Uttar Pradesh police
-
మహా కుంభమేళాకు సైబర్ భద్రత
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో మహా కుంభమేళా వెబ్సైట్లు, యాప్‌లపై సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి భద్రత కల్పించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్(IIT Kanpur) ముందుకొచ్చింది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)ను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది.నిపుణుల బృందం పర్యవేక్షణఐఐటీ కాన్పూర్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) అలహాబాద్‌కు చెందిన ఎక్స్‌పర్ట్‌తో కలిసి యూపీ పోలీసు సిబ్బందికి సాయం చేసేందుకు సిద్ధమైంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బృందం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణ, నిరంతరం ఆడిట్ నిర్వహిస్తుంది.వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలుసైబర్ దాడులు, రాన్సమ్వేర్, పోర్ట్ స్కానింగ్(Scanning) వంటి వాటిని నివారించడానికి ఈ బృందం వర్చువల్ పెట్రోలింగ్, ఫైర్‌వాల్ తనిఖీలు నిర్వహించనుంది. ఈవెంట్ వెబ్సైట్లు, అప్లికేషన్ల నిరంతరం పర్యవేక్షించనుంది. మహాకుంభ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లు కొన్నిసార్లు వల్నరబిలిటీ ఆడిట్(హానికర కంటెంట్‌ను జొప్పించడం)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NIIPC), కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ద్వారా స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టిక్యూసీ)తో సహా వివిధ నిపుణుల ఏజెన్సీలు నిత్యం ఆడిట్లను నిర్వహిస్తాయి. భద్రతా బలహీనతలను గుర్తించడానికి, పరిష్కరించడానికి ఈ ఆడిట్లు సహాయపడతాయి.ఇదీ చదవండి: నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణంయూపీ పోలీసుల సహకారంతో..నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన యూపీ పోలీసులతో సైబర్ సెక్యూరిటీని సమన్వయం చేస్తున్నారు. నిరంతర అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా బెదిరింపులు వంటివి వస్తే సత్వర చర్యలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
మనుషుల్లాగా మాకు గంజాయి తాగే అలవాటు లేద్సార్!
మనుషుల్లాగా మాకు గంజాయి తాగే అలవాటు లేద్సార్! -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్‌కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
'నాకు పెళ్లి కావాలి'.. పిల్ల దొరికేసిందిగా..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాకు చెందిన అజీమ్ మన్సూరి.. వయసు 26. పెళ్లీడొచ్చిన అతడికి పిల్ల దొరకడం లేదట. కారణం అతడు 30 ఇంచుల పొడవు మాత్రమే ఉండటం. దీంతో కాబోయే భార్య కోసం ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలిసిపోయాడు. ఇలా కాదని గత నెలలో ఏకంగా పోలీసులనే సాయం కోరాడు. తనకో మంచి వధువును వెతికిపెట్టమని అభ్యర్థించాడు. ఇంకేముందీ.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడికిప్పుడు రెండు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఒకటి ఘజియాబాద్‌కు చెందిన రెహనా అన్సారిది. అతడి హైటే ఉన్న ఈ యువతి అజీమ్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానంటోంది. అంతేకాదు, తనను అర్ధాంగిగా స్వీకరిస్తే.. చేదోడువాదోడుగా ఉంటానంటోంది. ఆమె తండ్రి కూడా ఎలాగైనా ఈ పెళ్లి ఖాయమయ్యేందుకు అబ్బాయి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నాడు. ఈ వివాహానికి అబ్బాయి తరపువాళ్లు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాడు. ఇక ఢిల్లీకి చెందిన మరో మహిళ అజీమ్‌తో జీవించేందుకు తహతహలాడుతోంది. "నేను అతడితో ఓ మాట చెప్పాలనుకుంటున్నా. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ నేనూ ఒంటరిదాన్నే. నేను అతడిని పెళ్లాడాలనుకుంటున్నాను" అని ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అజీమ్ వరకు చేరింది. తనకు రెండు సంబంధాలు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన అజీమ్ ఈ ప్రపంచంలో తనకంటూ ఒకరున్నారని ఆ దేవుడు రుజువు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మాత్రమే కాదు పలు చోట్ల నుంచి కూడా అమ్మాయి ఉంది చేసుకుంటారా? అంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయట. అయితే అజీమ్ ఫ్యామిలీ మాత్రం హాపూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా చేయనున్నారట. ఈ లెక్కన వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లోనో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనో జరిగే అవకాశాలున్నాయి. చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం! జనం పరుగో పరుగు.. ఇండియన్ ఏనుగు అంతే! -
కారుపైన యువకుడి పుషప్స్.. ఊహించని ట్విస్ట్
‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు... కానీ ఎంత మూల్యానికి’ అని థియేటర్లలో, టీవీలలో కనిపించే ప్రకటన గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ సంఘటనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రన్నింగ్ కారు పైకి ఎక్కి పుషప్స్ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విట్స్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉజ్వల యాదవ్ అనే కుర్రాడు సోలోగా కారు డ్రైవింగ్ చేస్తూ షికారు కెళ్లాడు. రహదారిపైకి రాగానే స్టన్నింగ్ స్టంట్స్ చేద్దామని భావించి డ్రైవ్ చేస్తున్న స్టీరింగ్ వదిలేసి కారు పైకి ఎక్కాడు.. రన్నింగ్‌లో ఉన్న కారుమీదనే పుషప్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 61 వేల మంది వీక్షించడంతోపాటు వందలాది మంది కామెంట్ చేశారు. నెట్టింటా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా చివరికి ఉత్తర ప్రదేశ్‌లో పోలీసుల కంటికి చిక్కింది. ఇంకేముంది ఉజ్వల్ చేసిన ఘనకార్యానికి పోలీసులు తగిన మూల్యం విధించారు. ‘కొన్ని పుషప్స్ మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయి. ఎంతో కష్టపడ్డావ్ కదా. నీ కష్టానికి ఇదిగో బహుమతి’ అంటూ అతనికి భారీగానే చలాన్ విధించారు. డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడం నేరమని. ఇది మీతోపాటు ఇతరులకు హానీ కలిగించవచ్చు అని యూపీ పోలీసులు తమ ట్విటర్లో పేర్కొన్నారు. అలాగే ఇలా ఎవరైన చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్ అధికారి అజయ్ కమార్ హెచ్చరించారు. దీంతో పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక స్టంట్స్‌తో హీరో అవుదామనుకున్న ఉజ్వల్‌కు చివరికి పోలీసులు షాక్ ఇవ్వడంతో ఖంగుతిన్నాడు. అయితే అలా చేసినందుకు క్షమాపణలు కోరుతూ.. మరోసారి రిపీట్ చేయనంటూ చెప్పడం కొసమెరుపు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..! -
‘తాండవ్’ రూపకర్తలపై క్రిమినల్ కేసు
ముంబై: వెబ్‌సిరీస్ ‘తాండవ్’ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్‌సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్సిరీస్లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం.. మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్’ వెబ్‌సిరీస్ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్‌ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు. -
గ్యాంగ్‌స్టర్ ఇల్లు నేలమట్టం
లక్నో/కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో కరడుగట్టిన నేరగాడు వికాస్ దుబే గ్యాంగ్ ఎనిమిదిమంది పోలీసులను పొట్టన బెట్టుకున్న ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దుబే స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్డోజర్లతో నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. నేరగాడు దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్ చేశారు. కాల్పులు జరిగినప్పటి నుంచి జాడ తెలియకుండాపోయిన దుబే కోసం 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దుబే లొంగిపోకుంటే, పోలీసులు అతడిని కాల్చి చంపాలని అతడి తల్లి సరళా దేవి అన్నారు. ‘అతడి కారణంగా మేం సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. -
5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు
-
5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో కూడా నిరసనలు ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కూడా సీఏఏపై శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్హరీ చాకచక్యంతో దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. యూనివర్సీటీ క్యాంపస్ నుంచి జిల్లా జడ్జి కార్యాయలం వరకు.. ర్యాలీగా వెళ్తేందుకు ప్లాన్ చేసుకున్న విద్యార్థులపై ఎస్పీ వ్యాఖ్యలు పనిచేశాయి. (చదవండి : ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!) ‘ప్రజస్వామ్యయుతంగా నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే మీతో పాటు నేనూ ఉంటాను. కానీ, అతిగా ప్రవర్తించి.. మీ నిరసనలో జోక్యం చేసుకునే అవకాశం ఇతరులకు ఇవ్వొద్దు’ అని ఆకాశ్ మైక్‌లో చెప్పారు. ‘మీ వినతి జిల్లా న్యాయమూర్తికి చేరేలా నేను చూసుకుంటాను’అని హామినిచ్చాడు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా జడ్జికి వినతిని అందించిన విద్యార్థులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇక నిముషంపాటు ఉన్న ఆకాశ్ స్పీచ్ వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలైన పోలీసుకు అర్థం చెప్పావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : ‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’) -
తుపాకీ గురిపెట్టి తనిఖీలు..
బదౌన్: బైక్ మీద వెళుతున్న ప్రయాణికులను పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపి, పాయింట్‌బ్లాంక్‌లో గన్ పెట్టి సోదా చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ద్విచక్ర వాహనదారులకు ఎదురైంది. బైక్‌ను ఆపి, దిగి చేతులు వెనక్కు పెట్టి కదలకుండా ఉండాల్సిందిగా ఆజ్ఞాపించారు. అనంతరం సోదాలు నిర్వహించారు. సోదా నిర్వహిస్తుండగా ఇద్దరు పోలీసులు గన్ గురిపెట్టి నిల్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలా పౌరులను భయభ్రాంతులకు గురి చేయడం సరి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి కేవలం పోలీసులు తమను తాము రక్షించుకోవడానికే అని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు అశోక్ కుమార్ త్రిపాఠి సోమవారం వివరణ ఇచ్చారు. కొందరు నేరగాళ్లు తమ వెంట ఆయుధాలు తెచ్చుకొని పోలీసులపై దాడిచేసే అవకాశం ఉందని అందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. -
పోలీసులు చూస్తుండగానే..
-
పోలీసులు చూస్తుండగానే మరో దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లిందన్న కారణంగా పోలీసు జీపులో ఓ మహిళా పోలీసు, 20 ఏళ్ల విద్యార్థినిని పట్టుకొని చెంప చెళ్లుమనిపించడం, ‘నీ చుట్టూరా ఎంతో మంది హిందువులుంటే నీకో ముస్లిం యువకుడే కావాల్సి వచ్చిందే’ అంటూ పక్కనే ఉన్న మరో మహిళా పోలీసు వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు జీపులో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీడియోను రికార్డు చేసినట్లు భావిస్తున్న హోం గార్డుపై యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మీరట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీకి చెందిన నర్సింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, తనతోపాటే చదువుతున్న 22 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఉంటున్న జాగృతి విహార్‌కు ఆదివారం నాడు వెళ్లింది. జాగృతి విహార్, వారు చదువుతున్న నర్సింగ్ కాలేజీకి ఎదురుగానే ఉంది. మీరట్ వైద్య యూనివర్శిటీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఆ జాగృతి విహార్లోనే ఉంటారు. అందులో కిరాయి తీసుకొని ఉంటున్న ముస్లిం యువకుడి వద్దకు ఆ విద్యార్థిని వెళ్లడం గమనించిన స్థానికులు విశ్వ హిందూ పరిషత్‌కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఆ జంటను పట్టుకొని కొట్టారు. ఈ విషయాన్ని ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా, మహిళా పోలీసులు వచ్చి మహిళను రక్షించి జీపులో తీసుకెళ్లారు. తాము జాగృతి విహార్‌పై దాడి చేసినప్పుడు ఆ యువ జంట ప్రేమించుకుంటున్నారని, వారిని హెచ్చరించి పోలీసులకు అప్పగించామని, వారిపై చేయి చేసుకోలేదని వీహెచ్‌పీ స్థానిక నాయకుడు బలరాజ్ దూంగర్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి హెపూర్‌లో ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు వెళ్లి, ముస్లిం యువకుడిపై కేసు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారు క్లాస్మేట్స్ మాత్రమేనని, వారి మధ్య మరెలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి తండ్రి చెబుతూ వస్తున్నారు. బుధవారం రాత్రి వరకు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే విద్యార్థినిగానీ, ముస్లిం యువకుడుగానీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆదివారం ఈ సంఘటన జరిగిన నాటి నుంచి నర్సింగ్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సంఘటనపై కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమది కో ఎడ్యుకేషన్ కాలేజని, విద్యార్థిని, ముస్లిం యువకుడు క్లాస్మేట్స్ అని తెలిపారు. నర్సింగ్ కాలేజీ అవడం వల్ల ల్యాబుల్లో కూడా ఆడ, మగ కలిసే పనిచేయాల్సి వస్తుందని, కలుసుకోవద్దని, పరిచయాలు పెంచుకోవద్దని వారికి తాము చెప్పలేమని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కళాశాలకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. యూనివర్శిటీలో హిందూత్వ సంస్థల ఉనికి పెరిగినప్పటి నుంచి అశాంతి పరిస్థితులు పెరుగుతున్నాయని అధ్యాపకులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం శోచనీయమని, అందుకే మహిళా పోలీసులపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని సబ్ ఇనిస్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది. పోలీసుల సమక్షంలోనే ముస్లిం యువకుడిపై గూండాలు దాడి చేసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి చర్యలను సహించబోమని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని యూపీ డీజీపీ ట్వీట్ చేశారు. -
ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన..
లక్నోః ఉత్తరప్రదేశ్ లో మొదటిసారి ప్రారంభించిన పోలీస్ ట్విట్టర్ గ్రీవెన్స్ సేవలకు అనూహ్య స్పందన లభించినట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలతో మమేకమై.. ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రారంభించిన మైక్రోబ్లాగింగ్ వేదికను దేశంలోనే మొట్ట మొదటిసారి తమ రాష్ట్రం ప్రారంభించినట్లు చెప్పారు. ట్విట్టర్ సర్వీస్ ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 19 తేదీల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే 1,710 ట్వీట్లు వచ్చాయని, వాటిలో 1,280 కేసులను ఇప్పటికే పరిష్కరించినట్లు రాష్ట్ర డీజీపీ జావేద్ అహ్మద్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ ట్విట్టర్ లో సేవలందించేందుకు సెప్టెంబర్ 8న ముందుకు వచ్చింది. ప్రజలు ఆన్లైన్ లో ఇచ్చే ఫిర్యాదులకు డిపార్ట్ మెంట్ వెంటనే స్పందింస్తుందని, ఇందుకోసం ట్విట్లర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర డీజీపీ పేర్కొన్నారు. -
ఔరా! ఎస్ఐని ఊర కుక్క కరిచిందని..!
అసలే పోలీసోళ్లకు కోపం ఎక్కువ అంటారు. అందుకే ఓ సబ్ ఇన్స్పెక్టర్ తనను కరిచిన ఊరకుక్కను తుపాకీతో కాల్చిపారేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని లక్నోలోని చిన్హాత్ పోలీసు స్టేషన్ అధికారిని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ ఆదేశించారు. చిన్హాత్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర ప్రతాప్ నివసిస్తున్నారు. డ్యూటీలో భాగంగా బరాబంకీ వెళుతుండగా ఓ ఊరకుక్క ఆయనను కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేంద్ర ప్రతాప్ వెంటనే ఇంటికి వెళ్లి లైసెన్స్డ్ రైఫిల్ తీసుకొని వచ్చి ఆ కుక్కను అక్కడికక్కడే కాల్చిపారేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో సదరు ఎస్సైపై కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో జంతు హక్కుల కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిందితుడైన ఎస్సై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు మెంబరైన కమ్నా పాండే ఈ అంశాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారుల్ని ఆమె ఆదేశించారు. మరోవైపు ఎస్సై తుపాకీతో కాల్చిన కుక్క పరిస్థితి ఏమైందనేది తెలియకుండా ఉంది. కాల్పుల తర్వాత ఆ కుక్క పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్ఐఏ అధికారి హత్య: దర్యాప్తులో కీలక మలుపు
లక్నో: భారత్ లోనేకాక పాకిస్థాన్ లోనూ సంచలనం కలిగించిన ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యకుసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. స్వగ్రామం సాహస్ పూర్ లో తంజీల్ హాజరైన వివాహవేడుకకు హాజరైన ఇద్దరు వ్యక్తులే హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పెళ్లి వీడియోను కూలంకషంగా పరిశీలించారు. ఇద్దరు ఆ అనుమానితుల్లో ఒకరిని ఆర్షిగా గుర్తించామని, అతను తంజీల్ కుటుంబానికి స్నేహితుడని బిజ్నూర్ ఎస్పీ సుభాస్ సింగ్ బఘేల్ తెలిపారు. రెండో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సిఉందన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే తంజీల్ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న మొహమ్మద్ తంజీల్ అహ్మద్ గత ఆదివారం స్వగ్రామంలో జరిగిన వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ శరీం ఛిధ్రమైపోయి అక్కడికక్కడే మరణిచారు. అతని పక్కసీట్లో కూర్చున్న భార్య ఫాతిమాకు నాలుగు బెల్లెట్లు తగిలాయి. నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఫాతిమా ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అనేక విమర్శలు చెలరేగిన నేపథ్యంలో తంజీల్ హత్యకేసు సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం ఎనిమిది బృందాలను ఏర్పాటుచేశారు. యూపీలోని డ్రగ్స్ మాఫియా, హవాలా వ్యాపారులు సహా మాజీ నేరస్తులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీలనైన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించామని, లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ముగింపునకు వచ్చేఅవకాశం ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. -
కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం
నోయిడా: చిన్నారి అభినవ్ కిడ్నాప్ కేసు దర్యాప్తును ఉత్తరప్రదేశ్ పోలీసులు ముమ్మరం చేశారు. నోయిడాలోని బిషణ్‌పురాలోగల ఇంటి నుంచి సెప్టెంబర్ 26న బాలుడు కనిపించకుండా పోయాడు. ఫిర్యాదు అందిన వెంటనే మీరట్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ వివిధ జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఘజియాబాద్, హపూర్, బులందేశ్వర్ జిల్లా పోలీసులకు బాలుడి విషయమై సమాచారం ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో సోషల్ మీడియాను భాగస్వామ్యం చేయాలని పోలీసులకు ఐజీ అలోక్ శర్మ సూచించారు. చిన్నారి ఆచూకీ కోసం ఐదు జిల్లాలోని 35,000 సిబ్బంది రంగంలోకి దిగినట్లు చెప్పారు. ‘ అభినవ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఐదు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల పోలీసుల సహకారాన్ని కూడా తీసుకొంటున్నామని చెప్పారు. అనుమానాస్పదస్థితిలో 18 ఏళ్ల బాలుడు సెప్టెంబర్ 26న కనిపించకుండా పోయాడని అతడి తండ్రి అలోక్‌సింగ్ 29వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతడు ఐటీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. గాలింపులో పది పోలీసుల బృందాలు ఢిల్లీ-ఎన్సీఆర్, సమీప రాష్ట్రాలు రాజస్థాన్, హర్యానాలో పది పోలీసు బృందాలు గాలింపు చేపడుతున్నట్లు గౌతమ్ బుద్దనగర్‌కు చెందిన సీనియర్ ఎస్పీ ప్రీతీందర్ సింగ్ చెప్పారు. రాష్ట్ర పోలీసులు జీబీనగర్, ఇతర జిల్లాలు, సామాజిక మీడియాకు అభినవ్ వివరాలను అందజేశారని చెప్పారు. నలుగురు పోలీసులు ఒక బృందంగా గాలిస్తున్నారని చెప్పారు. ‘ ఉదయం అభినవ్ జోధ్‌పూర్ ఉన్నట్లు గుర్తించి అక్కడికి వె ళ్లినా ఫలితం లేకుండా పోయింది. మరో బృందం గుర్గావ్ వెళ్లి ఉట్టిచేతులతో తిరిగివచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకూ బాధిత కుటుంబానికి కిడ్నాపర్ల నుంచి ఎటువంటి బెదిరింపు ఫోన్‌కాల్ రాలేదు. పిల్లలు లేని దంపతులు బాలుడిని అపహరించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని అన్నారు. -
