Financer
-
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
డ్రంక్ అండ్ డ్రైవ్: పుణే ఫైనాన్సర్ వైస్ ప్రెసిడెంట్ మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి నగర ఆర్థిక సంస్థ ఉపాధ్యక్షుడి మృతికి కారమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు యజమాని జేమ్స్(30)పై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్టు అయిన సాయంత్రమే నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం స్థానికంగా ఆందోళన రేపుతోంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ ఖండేల్వాల్(38) ఆదివారం రాత్రి భార్య రోషిణి, కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం 12:30 గంటలకు పక్కింట్లొ జరిగే ఓ కార్యక్రమానికి నడుచుకుంటూ బయలుదేరాడు. అదే సమయంలో జేమ్స్(30) అనే వ్యక్తి ఫుల్‌గా తాగి కారు నడిపాడు. ఈ క్రమంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో కారు అదుపు తప్పి ఖండేల్వాల్ తాగి గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఖండేల్వాల్ తీవ్రంగా గాయపడగా ఆయన భార్య రోషిణికి స్వల్ప గాయలయ్యాయి. కాగా ఈ ఘటనలో బాధితుడి కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా ఖండేల్వాల్ చికిత్స పొందుతూ మరణించగా ఆయన భార్య కొలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వీర్ కారు యజమానికి జేమ్స్ ఆ సమయంలో మద్యం సేవించినట్లు ప్రాథమిక పరీక్షలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతుడు ఖండేల్వాల్ భార్య ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు జేమ్స్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై ఎస్ఐ సునిల్ జాదవ్ మాట్లాడుతూ.. నిందితుడు జేమ్స్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి ప్రహారీ గొడతో పాటు అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో నిందితుడు జేమ్స్‌పై నిర్లక్ష్యంగా కారు నడపడం, వాహనం చట్టం కింద కేసు నమోదు చేసి ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరపరచమన్నారు. అయితే ఆ రోజు సాయంత్రమే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో అతడిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం దీనిపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు సీనియర్ లీగల్ ఆఫీసర్లను కలిసినట్లు ఆయన చెప్పారు. కాగా నిందితుడు జెమ్స్ ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు రక్తాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆయన వెల్లడించారు. -
ఫైనాన్సర్ టోకరా!
సాక్షి, తుర్కపల్లి(ఆలేరు): అతనో వికలాంగుడు.. ఏప్రాంతంవాడో తెలియదు.. చిరువ్యాపారులకు డబ్బులు అప్పుగా ఇస్తూ ఫైనాన్సర్‌గా మారాడు. అయ్యప్పమాల వేసి పరమభక్తుడిగా నటించాడు.. పండుగలొస్తేచాలు హంగూఆర్భాటాలతో పూజలు చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. అన్నదానాలూ చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ ధనవంతుడినని నమ్మించాడు. తాను కొనుగోలు చేసిన భూములను తక్కువ ధరకు అమ్ముతానని కొందరిని నమ్మించి అడ్వాన్స్‌ల పేరిట రూ.51లక్షల వరకు వసూలు చేసి ఆ సొమ్ముతో రాత్రికిరాత్రే బిఛానా ఎత్తేశాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఆనంద్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఓ వికలాంగుడు నాలుగేళ్లక్రితం ఓ చిన్నపాటి సూట్‌కేసుతో తుర్కపల్లికి వచ్చాడు. తాను ఫైనాన్సర్అని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంట్లోకి కావాల్సిన ఏసీలు, ఫ్రిజ్, టీవీ, సోఫాలు, ఇలా రకరకాల వస్తువులు కొనుగోలు చేశాడు. తను ఉండే ఇంట్లో పరమభక్తుడిలా రోజూ పూజలు చేస్తూ చుట్టపక్కల వారికి ప్రసాదాలు పంచేవాడు. దీపావళి పండుగ వస్తే ఘనంగా లక్ష్మీపూజ చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. తుర్కపల్లిలో చిరువ్యాపారులకు, ఆటోడ్రైవర్లకు ఫైనాన్స్ ఇచ్చి డెయిలీ వసూళ్లకు యువకులను సైతం తన దగ్గర ఉద్యోగులుగా పెట్టుకున్నాడు. తాంత్రికస్వామిగా.. కార్తీకమాసం కంటే ముందే అయ్యప్పమాలధారణ చేసేవాడు. 23 సార్లు తాను మాలవేసుకున్న తాంత్రికస్వామిగా పరిచయం చేసుకున్నాడు. అయ్యప్ప పూజల సందర్భంగా పెద్ద ఎత్తున్న మండల కేంద్రంలో అన్నదానాలు చేసేవాడు. గుళ్లు గోపురాలకు పెద్ద ఎత్తున చందాలు రాసేవాడు. గణేశ్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆర్థికంగా ఉన్న అయ్యప్ప భక్తులు, ప్రజలపై కన్ను మాల వేసుకున్న భక్తుల్లో ఆర్థికంగా ఉన్నవారిపై ఓ కన్నువేసేవాడు.ఆ క్రమంలోనే చుట్టు పక్కల ఉన్న భూములను కొనుగోలు చేసానని భూమి జిరాక్స్ పత్రాలను వారికి చూపించేవాడు. ఎవరూ లేని సమయంలో ఆ భూముల వద్దకు తీసుకెళ్లి ఈ భూమి నేను అగ్రిమెంట్ చేసుకున్నానని నమ్మించే వాడు. ఆ భూములను తక్కువ ధరలకు మీకు అమ్ముతామని పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అందరికీ తెలిస్తే భూమిని మీకు అమ్మనని స్పష్టంచేసేవాడు. అనంతపురం వాసుడిగా.. మీరు ఏప్రాంతం నుంచి వచ్చారని ప్రజలు అడిగితే తనది అనంతçపురం అని, ధనవంతుల కుటుంబం అని నమ్మించాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ అని అడిగితే తన ఫొటోతో ఇతరుల ఫొటోలను జతచేసి మార్ఫింగ్చేసి కుటుంబ సభ్యులని చూపించాడు. గురుస్వామిని నమ్మించి.. తుర్కపల్లికి చెందిన ఓగురుస్వామిని నమ్మించి రూ.36లక్షలు వసూలు చేశాడు. తాను బొమ్మలరామారంలోని మెయిన్‌రోడ్డులో భూమి కొనుగోలు చేశానని ఆ గురుస్వామిని అక్కడికి తీసుకెళ్లి చూయించాడు. ఇక్కడ 14 ఎకరాలు ఉందని దీనిని యజమానులు రూ.75వేలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారని తెలిపాడు. ఇందులో 5 ఎకరాల భూమని తాను వారి వద్దనుంచి రూ.5లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశానని చెప్పాడు. ఈ భూమికి ఎకరం రూ.80లక్షల వరకు డిమాండ్ ఉందని కానీ గురుస్వామి కాబట్టి మీకు రూ.20లక్షలకు ఎకరం చొప్పున విక్రయిస్తానని చెప్పి నమ్మించాడు. ఇలా ఆ గురుస్వామినుంచి ఇటీవల రూ. 36 లక్షలు వసూలు చేశాడు. మరో వ్యక్తి వద్దనుంచి రూ.5లక్షలు, ఓహోటల్ యజమాని వద్ద రూ.2.50లక్షలు, మరికొంతరి వద్ద కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ నెల 27న భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని రావాలని గురుస్వామికి చెప్పాడు. అయితే 27తేదీన ఫైనాన్సర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో గురుస్వామి ఆఫైనాన్సర్ ఇంటి వెళ్లివాకబు చేశాడు. పనిమీద రాత్రి బయటికి వెళ్లాడని, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడని అతని వద్ద పనిచేసే వర్కర్లు చెప్పారు. మంగళవారం ఫోన్ చేసినా స్విచ్ఆఫ్ వచ్చింది. అతడు 51 లక్షల రూపాయల నగదు ,నగలతో ఆదివారం రాత్రి తన మూడుచక్రాల వాహనంపైన భువనగిరికి వెళ్లి బస్‌స్టాండ్‌లోని పార్కింగ్‌లో ఉంచి ఆటోలో పరారయ్యాడు. గురుస్వామితో పాటు మరో ఐదుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. ఎటువంటి ఆధారం దొరకకుండా.. ఎవరికీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆనంద్‌రెడ్డి వ్యవహరించాడు. అతడు వాడిన ఫోన్లు, సి మ్‌లతో పాటు వాహనం కూడా గ్రామస్తుల పే రుమీదనే కొనుగోలు చేశాడు. తన ఉంటున్న గది లో పలుబ్యాంక్లకు సంబంధించిన పాస్పుస్తాకా లు, ఖాళీ చెక్కులు, ఆధార్‌కార్డులు, ప్రామిసరీ నోట్లు, వాహనాలు ధ్రువీకరణ పత్రాలు లభించాయి. పలు జిల్లాల్లో కూడా కేసులు ఆంధ్రరాష్ట్రంలోని అనంతపుం, తాడిపత్రి, చిత్తూ రు, మదనపల్లి, తిరుపతిలో అతని పై పలు కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు. -
