ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి నగర ఆర్థిక సంస్థ ఉపాధ్యక్షుడి మృతికి కారమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు యజమాని జేమ్స్(30)పై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్టు అయిన సాయంత్రమే నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం స్థానికంగా ఆందోళన రేపుతోంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ ఖండేల్వాల్(38) ఆదివారం రాత్రి భార్య రోషిణి, కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం 12:30 గంటలకు పక్కింట్లొ జరిగే ఓ కార్యక్రమానికి నడుచుకుంటూ బయలుదేరాడు. అదే సమయంలో జేమ్స్(30) అనే వ్యక్తి ఫుల్‌గా తాగి కారు నడిపాడు.
ఈ క్రమంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో కారు అదుపు తప్పి ఖండేల్వాల్ తాగి గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఖండేల్వాల్ తీవ్రంగా గాయపడగా ఆయన భార్య రోషిణికి స్వల్ప గాయలయ్యాయి. కాగా ఈ ఘటనలో బాధితుడి కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా ఖండేల్వాల్ చికిత్స పొందుతూ మరణించగా ఆయన భార్య కొలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వీర్ కారు యజమానికి జేమ్స్ ఆ సమయంలో మద్యం సేవించినట్లు ప్రాథమిక పరీక్షలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతుడు ఖండేల్వాల్ భార్య ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు జేమ్స్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై ఎస్‌ఐ సునిల్ జాదవ్ మాట్లాడుతూ.. నిందితుడు జేమ్స్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి ప్రహారీ గొడతో పాటు అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో నిందితుడు జేమ్స్‌పై నిర్లక్ష్యంగా కారు నడపడం, వాహనం చట్టం కింద కేసు నమోదు చేసి ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరపరచమన్నారు. అయితే ఆ రోజు సాయంత్రమే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో అతడిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం దీనిపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు సీనియర్ లీగల్ ఆఫీసర్లను కలిసినట్లు ఆయన చెప్పారు. కాగా నిందితుడు జెమ్స్ ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు రక్తాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment