంట తరువాత ఫోన్ చేయగా మృతి చెందిందని తెలియజేయడంతో తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. జొన్నాడలోని తారక రామ పాత కాలనీకి చేరుకోగా అప్పటికే అద్దె ఇంట్లో మృతి చెందిన దేవి మృతదేహాన్ని బాలకృష్ణ తల్లిదండ్రుల ఇంటికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది. వంట విషయంలో గొడవ పడి బయటకు వెళ్లి, ఇంటికి చేరుకునే లోపే ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిందని భర్త బాలకృష్ణ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.. తమ కుమార్తె దేవిని అత్తింటివారు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు కొండయ్య, లక్ష్మి ఆరోపిస్తున్నారు. కొట్టడంవల్లే చనిపోయిందని, తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. భర్త బాలకృష్ణ, కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ మృతురాలు దేవి నివాసముంటున్న జొన్నాడలోని పాత తారకరామ కాలనీ, అత్తమామలు నివాసముంటున్న కొత్త కాలనీలో స్థానిక పోలీసులు విచారణ జరిపారు. తహశీల్దారు పి.రామమూర్తి, సీఐ వి.పుల్లారావు, ఎస్సై ఎం.శేఖర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన దేవి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో తామే కిందకు దింపామని ఇంటి యజమాని మారిశెట్టి శ్రీనివాసు తెలిపారు. భర్త, అత్త మామల వేధింపుల వల్లే దేవి మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.శేఖర్‌బాబు కేసు నమోదు చేశారు. -
మారుతండ్రి కర్కశత్వం
నాలుగేళ్ల కూతురుకు వాతలు పెట్టి చిత్రహింసలు జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో దారుణం జవహర్‌నగర్: కన్నతండ్రి, మారుతల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన ప్రత్యూష వ్యవహారం మరచిపోకముందే జవహర్‌నగర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల కూతురుని మారుతండ్రి చిత్రహింసలకు గురిచేశాడు. కంటికి రెప్పలా కాపాడి ప్రేమను పంచాల్సిన కన్నతల్లి వంతపాడింది. తల్లిదండ్రుల కర్కశత్వానికి ఆ చిన్నారి చివరకు నడవలేని స్థితికి చేరుకుంది. జవహర్‌నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం ఊసిరికపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి, ప్రమీల దంపతులు. వీరికి కుమార్తెలు పవిత్ర, సంధ్య(4) ఉన్నారు. బతుకుదెరువుకోసం జవహర్‌నగర్ కు వలస వచ్చి బీజేఆర్‌నగర్‌లో నివాసముంటున్నారు. అనారోగ్యంతో వెంకట్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ప్రమీల తన తల్లి సుశీలతో కలసి ఉంటోంది. రెండు నెలల క్రితం ప్రమీల అల్వాల్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇటీవల ప్రశాంత్ సంధ్యను చెంపలపై గాయపర్చి.. తొడలపై వాతలు పెట్టాడు. నెల రోజులగా అతడు వేధిస్తున్నా చిన్నారి ఏడుస్తూ భరించింది. ఇదంతా చూస్తూ కన్న తల్లి ప్రమీల భర్తకు వంతపాడింది. దీంతో పాపను చూసి తల్లడిల్లిన అమ్మమ్మ సుశీల, మేనమామ శ్రీనివాస్‌లు పలుమార్లు ప్రమీల దంపతులను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రశాంత్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. -
ఇనుపకడ్డీలు కాల్చి కోడలికి వాతలు పెట్టారు
వరంగల్ : కోడలు మగపిల్లాడిని ఇవ్వలేదనే కారణంతో అత్తమామలు ఆమెను గొడ్డును బాదినట్టు బాది, ఇనుప కడ్డీలు కాల్చి ఆమె మెడపై వాతలు పెట్టారు. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాఘవాపురం గ్రామానికి చెందిన జొన్నల సమ్మయ్య(33)కు మొగుళ్లపల్లి మండలానికి చెందిన అరుణతో(28) ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగపిల్లలు పుట్టలేదని, ఆమెను చంపేసి సమ్మయ్యకు మరో పెళ్లి చేస్తే వంశోద్ధారకుడు పుడతాడని భావించిన సమ్మయ్య తల్లిదండ్రులు గత నాలుగేళ్లుగా అరుణను మానసికంగా వేధించడం ప్రారంభించారు. రానురాను వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా బుధవారం రాత్రి అరుణను తీవ్రంగా కొట్టిన అత్తమామలు లక్ష్మి, రాజయ్యలు ఇనుప కడ్డీలతో ఆమె మెడపై వాతలు పెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని అరుణను ఆస్పత్రికి తరలించి, అత్తమామలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. నీటిపారుదల శాఖలో పనిచేసే బాలు అనే ఉద్యోగి గత ఏడాది కాలంగా భార్య దివ్యను వేధిస్తున్నాడు. గత ఏడాది నుంచి ఆమెను కనీసం పుట్టింటికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో భర్త వేధింపులను భరించలేకపోయిన ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక ఏడాది పాప ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరపరాధే.. కానీ పదకొండేళ్లు జైల్లో టార్చర్
అహ్మదాబాద్: పదకొండేళ్లపాటు తనను నానాయాతనలు పెట్టిన తీరును గాంధీనగర్ ఓ ఆలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం వివరించాడు. ఆ విషయాలన్నింటిని 200 పేజీల పుస్తకంలో వివరించాడు. హిందీలో రాసిన ఈ పుస్తకానికి గ్యారా సాల్ సాలఖోన్ కే పిచే(పదకొండేళ్లు జైలు లోపల) అని పేరు పెట్టాడు. 2002లో గాంధీ నగర్లో అక్షర్‌థామ్ ఆలయం వద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా వారి వద్ద ఓ సూసైడ్ నోట్ కనిపించింది. దీని ఆధారంగా అక్కడే ఉంటున్న మఫ్తీ అబ్దుల్ ఖయ్యూంను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దాదాపు పదకొండు సంవత్సరాలపాటు అతడిని పరివిధాల ప్రశ్నించడం, భయాందోళనలు కలిగేలా టార్చర్ పెట్టడంలాంటివి చేశారు. ఈ కేసు పలు కోణాల్లో విచారణ పూర్తవుతూ వాయిదాలు పడుతూ సుప్రీంకోర్టు వరకు రాగా.. ఈ దాడికి మఫ్తీకి సంబంధం లేదని నిరపరాధి అని గత ఏడాది మే 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం తన ఇంటివద్దే ఉంటున్న ఆయన తనకు నష్ట పరిహారం ఇప్పించాలని, తనపై తప్పుడు కేసులు బనాయించి ఇన్నాళ్లపాటు ఇబ్బందిపెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వాదనల సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. 'నాకు అన్నీ గుర్తున్నాయి. ఏ కారణం లేకుండా పదకొండేళ్లపాటు ఒళ్లుగగుర్పొడిచేలా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. నా పరువు, నా కుటుంబ ప్రతిష్ఠ అంతాపోయింది. ఈ విషయాలన్నీ నేను నా పుస్తకంలో రాశాను. విచారణ సమయంలో వాళ్లు ఎన్ని రకాల టార్చర్లు పెట్టారో వాటన్నింటిని అందులో పేర్కొన్నాను' అని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు. -
బాలికను వేధించిన ఇద్దరిపై ‘నిర్భయ’ కేసు
రంగారెడ్డి జిల్లా : ఓ బాలికను వేధించిన ఇద్దరిపై రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. జవహర్‌నగర్‌లోని మార్వాడిలైన్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన భానుగడ్డ తరుణ్‌కుమార్ (22), అతడి స్నేహితుడు కీసర గ్రామానికి చెందిన నిఖిల్(19)లు కొంతకాలంగా బాలికను వేధించసాగారు. తనను ప్రేమించాలని నిఖిల్ నిత్యం విద్యార్థినిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేని బాలిక ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
అదనపు కట్నం.. వేధింపులు
జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు వేధింపులు తాళలేక ఉసురు తీసుకున్నారు. సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌లో వరకట్న దాహానికి మనీష బలికాగా.. జగిత్యాల పట్టణంలో అబార్షన్ చేయించుకోవాలని. అదనంగా కట్నం తీసుకు రావాలని భర్త వేధించడంతో పర్విన్ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. సైదాపూర్ రూరల్ : సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మనీష (22) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు.. బంధువుల కథనం.. శంకరపట్నం మండలం తాడికల్ పంచాయతీ పరిధిలోని చింతగట్టు గ్రామానికి చెందిన గంగిపల్లి అంజయ్య కూతురు మనీషను గత ఏడాది మే 23వ తేదీన సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన చిక్కుల కళావతి -కొంర య్య దంపతుల పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో మనీష తల్లిదండ్రులు శ్రీనివాస్‌కు రూ. 3 లక్షల కట్నం, ద్విచక్రవాహనం, 6 తులాల బంగారం ఇతర లాంఛనాలన్నీ ఇచ్చారు. చెల్లె పెళ్లి కోసం రూ. లక్ష తీసుకురావాలని శ్రీనివాస్, అత్త కళావతి, ఆడబిడ్డ తిరుమల, మరుదలు మొగిళి, చారీలు వేధించారు. దీంతో మనీష తండ్రి గతన ఆగస్టులో రూ. 50 వేలు ఇచ్చాడు. అయినా మరో రూ. 50 వేలు తీసుకు రావాల్సిందేనని రోజూ వేధింపులకు గురిచేశారు. ఇంతలో మనీష మంగళవారం ఒంటికి నిప్పంటించుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బిడ్డను అత్తింటివరే నిప్పంటించి హత్యచేశారని మృతురాలి తండ్రి అంజయ్య ఆరోపించారు. మనీష తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. న్యాయం చేసే వరకూ మృతదేమాన్ని కదిలించేది లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. జగిత్యాలలో సమీనా పర్విన్ జగిత్యాల: భర్త వేధింపులు తాళలేక జగిత్యాల ఖిలాగడ్డకు చెందిన సమీనా పర్విన్ (29) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ నరేశ్ కుమార్ కథనం... మంచిర్యాలకు చెందిన సమీనా పర్వీన్‌కు నాలుగేళ్ల క్రితం జగిత్యాల ఖిలాగడ్డకు చెందిన మదిన్ అబ్బాస్‌తో వివాహం అయింది. వీరికి ఇద్దరు ఉన్నారు. సమీనా ఇటీవలే మళ్లీ గర్భందాల్చింది. మూడోసారి కూడా అమ్మాయే పుడుతుందని భర్త మదిన్ అబ్బాస్ అబార్షన్ చేంచుకోవాలని భార్యను వేధించేవాడు. అంతేగాకుండా పెళ్లి అయిన నాటి నుంచి అదనంగా కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయమై మంగళవారం భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఇంతలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో సమీనా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి అబ్రార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
అబిడ్స్ సీఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
హైదరాబాద్: అబిడ్స్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. డ్యూటి విషయంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సీఐ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
ఉజ్జెక్‌లో బతుకు బితుకు
వరుస దాడులతో తెలుగువారు బెంబేలు స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ ఆర్తనాదాలు స్పందించని ఏజెన్సీలు, దౌత్య కార్యాలయం తమ వెతలతో ‘సాక్షి’కి బాధితుల ఈమెయిల్ గాజువాక : రష్యాలో ఉపాధి కోసమంటూ వెళ్లి ఉజ్బెకిస్థాన్‌లో చిక్కుకుపోయిన కొందరు విశాఖ వాసుల సహా 250 మంది భారతీయులు వరుస దాడులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఒక కంపెనీలో అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న ఫిలిప్ఫీనీయుల కబంధహస్తాల్లో చిక్కుకొని ఆర్నెల్లుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. తట్టుకోలేక స్వదేశానికి వెళ్లిపోతామని మొర పెట్టుకున్నా తమను ఉద్యోగానికి పంపిన ఏజెన్సీగానీ, భారత దౌత్య కార్యాలయం అధికారులు కానీ స్పందించట్లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటూ ‘సాక్షి’కి ఈ మెయిల్ పంపారు. 250 మంది భారతీయులు దాదాపు వంద మంది తెలుగువారు సహా 250 మంది భారతీయులు రష్యాలో ఉద్యోగం కోసమని ప్లేస్వెల్ హెచ్ఆర్డీ సర్వీసెస్ ద్వారా వెళ్లారు. విశాఖకు చెందిన ప్రజ్ఞ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా విశాఖతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందినవారు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తీరా నిర్వాహకులు రష్యాలో గాకుండా ఉజ్బెకిస్థాన్‌లోని కర్కల్ పాకిస్థాన్ జిల్లా అకలక్ ప్రాంతంలో యూజీసీసీ ప్లాంట్ ప్రాజెక్టుకు చెందిన సంగ్చంగ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిర్చారు. అయితే అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఫిలిప్ఫీనీయులు వీరిని అడ్డగిస్తున్నారు. ఇప్పటికి ఐదారుసార్లు దాడులు చేశారని బాధితులు వాపోతున్నారు. రెండ్రోజుల క్రితం ఆరుగురు భారతీయుల ఆచూకీ లభించకుండా పోయిందని చెబుతున్నారు. రూ. 1.20 లక్షలు (2వేల యూఎస్ డాలర్లు) చొప్పున చెల్లించిన తమకు సరైన ఉద్యోగం లేకపోగా ఉజ్బెకిస్థాన్‌లో చిత్రహింసలు అనుభవిస్తున్నా మని ఈమెయిల్లో వెల్లడించారు. తాగడానికి సరిపడా మంచినీరు కూడా ఇవ్వట్లేదని, కంపెనీ కన్స్ట్రక్షన్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ల ముందే ఫిలిప్ఫీనీయులు తమను చితకబాదుతున్నా వారెవరూ కిమ్మనట్లేదని వాపోయారు. తామెలా ఉన్నామోనని స్వస్థలాల్లో ఉన్న తమ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారని, అధికారులు స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు. తమ సమాచారం కోసం +998912608667, +998941405802, +998941460299, +998912724395 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
రైల్లో నుంచి కన్న కూతురిని విసిరివేసిన తల్లి!
కన్న కూతురిని నడుస్తున్న రైల్లో నుంచి కిందకి విసిరివేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో చోటు చేసుకుంది. రైల్లో నుంచి కింద పడిన పసిపాపకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నైహతి రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నైహతీలో రైలు వేగం అందుకోగానే తన ఒడిలోని ఒక సంవత్సరం వయస్సు ఉన్న పసిపాపను పూర్ణిమా దాస్ అనే ప్రయాణికురాలు బయటకు విసిరివేయడం తోటి ప్రయాణీకులను షాక్ గురిచేసింది. వెంటనే చైన్ లాగి పసిపాపను ప్రయాణికులు రక్షించారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళను పోలీసులకు అప్పగించారు. పసిపాపకు చికిత్స అందిస్తున్నాం. పాప పరిస్థితి విషమంగా ఉంది అని పోలీసులు తెలిపారు. తనకు ఆడపిల్ల పుట్టిందని తన భర్త కుటుంబం వేధింపులకు పాల్పడుతుండటంతో పసిపాపను వదిలించుకోవాలని అనుకున్నాను. అందుకే నేను పసిపాపను రైల్లో నుంచి బయటకు విసిరివేసాను అని తల్లి తెలిపింది. తనకు ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి తన అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని మహిళ వాపోయింది.