
బెంగళూరు: జన్మినిచ్చిన తల్లిని రాచిరంపాన పెడుతూ రాక్షసానందం పొందాడో ప్రబుద్ధుడు. నానమ్మ అని గౌరవించకుండా తండ్రిని మించిపోయి చిత్రహింసలు పెట్టాడో యువకుడు. వయసు మీద పడ్డ ముసలి తల్లిని తాగిన మత్తులో ప్రతిరోజు కొడుతూ నరకం చూపించారు తండ్రీకొడుకులు. ఈ దారుణం కర్ణాటకలో చోటు చేసుకుంది. బెళతంగాడీకి చెందిన శ్రీనివాస్ శెట్టి తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించేవాడు. (ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది..)
శ్రీనివాస్‌తో పాటు, అతని కొడుకు ప్రదీప్ శెట్టి కూడా రోజూ తాగొచ్చి ఆమెను కొట్టేవారు. ఈ క్రమంలో ఓ రోజు శ్రీనివాస్ తల్లిపై చేయి చేసుకోవడమే కాక ఆమెను నేలపై ఈడ్చుకుంటూ వెళ్లి మూలకు విసిరేసాడు. ఈ వీడియోను ఆమె రెండో మనుమడు వీడియో తీయగా బయటకు వచ్చింది. ఈ వీడియోలో ముసలితనంలో ఉన్న ఆమె నిస్సహాయురాలై సాయం కోసం అర్థించటం అందరినీ కలిచివేస్తోంది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. (అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి)
Comments
Please login to add a commentAdd a comment