బదౌన్ గ్యాంగ్‌రేప్ కేసులో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ గ్యాంగ్‌రేప్, హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈకేసులో ప్రధాన ప్రత్యక్షసాక్షి సత్యశోధన పరీక్షలో విఫలమైయ్యాడు. దీంతో అతడు చెప్పిన సాక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రధానసాక్షి అయిన నజ్రూకు ఇటీవల పాలీగ్రాఫిక్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నివేదిక ఈరోజు తమకు అందిందని సీబీఐ తెలిపింది. అయితే నజ్రూ చెప్పిన సాక్ష్యానికి, పరీక్షలో వచ్చిన ఫలితానికి పొంతన లేదని వెల్లడించింది. నజ్రూ చెప్పిన సాక్ష్యం ఆధారంగానే యూపీ పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. యూపీలోని బదౌన్ లో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం వారిని చెట్టుకు ఉరేసి హత్య చేసినట్టు ఆరోపణలు రావడంతో సంచలనం రేగింది. అయితే బాలికలపై అత్యాచారం జరగలేదని డీఎన్ఏ పరీక్షలో తేలింది. -
ఆదిత్యనాథ్ ధిక్కారం
నిషేధాన్ని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం లక్నో: ఎన్నికల ప్రచార సభలో పాల్గొనొద్దని ఉత్తరప్రదేశ్ పోలీసులు విధించిన నిషేధాన్ని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ధిక్కరించారు. బుధవారం ఆయన లక్నోలోని ఇందిరానగర్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించారు. అంతకుముందు.. ఈ సభలో ప్రసంగించేందుకు ఆయనకు ఇచ్చిన అనుమతిని పోలీసులు ఉపసంహరించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ ఆదేశాలమేరకే దీన్నిఉపసంహరించారని ఆదిత్యనాథ్ విమర్శించారు. నోయి డా ఉపఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు ఇవ్వడం తెలిసిందే. ప్రభుత్వ మత ఎజెండాను ఎండగట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన అన్నారు. అనుమతిలేకుండా ఎన్నికల సభలో పాల్గొన్నందుకు ఆదిత్యనాథ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పా రు. ‘సభ నిర్వహించడంలేదని బీజేపీ నేతలు చెప్పడంతో అనుమతి రద్దు చేశాం. అయితే వారు తిరిగి అనుమతి కోరారు. సమయాభావంతోఅనుమతివ్వలేదు’ అని తెలిపారు. -
భత్కల్ను ప్రశ్నించనున్న యూపీ పోలీసులు!
2010లో వారణాసి బాంబుపేలుళ్ల ఘటనపై కరడుకట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ను ప్రశ్నించేందుకు తమ రాష్ట్రానికి చెందిన తీవ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఒకటి గత అర్థరాత్రి న్యూఢిల్లీ పయనమైయ్యందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఐజీపీ (శాంతి భద్రతలు) ఆర్.కే.విశ్వకర్మ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. 2010 సెప్టెంబర్ 7వ తేదీన వారణాసిలో శీతల్ ఘాట్ వద్ద వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుశ్చర్య తమ పనే అని ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే ఆ ఘటనలో భత్కల్ పాత్రకు సంబంధించి ఏటువంటి ఆధారాలు లభించలేదని విశ్వకర్మ పేర్కొన్నారు. అయినా అతడికి ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలిసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భత్కల్ను యూపీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. గురువారం భారత్- నేపాల్ సరిహద్దుల్లో భత్కల్‌తోపాటు నిఘావర్గాలకు చిక్కిన అసదుల్లా స్వస్థలం అజాంగఢ్‌లోని బాజ్ బహదుర్ ప్రాంతమని ఆయన తెలిపారు. అయితే అతనిపై స్థానికంగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.