
బదౌన్: బైక్ మీద వెళుతున్న ప్రయాణికులను పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపి, పాయింట్‌బ్లాంక్‌లో గన్ పెట్టి సోదా చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ద్విచక్ర వాహనదారులకు ఎదురైంది. బైక్‌ను ఆపి, దిగి చేతులు వెనక్కు పెట్టి కదలకుండా ఉండాల్సిందిగా ఆజ్ఞాపించారు. అనంతరం సోదాలు నిర్వహించారు. సోదా నిర్వహిస్తుండగా ఇద్దరు పోలీసులు గన్ గురిపెట్టి నిల్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలా పౌరులను భయభ్రాంతులకు గురి చేయడం సరి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి కేవలం పోలీసులు తమను తాము రక్షించుకోవడానికే అని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు అశోక్ కుమార్ త్రిపాఠి సోమవారం వివరణ ఇచ్చారు. కొందరు నేరగాళ్లు తమ వెంట ఆయుధాలు తెచ్చుకొని పోలీసులపై దాడిచేసే అవకాశం ఉందని అందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment