పోలీసులు చూస్తుండగానే.. | New Video Of Meerut Woman's Muslim Friend Being Beaten As Cop Watches | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 27 2018 7:14 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

ఓ ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లిందన్న కారణంగా పోలీసు జీపులో ఓ మహిళా పోలీసు, 20 ఏళ్ల విద్యార్థినిని పట్టుకొని చెంప చెళ్లుమనిపించడం, ‘నీ చుట్టూరా ఎంతో మంది హిందువులుంటే నీకో ముస్లిం యువకుడే కావాల్సి వచ్చిందే’ అంటూ పక్కనే ఉన్న మరో మహిళా పోలీసు వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో పోలీసు జీపులో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వీడియోను రికార్డు చేసినట్లు భావిస్తున్న హోం గార్డుపై యోగి అదిత్యనాథ్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement