
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్‌కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.