cops
-
కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్‌కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్‌డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం. -
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!
రైట్ బ్రదర్స్ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్ కారుని హెలికాప్టర్‌గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్ హెలికాప్టర్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ను హెలికాప్టర్‌గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్‌కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్ హెలికాప్టర్లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన. ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్‌గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్ చేశామని చెప్పారు. ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k — Priya singh (@priyarajputlive) March 17, 2024 (చదవండి: పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!) -
దారుణం: డెడ్‌బాడీని కాలువలో పడేసిన పోలీసులు
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులే అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ బాధితుని మృతదేహాన్ని కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికితీసి మార్చురీకి తరలించారు. పోలీసు కానిస్టేబుళ్లు ఓ బాధిత మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా.. ఓ బాటసారి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు. అయితే.. ఓ ప్రమాదంలో చిధ్రమైన మృతదేహాన్ని ఇలా కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆ బాధిత మృతదేహం ఎవరిదో కూడా గుర్తించినట్లు స్పష్టం చేశారు. పోలీసు కానిస్టేబుళ్లు చేసిన ఘటన అమానవీయమని పేర్కొన్న జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ చిధ్రమైన మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: యువకుడి బ్యాంక్ ఖాతాలో 753 కోట్లు -
డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్!
ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం (నాట్స్) భాషే రమ్యం , సేవే గమ్యం, తమ లక్ష్యం అని చాటడమే కాక దాన్ని నిరూపించే దిశగా ప్రవాసంలోని భారతీయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో, డల్లాస్ లో అసంఖ్యాకంగా పెరుగుతున్న తెలుగు వారి సంరక్షణ నిమిత్తం, ఇటీవల పెరుగుతున్న నేరాలు, దోపిడీలను దృష్టిలో ఉంచుకొని కాఫీ విత్ ఎ కాప్ (Coffee with a Cop) అనే కార్యక్రమాన్ని నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ఫ్రిస్కో మోనార్చ్ వ్యూ పార్క్, ఫ్రిస్కో, టెక్సాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో పోలీస్ శాఖ నుండి విచ్ఛేసిన ఆఫీసర్ గిబ్సన్ మరియు డిటెక్టివ్ చావెజ్ ముఖ్యంగా ప్రజలు దొంగతనాలు, దోపిడీల బారిన పడకుండా వహించాల్సిన జాగ్రత్తలు , ఇళ్ళ వద్ద ఏర్పాటు చేసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లను వివరించారు. ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, చెట్లను క్రమ పద్ధతిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను, లైటింగ్ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియచేశారు. పండుగలు, సెలవలు వంటి సందర్భాలలో విలువైన నగలు, ఇతర వస్తువులను భద్రపరచటంలోనూ, వాటిని ధరించి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంకా, విద్యార్థులు స్కూల్స్ లో కంప్యూటర్ ఉపయోగించటంలోను, సైబర్ భద్రత విషయంలోను, బుల్లియింగ్ విషయంలోను మరియు ఇతర అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు. అంతేకాక, అనుమానిత వ్యక్తులను గుర్తించినపుడు దూరం నుండే వారి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించి వెంటనే పోలీసులకు అందివ్వాలని సూచించారు. అలాగే ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న వివిధ కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా హాజరై, చివరలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పోలీస్ ఆఫీసర్ ల నుండి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను అందిస్తున్నందుకు అక్కడకు వచ్చిన అందరూ నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రశంసించారు. నాట్స్ డల్లాస్ కార్యవర్గ సభ్యులు చాప్టర్ కో అర్డినెటర్స్ రవి తాండ్ర, సత్య శ్రీరామనేని ఇతర సభ్యులు శ్రీధర్ న్యాలమాడుగుల, రవి తుపురాని, పార్థ బొత్స, శివ నాగిరెడ్డి, రవీంద్ర చుండూరు, గౌతమ్ కాసిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔనాట్స్ అధ్యక్షులు బాపు నూతి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల ఈ కార్యక్రమంలో పాల్గొని, మన కమ్యూనిటీకి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి కూడా ఈ సందర్భంగా డల్లాస్ చాప్టర్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నాక్స్ మరియు టీ అందించిన స్వాగత్ బిర్యానీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే, నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు పోషక దాతలు అయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్ , ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ ముందు, ముందు మరిన్ని విలక్షణమైన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియచేశారు. (చదవండి: కువైట్‌లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!) -
నడిరోడ్డుపై కానిస్టేబుళ్ల కొట్లాట
పాట్నా: బిహార్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ముష్టియుద్ధానికి దిగారు. జనం చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా కొట్టుకున్నారు. బిహార్‌లో నలందకు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. లంచం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదంతో వీడియో ప్రారంభం అవుతుంది. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవాలని ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో ఘర్షణ మొదలయ్యింది. నడిరోడ్డుపైనే ఇద్దరు దాదాపు ముష్టి యుద్ధానికి దిగారు. అనంతరం ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనంలో నుంచి లాఠీ తీసుకుని ఫైటింగ్‌కి దిగాడు. ఇక చుట్టుపక్కల చేరిన జనం వారిని హెచ్చరిస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. बिहार पुलिस के जवान आपस में हिसाब-किताब करते हुए, नालंदा का वीडियो. pic.twitter.com/8KWlChndwl — Utkarsh Singh (@UtkarshSingh_) September 18, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. सोशल मीडिया पर नालन्दा जिला अंतर्गत दो पुलिस कर्मियों के बीच विवाद का वायरल विडिओ पर पुलिस अधीक्षक, नालन्दा के द्वारा संज्ञान लेते हुए दोनों पुलिस कर्मियों को पुलिस केंद्र वापस किया गया है और जांच का आदेश दिया गया है।(1/2) . .#BiharPolice #HainTaiyaarHum #Bihar — Bihar Police (@bihar_police) September 18, 2023 ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్
ఢిల్లీ: జీ20 సదస్సుకు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. దాదాపు లక్ష మంది పోలీసులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. అవసరమైన ప్రాంతాలలో చెకింగ్ ఏర్పాట్లు చేశారు. నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | In view of the upcoming G20 Summit, Delhi Police is patrolling the Raj Ghat area with the help of a tractor. pic.twitter.com/lJo0Wevrvs — ANI (@ANI) September 7, 2023 వీడియోలో యమునా నది దృశ్యాలు కనిపిస్తున్నాయి. మట్టి రహదారిలో పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రపంచ స్థాయి నేతలు ఢిల్లీకి రానున్నందున పోలీసులు ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుంటా చెకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నాం. సమావేశం నిర్వహించనున్న ప్రాంతానికి సమీపంలో ఉన్నందున యమునా ఖాదర్ ప్రాంతంలో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నాం. ఈరోజు టియర్ గ్యాస్ ప్రాక్టీస్ కూడా చేశాం' అని షహద్రా డీసీపీ ఇన్ఛార్జ్ హర్ష్ ఇండోరా తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు.. ఎవరెవరికి బస ఎక్కడంటే..? -
సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కించపరుస్తూ పోస్టులు చేసిన వ్యవహారంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూప్‌కు షాహబుద్ధీన్ అన్సారీ అనే వ్యక్తి అడ్మిన్‌గా ఉన్నాడు. ఆ గ్రూప్‌లో సీఎం యోగిని అవమానపరుస్తూ పోస్టూ చేశాడో వ్యక్తి. దీంతో గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగిపై ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిందని.. ఈ అంశంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను అదుపులోకి తీసుకున్నామని కోత్వాలీ పోలీసు స్టేషన్ అధికారి కుమార్ సేత్ తెలిపారు. గ్రూప్ అడ్మిన్‌ను షాహబుద్ధీన్గా గుర్తించారు. పోస్టు చేసిన వ్యక్తిని ముస్లిం అన్సారీగా గుర్తించారు. అయితే.. సీఎం యోగికి కించపరుస్తూ పోస్టు చేసిన వ్యవహారంపై ఫిర్యాదులు అందిన తర్వాత చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ పేరు 'నగర పాలిక పరిషత్ బదోనీ'గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బదోనీకి సంబంధించిన నగరపాలిక కార్పోరేటర్లు, స్థానికులు ఆ గ్రూప్‌లో ఉన్నారని వెల్లడించారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్యేశంతోనే ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇది కార్పోరేటర్లకు సంబంధించిన అధికారిక గ్రూప్ కాదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
నిందితులను పట్టుకున్నారు.. చివరికి కక్కుర్తి పడి పోలీసులే అరెస్టయ్యారు!
కొచ్చి: లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన కేరళలోని కొచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తిని కొందరు నిందితులు మోసం చేశారు. దీంతో కర్ణాటకలో ఈ ఘటనపై చీటింగ్ కేసు నమోదు కాగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న నలుగురు పోలీసులు కేరళకు చేరుకున్నారు. నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే అంతటితో ఆగకుండా నిందితులను విడిచిపెట్టడానికి వాళ్లు కొంత డబ్బును డిమాండ్ చేశారు. దీంతో నిందితుల్లో ఒకడు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కర్ణాటక పోలీసులను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనం నుంచి రూ. 3.95 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నలుగురు పోలీసులపై దోపిడీ ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారిలో ఒకరు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయాన్ని పరిశీలించడానికి కర్ణాటక పోలీసు నుంచి సీనియర్ అధికారి కొచ్చికి చేరుకున్నారు. చదవండి: అంజూ ఘటన: ఆ కుటుంబానికి ఉపాధే కరువైంది! -
కారు బోనెట్ మీద మహిళ... అలాగే తీసుకెళ్లిన పోలీసులు..
భోపాల్: మధ్యప్రదేశ్ లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడన్న నెపంతో అరెస్టైన యువకుడిని విడిచి పెట్టమంటూ ఓ తల్లి పోలీసు కారు బోనెట్ ఎక్కి కూర్చుంది. దీంతో పోలీసులు ఆమెను అలా బోనెట్ పైన కూర్చుండగానే అమానుషంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లారు. స్థానికుల్లో ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్, నర్సింగ్ పూర్లో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో అనిల్ అజ్మేరియా, సంజయ్ సూర్యవంశీ అనే ఇద్దరు ఎస్సైలు నీరజ్ డెహరియా అనే కానిస్టేబుల్ తో కలిసి అక్కడి వెళ్లారు. అక్కడ సోను కహార్ అనే యువకుడి ఇంటిని సోదా చేయగా రూ. 3 లక్షలు విలువ చేసే 20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. సోను కహర్ ను పోలీసు కస్టడీకి తరలించే క్రమంలో కారు ఎక్కించగానే అతడి తల్లి మోహిని కహార్ వచ్చి వారికి అడ్డుపడింది. తన బిడ్డను విడిచిపెట్టమని పోలీసుల కాళ్ళమీద పడి ప్రాధేయపడింది. అయినా కూడా వారు కనికరించకపోవడంతో పోలీసు వాహనం బోనెట్ ఎక్కి కూర్చుని బ్రతిమాలింది. అంతలో చుట్టూ జనం గుమికూడటంతో కారుని అలాగే పోలీసు స్టేషన్ కు పోనిచ్చారు పోలీసులు. అక్కడున్న వారిలో ఎవరో ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. వెంటనే ఆ ఇద్దరు ఎస్సైలను, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. #MadhyaPradesh के #Narsinghpur जिले से रोंगटे खड़े करने वाला वीडियो सामने आया है.वायरल वीडियो में एक प्राइवेट नम्बर की चलती कार में लटकी महिला को थाने में ले जाते देखा जा सकता है.तीन पुलिस वाले सस्पेंड कर दिए गए है.@abplive @drnarottammisra @DGP_MP @brajeshabpnews pic.twitter.com/ltVroZuigX — AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) July 5, 2023 -
డ్రైన్లు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: గుజరాత్ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న బిపర్ జోయ్ తుఫాను ప్రభావం బెంగళూరు నగరం మీద కూడా పడింది. మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం నీటమునిగింది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. స్వయంగా ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగి డ్రైనేజీ అడ్డులను తొలగించి వర్షపు నీటిని మళ్లించి ట్రాఫక్ క్లియర్ చేశారు. వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బెంగళూరు సౌత్ డీసీపీ సుజీతా సల్మాన్. భారీ వర్షం కారణంగా ఏకోస్పెస్, బెల్లందూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కోన్ లను ఉపయోగించి నీటిని తొలగించారు. డ్రైనేజీల్లో అడ్డుపడిన చెత్తను స్వహస్తాలతో తీసి వర్షపు నీటిని మళ్లించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయగలిగారు. ఇదే విషయాన్ని బెంగళూరు సౌత్ డీసీపీ తన ట్విట్టర్లో రాస్తూ.. నిలిచిపోయిన నీటిని ట్రాఫిక్ పోలీసుల సాయంతో తొలగించడమైందన్నారు. ట్వీట్ తోపాటు వీడియోని కూడా జత చేశారు డీసీపీ. water logging cleared with the help of our staff. @CPBlr @jointcptraffic @blrcitytraffic @BlrCityPolice https://t.co/CUXvU8EG9e pic.twitter.com/fMmo3dsV92 — Sujeetha Salman , IPS (@DCPSouthTrBCP) June 12, 2023 -
మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయొద్దని కోర్టులు ఆదేశించినా.. ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ బుధవారం తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిని పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారని ఏ క్షణంలోనైన అరెస్టు చేసే అవకాశం ఉందని ట్వీట్టర్లో పేర్కొన్నారు. బహుశా ఇదే నా చివరి ట్వీట్ కాబోలు ఆ తదనంతరం తాను అరెస్టు అవుతానేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధానిని గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుతో పాక్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఆ తదనంతరం నాటకీయ పరిణామాల మధ్యలో సుప్రీం కోర్టు జోక్యంతో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా అదే కోర్టు బయట అల్‌ఖాదీర్ ట్రస్ట్ కేసు విషయమై ఇమ్రాన్ ఖాన్‌ను మిలటరీ బలగాలు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో ఉత్కంఠకు తెరలేపింది. మళ్లీ తదనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు ఆ కేసులో రెండు వారాల బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. ఈ వరుస అరెస్టు మరువక మునుపై మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం కావడం గమనార్హం. (చదవండి: పాక్‌లో అరెస్టు భయం..పరుగులు తీస్తున్న మాజీ మంత్రి) -
భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..
ఓ వ్యక్తి తన భార్య కోసం తన కన్న కొడుకునే చంపేందుకు యత్నించాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ షాకింగ్ గటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు ప్రతీక్ ఉన్నాడు. ఐతే అతని మూడోవ భార్య ఈ చిన్నారి విషయమై అతనిపై కోపంతో పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. తనకు ఈ చిన్నారి అంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడమే గాక అతన్ని కడతేర్చడం లేదా ఎక్కడికైన పంపిస్తేనే తాను తిరిగి వస్తానని చెప్పాంది. దీంతో విసిపోయిన శశిపాల్ ఈ చిన్నారి లేకపోతేనే తన జీవితం హాయిగా ఉంటుందని భావించి..సదరు చిన్నారిని చంపేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ప్రతీక్ తన తాతయ్య, నానమ్మలతో పడుకునేవాడు. ఐతే తన తండ్రి కూలర్ వద్ద పడుకుందామని చెప్పడంతో.. నాన్నతో హాయిగా కూలర్ దగ్గర పడుకోవచ్చిని ఎంతో ఎగ్జాయిట్‌మెంట్‌తో వెళ్లాడు. అయితే ఆ కర్కశ తండ్రి ఆ చిన్నారి నిద్రపోయిన తర్వాత టీవీ వాల్యూమ్ బాగా పెంచి..ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా తన మూడో భార్యకు తెలిపేలా వీడియో తీసి మరీ పంపించాడు. ఐతే ఆమె అతడి వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేయడంతో ఆమె ఆ వీడియోని చూడలేకపోయింది. ఆ తర్వాత శశిపాల్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శశిపాల్ని అతని మూడో భార్య పాయల్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శశిపాల్ మొబైల్లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో లభించిందని పోలీసుల తెలిపారు. కానీ అతడి భార్య పాయల్ మాత్రం ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తానెప్పుడూ తన కుమారుడిని చంపమని తన భర్తకు చెప్పలేదని వాపోయింది. శశిపాల తల్లిదండ్రులు తన తండ్రితో పడుకోవడానికి ఎంతో ఆనందంగా ప్రతీక్ వెళ్లాడని, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి) -
పిలిస్తే రాలేదని రెచ్చిపోయిన పోలీసు.. టెర్రరిస్టుగా మారుస్తానంటూ...
ఓ పోలీసు సహనం కోల్పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ప్రజల పట్ల పోలీసులు ఇలా ప్రవర్తిస్తారా? అని ముక్కుమీద వేలేసుకునేలా బెదిరింపులకు దిగాడు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. బిహార్ పోలీసు ఒక టీచర్ పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించాడు. ఒక ఉపాధ్యాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రాజధాని పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమయి పోలీస్టేషన్‌కు వచ్చారు. అయితే ఆ టీచర్ పోలీసు పిలిపించిన సమయాని కంటే మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడు. దీంతో విసిగిపోయిన సదరు పోలీసు దురుసుగా ప్రవర్తించాడు. పోలీసు రాజేష్ శరణ్ కూర్చొన్న సీటులోంచి లేచి కోపంతో ..ప్రజలను తీవ్రవాదులుగా ప్రకటించడమే మా పని.. ఒక్కసెకనులో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తా! అని బెదరింపులకు దిగాడు. కానీ ఉపాధ్యాయుడు అందుకు గల కారణాన్ని వివరించేందుకు యత్నించినా వినకుండా ఇలా అధికార మదంతో చెలరేగిపోయాడు. ఆ సమయంలో చుట్టు పక్కల ఉన్న ప్రజలెవరూ జోక్యం చేసుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో జమయి పోలీస్టేషన్ ఈ ఘటనపై సత్వరమే విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా) -
మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
సాక్షి, తిరువనంతపురం: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కేరళలోని తిరువిల్వమలలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎనిమిదేళ్ల అదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా చిన్నారి ముఖంపైనే పేలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ చిన్నారి స్థానిక స్కూల్లో మూడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్ ఫోన్ పేలుడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఐఏఎస్ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్ సీఎంపై విమర్శలు) -
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ నయం చేస్తానంటూ రూ.15 లక్షలు టోకరా!
ఆదునిక టెక్నాలజీతో కూడిన వైద్యం వచ్చాక ఆయుర్వేదం వైద్యం వైపుకి జనం వెళ్లటం చాలా వరకు తగ్గిపోయారు. ఐతే ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు దుండగలు అమాయక ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..థానే రైల్వే సిబ్బంది ఒక ఆయుర్వేద సెంటర్‌పై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆయుర్వేద వైద్యంతో తగ్గిస్తానంటూ ఇద్దరు వ్యక్తులు సుమారు రూ. 15 లక్షలు తీసుకున్నారని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు రైల్వే పెయింటర్. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తన భార్యకు ఆ ఆయుర్వేద సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. అయితే తన భార్య పరిస్థితిలో మార్పురాలేదని వాపోయాడు. దీంతో ఆ ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులు ముఖం చాటేస్తూ..తప్పించుకుని తిరుగుతన్నారని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు సదరు ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని, ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!) -
గర్లఫ్రెండ్‌ని టైంకి డ్రాప్ చేయాలన్న ఇంటెన్షన్ పోలీసులకు పట్టించి..చివరికి..
గర్లఫ్రెండ్ కోసం అరెస్టు అయ్యాడో ఓ వ్యక్తి. చివరికి అదే అతడి బండారం మొత్తం బయట పెట్టించి.. జైలు పాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన జెవోన్ పియర్ జాక్సన్ అనే వ్యక్తి తన స్నేహితురాలికి ఇంటర్యూ ఉండటంతో తానే డ్రాప్ చేయాలని అనుకున్నాడు. ఆమెను కరెక్ట్ టైంకి తీసుకెళ్లి సాయం చేయాలనకున్నాడు జాక్సన్. ఐతే అప్పటికే అతని కారు వెనుక సీటులో తన ముగ్గురు పిల్లలు ఉన్నా..ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. ఐతే అతను తన గర్లఫ్రెండ్‌కి సాయం చేసి ఇంప్రెస్ చేయాలన్న ఆతృతలో వేగంగా కారుని నడిపాడు. ఈ క్రమంలో రద్దీగా ఉండే ఫాల్స్ చర్చ్రోడ్ వద్ద స్పీడ్‌గా కారుని పోనిచ్చాడు. బ్లాక్ మెర్సిడేజ్ కారులో వేగంగ వెళ్లిపోతున్న జాక్సన్ పోలీసుల వాహనాన్ని సైతం పట్టించుకోకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై జాక్సన్ కారుని అడ్డుకున్నారు. అతను రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక తెల్లటి పికప్ కారుని ఢీ కొట్టయేబోతుండగా..త్రుటిలో ప్రమాదం తప్పినట్టు సమాచారం దీంతో పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని.. విచారించడం ప్రారంభించారు. అతడు గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. అదీగాక కారులో పిల్లలు ఉన్నా కూడా ఇంత ప్రమాదకరమైన వేగంతో నడిపినందుకుగానూ జాక్సన్‌పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి 22 ఏళ్ల జాక్సన్‌ని బ్రెవార్డు కౌంటి జైలుకి తరలించారు. అతను ఈ కేసు విషయమై ఏప్రిల్ 18న కోర్టు ఎదుట హాజరుకావల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! పగవాడికూడా వద్దంటూ విలపిస్తున్న మహిళ) -
నన్ను చంపేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం: పాక్ మాజీ ప్రధాని
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని పోలీసులు మంగళవారం అరెస్టు చేసేందుకు యత్నించగా, అతని మద్దతుదారులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులపై ఇమ్రాన్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు తన నివాసం వద్ద అరెస్టు చేయాలనే ప్లాన్ వెనుక ఉన్న ముఖ్యోద్దేశం తనను అపహరించి, చంపయేడమేనని ఆరోపించారు. అంతేగాక తన మద్దతుదారులను అడ్డుకునేలా బలగాలను సైతం రంగంలోకి దింపారని మండిపడ్డారు. అందుకు సంబంధించిన కాల్పుల దృశ్యాలను ఖాన్ ట్వీట్ చేశారు. ఇవి పోలీసుల దుర్మార్గపు ఆలోచనను బయటపెడుతున్నాయని ఆయన అన్నారు. అరెస్టు చేయడం అనేది ఒక నాటకీయంగా జరుగుతుందని. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘మద్దతుదారులను కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్‌తో సహా కాల్పులకు దిగారు పోలీసులు, నేను మంగళవారం బెయిల్‌పై వచ్చేందుకు పూచీకత్తుపై సంతకం చేశాను. దీన్నీ స్వీకరించడానికి డీఐజీ నిరాకరించారు. దీనిని బట్టే వారి అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోంది. అదీగాక మద్దతుదారులను ఎదుర్కోవడానికి పారామిలటరీ సిబ్బందిని దింపడంపై ఆంతర్యం ఏంటి’ అని మండిపడ్డారు. ఘర్షణలు తలెత్తకుండా తటస్థ వైఖరినే అవలంభిస్తాం అని చెబుతుండే పాలకులు ఇప్పడూ చేస్తోంది ఏంటి అని నిలదీశారు. ఇప్పటికే అక్రమ వారెంట్‌కి సంబంధించిన కేసును కోర్టులో ఎదుర్కొంటున్నప్పుడూ ఇప్పుడూ ఇలాంటి డ్రామాలకు తెరతీయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, అవినీతి ఆరోపణలు, తోషాఖాన్ కేసులో ఇమ్రాన్ ఖాన్ని అరెస్టు చేసేందుకు గత కొన్నిరోజులుగా ప్రత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఆయన ఇంటి వద్ద గత రెండు వారాలుగా హైడ్రామా కొనసాగింది. Clearly "arrest" claim was mere drama because real intent is to abduct & assassinate. From tear gas & water cannons, they have now resorted to live firing. I signed a surety bond last evening, but the DIG refused to even entertain it. There is no doubt of their mala fide intent. pic.twitter.com/5LZtZE8Ies — Imran Khan (@ImranKhanPTI) March 15, 2023 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం.. రాళ్లు రువ్వి అడ్డుకుంటున్న మద్దతుదారులు) -
మూడేళ్లుగా రిలేషన్షిప్..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి..
ముంబైలో 37 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. గత రెండు రోజులుగా వస్తున్న దుర్గంధాన్ని భరించలేక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ముంబైలోని సీతాసదన్ సోసైటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...27 ఏళ్ల హర్దిక్ షా, మేఘా ధన్సింగ్ తోర్వి అనే మహిళతో మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. గత ఆరు నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే సీతాసదన్ సోసైటీలో కొత్త ఇంటికి మారారు. ఐతే మేఘ నర్సుగా పనిచేస్తోంది. కాగా, హార్దిక్ నిరుద్యోగి. ఇంటి ఖర్చులను భరించేది మేఘానే. దీంతో ఈ విషయమై తరుచు గొడవపడేవారు. ఒక రోజు ఆ గొడవ కాస్త తీవ్రస్థాయికి చేరుకోవడంతో క్షణికావేశంలో హర్ధిక్ మేఘాను చంపి పరుపులో కుక్కి ఉంచాడు. ఆ తర్వాత హర్దిక ఖర్చులకు డబ్బుల కోసం ఇంట్లోని వస్తువును అమ్మేసి పరారయ్యేందుకు ప్లాన్ వేశాడు. అయితే గత రెండు రోజులుగా విపరీతమైన దుర్గంధం రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా మేఘా విగత జీవిగా ఉండటాన్ని గమనించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ జంట ఇటీవలే అద్దెకు వచ్చాని, తరుచు గొడపడుతుంటారని అపార్టెమెంట్ వాసులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయడం ప్రారంభించి..హార్దిక్ ఫోన్‌ని ట్రేస్ చేయడం ప్రారంభించారు పోలీసులు. అతను ఇంట్లోని వస్తువులను అమ్మేసి రైలులో పారిపోతున్నట్లు తెలియడంతో అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు హార్ధిక్‌ని మధ్యప్రదేశ్ నాగ్డాలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం) -
దొంగకు ఖాకీ మద్దతు.. తొమ్మిది నెలలుగా కేసు చేధించకుండా..
సాక్షి, పుట్టపర్తి: ‘నా ఇంట్లో చోరీ జరిగి 9 నెలల వుతోంది. 20 తులాల బంగారాన్ని అపహరించుకెళ్లారు. ఈ సొత్తు రికవరీలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న హోంగార్డు నాగరాజు నాయక్.. పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు స్టేషన్‌కెళ్లి సీఐను కలిసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా నన్నే దుర్భాషలాడుతూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎదుట హోంగార్డు లక్ష్మణ నాయక్ వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీని కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. పుట్టపర్తిలోని శిల్పారామం సమీపంలో నివాసముంటున్న లక్ష్మణ నాయక్ ఇంట్లో 2022, జూన్ 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ.11 వేలను అపహరించుకెళ్లారు. గోకులం ప్రాంతానికి చెందిన కాటమయ్య, హోంగార్డు నాగరాజు నాయక్‌ను అనుమానితులగా పేర్కొంటూ అప్పట్లో పుట్టపర్తి అర్బన్ పోలీసులకు లక్ష్మణ నాయక్ ఫిర్యాదు చేశాడు. నాగరాజు నాయక్‌పై గతంలోనూ చోరీ కేసులున్నాయని అందులో గుర్తు చేశాడు. బైక్ చోరీ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి వచ్చిన నాగరాజు నాయక్‌ను పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చేరదీసి డ్రైవర్‌గా పెట్టుకున్నారని వివరించాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో అంతులేని నిరక్ష్యం కనబరుస్తున్నారని బాధితుడు వాపోయాడు. చోరీ సొత్తు రికవరీ చేసివ్వాలంటూ స్టేషన్‌కెళ్లి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయాడు. పైగా ‘ఎమ్మెల్యేతో ఫోన్‌చేయిస్తే బంగారాన్ని రికవరీ చేయాలా? నా దగ్గర పనిచేసే డ్రైవర్ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకోసారి స్టేషన్‌కు వస్తే బాగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరాడు. 63 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. తొలుత ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించి, పరిశీలించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ చేరుకుని అర్జీదారులతో మాట్లాడి సమస్య తీవ్రతపై ఆరా తీశారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. (చదవండి: కనుమరుగవుతున్న కష్టజీవి..) -
రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందంటూ వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో వాటిని తొలగించేందకు పోలీసులు, జిల్లా అధికారులు వచ్చారు. ఐతే వారు ఆక్రమణలు తొలగించి పనిపూర్తి చేసుకుని వెళ్లిపోతుండగా.. ఒక గుంపు దాడికి తెగబడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని జితార్ ఖేడి గ్రామంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని తొలగించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంజయ్ సాహు నేతృత్వంలోని పోలీసులు బృందం గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించి వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి పోలీసులుపై రాళ్లు రువ్వి.. దాడికి తెగబడ్డారు. ఆ గుంపులో మహిళలు, పిల్లలు తోసహా అధికారులపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బుల్డోజర్లు, కార్లు ధ్వసం అయ్యాయి. ఈ దాడి నుంచి మేజిస్ట్రేట్ సాహును రక్షించేందుకు మరో పోలీసుల వాహనంలో తరలించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమీపంలోని జితార్ ఖేడీ గ్రామంలోని అర బిఘా (6,000 చదరపు అడుగులు) ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సాహు పేర్కొన్నారు. ఇంతకుమునుపు గతంలో ఈ భూమిలో అన్ని వర్గాల వారు కార్యక్రమాలు నిర్వహించేవారని, ఐతే ఆక్రమణలకు గురికావడంతో అన్నీ ఆగిపోయాయని గ్రామస్తులు చెబుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు సాహు నేతృత్వంలోని పోలీసుల బృందం ఆక్రమణలు తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆక్రమణలు తొలగించి పని పూర్తి చేసి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని పోలీసుల చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది తోసహా బుల్డోజర్ డ్రైవర్ కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టాన్ని ఉల్లంఘి ఈ ఘటనకు పాల్పడిన వారందరికీ శిక్ష పడుతుందని అదనపు మెజిస్ట్రేట్ సంతోష్ ఠాగూర్ తెలిపారు. (చదవండి: ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం) -
శ్రద్ధా హత్య కేసు..చార్జిషీట్లో షాకింగ్ ట్విస్ట్
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసులో ఆరు వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చార్జిషీట్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సుమారు 6,629 పేజీల చార్జీషీట్లో శ్రద్ధా తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లిందన్న కోపంలోనే అఫ్తాబ్ ఈ దారుమైన ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అప్తాబ్‌కి శ్రద్ధా తన స్నేహితుడిని కలవడం నచ్చలేదని, పైగా ఆ విషయమై తీవ్ర ఆందోళన చెందినట్లు నివేదికలో తెలిపారు. దీంతోనే ఆమెను అంత క్రూరంగా చంపేశాడని చార్టిషీట్లో పేర్కొనట్లు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మీను చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ తన భాగస్వామి శ్రద్ధావాకర్ని హత్య చేసి, 36 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఆ తదనంతరం శ్రద్ధా కనపడకపోవడం, ఆ విషయాన్ని స్నేహితులు శ్రద్ధా తండ్రికి చెప్పడంతో.. ఆయన ఫిర్యాదు మేరకు అఫ్తాబ్‌ని అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్) -
కాలిఫోర్నియా కాల్పుల ఘటన: పట్టుబడతానన్న భయంతో నిందితుడు..
California Shooting: కాలిఫోర్నియాలోని లాస్ఏంజేల్స్లో చైనీస్ లూనార్ న్యూయర్ వేడుకల్లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కాల్పులకు తెగబడింది 72 ఏళ్ల వృద్ధుడా! అని ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ ఘటన జరిగిన రోజు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. అదీగాక ఒక దుండగుడు మారిటెక్ పార్క్‌లోని డ్యాన్స్ క్లబ్లో మెషిన్ గన్‌తో కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షుల చెప్పడంతో ఆ పోలీసుల ఆ దిశగా నగరమంతా జల్లెడ పట్టారు. అందులో భాగంగా ఒక అనుమానిత వ్యాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అంతే నిందితుడు పట్టుబడిపోతానన్న భయంతో తనను తాను గన్‌తో పేల్చుకుని చనిపోయాడు. ఆ నిందితుడిని 72 ఏళ్ల కెన్ట్రాన్గా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మాట్లాడుతూ..అతడు ఆ రోజు రాత్రి 10 గంటలకు మారిటెక్ పార్క్‌లో ఉన్న డ్యాన్స్ కబ్‌లో కాల్పులకు పాల్పడిన తర్వాత మళ్లీ రెండోసారి కాల్పులకు తెగబడుతుండగా కొంతమంది అతడిని గన్ని లాక్కున్నట్లు సమాచారం. ఆ తర్వాత అతన్ని అక్కడ నుంచి వ్యాన్‌లో పరారయ్యాడు. ఐతే అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ని గమనించి ట్రేస్ చేసే ప్రయత్నంలో భాగం చుట్టుమట్టారు. ఒక పోలీస్ అతని వ్యాన్‌ను సమీపిస్తుండగా పెద్దగా గన్ పేలిన శబ్దం వినిపించింది. పోలీసులు వెంటనే వచ్చే వ్యాన్ వద్దకు చూసేటప్పటికే నిందితుడు చనిపోయాడు. బహుశా నిందితుడు పట్టుబడతానన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నటట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇతర అనుమానితులెవరూ కూడా పరారీలో లేరు. అతను ఈ దాడులకు ఆటోమేటిక్ అసాల్ట్ పిస్టల్ని ఉపయోగించినట్లు వెల్లడించారు. ఐతే నిందితుడు ఈ సాముహిక కాల్పులకు తెగబడటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి?, లేదా ఏదైనా మానసిక సమస్య ఉందా అనేది తెలియాల్సి ఉందన్నారు షెరీఫ్. కాగా, ఈ కాల్పుల ఘటనలో సుమారు 10 మంది దాక అక్కడికక్కడే మరణించగా, పలువురి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సాముహిక కాల్పుల బాధితు గౌరవార్థం అని పబ్లిక్ భవనాల వద్ద జెండాలను అవనతం చేయాలని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. (చదవండి: కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి) -
బాహాటంగా పోలీసు అధికారులపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బహిరంగా ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందరీ ఖాతాలను లెక్కిస్తా! అంటూ బెందిరింపులకు దిగారు. అంతేగాదు తాను ఎవ్వరిని వదిలిపెట్టను అని కూడా చెప్పారు. అందువల్ల ఎవ్వరూ కూడా తమ దూకుడుకి భయాందోళనలకు గురికావద్దని చెప్పాలనుకుంటున్నా అన్నారు. ఈ విషయాలను ముఖ్యంగా పోలీసు అధికారులందరూ చెవులు రిక్కరించి వినాలనే చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాజీ సీఎం కమల్‌నాథ్ తన అప్రజాస్వామిక ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ని మరోసారి చూపించుకున్నారంటూ విమర్శించారు. ఆయన ఇలా అధికారులను బెదిరింపులకు గురిచేయడం తొలిసారి కాదని, 2021లో కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. పూనావల్లా కాంగ్రెస్‌కి గట్టి కౌంటరిచ్చేలా.. ఆ పార్టీ ఎప్పుడూ ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను, బెదిరింపులు, ప్రతికార రాజకీయాలను విశ్వసిస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో లేనప్పుడే.. పోలీసు అధికారులను, పరిపాలను బాహటం బెదిరింపులకు గురిచేస్తే..ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయినా ప్రేమతో ఓటర్లను ఆకర్షించాలి గానీ బెదిరింపులతో కాదని కమల్‌నాథ్‌కి సూచించారు. అంతేగాదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రకటనలకు మద్ధతిస్తుందా? లేదా ఖండిస్తుందా? అనే విషయం గురించి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. (చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. అందుకే ఆమె నోరుమెదపరు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..) -
షాకింగ్ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...
బిహార్‌లో వృద్ధుడిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢీ కొట్టడంతో ఆ వృద్ధుడు కారు ముందు భాగం బానెట్‌పై పడిపయాడు. అయినా ఆపకుండా ర్యాష్‌గా వెళ్లిపోయాడు కారు డ్రైవర్. ఆ తర్వాత సడెన్ బ్రేక్‌లు వేసి ఆ వృద్ధుడిని కింద పడేసి..అతడిపై నుంచే వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని చంపారన్ జిల్లాలోని జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బాంగ్రా గ్రామానికి చెందిన శంకర్ చౌధర్ అనే 70 ఏళ్ల వ్యక్తి సైకిల్‌పై వస్తున్నాడు. బాంగ్రా చౌక్ సమీపంలోని ఎన్‌హెచ్27 రహదారిని దాటుతుండగా గోపల్‌గంజ్ పట్టణం నుంచి వేగంగా వస్తున్న కారు అతడిని ఢీ కొట్టింది. ఈ అనుహ్య ఘటనకు ఆ వృద్ధుడు ఆ కారు బానెట్‌పై పడిపోయాడు. ఐతే ఆ కారు డ్రైవర్ మాత్రం కారు ఆపకుండా నిర్లక్ష్యంగా పోనిచ్చాడు. అలా ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ వృద్ధుడిని ఈడ్చుకెళ్లి..సడెన్ బ్రేక్‌లు వేసి కింద పడిపోయేలా చేశాడు. దీంతో ఆ వృద్ధుడు ఒక్కసారిగా కారు కింద పడిపోయాడు. ఆ డ్రైవర్ కాస్త కూడా వృద్ధుడని కనికరం చూపకుండా.. కారుని అతని పై నుంచి తీసుకెళ్లిపోయాడు. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల స్థానికులు గమనించి ఆ కారుని ఆపమని అరవడమే కాకుండా కొంతమంది ఆ కారుని వెంబడించారు. కానీ ఆ డ్రైవర్ ఆ స్థానికులను చూసి మరింత స్పీడ్‌గా కారుని పోనిచ్చినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వాళ్లు ఎన్‌హెచ్27 రహదారి సమీపంలోని పోలీస్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో ఆ కారుని పిప్రకోఠి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐతే ఆ కారు డ్రైవర్‌తో సహా కారులో ఉన్నవారందరూ పరరయ్యినట్లు పేర్కొన్నారు. ఆ కారు యజమానిని ట్రేస్ చేసి ఈ ఘటన గురించి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఢిల్లీలోని 20 ఏళ్ల యువతి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన తర్వాత దేశంలో ఇదేతరహాలో వరుస ఘటనలు చోటుచేసుకోవం బాధాకరం. (చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు) -
వృద్ధుడని కనికరం లేకుండా రెచ్చిపోయిన మహిళా పోలీసులు
వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్ కిషోర్ పాండే అనే వృద్ధ టీచర్ కైమూర్ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. పోని ఆ సైకిల్ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. (చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది) -
అంకుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కిడ్నాప్ చేశా! నివ్వెరపోయిన పోలీసులు
ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్‌పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కి గురయ్యింది. దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్‌గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..
టెస్లా కారులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన కుటుంబం కాలిఫోర్నియాలోని పెద్ద కొండపై నుంచి పడిపోయింది. ఐతే ఈ ఘటనలో ఆ కుటుంబ సభ్యులంతా ప్రాణాలతో బతికి బట్టగట్టగలిగారు. ఈ ప్రమాదం శాన్ మాటియో కౌంటీలోని డెవిల్స్ స్లైడ్ వద్ద జరిగింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని నిర్థారించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ..హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకున్న కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ సిబ్బంది హెలికాప్టర్లతో అద్భుతంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టి బాధితులను రక్షించింది. ఐతే ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన హత్యా యత్నంగా అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు కుటుంబ యజమాని 41 ఏళ్ల ధర్మేష్ ఏ పటేల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయనున్నట్లు కాలిఫోర్నియా పోలీసులు పేర్కొన్నారు. అదీగాక కారు కొండపై నుంచి ఇంత నిటారుగా పడిపోతే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అన్నారు. చాలా అరుదైన సమయాల్లోనే ఇలా జరుగుతుందని అన్నారు. ఈ ప్రమాదంలో 4 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడికి చాలా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బాధితులు దాదాపు 250 నుంచి 300 అడుగులు కొండ దిగువున పడిపోయినట్లు పేర్కొన్నారు. బహుశా కారు సీట్లు పిల్లలను కాపాడి ఉండవచ్చని భావించారు. సదరు వ్యక్తి పటేల్ తన భార్య పిల్లలను చంపేందుకు ఇలా హత్యయత్నానికి ఒడిగట్టాడేమో అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. అతను కోలుకున్న తర్వాత శాన్ మాటియో కౌంటీ జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ) -
ఆ టైంలో బయట ఉన్నందుకు...దంపతులకు రూ. 3000లు జరిమానా!
ఒక జంట అర్ధరాత్రి బయట ఉన్నందుకు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో బయటకు రావడం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ మూడు వేలు జరిమానా విధించారు పోలీసులు. కట్టేంత వరకు వారిని రకరకాలుగా వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు బాధితుడు సహాయం కోసం కమిషనర్ ఆఫ్ పోలీసును ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెంగళూరులో ఒక జంట తమ స్నేహితుడు బర్త్‌డే కేక్ కటింగ్ ఈవెంట్‌కి హజరై తిరిగి ఇంటికి పయనమయఆయరు. ఆ క్రమంలోనే ఆ జంట తమ ఇంటికీ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి సమీపంలో ఒక పెట్రోలింగ్ వ్యాన్ ఆగింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించమని ఆ జంటను డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ జంట అవాక్కయ్యింది. సాధారణ రోజుల్లోనే కదా మేము బయటకు వచ్చింది, ఎందకని తమను ఇలా ఐడీ కార్డులు చూపించమని నిలదీస్తున్నారో వారికి ఒక్కసారిగా అర్థం కాదు. ఆ తర్వాత ఆ దంపతలు తమ ఐడీ కార్డులను పోలీసులకు చూపించారు. ఆ తదనంతరం పోలీసులు ఆ జంట వద్ద నుంచి ఫోన్లు లాక్కుని వ్యక్తిగత వివరాలను విచారించడం ప్రారంభించారు. అర్థరాత్రి సమయం కావడంతో వారు కూడా ఓపికగా సమాధానాలు చెప్పారు. ఇంతలో వారిలో ఒక పోలీసు ఆ జంట పేర్లను, ఆధార్ నెంబర్లను నమోదు చేయడం చూసి...మాకు ఎందుకు చలానా జారీ చేస్తున్నారని ప్రశ్నించాం. అందుకు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి నియమం లేదని తెలిసినా...ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో దీని గురించి తమకు తెలియదని మర్యాదపూర్వకంగా చెప్పడమే గాక క్షమాపణలు కూడా చెప్పింది ఆ జంట. అయినా పోలీసులు వారిని వదలకుండా వేధింపులకు గురి చేశారు. పైగా రూ. 3000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ జంట ఎంతగా ప్రాథేయపడిన వినకపోగా అరెస్టులు చేస్తామని బెదిరించారు పోలీసులు. కాసేపటికి పోలీసుల్లో ఒకరూ ఆ జరిమానాలో కనీసం మొత్తం చెల్లించేస్తే వదిలిపెట్టేస్తారని చెప్పారు. ఆ తర్వాత తాను పేటీఎం ద్వారా చెల్లించేంత వరకు పోలీసులు తమను వదలలేదని బాధితుడు కార్తీక్ పత్రి అన్నారు. ఆఖరికి నా భార్య కన్నీరు పెడుతున్న దయాదాక్షిణ్యం చూపకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించారని వాపోయాడు కార్తీక్. ఈ వియషయాంలో తనకు సాయం చేయాల్సిందిగా బాధితుడు కార్తీక్ బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వివరించాడు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ అనూప్ శెట్టి స్పందించి...ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందకు కార్తీక్‌కి ధన్యావాదాలు. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి) -
థ్రిల్లర్ సినిమాను తలపించే కథ...పాపం కొడుకు కోసం ఆ తల్లే..
ఎన్నో క్రైం స్టోరీలను విని ఉంటాం. ఆ కేసుల్లో చాలామటుకు హత్య చేయడం.. తప్పించుకునేందుకు రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎక్కడో ఒక చోట దొరికపోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. దీంతో తల్లే కొడుకును కాపాడేందుకు రంగంలో దిగి రక్షించుకునే తాపత్రయాన్ని.. చూస్తే సినిమానే తలిపించే కథలా ఉంటుంది ఈ క్రైం స్టోరీ. వివరాల్లోకెళ్తే...యూపీలోని అలీఘర్‌లో 2015లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి గోండా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఒక బాలిక అనుమానస్పద మృతి వార్తను చూసి సదరు అమ్మాయి తండ్రి ఆ బాలిక తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్య నేరం కింద కేసు నమోదు జైలుకి పంపారు అధికారులు. ఐతే నిందితుడు విష్ణు తల్లి ఈ ఆరోపణలు అవాస్తవం అని నిరూపించి తన కొడుకును ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలనకుంది. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసును చేధించేందుకు పూనుకుంది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏ అమ్మాయి ఐతే కిడ్నాప్ అయ్యి హత్యకు గురయ్యిందన్నారో ఆ అమ్మాయి బతికే ఉందని ఈ తల్లి గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో పోలీసులు సదరు బాధితురాలిని హత్రాస్‌లో ట్రాక్ చేసి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపర్చి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐతే ఈ కేసులో మరింత ముందకు వెళ్లాడానికి ఆమెకు డీఎన్ఏ టెస్ట్‌లు కూడా నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారి సింగ్ చెప్పారు. ఆ తదనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐతే ఆ ఘటనలో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు. దాదాపు ఏడేళ్ల తర్వాత గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ మేరకు విష్ణు తల్లి తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో ఇరుకిస్తున్నారని తెలిసి.. తానే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించేందకు తాను ఈ బాధ్యత తీసుకున్నాని చెప్పింది. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...
భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆమె భర్త. ఈ ఘటన రాజస్తాన్ ధోలపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకాం....ఈ జంట ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకుసుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే జైపూర్‌లో ఉంటున్న భర్త కుటుంబసభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబసభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందకు ఒప్పుకోవడం లేదన్న కోపందో ఆమె భర్త కోపంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానన్న భయంతో బెంచ్ మీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను రాసింది. ఆ తర్వాత ఆమె ఒక జీఆర్పీ జవాన్ సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...) -
పోలీసుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న కోట్ల డబ్బు...టెన్షన్లో అధికారులు
ఒక పోలీస్ అకౌంట్లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు. దీంతో అతని అకౌంట్‌ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్‌లానే పాక్‌లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. (చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్) -
హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు
లక్నో: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ నేరుగా హైకోర్టు జడ్జితో మీ ఇల్లు ఎక్కడా, ఎక్కడికి రావాలి అని ప్రశ్నించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గత ఆదివారం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్ సింగ్ జిల్లాకు వచ్చినప్పుడూ ఈ ముగ్గురు పోలీసులకు ఎస్కార్ట్ డ్యూటీ పడింది. దీంతో ఆ ముగ్గురు పోలీసులు న్యాయమూర్తితో ఫోన్లో ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడకు రావాలి అని నేరుగా ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యి పోలీస్ సూపరింటెండ్‌కి పిర్యాదు చేశారు. అంతే అధికారులు అదేరోజు ఆ ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఐతే ఈ విషయామై నేరుగా న్యాయమూర్తిని సంప్రదించకూడదని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ప్రోటోకాల్‌ని పర్యవేక్షిస్తున్నావారి వద్ద నుంచి సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. ఐతే వారు న్యాయమూర్తి ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారనేది తెలియరాలేదన్నారు. (చదవండి: స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా...నటీ ఖుష్బు సీరియస్) -
ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా..
న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెట్‌లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్‌గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్‌టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్‌ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్‌కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు. నిందితులు అక్కడ ఒక ఆఫీసర్‌తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్‌కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్‌స్టేషన్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్ఇన్స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది. (చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...) -
హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం
-
యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం
ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్‌లోని తాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్ దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు. (చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం) -
గోవా డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి జాన్ డిసౌజా అరెస్ట్
-
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి...
Mutilated Body Found In Indore: ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం....పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది. దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్ జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్ జోయాతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్‌మహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి) -
లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు... వైరల్ వీడియో
Man Snatches Cop's Baton: కొంతమంది అధికారులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే...మరికొంతమంది అత్యంత సౌమ్యంగా ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు అధికారులు అన్న భయం గానీ ఏమీ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత అధికారుల ఆగ్రహానికి గురై ఊచలెక్కెడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జై ప్రకాష్ జైస్వాల్ అనే కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి దాడి చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులెవరు కనీసం ఆ దాడిని వారించే సాహసం కూడా చేయలేదు. పోలీసుల కథనం ప్రకారం .... దినేష్ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్ బైక్‌తో కానిస్టేబుల్ జై ప్రకాశ్ మోటార్ బైక్‌ని ఢీ కొట్టాడు. దీంతో కానిస్టేబుల్ దినేష్‌తో బైక్ జాగ్రత్తగా నడుపు అన్నాడు. అంతే కోపంతో ఆ కానిస్టేబుల్ లాఠీని లాక్కుని మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడకి కానిస్టేబుల్ చాలా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు కూడా. కానీ దినేష్ మాత్రం కానిస్టేబుల్ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq — Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022 (చదవండి: మహిళా అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్) -
అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులతో ఘర్షణ.... మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొబెట్టి...
Clashed With Police Women Handcuffed: బిహార్‌లోని గయా జిల్లాలో ఇసుక గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్న పోలీసు అధికారులతో ఘర్షణ పడిన నిత్య గ్రామస్తులను అరెస్టు చేశారు. గ్రామస్తులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పురుషులు, మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొని ఉన్న వీడియో ఆన్లైన్లో దుమారం రేపింది. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిష్కరించడానికి, బీహార్ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ఈ నెల ప్రారంభంలో అన్ని ఇసుక మైనింగ్ సైట్లలో పర్యావరణ తనిఖీని నిర్వహించే ప్రక్రియను ప్రారంభించింది. కసరత్తు చేసేందుకు నిమగ్నమైన ప్రైవేట్ సంస్థలు, ఇసుక బంకులను తనిఖీ చేయడానికి సాంకేతిక, డ్రోన్లను ఉపయోగించనున్నారు. -
వివాహేతర సంబంధాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించలేం!: కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు
Court Cancels Cop’s Sacking: సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా చూడగలిగినప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్మెంట్లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది. (చదవండి: రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ) -
మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు!
Man Called The Emergency Helpline Of Haryana Police: ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి. ప్రజలకు అత్యవసర సమయాల్లో సహాయ సహకారాలు అందించే నిమిత్తం అధికారులు ఈ ఫోన్ నెంబర్లను కేటాయిస్తారు. అయితే కొందరు వాటిని దుర్వినియోగం పరిచి విలువైన సమయాన్ని వృద్ధా చేస్తుంటారు. అచ్చం అలాంటి సంఘటనే హర్యానాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...హర్యానాలో అ్యతవసర హెల్పలైన్ నెంబర్ 112 ఒకటి ఉంది. ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు లేదా ఏదైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ హెల్ప్‌లైన్ నెంబర్ కాల్ చేస్తే పోలీసులు వచ్చి తక్షణ సాయం అందిస్తారు. అయితే ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కి ఒక తాగుబాతు కాల్ చేసి సహాయం అడుగుతాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ తాగుబోతు ఉన్న చోటుకి తరలివస్తారు. అయితే అక్కడ ఆ తాగుబోతు పోలీసు కారు వచ్చిందా అని అక్కడకి వచ్చిన పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురై ఎందుకు ఈ ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసావని ప్రశ్నించారు. ఆ వ్యక్తి సాయంత్రం ఐదు గంటలకు రైళ్లు, కార్లు తిరగకపోవడంతో అసలు పోలీసులు పనిచేస్తున్నారో లేదో అనే సందేహం వచ్చిందని అందువల్ల తెలుసుకునేందుకు కాల్ చేశానని చెబుతాడు. దీంతో పోలీసులకు ఒక్కసారిగా మతిపోతుంది. సదరు వ్యక్తి రాయ్పురానిలోని తప్రియా గ్రామానికి చెందిన 42 ఏళ్ల నరేష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఎందుకు కాల్ చేయాలో కూడా వివరించడమే కాక ఎందుకు తాగుతున్నావని నరేష్‌ని ప్రశ్నించారు కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. पीने के बाद जनता को पुलिस की याद आती है। 2 दिन से पुलिस की गाड़ी नही दिखी तो 112 पे फ़ोन मिला लिया 😀😀. घटना पंचकूला की है । ( PS - Police resources are already scarce , don't misuse them 🙏) @police_haryana @112Haryana pic.twitter.com/5aQFLhs3Aq — Pankaj Nain IPS (@ipspankajnain) February 9, 2022 (చదవండి: మోడల్‌గా మారిన 60 ఏళ్ల కూలీ!) -
పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడిన వీడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. -
ఉరికి వేలాడుతున్న మనిషి.. అంతా ప్రాణం పోయింది అనుకున్నారు, కానీ..
నొయిడా: కేవలం మూడు నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు పోలీసులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవ పడ్డాడు. వాగ్వాదం అనంతరం ఆ భార్య పొలానికి వెళ్లిపోయింది. భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన భర్త క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధతో మద్యంతాగి ఇంట్లోకి వెళ్లి కోపంతో తలుపువేసుకున్నాడు. ఇదంతా గమనించిన అతని కుమార్తె వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడు తన చెల్లికి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. సోదురుడు సూచించిన మేరకు ఆ బాలిక పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న వ్యక్తి కనిపించడంతో పాటు స్థానిక ప్రజలు గుమికూడి అతను చనిపోయినట్లుగా భావిస్తుంటారు. అయితే అతనిలో ఇంకా కొంచెం కదలిక ఉందని పోలీసుల్లో ఒకరు గమనించి వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతని ప్రాణాలను కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నట్టు సమాచారం. చదవండి: ఇకపై కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే తల్లిడండ్రులకు శిక్ష.. ఎక్కడంటే -
పోలీసుల అదుపులో ప్రియాంక, సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
లక్నో: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు.పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆగ్రా వెళుతుండగా బుధవారం లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్నో పోలీస్ లైన్స్‌కు తరలించారు. ప్రియాంకను అడ్డుకోవడం ఈ నెలలో ఇది రెండోసారి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినపుడు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, యూపీ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రియాంక యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి వెళ్లినా అడ్డుకుంటారా అంటూ అధికారులను ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఆమె పర్యటనను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో యోగీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్రియాంక ట్విటర్లో మండిపడ్డారు. బాధిత కుటుంబం న్యాయం కోరుకుంటోంది.. తాను ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నా. యూపీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది? తనను ఎందుకు ఆపుతున్నారు? ఈ రోజు వాల్మీకి జయంతి బుద్ధుడిపై ప్రధాని మోదీ గొప్పగా మాట్లాడుతారు. కానీ దానికి విరుద్ధంగా తనపై దాడి చేశారంటూ ఆమె హిందీలో ట్వీట్ చేశారు. 25 లక్షలు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ వాల్మీకి కుటుంబంతో తమ నేత మాట్లాడకుండా యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. మరోవైపు ప్రియాంక గాంధీని పోలీస్ లైన్‌కు తరలిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళా పోలీసులు ప్రియాంకతో సెల్ఫీ తీసుకునేందుకు మొహమాట పడుతుండగా, చొరవగా వారితో సెల్ఫీకి ఫోజులివ్వడంతోపాటు, అప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకోవడం విశేషం. #WATCH | Lucknow: Congress' Priyanka Gandhi Vadra & her convoy stopped by Police on their way to Agra. Police say, "You don't have permission, we can't allow you" She was going to meet family of a sanitation worker who was nabbed in connection with a theft&died in Police custody pic.twitter.com/N3s0QAU8n6 — ANI UP (@ANINewsUP) October 20, 2021 -
జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... ‘మై గరీబ్ ఆద్మీ హూ’ అన్న విడిచి పెట్టలేదు..
జైపూర్: రాజస్థాన్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసులు.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. బిల్వారా జిల్లాలోని.. ఒక దేవాలయం ముందు చెప్పులు అమ్మే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు.. బిల్వారాలోని స్థానిక దేవాలయం ముందు ఒక దివ్యాంగుడు చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్లు అక్కడికి చేరుకుని చెప్పుల షాపును తీసేయాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా.. అతడిని నోటికొచ్చినట్లు దుర్భాషాలాడారు. అతడిని బయటకు లాగి జుట్టుపట్టుకుని విచక్షణ రహితంగా కొట్టసాగారు. రోడ్డుపై లాక్కెళుతూ క్రూరంగా ప్రవర్తించారు. ఆ దివ్యాంగుడు ‘మై గరీబ్ ఆద్మీ హూ’ నన్ను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికి పోలీసులు విడిచిపెట్టలేదు. అయితే, స్థానికులు పోలీసులను ఎవరు కూడా వారిని ఆపే సాహసం చేయడం లేదు. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై బిల్వారా పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సంఘటపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కాగా, గతంలో లక్నో సమీపంలోని ఉన్నావ్‌లో 18 ఏళ్ల కూరగాయలు అమ్మే వ్యక్తిపై పోలీసులు ఇలానే క్రూరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ వ్యక్తి కొన్నినెలల తర్వాత మృతిచెందాడు. దీంతో బంధువులు అతని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఉన్నతాధికారులు దిగివచ్చి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో బంధువులు తమ నిరసనను మానుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరగటంతో పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసులకు డీజీపీ తీపికబురు.. వారంలో ఓరోజు వీక్లీ ఆఫ్.. బర్త్‌డేకూ..
సాక్షి, చెన్నై(తమిళనాడు): పోలీసులకు వారంలో ఓ రోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సిందేనని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలతో సెలవుకు ఆదేశించారు. విధి నిర్వహణలో పోలీసులకు పనిభారం పెరుగుతుండడాన్ని పరిగణించి వారంలో ఓరోజు సెలవు తప్పనిసరిగా అమలుకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులతో పోలీసు యంత్రాంగం శనివారం ప్రత్యేక ప్రకటన చేసింది. ఆమేరకు అన్నిస్టేషన్లు, వివిధ విభాగాల్లో, ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ తప్పనిసరి చేశారు. ఎవరైనా పోలీసు బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పక్షంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సెలవు మంజూ రుకు ఆదేశాల్ని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. -
క్షణాల్లో కదిలిన సీఆర్పీఎఫ్ సిబ్బంది, షాకింగ్ వీడియో
సాక్షి,లక్నో: రెప్పపాటులో మృత్యుముఖం నుంచి ఒక వ్యక్తిని కాపాడిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫాంల వద్ద అప్రమత్తంగా ఉండాలని, , కదులుతున్న రైళ్లను ఎక్కొద్దు, దిగవద్దు అంటూ పదే పదే ర్వైల్వే శాఖ హెచ్చరిస్తున్నా, చాలామంది ప్రమాదం అంచున నిలబడుతున్నారు. కానీ రక్షణ సిబ్బంది మెరుపు వేగంతో కదిలి వారిని కాపాడుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్నఇలాంటి షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి, కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెప్పపాటు నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ఇలాంటి వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా చాలామంది అదే నిర్లక్క్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. తాజా ఘటన వివరాల్లోకి వెళితే..ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో గోమతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది. అంతలోనే ఒక వృద్ధుడు రైల్లోంచి దిగుతూ పట్టు తప్పి జారి పోయాడు. దీన్ని గమనించిన ఆర్పీఎఫ్ అధికారి శరవేగంతో ఆ వృద్ధుడిని సురక్షితంగా కాపాడారు.వృద్ధుడు రైల్లోంచి జారి పట్టాలపై పడిపోతున్న దృశ్యం అక్కడి వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కానీ పోలీసులు సకాలంలో స్పందించడంతో లిప్తపాటులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వారంతా ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ త్రిలోక్ శర్మ, శ్యామ్ సింగ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. गाज़ियाबाद रेलवे स्टेशन पर एक बुजुर्ग यात्री को मौत के मुँह से बचाया @RPF_INDIA के कॉन्स्टेबल त्रिलोक शर्मा और कांस्टेबल श्याम सिंह को रेलवे पुलिस ने इस काम के लिए सराहा है pic.twitter.com/FwCsjvrQzC — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 6, 2021 -
పహారాలోనే ప్రాజెక్టులు
ధరూరు(గద్వాల)/ అమరచింత (వనపర్తి)/ దోమలపెంట (అచ్చంపేట)/నాగార్జునసాగర్ / హుజూర్నగర్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జల వివాదాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద శనివారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. టీఎస్జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రం వద్ద నాగర్‌కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం నిలిచిపోవడం, శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండటంతో నీటిమట్టం తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ జలాశయంలో నీటిమట్టం 821 అడుగులుండగా, శనివారం సాయంత్రం 819.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ 40.4514 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 13.306 మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. రేగుమాగడి గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకి నీటి విడుదల జరగలేదు. అలాగే జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్ కో జల విద్యుత్ కేంద్రం వద్ద ప్రధాన గేటును మూసివేశారు. ఈ ప్రాజెక్టుపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సాగర్‌లో విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు అలాగే సాగర్ ప్రాజెక్ట్ వద్ద నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు. మెయిన్ పవర్హౌజ్కు వెళ్లే రోడ్డు దారిని పూర్తిగా మూసివేశారు. కేవలం అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని మాత్రమే గుర్తింపు కార్డులను చూసి ఆ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 533.80 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జలాశయానికి 27,587 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా 32,212 క్యూసెక్కులు విడుదలయ్యింది. విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు వినియోగించారు. ‘పులిచింతల’లో 30 మెగావాట్లు.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవర్‌హౌజ్, డ్యామ్, పరిసర ప్రాంతంలో సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. టీఎస్ జెన్ కోలో జల విద్యుత్ ఉత్పత్తి శనివారం కూడా కొనసాగింది. ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి 39 వేల క్యూసెక్కుల నీరు ఇ ఫ్లోగా వచ్చి ప్రాజెక్ట్‌లో చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటితో పవర్ హౌస్‌లోని 2 యూనిట్లను రన్ చేస్తూ 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.06 టీఎంసీల నీరు ఉంది. -
పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు
సాక్షి, చెన్నై : ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసి అతడి ఆస్తులు రాయించుకున్న కేసులో ఇన్స్పెక్టర్, ఎస్ఐలు సహా పది మంది పోలీసులపై ఆదివారం సీబీసీఐడీ ఆరు సెక్షన్లతో కేసు నమో దు చేసింది. చెన్నై అయపాక్కంకు చెందిన పారి శ్రామికవేత్త రాజేష్ ఆరు నెలల క్రితం కిడ్నాప్ అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనతో బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకుని వదిలిపెట్టారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో పోలీసు అధికారులు ఉన్నట్టు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు సీబీసీఐడీకి చేరింది. ఆరు నెలలుగా ఈ కేసును సీబీసీఐడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులే కిడ్నాపర్లని తేలింది. తిరుమంగళం ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు సహా పది మంది పోలీసులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి విచారించేందుకు సీబీసీఐడీ సిద్ధమవుతోంది. మరో కీచక పోలీసు సాక్షి, చెన్నై: యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడి కోసం మహిళా పోలీసులు గాలిస్తు న్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి తారస పడింది. ఆమె నెంబరు తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్‌మెన్‌గా మారాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని, కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు. అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్ తప్పించుకునే యత్నం చేశాడు. ఆమె ఎస్పీ జయకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ జాక్సన్‌ను ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ సమాచారంతో జాక్సన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి కోసం తిరుచెందూరు మహిళా పోలీసులు గాలిస్తున్నారు. కొద్ది రోజులుగా అధిక సంఖ్యలో పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం గమనార్హం. నాగరాజన్‌పై గూండా చట్టం క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన కేసులో అథ్లెటిక్ శిక్షకుడు నాగరాజన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న పూర్వ క్రీడాకారాణులు సైతం ఆన్లైన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయనపై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్ ఆదివారం ఆదేశించారు. చదవండి: మనవడి పెళ్లి వివాదం.. సర్పంచ్ కిడ్నాప్ -
ఖాకీ జులుం: మందుబాబు మరణం
సాక్షి, చెన్నై : మద్యం మత్తులో మోటారు సైకిల్ మీద దూసుకొచ్చిన మందుబాబుపై ఓ ఖాకీ జులుం ప్రదర్శించాడు. లాఠీతో చితక్కొట్టాడు. ఈ దెబ్బలకు స్పృహ తప్పిన ఆ మందుబాబు ఆస్పత్రిలో మరణించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పెషల్ పార్టీ ఎస్ఐపై హత్య కేసు నమోదైంది. ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేశారు. సేలం జిల్లా వాలప్పాడి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం తదితర 11 జిల్లాల్లో ఇంకా మద్యం దుకాణాలు తెరచుకోలేదు. దీంతో మందుబాబులు పొరుగు జిల్లాల వైపుగా పోటెత్తుతున్నారు. అలాగే, సారా జోరు పెరగడంతో కట్టడి లక్ష్యంగా ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టపట్టిలో కిరాణా కొట్టు నడుపుతున్న మురుగేషన్ తన మిత్రులతో కలిసి కరుమందం గ్రామంలో మద్యం తాగాడు. మంగళవారం సాయంత్రం మోటారు సైకిల్‌పై తిరుగు పయనం అయ్యాడు. ఒకే మోటారు సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు రావడాన్ని పాపనాయకన్ పట్టి చెక్ పోస్ట్ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. ఆ ముగ్గురు మత్తుకు చిల్తై ఉండటం, ఇందులో మురుగేషన్ పోలీసుల మీద తిరబడడం.. విధుల్లో ఉన్న స్పెషల్ ఎస్ఐ పెరియస్వామిలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో మురుగేషన్‌ను ఆయన చితక్కొట్టేశాడు. ఈ దృశ్యాల్ని మురుగేషన్‌తో వచ్చిన మిత్రుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. మరో మిత్రుడు ఎస్ఐ కాళ్లా.. వేళ్లా పడినా ఎస్ఐ మురుగేషన్‌ను వదిలిపెట్టలేదు. దెబ్బలకు తాళలేక మురుగేషన్ స్పృహ తప్పాడు. దీంతో అంబులెన్స్‌ను రప్పించి ఆత్తూరు ఆస్పత్రికి తరలించారు. మురుగేషన్ తలకు బలమైన గాయమైనట్టు ఆత్తూరు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం సేలం ఆస్పత్రికి తరలించగా, బుధవారం వేకువ జామున మురుగేషన్ మరణించాడు. మద్యం మత్తులో కిందపడడంతో మృతి చెందినట్లు తొలుత అందరూ భావించారు. అయితే మృతుడి మిత్రుడు చిత్రీకరించిన వీడియో వైరల్ కావడంతో ఎస్ఐ పైశాచికత్వం తెలిసింది. దీంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఏటావూర్ పోలీసు స్టేషన్ ముట్టడించారు. డీఐజీ సీరియస్.. ఆ వీడియో వైరల్‌తో సేలం ఎస్పీ శ్రీఅభినవ్ తొలుత స్పందించారు. ఆ చెక్ పోస్టులో ఉన్న సిబ్బందిని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐపై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్ఐను అరెస్టు చేశారు. ఇక నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఐజీ మహేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, బాధిత కుటుంబం న్యాయం కోసం పట్టుబడుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగింది. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు. దీంతో అధికారులు వారిని బుజ్జగిస్తున్నారు. ఈ వ్యవహారం చివరకు అసెంబ్లీకి చేరింది. ప్రతిపక్ష నేత పళనిస్వామి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పందించిన సీఎం స్టాలిన్ విచారణ సాగుతోందని, ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, గత ఏడాది జూన్ 22వ తేదీన పోలీసుల దాడిలో తూత్తుకుడి జిల్లా సాత్తాన్ కులంలో తండ్రి కుమారులు మరణించి సరిగ్గా ఏడాదైన సమయంలో తాజాగా మరోమారు ఓ ఖాకీ రూపంలో పోలీసు యంత్రాంగం రచ్చకెక్కింది. కాగా తాజా ఘటననపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సమగ్ర విచారణతో నివేదిక సమర్పించాలని సేలం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను' -
ఆర్టిస్ట్ అరెస్ట్: పోలీసులు చెప్పిన కారణం వింటే షాక్..
ఇస్లామాబాద్: అప్పుడప్పుడు పోలీసులు చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యం, అసహనం వంటి ఫీలింగ్స్ అన్ని ఒకేసారి వ్యక్తం అవుతాయి. ఎందుకంటే వింత వింత కారణాలు చెప్పి సామాన్యులను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటారు పోలీసులు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పాకిస్తాన్లో వెలుగు చూసింది. తెల్లవారుజామున రోడ్డు మీద రిక్షా కోసం వెయిట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారు చెప్పిన కారణం వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. సదరు వ్యక్తి జుట్టు పొడవుగా పెంచుకున్నందుకు అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్త చేస్తునారు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఆర్టిస్ట్, టీచర్, ప్రదర్శనకారుడైన అబుజర్ మధు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కల్మా చాక్ ప్రాంతంలో రిక్షా ఎదురు చూస్తున్నాడు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అబుజర్ని గమనించి అతడి వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడి ఐడీ కార్డ్ చూపించమని కోరారు. అబుజర్ తన ఐడెంటిటీ కార్డ్ పోలీసులుకు చూపించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా అబుజర్ జైలులోనే గడిపాడు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించగా.. అతడు జుట్టు పెద్దగా పెంచుకున్నాడని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. వారు చెప్పిన సమాధానం విన్న అబుజర్కు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఈ సంఘటన గురించి అబుజర్ స్నేహితురాలు, పిల్లల హక్కుల న్యాయవాది నటాషా జావేద్ ట్వీట్ చేయడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ పోలీసులు ఇలా ప్రవర్తించడం కొత్తేం కాదని.. గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అబుజర్ మాట్లాడుతూ.. ‘నేను ఐడీ కార్డ్ చూపించినప్పటికి పోలీసులు నమ్మలేదు. నన్ను పూర్తిగా చెక్ చేశారు. ఇక రాత్రంతా జైలులోనే ఉంచారు. నాలాగే జుట్టు పెంచుకుని కార్లలో తిరిగే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారా’ అని ప్రశ్నించాడు. Last weekend, my friend Abuzar was picked up by Punjab Police in Lahore. He had to spend a night in Model town police station, in a lock up. Reason: his long hair. A thread — Natasha Javed (@natashajaved1) June 7, 2021 ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు దీనిపై స్పందించారు. ‘‘అబుజర్ వేషధారణ కాస్త అనుమానాస్పాదంగా ఉంది. అతడు తన పొడవాటి జుట్టును ముడి పెట్టుకుని.. చేతికి ఓ కంకణం ధరించి ఉన్నాడు. పైగా తెల్లవారుజామున ఇలా రోడ్డు మీద ఉండటంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపారు. చదవండి: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్ కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి -
సోపోర్‌లో ఉగ్రవాదుల మెరుపు దాడి
జమ్మూకశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై గ్రనేడ్‌తో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఎల్ఈటీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండిస్తూ ట్విట్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. చదవండి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం థర్డ్‌వేవ్ ముప్పు నిజమే.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: కేజ్రీవాల్ -
పోలింగ్ కేంద్రంలో తల్లి.. పసిబిడ్డను ఆడించిన ఏపీ కానిస్టేబుల్
సాక్షి, అనంతపూరం: ఖాకీలు అనగానే.. కటువు మాటలు, కరడు గట్టిన హృదయం, కర్కోటకులు అనే భావన ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయింది. అయితే పోలీసుల్లో అందరు ఇలానే ఉండరు. వారిలో కూడా మంచి, మానవత్వం ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలను ఎన్నింటినో చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పసిబిడ్డను తీసుకుని ఓ తల్లి ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఎర్రటి ఎండ.. క్యూలైన్లో నిల్చోవడంతో చిన్నారికి ఉక్కపోత పోసి.. ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇది గమనించి.. బిడ్డను తనతో పాటు తీసుకుని టెంట్ కిందకు వచ్చాడు. ఏడవకూడదంటూ ఊరడించాడు. చిన్నారి తల్లి ఓటు వేసి వచ్చేవరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు. బిడ్డను ఎత్తుకున్న కానిస్టేబుల్ ఫోటోని ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతుంది. తమిళనాడులో చోటు చేసుకున్న సంఘటనను, అక్కడి పోలీసు కానిస్టేబుల్ని ఏపీ పోలీసులు ఎందుకు ప్రశంసిస్తున్నారంటే.. సదరు కానిస్టేబుల్‌ది అనంతపురం కాబట్టి. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ఈ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తునాడు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో ‘‘తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుకున్న ఏపీ పోలీసు కానిస్టేబుల్. ఈ అనంతపురం పోలీసు కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇక ఆ మహిళ ఓటు వేసి వచ్చేవరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనిని అక్కడున్న వారందరు ప్రశంసించారు’’ అంటూ ట్వీట్ చేసింది. #APPolice's humane face at #TamilNaduElections: @AnantapurPolice constable deployed to #TamilNadu for #TamilNaduElections2021 carried & lulled a 1-month-old crying baby until the mother's return from the voting booth, winning the hearts of many.#AndhraPradesh#Elections2021 pic.twitter.com/vk0DO2doJN — Andhra Pradesh Police (@APPOLICE100) April 6, 2021 ఏపీ పోలీసు శాఖ సదురు కానిస్టేబుల్ పేరును వెల్లడించలేదు. ఈ ఫోటోని చూసిన వారంతా తెగ ప్రశంసిస్తున్నారు. గుడ్ జాబ్.. హ్యాట్సాఫ్ అంటూ పొగుడుతున్నారు. ఇక తమిళనాడు 38 జిల్లాలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 62.86 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మే 2న వీరి భవితవ్యం తేలనుంది. చదవండి: తమిళ ఎన్నికల్లో ‘అనంత’ పోలీసుల సేవలు -
డ్రైవర్‌పై ప్రతాపం.. పోలీసును చితకబాదిన జనాలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సినిమాను తలపించే సన్నివేశం ఒకటి చేసుకుంది. ఓ పోలీసు అధికారి కారు డ్రైవర్ని బెల్ట్‌తో విచక్షణారహితంగా బాదాడు. అతడి చర్యలకు ఆగ్రహించిన జనాలు.. సదరు అధికారిని రోడ్డు మీద పడేసి మరి చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హౌజ్ ఖాస్ ప్రాంతంలోని ఢిల్లీ ఐఐటీ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు సిబ్బంది కారును ఆపడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండటంతో పోలీసు అధికారులు మాస్క్ చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఓ కారు డ్రైవర్ని ఆపారు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో గితేశ్ దాగర్ అనే వ్యక్తి సెడెన్‌గా బ్రేక్ వేశాడు. దాంతో గితేశ్ కారు, మరో కారుకి డ్యాష్ ఇచ్చింది. ఆగ్రహించిన గితేశ్.. సిగ్నల్ దగ్గర కారు ఆపిన అధికారుల దగ్గరకు వెళ్లి గొడవపెట్టుకున్నాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో సహనం కోల్పోయిన ఓ పోలీసు అధికారి గితేశ్‌పై బెల్టుతో దాడి చేశాడు. అతడి పక్కన ఉన్న అధికారులు, రోడ్డు మీద ఉన్న జనాలు సదరు అధికారిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అతడు వారిని పట్టించుకోకుండా నడిరోడ్డుపై బెల్ట్‌తో గితేశ్ని బాదుతూనే ఉన్నాడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న జనాలు ఆగ్రహంతో సదరు అధికారి మీద దాడి చేశారు. అతడిని రోడ్డు మీద పడేసి మరి కొట్టారు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఘటనపై దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ స్పందించారు. సదరు అధికారి, కారు డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. పూర్తిగా విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చదవండి: సంగారెడ్డి: బొలెరో డ్రైవర్‌పై.. పోలీసుల ఓవరాక్షన్ -
13 మంది పోలీసులను మోసం చేసి.. రూ.1.5 కోట్లు..
ముంబై : హౌసింగ్ సొసైటీలో స్థలాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 13 మంది పోలీసులను మోసం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్(సీఐడీకో) తక్కువ డబ్బుతో స్థలాలను అందిస్తోందని, హౌసింగ్ సొసైటీలను నిర్మిస్తోందని ముంబైకి చెందిన సచిన్ పవర్ అనే వ్యక్తి ఓ పోస్ట్ పెట్టాడు. స్థలాలకోసం సీఐడీకో లాటరీ తీస్తోందని పోస్టలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సతీష్ మిసల్ అనే పోలీస్ కానిస్టేబుల్ సచిన్‌ను సంప్రదించాడు. సీఐడీకోతో తనకు సంబంధాలు ఉన్నాయని, కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే స్థలం ఇప్పిస్తానని సచిన్ నమ్మబలికాడు. సతీష్ ఇందుకు అంగీకరించాడు. సచిన్ అంతటితో ఆగకుండా ఖరఘర్ పోలీస్ స్టేషన్‌లోని మరికొంతమంది పోలీసులకు కూడా వల వేశాడు. 25 మంది గ్రూపుగా ఏర్పడి హౌసింగ్ సొసైటీ నిర్మించుకోవచ్చని వారితో చెప్పాడు. దీంతో వారు ఓ సొసైటీగా ఏర్పడ్డారు. సచిన్ ఓ ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్ తెరిచి ప్రతీ సభ్యుడి వద్దనుంచి 1.35 లక్షలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత సతీష్ సీఐడీకో లక్కీ డ్రాలో పాల్గొన్నాడు. సచిన్ చొరవ లేకుండానే లక్కీడ్రాలో వీరి సొసైటీకి కలబొలిలో ఓ ఫ్లాట్ వచ్చింది. దీంతో సచిన్ నిలదీయగా మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సచిన్ సొసైటీ అకౌంట్‌ను క్లోజ్ చేశాడు. అయితే పవర్ తన అకౌంట్‌ను క్లోజ్ చేయలేదు. వేరే పనుల కోసం సతీష్‌తో చెక్కులపై సంతకం పెట్టించుకున్న సచిన్ సొసైటీ అకౌంట్ నుంచి రూ. 1.5 కోట్లు కాజేశాడు. ఇది గుర్తించిన సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి.. చదివించండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్ వ్యభిచార గృహంపై పోలీసుల దాడి -
పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు
న్యూఢిల్లీ: స్పైడర్‌మ్యాన్ సినిమాలు అంటే పిల్లలు, పెద్దలకు ఎంతో ఆసక్తి. పెద్ద పెద్ద భవంతులను సైతం అలవోకగా ఎక్కుతూ.. ప్రమాదాల నుంచి జనాలను కాపాడుతూ అందరి ప్రశంసలు పొందుతాడు స్పైడర్‌మ్యాన్. సినిమాలో అంటే ఏ వేషాలైన వేయగల్గుతాం. కానీ రియాలిటీలో మాత్రం ఇలా బిల్డింగ్‌ల మీదకు ఎక్కడం సాహసంగానే చెప్పవచ్చు. ఇలాంటి సాహసాన్ని నిజం చేసి చూపించాడు ఓ పోలీసు అధికారులు. ప్రస్తుతం అతడి సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రియల్ స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. దక్షిణ ఢిల్లీ గ్రేటర్ కైలాష్-1 ఏరియాలోని ఓ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో శుక్రవారం ఉదయం 6.55 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఇద్దరు పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. ఇక బిల్డింగ్ లోపల ఉన్న వారిని బయటకు తరలించారు. కానీ ముగ్గురు మనుషులు లోపల చిక్కుకుపోయారు. వారు బయటికి రావడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఇక వీరిలో ఓ అధికారి బిల్డింగ్ ఇనుప గ్రిల్ సాయంతో లోపలికి చేరుకున్నాడు. అక్కడ చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు. ఇలా కాపాడిన వారిలో 87 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. ప్రాణాలు తెగించి మరి జనాలను కాపాడిన ఆ పోలీసు అధికారి సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రియల్ స్పైడర్‌మ్యాన్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: సంగారెడ్డి: బొలెరో డ్రైవర్‌పై.. పోలీసుల ఓవరాక్షన్ -
సదాశివపేట పోలీసుల ఓవరాక్షన్
-
సంగారెడ్డి: బొలెరో డ్రైవర్‌పై.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో బొలెరో వాహన డ్రైవర్‌పై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. బూటు కాలితో తంతు.. లాఠీలతో చితకబాదారు. లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా ఇష్టం ఉన్నట్లు కొట్టారు. ఇంతకు ఆ డ్రైవర్ చేసిన పాపం ఏంటో తెలుసా.. పోలీసులు వాహనం ఆపమనగానే ఆపకుండా.. కాస్తా ముందుకు వెళ్ళి ఆపడం. దానికే రెచ్చిపోయిన సదాశివపేట పోలీసులు ఆ అమాయకునిపై తమ ప్రతాపం చూపారు. ఆ వివరాలు.. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై సడెన్‌గా పోలీసులు రావడంతో వాహనాన్ని కాస్తా దూరంగా తీసుకెళ్లి ఆపాడు వాజిద్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ.. బండ బూతులు తిట్టాడు. పోలీసుల దాడిలో వాజిద్‌కి గాయాలయ్యాయి. ఓవైపు రాష్ట్రంలో ప్రైండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే... కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
విద్యార్థినిల బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన ఖాకీలు
ముంబై: అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే బాలికలపై జరిగే దారుణాలకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు చదువుతూనే ఉంటాం. తమకంటూ ఎవరు లేని ఈ అభాగ్యుల పట్ల జాలి, దయ చూపాల్సింది పోయి పశువుల్లా ప్రవర్తిస్తారు కొందరు అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రాష్ట్రంలోని జల్గావ్లో ప్రభుత్వం ఆశాదీప్ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కొందరు పోలీసు అధికారులు, మరి కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న విద్యార్థినిలను బెదిరించి వారి బట్టలు విప్పించి.. డ్యాన్స్ చేయించారు. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా శ్వేతా మహాలే మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నాము. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారని భావిస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ”అన్నారు శ్వేతా మహాలే. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. దారుణం జరిగిన హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది. చదవండి: ఇది పశువుల హాస్టల్.. ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే -
‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’
