స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు తెలిసో.. తెలియకో చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన విషయాలు ఉండవచ్చు లేదా ఇష్టమైనవారితో చేసిన చాటింగ్ కూడా ఉండొచ్చు. అలాంటిప్పుడు బాధపడటం మానేసి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే డిలీట్ అయిన చాట్ మొత్తం తిరిగి పొందవచ్చు.
వాట్సాప్ చాటింగ్ రికవరీ
➤ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
➤క్లిక్ చేసిన తరువాత అక్కడ కనిపించే ఆప్షన్‌లలో 'సెట్టింగ్స్' ఆప్షన్ ఎంచుకోవాలి.
➤సెటింగ్స్ మీద క్లిక్ చేసిన తరువాత 'చాట్స్'పైన క్లిక్ చేయాలి.
➤క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే పేజీని.. కొంచెం స్క్రోల్ చేస్తే.. అక్కడ 'చాట్ బ్యాకప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
➤చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేసిన తరువాత బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్స్ వెనక్కి వస్తాయి.
ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు వినియోగదారులు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌కు బ్యాకప్ చేయవచ్చు. ఐఫోన్ వినియోగదారులు బ్యాకప్‌ల కోసం ఐక్లౌడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాకప్ స్టార్ట్ చేయడానికి ముందే.. గూగుల్ డిస్క్‌లో తగినంత స్టోరేజ్ ఉందా? లేదా అని నిర్థారించుకోండి.
Comments
Please login to add a commentAdd a comment