లుథియాన: కోటిరూపాయల నల్లధనాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని లుథియానా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన వీరిద్దరూ పేపర్ మిల్ లో పనిచేసే పంకజ్ గోయల్, రవికాంత్ లుగా గుర్తించినట్లు తెలిపారు.
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏడీసీపీ) తెలిపిన వివరాల ప్రకారం షేర్ పూర్ చౌక్ పోలీసు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టయోటా ఫార్చునర్ నుంచి రెండు సూట్ కేసుల్లో తరలిస్తున్న కోటి రూపాయల డబ్బును పట్టుకున్నట్లు వివరించారు. తాము పనిచేసే పేపర్ మిల్ యజమాని బిందాల్ ఈ డబ్బును లుథియానాలోని రాకేష్ కు ఇవ్వమని చెప్పినట్లు నిందితులు తెలిపారని వివరించారు. ప్రాథమిక విచారణలో ఈ డబ్బు నల్లధనంగా తేలిందని చెప్పారు. రాకేష్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
నల్లధనం తరలిస్తూ...
Published Sun, Jun 5 2016 8:04 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
Advertisement
Advertisement