లక్నో: సామాన్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అధికారులు.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది జనాలు పోలీసుల ప్రవర్తనకు జడిసి స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడతారు. ఇక ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. తప్పకుండా ఖాకీల చేతులు తడపాల్సిందే. లేదంటే మన కంప్లైంట్ పక్కకు పడేస్తారు. అందరు ఇలానే లేకపోయినా.. చాలా చోట్ల మాత్రం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూపీలో చోటు చేసుకుంది. కిడ్నాపయిన తన బిడ్డను విడిపించాల్సిందిగా కోరుతూ.. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. వికలాంగురాలు అని కూడా చూడకుండా.. ఆమె వద్ద నుంచి 15 వేల రూపాయల వరకు వసూలు చేశారు. కానీ ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమార్తె క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని భరించలేని ఆ తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. (చదవండి: ప్రేమికుల కిడ్నాప్.. సినిమాను తలపించేలా ) వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గుడియా అనే వికాలంగురాలి భర్త చనిపోయాడు. మైనర్ కుమార్తెతో కలిసి ఉన్న కొద్ది పాటి భూమిని సాగు చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గుడియా మైనర్ కుమార్తెని ఆమె బంధువు ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. దాంతో గుడియా పోలీస్ స్టేషన్లో దీని గురించి ఫిర్యాదు చేసింది. ఇక ఆమె కుమార్తెని వెతికాలంటే డీజిల్ ఖర్చు భరించాల్సిందిగా పోలీసులు గుడియాకు తెలిపారు. అందుకు అంగీకరించిన ఆ తల్లి బంధువుల దగ్గర అప్పు తెచ్చి మరి డీజిల్ ఖర్చులకు గాను 15 వేల రూపాయలు చెల్లించింది. ఇలా మూడు నాలుగు సార్లు డబ్బులు ఇచ్చిన్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. కుమార్తె గురించి ప్రశ్నిస్తే.. వెతుకుతున్నాం అంటూ సమాధానమిచ్చేవారు. ఆ తర్వత అసలు రెస్పాన్స్ లేదు. (చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి) దాంతో గుడియా అధికారులను నిలదీయగా.. వారు ఆమె పట్ల ఏ మాత్రం జాలీ, దయ లేకుండా.. ‘‘ఇక్కడ నుంచి వెళ్లు.. అసలు నీ కుమార్తె ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో’’ అంటూ నీచంగా మాట్లాడారు. ఇక తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను అన్నది గుడియా. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. స్టేషన్ ఎస్హెచ్ఓను విధుల నుంచి తొలగించడమేకాక మరో అధికారిని నియమించి గుడియా కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇక గుడియాను పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద వదిలేశారు. -
‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు
తిరువనంతపురం: చెన్నైలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంబంధంలో ఉన్న 22 ఏళ్ల కేరళ మహిళను పోలీసు అధికారులు తన భాగస్వామి ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు ఓ మహిళా పోలీసుతో కలిసి వచ్చి 22 ఏళ్ల యువతిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. కోజికోడ్ నివాసి అయిన ఈ మహిళ ఓ యువతితో ప్రేమలో ఉంది. అయితే ఈ బంధాన్ని సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో ఆమె అక్టోబర్‌లో తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లిపోయి.. చెన్నైలో ఉంటున్న భాగస్వామి వద్దకు చేరుకుంది. 20 రోజుల తర్వాత పోలీసులు చెన్నై వెళ్లి ఆమెను తీసుకెళ్లి కేరళ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సదరు యువతి తన ఇష్టం మేరకే మరో మహిళతో కలిసి జీవించడానికి చెన్నై వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నప్పటికి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తీసుకు రావడంతో ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. అంతేకాక పోలీసులు బాధితురాలికి, ఆమె భాగస్వామికి లీగల్ సాయం తీసుకునే అవకాశం కూడా కల్పించలేదు. (చదవండి: వివక్షపై విజయానికి రెండేళ్లు..) ఇక ఆదివారం కోర్టులో హాజరయిన సదరు యువతి చెన్నై వెళ్లిపోవడానికి ముందు 10 రోజుల పాటు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటానని మెజిస్ట్రేట్ ముందు తెలిపింది. ఇలాంటి సందర్బాల్లో తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల సాయంతో ఎల్జీబీటీక్యూఐఏ యువత హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు. కేరళ బాధితురాలి విషయంలో కూడా ఇదే జరిగింది. మేజర్ అయిన యువతి తన ఇష్టం మేరకే చెన్నైలో ఉంటున్న భాగస్వామి దగ్గరకు వెళ్లింది. కానీ పోలీసులు మాత్రం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యువతి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే 2018లో ఇలాంటి కేసులో కేరళ హై కోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. -
శ్రీవారి సేవలో సాయి కుమార్
సాక్షి, తిరుపతి: కనిపించే మూడు సింహాలు.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే అన్నారు సినీ నటడు సాయి కుమార్. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా.. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగులు మొదలయ్యాయి. కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి సెల్యూట్ చేశారు. ‘పోలీసులు నిజమైన హీరోలు.. వారి గెటప్ వేస్తే.. మాలో ఒక పౌరుషం కనిపస్తుంది. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో. ‘పోలీస్ స్టోరి’ చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది. త్వరలోనే ‘నాలుగో సింహం’ అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నాను’ అన్నారు సాయి కుమార్. (చదవండి: 13 ఏళ్లకు మళ్లీ...) తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డిపై సాయి కుమార్ ప్రశంసలు కురిపించారు. పోలీసు అధికారి పోలంలోకి దిగడం అంటేనే, ఆయన మనుషుల్లో ఎలా కలిసి పోయారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రమేష్ రెడ్డి లాంటి అధికారి ఉన్న చోట మంచి హ్యూమానిటీ కూడా ఉంటుందని తెలిపారు సాయి కుమార్. -
హత్రాస్ ఉదంతం.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
లక్నో: ఉన్నతకుల దురహంకారానికి 20 ఏళ్ల దళిత యువతి బలయిన ఉదంతం దేశవ్యాప్తంగా ఆగ్రహ రగిలిస్తోంది. ప్రజలు, విపక్షాలు సదరు యువతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాంతో యూపీ ప్రభుత్వం హత్రాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్వినియోగ ఆరోపణలపై వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్ బృందం కోరింది. (చదవండి: మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం) పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక హత్రాస్ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. వీటిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భీమ్ ఆర్మీ చీష్ చంద్ర శేఖర్ ఆజాద్ పాల్గొన్నారు. దోషులను ఉరితీయాలని.. యూపీ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు యూపీ అధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సాయం కోరిన తల్లి.. కొడుకుపై కాల్పులు
వాషింగ్టన్: మానసిక వికలాంగుడైన తన కుమారుడిని ఆస్పత్రిలో చేర్చడానికి పోలీసుల సాయం కోరి వారికి ఫోన్ చేసింది తల్లి. కానీ పోలీసులు ఆ కుర్రాడిని ఆస్పత్రికి బదులు ప్రాణాపాయస్థితిలోకి తీసుకెళ్లి ఐసీయూలో చేర్చారు. హృదయవిదారకమైన ఈ సంఘటన సాల్ట్ లేక్ సిటీలో చోటు చేసుకుంది. వివరాలు.. గోల్డా బార్టన్‌కు 13 ఏళ్ల కుమారుడు లిండెన్ కామెరాన్ ఉన్నాడు. అతడు ఆస్పెర్గర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు అప్పుడప్పుడు అసాధరణంగా గొడవ చేసేవాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే.. సెట్ అయ్యేవాడు. గత శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బార్టెన్కు. దాంతో పోలీసులకు కాల్ చేసి.. లిండెన్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సాయం చేయాల్సిందిగా కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు బార్టెన్ ఇంటికి వచ్చిన పోలీసులు లిండెన్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ కుర్రాడు వీరిని చూసి భయపడి పారిపోయాడు. (చదవండి: పికప్ అవుతోంది) దాంతో పోలీసులు లిండెన్ మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి పేగులు, మూత్రాశయం, భుజం, చీలమండలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాడు. సాయం కోసం పోలీసులకు కాల్ చేస్తే.. వారు తన బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బార్టెన్. ‘నా బిడ్డ నిరాయుధుడు.. మానసిక వికలాంగుడు. అలాంటి వాడి మీద ఇంత దారుణంగా దాడి చేయడం అమానుషం’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది. అయితే అమెరికాలో ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. కుటుంబ సభ్యులను కానీ, జనాలను కానీ ఇబ్బంది పెట్టే మానసిక వికలాంగులను అనేక మందిని పోలీసులు కాల్చి చంపారు. లిండెన్పై కాల్పులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సాల్ట్ లేక్ సిటీ మేయర్ ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
పోలీసుల ఎదుటే కొట్టి చంపారు
లక్నో: పాఠశాల ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన వ్యక్తిని సోమవారం ఉదయం గ్రామస్తులు పోలీసుల సమక్షంలో కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో కొందరు వ్యక్తులు కర్రలతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసులు గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దెబ్బల దాటికి తాళలేక బాధితుడు మరణించాడు. కానీ గ్రామస్తులు మాత్రం అతడిని కొడుతూనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గోరఖ్‌పూర్‌కు చెందినవాడు. కొద్ది రోజుల క్రితం అతడు తన తండ్రి తుపాకీతో ఓ ఉపాధ్యాయుడిని కాల్చి చంపాడు. అందుకు ప్రతీకారంగా గ్రామస్తులు అతడిని కొట్టి చంపేశారు. (చదవండి: ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే) -
మనవాళ్లే బాధితులైతే.. ఉపేక్షిస్తామా
-
మనవాళ్లే బాధితులైతే.. ఉపేక్షిస్తామా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దళితులమీద దాడులు సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇతరత్రా ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి తేడా ఉందని.. తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తప్పవన్నారు. ఏదైనా పొరపాటు చేస్తే.. ఎస్సైని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదన్నారు సీఎం జగన్. తప్పు చేసింది ఎస్సై అయినా సీఐ అయినా సరే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా. ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ సందేశాన్ని పోలీసు అధికారులు కింది స్థాయికి తీసుకెళ్లాలి అని సీఎం జగన్ కోరారు. (చదవండి: మలుపు తిరిగిన శిరోముండనం ఘటన) కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు, తదితర స్థాయిలో ఉన్నవారికి ఓరియెంటేషన్ నిర్వహించాలన్నారు సీఎం జగన్. మానవత్వంతో వ్యవహరించడంతో పాటు.. ప్రజలకున్న హక్కులేంటి.. మనం ఎంత వరకు వెళ్లాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. గుండుకొట్టించడం లాంటి ఘటనలు తప్పు.. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదని స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నమన్నారు సీఎం జగన్. ఎస్పీలు, ఏఎస్పీలు ఈ సందేశాన్ని దిగువస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి దళితురాలు, డీజీపీ ఎస్టీ అని గుర్తు చేశారు. సమాజంలో దిగువున ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. అక్రమ మద్యం తయారీ, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా చట్టానికి అతీతులు కారన్నారు. ఇది మనసులో పెట్టుకుని విధులు నిర్వహించాలన్నారు. అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు.. సీఎం జగన్ సీరియస్) -
జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
‘నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడ్చారు’
భోపాల్: స్టాల్ ఏర్పాటు విషయంలో పోలీసులకు, ఓ సిక్కు వ్యక్తికి మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో నడిరోడ్డు మీద ఆ సిక్కు వ్యక్తి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఖాకీల తీరు పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ బర్వానీలోని రాజ్పూర్ తహసీల్‌లో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని జియానీ ప్రేమ్ సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. బాధితుడు ఈ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని భావించాడు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో జియానీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు అతడి జుట్టు పట్టుకుని ఈడ్చారు. జియానీని కాపాడ్డానికి వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అవతలకు లాగి పడేశారు. (రూ. 100 ఇవ్వనందుకు.. అయ్యో పాపం!) ఈ క్రమంలో పోలీసులు తనను ఈడ్చుకెళ్తుండగా.. ‘వీళ్లు నన్ను కొడుతున్నారు. మమ్మల్ని చంపేస్తారు. పోలీసులు మా జుట్టు పట్టుకుని ఈడుస్తున్నారు. మేం స్టాల్ పెట్టుకోవడానికి వారు అంగీకరించడం లేదు’ అంటూ అరుస్తూ.. తమను కాపాడాల్సిందిగా చుట్టూ ఉన్న జనాలను కోరాడు జియానీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన జరిగినప్పుడు జియానీ తాగి ఉన్నడు. పోలీసులను అడ్డుకున్నాడు’ అని తెలిపారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. (చూస్తే పిచ్చోళ్లే.. కానీ అతి కిరాతకులు!) The incident took place in Rajpur Tehsil of Barwani after an argument broke out between the family of Giani Prem Singh Granthi and the police over setting up a stall in the area, police said he was drunk, two suspended @ndtvindia @ndtv pic.twitter.com/C6SudAS5cD — Anurag Dwary (@Anurag_Dwary) August 7, 2020 ఈ ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధితుడు గత కొంతకాలంగా పల్సూద్ పోలీస్ ఔట్‌పోస్ట్ దగ్గర తాళాల దుకాణం నడుపుకుంటున్నాడు. అతడిని నడిరోడ్డు మీద పోలీసులు అవమానించారు. అతడి తలపాగాను అపవిత్రం చేశారు’ అని మండిపడ్డారు. లంచం ఇవ్వడానికి నిరాకరించడంతోనే పోలీసులు తనపై దాడి చేశారని జియానీ ఆరోపించాడు. -
పోలీసులకు రాఖీ కట్టిన సోము వీర్రాజు
