ఎస్పీ కార్యాలయం ఆవరణలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
ఎస్పీ కార్యాలయం ఆవరణలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
Published Tue, Jul 26 2016 5:13 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
వడ్డీ వ్యాపారి దాడుల నుంచి పోలీసులు కాపాడడం లేదనే...
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మనస్తాపం
గుంటూరు ఈస్ట్: వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు వరుస దాడులు చేస్తున్నా పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి గురయిన ఓ వృద్ధురాలు, ఆమె కుమారుడు, కుమార్తె సోమవారం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితురాలి రెండో కుమారుడు సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... బొంగరాలబీడు రెండో లైనులో నేలపాటి నిర్మల అనే 60 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె పెద్ద కుమార్తె తెనాలి కుమారి, పెద్ద కుమారుడు భానుప్రకాశ్, రెండో కుమారుడు సంజీవరావు పక్కపక్క అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. 2011 సంవత్సరంలో నిర్మల తమ ఎదురింటిలో నివసించే పాలపాటి అంబేద్కర్ వద్ద తన అత్తగారు కనకమ్మ పేరు మీద అదే ప్రాంతంలో ఉన్న 72 గజాల బీఫాం స్థలాన్ని తాకట్టు పెట్టి లక్షరూపాయలు డబ్బు వడ్డీకి తీసుకున్నారు. నెల నెల వడ్డీ కడుతున్నారు. కొద్ది నెలలకే అంబేద్కర్ ఆ స్థలాన్ని ఆక్రమించి అందులో ఉన్న పూరిల్లు తొలగించి రేకుల షెడ్ నిర్మించాడు. ఈ విషయమై నిర్మల కుటుంబ సభ్యులు అంబేద్కర్‌తో గొడవ పడి పోలీస్టేçÙన్‌లో ఫిర్యాదు చేసి కోర్టులో దావా వేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సార్లు నిర్మల, ఆమె సంతానం అంబేద్కర్‌కు లక్ష రూపాయలు వడ్డీ డబ్బులు ఇచ్చేందుకు యత్నిం చగా అతను తిరస్కరించి 5 లక్షలు వరకు ఇవ్వాలని డిమాండు చేశాడు. 8 నెలల క్రితం వీరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అంబేద్కర్ అనుచరులతో నిర్మల, ఆమె కుటుంబ సభ్యులపై దాడులు చేశాడు. నిర్మల కుమార్తె తెనాలి కుమారికి దుగ్గిరాల నుంచి∙లక్షా డైబ్బై ఐదు వేలు ఇవ్వాలంటూ వేరే పేరుమీద నోటీసులు వచ్చాయి. ఇదంతా అంబేద్కర్ చేస్తున్నదే అని కుటుంబ సభ్యులంతా మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 21 వ తేదీ రాత్రి అంబేద్కర్ అనుచరులతో నిర్మల, ఆమె కుమారుడు, కుమార్తెతో పాటు కోడలు మల్లిపై దాడి చేసి గాయపరిచాడు. మల్లి ఆసుపత్రిలో చికిత్స పొందింది. నిర్మల కుటుంబ సభ్యులు అరండల్ పేట పోలీస్టేçÙన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అంబేద్కర్ ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకుని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అప్పటికే నిర్మల కుటుంబ సభ్యులు సంవత్సర కాలంలో 3 సార్లు ఎస్పీ గ్రీవెన్స్‌లో, పలుసార్లు అరండల్ పేట పోలీస్టేçÙన్‌లో అంబేద్కర్ చేస్తున్న వరుస దాడులపై ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్మల, ఇతర కుటుంబసభ్యులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. మల్లి ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు చేస్తుండగా నిర్మల, కుమారి, భానుప్రకాశ్ వెంట తెచ్చుకున్న ఎలుకల మందును కూల్ డ్రింక్ బాటిల్‌లో కలిపి తాగిన కొద్ది సేపటికే కింద పడిపోయారు. అక్కడే ఉన్న సంజీవరావు పోలీసుల సహాయంతో ముగ్గురినీ ఆటోలో జీజీహెచ్‌కు తరలించాడు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. పలుసార్లు తమపై దాడి చేసిన అంబేద్కర్‌తో పాటు తమమీద కేసులు పెట్టడం అన్యాయమని, ఆత్మహత్య చేసుకుంటేనన్నా దయ కలుగుతుందని తమ కుటుంబ సభ్యులు ఇలా చేశారని సంజీవరావు వాపోయాడు.
Advertisement
Advertisement