ఎస్పీ కార్యాలయం ఆవరణలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
వడ్డీ వ్యాపారి దాడుల నుంచి పోలీసులు కాపాడడం లేదనే... ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మనస్తాపం గుంటూరు ఈస్ట్: వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు వరుస దాడులు చేస్తున్నా పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి గురయిన ఓ వృద్ధురాలు, ఆమె కుమారుడు, కుమార్తె సోమవారం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితురాలి రెండో కుమారుడు సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... బొంగరాలబీడు రెండో లైనులో నేలపాటి నిర్మల అనే 60 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె పెద్ద కుమార్తె తెనాలి కుమారి, పెద్ద కుమారుడు భానుప్రకాశ్, రెండో కుమారుడు సంజీవరావు పక్కపక్క అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. 2011 సంవత్సరంలో నిర్మల తమ ఎదురింటిలో నివసించే పాలపాటి అంబేద్కర్ వద్ద తన అత్తగారు కనకమ్మ పేరు మీద అదే ప్రాంతంలో ఉన్న 72 గజాల బీఫాం స్థలాన్ని తాకట్టు పెట్టి లక్షరూపాయలు డబ్బు వడ్డీకి తీసుకున్నారు. నెల నెల వడ్డీ కడుతున్నారు. కొద్ది నెలలకే అంబేద్కర్ ఆ స్థలాన్ని ఆక్రమించి అందులో ఉన్న పూరిల్లు తొలగించి రేకుల షెడ్ నిర్మించాడు. ఈ విషయమై నిర్మల కుటుంబ సభ్యులు అంబేద్కర్‌తో గొడవ పడి పోలీస్టేçÙన్లో ఫిర్యాదు చేసి కోర్టులో దావా వేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సార్లు నిర్మల, ఆమె సంతానం అంబేద్కర్‌కు లక్ష రూపాయలు వడ్డీ డబ్బులు ఇచ్చేందుకు యత్నిం చగా అతను తిరస్కరించి 5 లక్షలు వరకు ఇవ్వాలని డిమాండు చేశాడు. 8 నెలల క్రితం వీరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అంబేద్కర్ అనుచరులతో నిర్మల, ఆమె కుటుంబ సభ్యులపై దాడులు చేశాడు. నిర్మల కుమార్తె తెనాలి కుమారికి దుగ్గిరాల నుంచి∙లక్షా డైబ్బై ఐదు వేలు ఇవ్వాలంటూ వేరే పేరుమీద నోటీసులు వచ్చాయి. ఇదంతా అంబేద్కర్ చేస్తున్నదే అని కుటుంబ సభ్యులంతా మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 21 వ తేదీ రాత్రి అంబేద్కర్ అనుచరులతో నిర్మల, ఆమె కుమారుడు, కుమార్తెతో పాటు కోడలు మల్లిపై దాడి చేసి గాయపరిచాడు. మల్లి ఆసుపత్రిలో చికిత్స పొందింది. నిర్మల కుటుంబ సభ్యులు అరండల్ పేట పోలీస్టేçÙన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అంబేద్కర్ ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకుని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అప్పటికే నిర్మల కుటుంబ సభ్యులు సంవత్సర కాలంలో 3 సార్లు ఎస్పీ గ్రీవెన్స్‌లో, పలుసార్లు అరండల్ పేట పోలీస్టేçÙన్లో అంబేద్కర్ చేస్తున్న వరుస దాడులపై ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్మల, ఇతర కుటుంబసభ్యులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. మల్లి ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు చేస్తుండగా నిర్మల, కుమారి, భానుప్రకాశ్ వెంట తెచ్చుకున్న ఎలుకల మందును కూల్ డ్రింక్ బాటిల్లో కలిపి తాగిన కొద్ది సేపటికే కింద పడిపోయారు. అక్కడే ఉన్న సంజీవరావు పోలీసుల సహాయంతో ముగ్గురినీ ఆటోలో జీజీహెచ్‌కు తరలించాడు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. పలుసార్లు తమపై దాడి చేసిన అంబేద్కర్‌తో పాటు తమమీద కేసులు పెట్టడం అన్యాయమని, ఆత్మహత్య చేసుకుంటేనన్నా దయ కలుగుతుందని తమ కుటుంబ సభ్యులు ఇలా చేశారని సంజీవరావు వాపోయాడు.