సాక్షి, విజయవాడ: కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో పోలీసులదే అగ్రస్థానం అన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. పోలీసుల సమక్షంలో సోమవారం నిర్వహించిన రాఖీ పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వీర్రాజుతో పాటు జీవిఎల్, సునీల్ డియోదర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని కలిసి వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోము వీర్రాజు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో వైద్యుల తరువాత ముఖ్య పాత్ర పోలీసులదే అని ప్రశంసించారు. (3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం) లాక్డౌన్లో ప్రజలందరూ బయటకు రాకుండా పోలీసులు ప్రముఖ పాత్ర వహించారని సోము వీర్రాజు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు పోలీసులు కల్పించిన అవగాహన, జాగ్రత్తలు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
35 ఏళ్లనాటి కేసు; దోషులుగా 11 మంది పోలీసులు
లక్నో: ముప్పై అయిదేళ్ళ క్రితం జరిగిన రాజా మాన్సింగ్ హత్య కేసులో మంగళవారం 11 మంది పోలీసులను మధుర కోర్టు దోషులుగా తేల్చింది. గత రెండు దశాబ్దాలుగా విచారిస్తున్న ఈ కేసుకు ముగింపు పలికింది. రేపు కోర్టు దోషులకు శిక్షను ఖరారు చేయనుంది. 1985 నాటి ఈ కేసు వివరాలు.. రాజస్తాన్, భరత్పూర్ రాజవంశీకుడు రాజా మాన్సింగ్ 1985 ఫిబ్రవరి 21న హత్యకు గురయ్యారు. ఈ హత్య అప్పట్లో రాజకీయంగా కలకలం రేపింది. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత అప్పటి రాజస్తాన్ ముఖ్యమంత్రి శివ్‌చరణ్ మాథూర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీని గురించి రాజా మాన్ సింగ్ మనవడు దుష్యంత్ సింగ్ మాట్లాడుతూ.. '1985 అసెంబ్లీ ఎన్నికల్లో డీగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజా మాన్ సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు భరత్పూర్ సంస్థానం జెండాను అవమానపరిచారు. ఈ ఘటన పట్ల మాన్సింగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు’ అన్నారు. (పైలట్‌పై గహ్లోత్ సంచలన వ్యాఖ్యలు) ఆయన మాట్లాడుతూ.. ‘దాంతో రాజా మాన్ సింగ్ వెంటనే ముఖ్యమంత్రి ర్యాలీ జరుగనున్న ప్రాంతానికి జీపులో వెళ్లి సీఎం కోసం ఏర్పాటు చేసిన వేదికతో పాటు చాపర్‌ను కూడా ధ్వంసం చేశారు. ఫిబ్రవరి 20న ఈ ఘటన జరిగింది. ఆ మరుసటి రోజు తన ఇద్దరు అనుచరులతో కలిసి సరెండర్ కావడానికి రాజా మాన్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో డీఎస్పీ కన్ సింగ్ భాటి నేతృత్వంలోని పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. రాజా మాన్‌సింగ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు' అని తెలిపారు దుష్యంత్. మాన్సింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత సీఎం రాజీనామా చేశారు. (‘ఆరు నెలల్లో మీరు సాధించినవి ఇవే’) (రాజా మాన్ సింగ్ కుటుంబ సభ్యులు) ఈ క్రమంలో నాటి ఘటనలో పాల్గొన్న 11 మంది పోలీసులను కోర్టు ఈరోజు దోషులుగా ప్రకటించింది. వారిలో అప్పటి డీఎస్పీ కన్ సింగ్ భాటి కూడా ఉన్నారు. తొలుత ఈ కేసును రాజస్తాన్ కోర్టు విచారించింది. అయితే అక్కడ కేసును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని భావించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత కేసును ఉత్తరప్రదేశ్ లోని మధుర కోర్టుకు అప్పగించింది. ఈ కేసు కోసం మధుర కోర్టు 1,700 వాయిదాలను(హియరింగ్స్) వినడం గమనార్హం. హత్య జరిగిన 35 ఏళ్లకు కోర్టు జడ్జిమెంట్‌ను ఇచ్చింది. రేపు(బుధవారం) దోషులకు శిక్ష ఖరారు చేయనుంది. -
‘పని 24 గంటలు.. జీతం 12 గంటలకే’
లక్నో: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ వాసులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సూపర్‌టెక్ ఎకోజోన్ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తికి సోమవారం కరోనా పాజిటీవ్‌గా తెలీంది. దాంతో పోలీసులు ఆ కాంప్లెక్స్‌ను సీల్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు, అపార్ట్మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కరోనా బయటపడిన ఇంటిని మాత్రమే సీల్ చేయాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు పోలీసులను కోరారు. తాము పని చేస్తున్న కంపెనీలు తిరిగి తెరిచారని.. ఆఫీసులకు వెళ్లకతప్పదని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ('రథయాత్ర 'ఏమవుతుందో ఏమో...!) అపార్ట్‌మెంట్‌వాసులకు నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ‘మీకు ముందు మేము ఉన్నాం. మేం మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగం. మేం 24 గంటలు పని చేస్తున్నాం.. కానీ మాకు 12 గంటలకే జీతం ఇస్తారు. అయినా మేం ప్రజల కోసం పని చేస్తున్నాం. ఒక వేళ మీరు గొడప పడాలనుకుంటే రండి’ అంటూ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల మాటలతో జనాలు శాంతించారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ పూర్తిగా సీల్ చేయబడింది. -
కరోనా: వారికి ఎం అండ్ ఎం బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కరోనా వారియర్స్‌కు, మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైద్యులు, పోలీసులు, మహిళా కొనుగోలుదారుల కోసం కొత్త పథకాలను లాంచ్ చేసింది. ముఖ్యంగా డాక్లర్ల కోసం బై నౌ పే లేటర్ అనే పథకాన్ని అందుబాటులో వుంచింది. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభ సమయంలో తమ వినియోగదారులకు, ప్రధానంగా కరోనా వారియర్స్‌కు ఆర్థిక సౌలభ్యంగల ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ పథకాలను తీసుకొచ్చామని సంస్థ (ఆటోమోటివ్ డివిజన్) సీఈవో వీజయ్ నక్రా ప్రకటించారు. ఈ పథకం కింద వైద్యులకు ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం రద్దు. అలాగే 8 సంవత్సరాల రుణ కాలపరిమితిపై 90 రోజుల మారటోరియాన్ని కూడా వర్తింప చేయనుంది. దీంతోపాటు 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ వంటి ప్రత్యేక ఆఫర్లతో ఈ కొత్త పథకాన్ని ఎం అండ్ ఎండ్ మంగళవారం విడుదల చేసింది. లాక్డౌన్, ఫైనాన్సింగ్ లాంటి సమస్యల మధ్య సులువుగా వాహనాల కొనుగోలుకు ఈ ఆఫర్లు సహాయపడనున్నాయి. (పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్) పోలీసు సిబ్బందికి భారీ ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందివ్వనుంది. అలాగే మహిళా వినియోగదారులకు ఫైనాన్సింగ్ వ్యయంపై 10 బేసిస్ పాయింట్ తగ్గింపు వుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎస్యువీ కొనుగోళ్లపై కూడా బై నౌ , పే లేటర్ ఆఫర్ వర్తించనుంది. ఇపుడే వాహనాన్ని సొంతం చేసుకొని, 2021 నుండి ఇఎంఐ ప్రారంభమయ్యే వెసులుబాటు కల్పించింది . మరో పథకం కింద, ఫైనాన్స్డ్ వాహనం కొనుగోలుపై లక్షకు ఇఎంఐ అతి తక్కువగా రూ .1,234 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.. (కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!) -
పంజాబ్‌లోని పాటియాలాలో దుండగుల ఘాతుకం
-
రెండు వారాల్లో రూ 2.67 కోట్ల ఫైన్..
పట్నా : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి బిహార్ పోలీసులు రెండు వారాల్లో ఏకంగా రూ 2.67 కోట్ల జరిమానాను వసూలు చేశారు. లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన 500 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 11,000కు పైగా వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 723 లాక్డౌన్ ఉల్లంఘనలను నమోదు చేసినట్టు బిహార్ పోలీసులు వెల్లడించారు. బక్సర్, గయా, సుపౌల్, భాగల్పూర్ జిల్లాల్లో లాక్డౌన్ ఉల్లంఘనులను గుర్తించేందుకు పోలీసులు డ్రోన్లు ఉపయోగించారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఉల్లంఘనులను స్పాట్లో గుర్తించేందుకు తాము డ్రోన్లను ఉపయోగించామని, లాక్డౌన్ సమయంలో ఇళ్ల వందే ఉండాలని వారిని హెచ్చరించి వదిలివేశామని సరన్ ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయడంలో డ్రోన్లు తమకు సహకరించాయని చెప్పారు. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించిన ప్రజలను కట్టడి చేసేందుకు బిహార్ రాజధాని పట్నాలో పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. చదవండి : లాక్డౌన్: భార్య ఎడబాటు తట్టుకోలేక.. -
అప్పుడు ఎన్కౌంటర్, ఇపుడు బిడ్డ దత్తత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోనిఫరూకాబాద్‌లో పోలీసు అధికారి మానవత్వానికి పరిమళాన్ని అద్దారు. తండ్రి చేసిన నేరానికి అనాథగా మిగిలిన ఆడబిడ్డను ఆదుకునేందుకు చొరవ చూపారు. తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన ఉన్మాది సుభాష్ బాథమ్ కుమార్తె గౌరి (1)ని దత్తత తీసుకునేందుకు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ ముందుకొచ్చారు. చట్టపరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ అధికారికంగా గౌరిని దత్తత తీసుకోనున్నారు. అంతేకాదు ఆ పాప బాగా చదువుకొని ఐపీఎస్ స్థాయికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. గౌరీ స్వతంత్రంగా మారే వరకు విద్య, ఇతర ఖర్చులను తామే భరిస్తామని, ఆమె ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నానని మోహిత్ అగర్వాల్ తెలిపారు.. ఆమెను తన స్వంత పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరీ ప్రస్తుతం పోలీసులు పర్యవేక్షణలో ఫరూఖాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని ముహమ్మదాబాద్ పట్టణంలోని కార్తియా గ్రామానికి చెందిన సుభాష్ బాథమ్..హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తూ..ఇటీవల బెయిల్‌మీద విడుదలయ్యాడు. ఇతనిపై ఇతర క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అయితే తనను జైలుకు పంపించారన్న ఆగ్రహంతో ఊరిమీద పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమో కానీ మారిపోయానంటూ ఊరివారినందరినీ నమ్మించాడు. జనవరి 30 న తమ కుమార్తె బర్త్‌డే వేడుకలకు రమ్మని స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచాడు. అలా వచ్చిన మొత్తం 23మంది చిన్నారులను ఇంటి నేలమాళిగలో బంధించడంతో పాటు కాల్చిపారేస్తానని బెదరించారు. దీంతో తమ పిల్లల్ని కాపాడాలంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు సుభాష్‌ను ఎన్కౌంటర్ చేసి పిల్లలను విడిపించారు. ఈ క్రమంలో పారిపోతున్న సుభాష్ భార్య రూబీపై గ్రామస్తులు రాళ్లఎఒ దాడి చేయడంతో హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో సుభాష్, రుబీల కుమార్తె అనాథగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. చదవండి : ఫోన్లో చూసి, ఖైదీల సాయంతో పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య! దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్ఎస్జీ -
ప్యాసింజర్ల వేషంలో ఆటోవాలాలకు షాక్
సాక్షి,బెంగళూరు: బెంగళూరులో ఆటో డ్రైవర్లకు పోలీసులు గట్టి షాకిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న5,200 మందికి పైగా డ్రైవర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, జరిమానా విధించారు. ప్యాసింజర్లలా నటించి మరీ వారిపై నిఘా పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలోని 7 మండలాల్లోని డ్రైవర్లనుంచి రూ.8,06,200 జరిమానా వసూలు చేశారు. ఆటో డ్రైవర్లపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో కొన్ని జోన్లలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంత్ గౌడ తెలిపారు. నగరంలోని ఇతర మండలాల్లో కూడా త్వరలో ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. పదిమంది ఆటో డ్రైవర్లలో ఇద్దరు మాత్రమే మీటర్‌పై 4-5 కిలోమీటర్ల దూరానికి వెళ్లడానికి అంగీకరించినట్టు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. యూనిఫాం ధరించకపోవడం, సరియైన పత్రాలు లేకపోవడంతోపాటు, కొన్ని ఏరియాలకు వెళ్లడానికి నిరాకరించడం, ఎక్కువ ఛార్జీలు డిమాండ్ చేయడం, మీటర్ చార్జీల కంటే ఎక్కువ వసూలు లాంటి ఆరోపణలపై పలువురు ఆటో డ్రైవర్లు బుక్ అయ్యారు. నేరస్థులుగా తేలిన వారికి భారీ జరిమానా విధించారు. అలాగే కొన్ని ఆటోలను సీజ్ చేశారు. కొంతమంది ఆటో డ్రైవర్లు అధికంగా ఛార్జ్ చేస్తున్నందున, అన్ని ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తోందని బెంగళూరులోని ఆదర్ష్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు నారాయణ్ స్వామి తెలిపారు. దీంతో ప్రజలు ఆటోలకు బదులుగా ఉబెర్/ఓలా క్యాబ్‌లవైపు మొగ్గు చూపుతున్నారనీ, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇలాంటి డ్రైవ్ చేపట్టిన బెంగళూరు పోలీసులు 6800 కేసులను నమోదు చేశారు. అలాగే జరిమానాగా రూ. 72 లక్షలను వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
నిత్యానంద ఆశ్రమం ఖాళీ, బిగుస్తున్న ఉచ్చు
అహ్మదాబాద్: వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నాప్లాంటి ఇతర క్రిమినల్ అభియోగా నేపథ్యంలో స్థానిక పోలీసులు తాజా దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతేకాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. తన పిల్లలను ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ చేసి హింసించారని శర్మ ఆరోపించారు. అయితే వీరిని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు నవంబర్ 26న పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఇంటర్‌పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానందకోసం గాలిస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ) అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఎన్ఓసి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) నిత్యానంద ఆశ్రమాన్ని నడుపుతున్నట్టు నిర్ధారించిన తరువాత అహ్మదాబాద్, హిరాపూర్, దాస్క్రోయిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు మంజూరు చేసిన సీనియర్ సెకండరీ స్థాయి వరకు తాత్కాలిక/సాధారణ ఎఫిలియేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకుందని సీబీఎస్ఇ నోట్‌ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. అయితే 2020 లో 10, 12 తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షకు హాజరుకావడానికి, తొమ్మిదవ తరగతి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సమీపంలోని సీబీఎస్ఐ-అనుబంధ పాఠశాలలకు మార్చడానికి బోర్డు అనుమతించింది. కాగా అయితే అత్యాచారం కేసులో విచారణను తప్పించుకునేందుకు నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్ గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ, అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్ చేయలేదనీ ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.